Interim orders
-
మోహన్‌బాబుకు దక్కని ఊరట
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్ట్‌పై దాడి కేసులో ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్‌బాబుకు హైకోర్టులో ఎలాంటి ఊరట దక్కలేదు. అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మోహన్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం మరోసారి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. ‘మైక్‌తో దాడి చేసి గాయపరిచారన్నది ఆరోపణ. అనుమతి లేకుండా మోహన్‌బాబు ఇంట్లోకి వెళ్లిన కారణంగానే ఘటన జరిగింది. తొలుత బీఎన్ఎస్ 118 సెక్షన్ కింద కేసు పెట్టిన పోలీసులు జర్నలిస్ట్ రంజిత్ వాంగ్మూలం తీసుకుని సెక్షన్ 109గా మార్చారు. మోహన్‌బాబు, రంజిత్ మధ్య ఎలాంటి వివాదం లేదు. హత్యకు ప్రయత్నించారనడానికి ఎలాంటి కారణాలు లేవు. సుప్రీంకోర్టు తీర్పుల మేరకు పిటిషనర్ బెయిల్‌కు అర్హుడు’అని పేర్కొన్నారు. మనోజ్ జిమ్ ట్రైనర్‌తోపాటు మరొకరి స్టేట్మెంట్ రికార్డు చేశామని ఏపీపీ జితేందర్‌రావు చెప్పారు. కౌంటర్ కూడా దాఖలు చేశామన్నారు. మోహన్‌బాబు కావాలని చేయకున్నా.. తెలిసి దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరారు.‘రంజిత్‌కు తగిలిన గాయంపై ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన నివేదిక ఆధారంగా సెక్షన్‌ను మార్చాల్సి వచ్చింది. వారంపాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. 20 రోజుల వరకు ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోవాలని చెప్పారు. పిటిషనర్ కుమారుడి ఆహ్వనం మేరకు మీడియా ప్రతినిధులు వెళ్లారు. మోహన్‌బాబు దుబాయ్ వెళ్లే అవకాశం ఉంది. ఆయనకు జీవితకాల శిక్ష పడే అవకాశం కూడా ఉంది’అని చెప్పారు. అయితే మోహన్‌బాబు దుబాయ్ వెళ్లడం లేదని రవిచందర్ పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇరు పార్టీలను అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణ సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని రవిచందర్ కోరగా, నిరాకరించారు. -
ఆ అవార్డు గ్రహీతగా టీఎం కృష్ణ చెప్పుకోరాదు: సుప్రీం
న్యూఢిల్లీ: దిగ్గజ కళాకారిణి ఎంఎస్ సుబ్బులక్ష్మి అవార్డు గ్రహీతగా ప్రకటించుకోరాదని కర్ణాటక సంగీత గాయకుడు టీఎం కృష్ణను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సోమవారం జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిల ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఎస్ సుబ్బులక్ష్మిని గతంలో టీఎం కృష్ణ తీవ్ర పదజాలంతో అవమానించి అప్రతిష్ట పాల్జేశారంటూ ఆమె మనవడు వి.శ్రీనివాసన్ వేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. టీఎం కృష్ణ ఇప్పటికే ఈ అవార్డును స్వీకరించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఈ మేరకు తీర్పు వెలువరించినట్లు తెలిపింది. ఈ విషయమై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ, ది హిందూ గ్రూప్‌లను ఆదేశించింది. మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ ఏటా ఎంఎస్ సుబ్బులక్ష్మి అవార్డును అందజేస్తుంటుంది. -
నిర్మలకు ఊరట దర్యాప్తుపై హైకోర్టు స్టే
బెంగళూరు: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఊరట లభించింది. ఈడీని అడ్డం పెట్టుకొని వ్యాపారవేత్తలను బెదిరించి ఎలక్టోరల్ బాండ్ల పేరిట కోట్లాది రూపాయలు వసూలు చేశారనే కేసులో నిర్మల, ఇతరులపై సాగుతున్న దర్యాప్తుపై కర్నాటక హైకోర్టు సోమవారం స్టే విధించింది. నిందితుల్లో ఒకరైన బీజేపీ నేత నళిన్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఎం.నాగప్రసన్న దర్యాప్తుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. తదుపరి విచారణను అక్టోబరు 22కు వాయిదా వేశారు. ఆదర్శ్ ఆర్ అయ్యర్ చేసిన ఫిర్యాదు మేరకు.. స్పెషల్ కోర్టు ఆదేశాలతో నిర్మలా సీతారామన్, బీజేపీ జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఈడీ అధికారులపై శనివారం ఎఫ్ఐఆర్ నమోదైంది. భారతీయ న్యాయసంహిత సెక్షన్ 384 (బెదిరించి డబ్బు గుంజడం), 120బి (నేరపూరిత కుట్ర), సెక్షన్ 34 కింద వీరిపై కేసు నమోదైంది. -
