సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫోన్ టాపింగ్ కేసులో హైకోర్టు విచారణ జరిపింది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. స్థిరాస్తి వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. దీంతో పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ హరీష్‌రావు హైకోర్టును ఆశ్రయించారు.
పోలీసులు దర్యాప్తు, అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హరీష్‌రావు కోరారు. గత విచారణ సందర్భంగా హరీష్ రావును అరెస్ట్ చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చిన హైకోర్టు.. ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. చక్రధర్ గౌడ్ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 28వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు.. అప్పటి వరకు అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు పొడిగించింది.
ఇదీ చదవండి: Telangana: ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
Comments
Please login to add a commentAdd a comment