వలంటీర్ల వల్ల మంచే జరుగుతోందిగా
సాక్షి, అమరావతి: వలంటీర్ల వల్ల మంచే జరుగుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. వారి వల్ల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువవుతున్నాయని తెలిపింది. వారి విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోమని స్పష్టం చేసింది. వారి విషయంలో స్పందించాల్సింది ఎన్నికల సంఘమేనని తేల్చి చెప్పింది. వలంటీర్లు ఎన్నికల్లో విధుల్లో పాల్గొనకుండా ఎన్నికల సంఘం (ఈసీ) ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేసింది. వలంటీర్ల నియామకం, తదితరాల వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు నెలలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 2.57 లక్షల మంది కార్యకర్తలను గ్రామ, వార్డు వలంటీర్లుగా నియమించారని, దీనిని చట్ట, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్ కడప జిల్లా రాజంపేటకు చెందిన షేక్ అబూబాకర్ సిద్దిఖీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ, అధికార పార్టీకి చెందిన కార్యకర్తలనే వలంటీర్లుగా నియమించారని, వారి ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని అధికార పార్టీ చూస్తోందని అన్నారు. రాష్ట్ర ఖజానా నుంచే వీరికి గౌరవ వేతనం చెల్లిస్తోందని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, వలంటీర్ల వల్ల మంచే జరుగుతోంది కదా, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తున్నారు కదా అని వ్యాఖ్యానించింది. వలంటీర్లు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఉన్నం మురళీధరరావు కోరారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. -
టెట్, టీఆర్టీపై నేడు మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ), టీచర్ అర్హత పరీక్ష (టెట్)ల మధ్య తగిన సమయం ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంలో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల జారీ విషయంలో తన నిర్ణయాన్ని గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీఆర్టీ, టెట్ పరీక్షల మధ్య తగిన సమయం ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం.పెద్దిరాజు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత నోటిఫికేషన్లను రద్దు చేసి, రెండు పరీక్షల మధ్య తగిన సమయం ఇస్తూ తిరిగి నోటిఫికేషన్లు జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని వారు కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రామకృష్ణప్రసాద్ మరోసారి విచారణ జరిపారు. పరీక్షలపై తీవ్ర ప్రభావం.. ప్రభుత్వ న్యాయవాది వీకే నాయుడు వాదనలు వినిపిస్తూ.. ఐదుగురు అభ్యర్థుల కోసం మొత్తం నోటిఫికేషన్లను నిలుపుదల చేయడం సరికాదన్నారు. పరీక్ష నిర్వహణను వాయిదా వేస్తే టీసీఎస్ సంస్థ పరీక్షల నిర్వహణకు మరో స్లాట్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఇది పరీక్షలపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. దీనివల్ల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని వివరించారు. అందువల్ల పరీక్షల నిర్వహణలో జాప్యం చేయలేమన్నారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు, న్యాయవాది జవ్వాజి శరత్చంద్ర వాదనలు వినిపిస్తూ.. టీఆర్టీ నిర్వహణ కోసం ఈ నెల 12న, టెట్‌కు 8న నోటిఫికేషన్లు జారీ చేశారని తెలిపారు. టెట్‌లో అర్హత సాధించిన వారు టీఆర్టీకి హాజరయ్యేందుకు అర్హులన్నారు. టెట్ ఫలితాలను మార్చి 14న విడుదల చేస్తారని, ఆ మరుసటి రోజే అంటే మార్చి 15న టీఆర్టీ పరీక్ష నిర్వహిస్తారని వివరించారు. టెట్ పరీక్ష సిలబస్ చాలా ఎక్కువని, ఆ పరీక్షకు హాజరయ్యేందుకు ఉన్న గడువు కేవలం 19 రోజులు మాత్రమేనన్నారు. ఇది ఎంత మాత్రం సరిపోదని, టీఆర్టీ పరీక్షకు సైతం తక్కువ సమయమే ఉందని వారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందువల్ల ఈ విషయంలో తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. -
రామోజీ, శైలజా కిరణ్‌పై చర్యలన్నీ 8 వారాలు నిలిపివేత
సాక్షి, అమరావతి : మార్గదర్శి సహ వ్యవస్థాపకుడు గాదిరెడ్డి జగన్నాథ రెడ్డి (జీజే రెడ్డి) షేర్లను అక్రమంగా బదలాయించిన వ్యవహారంపై నమోదైన కేసులో నిందితులైన ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు, మార్గదర్శి ఎండీ అయిన ఆయన కోడలు శైలజా కిరణ్‌పై తదుపరి చర్యలన్నింటినీ 8 వారాలు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వారిద్దరిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీకి ఒక్క రోజే గడువిచ్చిన న్యాయస్థానం తన తండ్రి జీజే రెడ్డికి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో ఉన్న వాటాల కోసం వెళితే రామోజీరావు తనను తుపాకీతో బెదిరించి, తమ వాటాలను శైలజా కిరణ్ పేరిట అక్రమంగా బదలాయించారంటూ యూరి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ ఈ నెల 13న కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టేయాలంటూ ఈ నెల 16న రామోజీ, శైలజా కిరణ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. సాధారణంగా క్వాష్ పిటిషన్లలో ఆ కేసు పూర్తి వివరాలను తెలుసుకొని, కోర్టు ముందుంచేందుకు పోలీసులకు న్యాయమూర్తులు వారం, మూడు రోజులు ఇలా కొంత గడువు ఇస్తారు. రామోజీరావు, శైలజా కిరణ్ వ్యాజ్యాలు న్యాయమూర్తి జస్టిస్ చక్రవర్తి ముందుకు మంగళవారం విచారణకు వచ్చాయి. పూర్తి వివరాలు కోర్టు ముందుంచేందుకు రెండు రోజులు గడువివ్వాలన్న సీఐడీ స్పెషల్ పీపీ వై.శివకల్పనారెడ్డి వినతిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఒక్క రోజే గడువిచ్చి, విచారణను బుధవారానికి వాయిదా వేశారు. బుధవారం రామోజీ తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా, శైలజా కిరణ్ తరఫున మరో సీనియర్ న్యాయవాది నాగముత్తు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించారు. షేర్లు కొన్నందుకు యూరి రెడ్డికి చెక్కు రూపంలో చెల్లించామని, వాటాలను బదలాయిస్తూ ఆయన సంతకాలు కూడా చేశారని తెలిపారు. ఆ తర్వాత ఆయన రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కి ఫిర్యాదు చేశారన్నారు. ఫిర్యాదు అక్కడ పెండింగ్‌లో ఉండగా, ఇప్పుడు సీఐడీకి ఫిర్యాదు చేశారని తెలిపారు. మార్గదర్శి అక్రమాలపై దర్యాప్తు చేస్తున్నాం కాబట్టే సీఐడీకి ఫిర్యాదు చేశారు సీఐడీ తరఫున వై.శివకల్పనా రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో అత్యంత కీలకమైన ఎస్‌హెచ్–4 ఫారంను వ్యాజ్యాలతో జత చేయలేదని, దీనిని కోర్టు తప్పక పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. మార్గదర్శి అక్రమాలపై ఏపీ సీఐడీ విచారణ జరుపుతోందన్న విషయం తెలిసి ఫిర్యాదుదారు తమకు ఫిర్యాదు చేశారని వివరించారు. మార్గదర్శికి ఏపీలో కూడా శాఖలున్నాయన్నారు. వాటాల బదిలీ డాక్యుమెంట్లపై ముద్రించిన స్టాంపు ఎక్కడిదో పరిశీలించాల్సి ఉందన్నారు. అందువల్ల ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. దర్యాప్తునకు సంబంధించిన కేసుల్లో యాంత్రికంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు చెప్పిందంటూ ఆ కేసు గురించి శివకల్పన ప్రస్తావించారు. అన్ని కేసులూ తనకు తెలుసునని న్యాయమూర్తి జస్టిస్ చక్రవర్తి అన్నారు. రామోజీ, శైలజా కిరణ్‌పై తదుపరి చర్యలన్నీ 8 వారాలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
Defamation Case: మళ్లీ ఎంపీగా రాహుల్ గాంధీ!
న్యూఢిల్లీ: లోక్‌సభ సభ్యత్వం కోల్పోవడానికి కారణమైన 2019 నాటి పరువు నష్టం కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాం«దీకి భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు రెండేళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ గుజరాత్‌లోని సూరత్ కోర్టు ఇచి్చన తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా లోక్‌సభ సభ్యత్వం మళ్లీ పొందడానికి రాహుల్‌కు అవకాశం లభించింది. ఆయన సభ్యత్వాన్ని లోక్‌సభ స్పీకర్ స్వయంగా పునరుద్ధరించవచ్చు లేదా సుప్రీంకోర్టు ఉత్తర్వు ప్రకారం సభ్యత్వం తిరిగి పొందడానికి రాహుల్ గాంధీ న్యాయ పోరాటం చేయొచ్చు. ఈ తీర్పుతో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి రాహుల్ గాంధీకి ఇక అడ్డంకులు తొలగిపోయినట్లే. ప్రజాజీవితంలో ఉన్నవారు ఆచితూచి మాట్లాడాలి పరువు నష్టం కేసులో తనకు రెండేళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు ఇచి్చన తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాహుల్ తొలుత గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని తిరస్కరిస్తూ గుజరాత్ హైకోర్టు తీర్పునిచి్చంది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రాహుల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గావై, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్‌తో కూడిన త్రిసభ్య సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. ‘‘పరువు నష్టం కేసులో రాహుల్‌కు గరిష్ట శిక్ష విధించడానికి ట్రయల్ కోర్టు న్యాయమూర్తి ఎలాంటి కారణం చూపలేదు. అందుకే దోషిగా నిర్ధారించే తీర్పును నిలిపివేయాలి. అలాగే ఈ తరహా(పరువుకు నష్టం కలిగించే) వ్యాఖ్యలు మంచివి కావు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రజాజీవితంలో ఉన్నవారు బహిరంగ సభల్లో ఆచితూచి మాట్లాడాలని ప్రజలంతా ఆశిస్తారు’’ అని స్పష్టం చేసింది. రాహుల్‌ను దోషిగా నిర్ధారించడం అనేది కేవలం ఆయనపైనే కాకుండా ఆయనను తమ ప్రతినిధిగా ఎన్నుకున్న ఓటర్ల హక్కుపై కూడా ప్రభావం చూపుతుందని వెల్లడించింది. ఐపీసీ సెక్షన్ 499(పరువు నష్టం) కింద రాహుల్‌కు గరిష్ట శిక్ష విధించడంపైనా ధర్మాసనం సంశయం వ్యక్తం చేసింది. శిక్షాకాలం ఒక్కరోజు తగ్గినా ఆయనపై ఎంపీగా అనర్హత వేటు పడేది కాదని ఉద్ఘాటించింది. సమాజ వ్యతిరేక వ్యాఖ్యలు కావవి రాహుల్ తరపున సీనియర్ అడ్వొకేట్ అభిõÙక్ మనూ సింఘ్వీ వాదనలు వినిపించారు. తన క్లయింట్ కరడుగట్టిన నేరçస్తుడు కాదని చెప్పారు. ఆయనపై బీజేపీ కార్యకర్తలు ఎన్నో కేసులు పెట్టారని, అయినా ఏ ఒక్క కేసులోనూ దోషిగా తేలలేదని గుర్తుచేశారు. రాహుల్‌పై ఫిర్యాదు చేసిన పూర్ణేష్ మోదీ ఇంటిపేరు అసలు మోదీయే కాదని పేర్కొన్నారు. ఈ విషయం ఆయనే చెప్పారని గుర్తుచేశారు. రాహుల్ వ్యాఖ్యలు సమాజానికి వ్యతిరేకంగా చేసినవి కావని వివరించారు. ఇది అపహరణ, హత్య, అత్యాచారం వంటి నేరం కాదని, అయినప్పటికీ రెండేళ్ల జైలు విక్ష విధించారని ఆక్షేపించారు. రాహుల్ నిర్దోíÙగా విడుదల కావడానికి, పార్లమెంట్‌కు హాజరు కావడానికి, వచ్చేసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇదే చివరి అవకాశమని అన్నారు. ఫిర్యాదుదారు పూర్ణేష్ మోదీ తరఫున సీనియర్ అడ్వొకేట్ మహేష్ జెఠ్మలానీ వాదించారు. రాహుల్ తప్పు చేశారనడానికి చాలా ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం చివరకు రాహుల్‌కు విధించిన జైలు శిక్షపై స్టే వి«ధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏమిటీ కేసు? 2019 ఏప్రిల్ 13న కర్ణాటకలోని కోలార్ పట్టణంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ‘‘దొంగలందరి ఇంటి పేరు మోదీ అని ఎందుకుంటుంది?’’ అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను తప్పుపడుతూ గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ సూరత్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్‌పై క్రిమినల్, పరువు నష్టం దావా వేశారు. విచారణ జరిపిన సూరత్ కోర్టు 2023 మార్చి 23న రాహుల్ గాంధీని దోషిగా తేలి్చంది. రెండేళ్లపాటు జైలు శిక్ష విధించింది. మరుసటి రోజే రాహుల్‌పై లోక్‌సభ స్పీకర్ అనర్హత వేటు వేశారు. రాహుల్ లోక్‌సభ సభ్యత్వం రద్దయ్యింది. మాజీ ఎంపీగా మారారు. అంతేకాకుండా ఢిల్లీలోని తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి, బయటకు వెళ్లిపోవాల్సి వచి్చంది. ఇప్పుడేం జరుగుతుంది? పరువు నష్టం కేసులో రాహుల్ గాం«దీకి సుప్రీంకోర్టు ఊరట కలిగించడంతో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని ఎప్పటిలోగా పునరుద్ధరిస్తారన్న దానిపై చర్చ ప్రారంభమైంది. అధికారిక ప్రక్రియ ప్రకారం.. లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలంటే రాహుల్ తొలుత లోక్‌సభ సెక్రటేరియట్‌కు విజ్ఞాపన పత్రం సమరి్పంచాల్సి ఉంటుంది. రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచి్చందని తెలియజేయాలి. సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని అభ్యరి్థంచాలి. సుప్రీంకోర్టు ఉత్తర్వు కాపీని కూడా సమరి్పంచాలి. అన్నీ సక్రమంగా ఉన్నట్లు భావిస్తే సభ్యత్వాన్ని పునరుద్ధరించినట్లు లోక్‌సభ సెకట్రేరియట్ ఒక అధికారిక ప్రకటన జారీ చేస్తుంది. ఇటీవల నేషనలిస్టు కాంగ్రెస్ పారీ్ట(ఎన్సీపీ) ఎంపీ మొహమ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడానికి రెండు నెలలు పట్టడం గమనార్హం. కోలార్ నుంచి కోర్టుల వరకు.. నాలుగేళ్ల క్రితం కర్ణాటక ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారమే సృష్టించి చివరికి ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోవలసి వచ్చింది. మోదీ ఇంటి పేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యల దగ్గర్నుంచి అత్యున్నత న్యాయస్థానం తీర్పు వరకు పరిణామ క్రమాన్ని చూద్దాం. ఏప్రిల్ 12, 2019: కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ దొంగలందరికీ ఇంటి పేరు మో దీయే ఎందుకు ఉంటుంది ? నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ అని వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 15, 2019: గుజరాత్ సూరత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. జూలై 7, 2019: సూరత్ మెట్రోపాలిటన్ కోర్టు ఎదుట రాహుల్ గాంధీ మొదటిసారిగా హాజరయ్యారు. మార్చి 23, 2023: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన సూరత్ కోర్టు ఆయనకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. రాహుల్ అప్పీలు చేసుకోవడానికి వీలుగా నెల రోజుల పాటు తీర్పుని సస్పెండ్ చేసింది. మార్చి 24, 2023: ఒక క్రిమినల్ కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో పార్లమెంటు సభ్యుడిగా ఆయనపై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం ఒక నోటీసు జారీ చేసింది. ఏప్రిల్ 3 2023: మెట్రోపాలిటన్ కోర్టు తీర్పుని సవాల్ చేస్తూ రాహుల్ సూరత్ సెషన్స్ కోర్టుని ఆశ్రయించారు. తీర్పుపై స్టే విధించాలని కోరారు ఏప్రిల్ 20, 2023: తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన సెషన్స్ కోర్టు రాహుల్ పిటిషన్‌ను కొట్టేసింది. ఏప్రిల్ 25, 2023: రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టుని ఆశ్రయించారు. తన శిక్షను నిలుపదల చేయాలని పిటిషన్ వేశారు. జూలై 7, 2023: గుజరాత్ హైకోర్టులో రాహుల్‌కి ఎదురు దెబ్బ తగిలింది. శిక్షపై స్టే విధించడానికి నిరాకరించిన కోర్టు రాహుల్ పిటిషన్‌ను తిరస్కరించింది. జూలై 15, 2023: హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టుకెక్కారు. జూలై 21, 2023: ఈ కేసులో గుజరాత్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 4, 2023: రాహుల్‌కి విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసులో కింద కోర్టు గరిష్టంగా రెండేళ్లు జైలు శిక్షని విధించడానికి కారణాలు కనిపించలేదని వ్యాఖ్యానించింది. సుప్రీం తీర్పుతో రాహుల్ పార్లమెంటు సభ్యత్వం తిరిగి పొందడానికి ఆస్కారం ఏర్పడింది. -
అవినాష్ కోసం వివేకా ప్రచారం చేశారు: తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా 2021 దాకా జరిగిన సీబీఐ దర్యాప్తులో ఎలాంటి ఆధారాల్లేవన్న విషయాన్ని తెలంగాణ హైకోర్టు ప్రముఖంగా ప్రస్తావించింది. వివేకా కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ అవినాష్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా.. మంగళవారం హైకోర్టు ఆయనకు ఊరట ఇచ్చిన సంగతి తెలిసిందే. విచారణకు హాజరు కావాలని అవినాష్‌కు చెబుతూనే.. ఏప్రిల్ 25వ తేదీ దాకా అవినాష్‌ను అరెస్ట్ చేయొద్దంటూ సీబీఐను ఆదేశించింది హైకోర్టు. అంతేకాదు ఈ పిటిషన్‌పై మధ్యంతర ఉత్వర్వుల్లో పలు కీలకాంశాలను ప్రస్తావించింది బెంచ్. వివేకా హత్యకు ఐదు కారణాలున్నాయని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. రాజకీయంగా పోటీ, ఆస్తుల వివాదం, అక్రమ సంబంధాలు, కొందరితో విభేధాలు, సిబ్బందితో వివాదాలని పేర్కొన్నారు. కానీ, వివేకా మాత్రం అవినాష్‌రెడ్డి కోసం ఎన్నికల్లో ప్రచారం చేశారు. పైగా అవినాష్‌రెడ్డి అప్పటికే ఎంపీగా ఉండి.. రెండోసారి పోటీ చేస్తున్నారు. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న షేక్ దస్తగిరి వాంగ్మూలం మేరకే అవినాష్‌పై కేసు నమోదు చేశారు. మరో నిందితుడు దస్తగిరికి చెప్పిన విషయాన్ని పరిగణించారు. హత్య వెనుక ఎవరో పెద్దవాళ్లున్నారని ఏ1 అన్నాడన్నది దస్తగిరి కథనం. ఎవరో ఏదో అన్నారని.. దాని ఆధారంగా అభియోగం మోపడం హియర్ సే(సాధారణంగా న్యాయస్థానంలో సాక్ష్యంగా అనుమతించబడదు) అవుతుంది. పైగా 2021 వరకు జరిగిన సీబీఐ దర్యాప్తులో అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవు. సీబీఐ కూడా ఇప్పటి వరకు అవినాష్‌ను అరెస్ట్ చేయలేదు. కేవలం నోటీసులు ఇచ్చి మాత్రమే విచారించింది. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడమన్న ఆప్షన్ చిట్ట చివరిదై ఉండాలి. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను ఈ కోర్టు క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎవరిమీద ఏ ఆరోపణలున్నాయి? దానికి ఆధారాలేమున్నాయి?. ఏప్రిల్ 25వరకు అవినాష్‌ను అరెస్ట్ చేయొద్దు. అవినాష్‌రెడ్డి విచారణ సందర్భంగా ప్రశ్నలను ముందుగా ఇచ్చి.. లిఖితపూర్వకంగా జవాబులు తీసుకోవాలి. దర్యాప్తు ప్రక్రియను ఆడియో, వీడియో ద్వారా రికార్డు చేయాలి. ఈ కేసులో తుది ఉత్తర్వులు ఏప్రిల్ 25న ఇస్తాం అని తెలంగాణ హైకోర్టు ఇరు వర్గాలకు స్పష్టం చేసింది. అంతేకాదు.. కేసు దర్యాప్తుపై ఇప్పటికే సుప్రీంకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసిందని, దర్యాప్తును ఏప్రిల్ 30 లోపు పూర్తి చేయమని సుప్రీంకోర్టు సూచించిందని కోర్టు గుర్తు చేసింది. అలాగే.. మధ్యంతర ఉత్వర్వుల్లో సిద్దారాం vs మహారాష్ట్ర కేసును ఉదహరించింది. -
ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, అమరావతి: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనపై ఎస్సీ, ఎస్టీ చట్టంతోపాటు హత్యాయత్నం కింద నమోదైన కేసులో దర్యాప్తు నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. కేసు ప్రాథమిక దశలో ఉన్నందున దర్యాప్తును నిలిపివేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఫిర్యాదుదారు వాదన వినకుండా ఉత్తర్వులు ఇవ్వడం కూడా సాధ్యం కాదంది. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ఫిర్యాదుదారు వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని గుర్తు చేసింది. ఒకవేళ ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తే మిగిలిన కేసుల్లో కూడా ఇలాంటి పిటిషన్లు కోకొల్లలుగా దాఖలవుతాయని తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఫిర్యాదుదారు మాతంగి వెంకటకృష్ణను, పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై జస్టిస్ శ్రీనివాసరెడ్డి గురువారం విచారణ జరిపారు. పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే ముందు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద ఫిర్యాదుదారు వాదన వినడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంగా చెప్పిందని ఉదాహరణలతో వివరించారు. శ్రీధర్‌రెడ్డిపై నమోదైన కేసు ప్రాథమిక దశలోనే ఉందని తెలిపారు. అంతకు ముందు శ్రీధర్‌రెడ్డి తరపు న్యాయవాది తప్పెట నాగార్జునరెడ్డి వాదనలు వినిపిస్తూ.. రాజకీయ కారణాలతో కేసు నమోదు చేశారన్నారు. పిటిషనర్ విషయంలో ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. -
అనుమతి లేకుండా అమితాబ్ పేరు వాడొద్దు.. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ పేరు, స్వరం, ఫొటోలు, ఆయనకు సంబంధించిన క్లిప్పింగ్‌లను ఎవరూ అనధికారికంగా వాడరాదంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒక ప్రముఖుడిగా తన ప్రచార హక్కులకు భంగం కలిగిస్తూ ‘కేబీసీ లాటరీ’ నిర్వాహకుడు సహా పలువురు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ అమితాబ్ వేసిన పిటిషన్‌పై విచారణ శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. పేరుప్రఖ్యాతులున్న బచ్చన్‌కు ఈ దశలో ఉపశమనం కల్పించకపోతే తీవ్ర నష్టాన్ని, చెడ్డపేరును చవిచూసే అవకాశం ఉందని ఈ సందర్భంగా జస్టిస్ నవీన్ చావ్లా పేర్కొన్నారు. విచారణను వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేశారు. -
ఎమ్మెల్యేలకు ఎర’ కేసు: సిట్ నోటీసులపై స్టే ఇవ్వలేం: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, న్యాయవాది శ్రీనివాస్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలన్న ఆ పార్టీ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ పరిస్థితుల్లో దర్యాప్తును అడ్డుకోలేమని పేర్కొంది. తదు పరి ఆదేశాలిచ్చే వరకు సంతోష్, శ్రీనివాస్‌ను అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించింది. సీఆర్పీసీ 41(ఏ) నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడానికి వీళ్లేదని స్పష్టం చేశారు. వెంటనే నోటీసులు అందజేసి విచారణ జరపాలని స్పష్టం చేసింది. ఢిల్లీలో ఉన్న సంతోష్‌కు నోటీసులు ఇచ్చేందుకు అక్కడి పోలీసులు.. సిట్‌కు సహకరించాలని సూచించింది. ఈ మేరకు వివరాలను ఢిల్లీ పోలీసులకు ఈ–మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా పంపాలని సిట్‌ను ఆదేశించింది. సీఆర్పీసీ 41(ఏ) నోటీసులు ఇవ్వ డం.. నిందితుల విచారణ లాంటి అంశాలు మీడియాకు ఎలా లీక్ అవుతున్నాయని ప్రశ్నించింది. దర్యాప్తు పారదర్శకంగా జరగాలని, వివరాలు గోప్యంగా ఉంచాలని సూచించింది. దర్యాప్తు వివరాలను సింగిల్ జడ్జికి అందజేయాలని మాత్రమే ద్వి సభ్య ధర్మాసనం చెప్పిందని.. అనుమతి తీసుకోమని చెప్పలేదని స్పష్టం చేసింది. మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఘటనలో ప్రధాన నిందితులకు బీఎల్ సంతోష్, శ్రీనివాస్‌తో సంబంధాలు ఉన్నాయని.. విచారణకు రావాలంటూ సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులు అందజేసేందుకు ఢిల్లీ పోలీసులు సహకరించడం లేదని సిట్, నోటీసులు ఆపాలంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లపై హైకోర్టు శనివారం విచారణ చేపట్టింది. వాదనల తర్వాత.. దర్యాప్తును రోజువారీ పర్యవేక్షణ చేయాలన్న బీజేపీ అభ్యర్థనపై ద్వి సభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించాలని సూచించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ చిదంబరేశ్, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్, అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) రామచంద్రరావు వాదనలు వినిపించారు. 41ఏ కింద నోటీసులు ఎలా ఇస్తారు... చిదంబరేశ్ వాదనలు వినిపిస్తూ.. ‘ద్వి సభ్య ధర్మా సనం ఆదేశాల మేరకు నోటీసుల జారీకి సిట్ సింగిల్ జడ్జి అనుమతి తీసుకోవాలి. కానీ, తీసుకోలేదు. నోటీసుల జారీ, నిందితుల విచారణకు సంబంధించి దర్యాప్తు వివరాలను మీడియాకు లీకులిస్తోంది. ఆ వివరాలన్నీ పత్రికలు, చానళ్లలో ప్రసా రమయ్యాయి. ఇది కోర్టు ధిక్కారం కిందికే వస్తుంది. అసలు ఈ కేసులో సంతోష్ నిందితుడు కాదు. అయినా అతనికి నోటీసులు ఇచ్చారు. మనీశ్ మహేశ్వర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ తీర్పు ప్రకారం.. నిందితుడు కాని వారికి సెక్షన్ 160 కింద నోటీసులు ఇవ్వాలి. సెక్షన్ 41ఏ కింద కాదు. విచారణకు వచ్చిన వెంటనే ఆయనను అరెస్టు చేయడం కోసమే ఈ నోటీసులు ఇచ్చారు. అతన్ని అరెస్టు చేస్తే రాజకీయ వివాదంగా మారే పరిస్థితి ఉంది. ఇది ద్వి సభ్య ధర్మాసనం ఉత్తర్వులకు విరుద్ధం. బీజేపీ ప్రధాన కార్యదర్శికి నోటీసులు ఇస్తూ.. ఆ పార్టీకి లోకస్(అర్హత) లేదనడం అర్థరహితం. ఈ విషయం విచారణలో ఉంది. దీని పై ద్వి సభ్య ధర్మాసనం కూడా కలుగజేసుకోలేదు. విచారణ పారదర్శకంగా సాగాలన్నదే పిటిషనర్ ఉద్దేశం. ఈ క్రమంలో నోటీసులపై స్టే విధించాలి’అని నివేదించారు. ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు.. ఏఏజీ వాదనలు వినిపిస్తూ.. ‘నోటీసులు ఇ చ్చేందుకు సహకరించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు కోర్టు ఆదేశాలు ఇవ్వాలి. 16న సిట్ వెళ్లినా వారు సహకరించలేదు. బీజేపీ ప్రధాన కార్యాయానికి అధికారులు వెళ్లినా అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. ఇది ద్వి సభ్య ధర్మాసనం ఆదేశాల ఉల్లంఘనే అవుతుంది’ అని చెప్పారు. ఈ కేసులో మనీశ్మహేశ్వరీస్ తీర్పు వర్తించదని ఏజీ పేర్కొన్నారు. అరెస్టు చేయాలన్న ఉద్దేశంతో నోటీసులు జారీ చేయలేదని చెప్పారు. ఆడియో, వీడియోలోని విషయాలను ఖరారు చేసుకోవడానికి వారిని విచారణ చేయాల్సి ఉందన్నారు. -
రౌడీషీట్లు తెరవచ్చు
సాక్షి, అమరావతి: ఏపీ పోలీస్ మాన్యువల్, పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ (పీఎస్వో) ప్రకారం రౌడీ షీట్లు తెరవడం, కొనసాగించడం, రౌడీలుగా ప్రకటించడం, వ్యక్తులపై నిఘాకు వీల్లేదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును హైకోర్టు ధర్మాసనం నిలుపుదల చేసింది. ప్రాథమికంగా సింగిల్ జడ్జి ఉత్తర్వులు చెల్లవని ధర్మాసనం ప్రకటించింది. సింగిల్ జడ్జి తీర్పునకు అనుగుణంగా ఆయా వ్యక్తులపై మూసివేసిన రౌడీషీట్లు , హిస్టరీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు లాంటి వాటిని తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు తిరిగి తెరవడానికి వీల్లేదని పోలీసులకు తేల్చి చెప్పింది. అయితే ఆ వ్యక్తులపై తాజాగా ఏవైనా ఆధారాలుంటే వాటి ప్రకారం రౌడీషీట్లు, హిస్టరీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు తెరవొచ్చని స్పష్టం చేసింది. అనుమానితుడిపై, నిందితుడిపై నిఘా వేయాలనుకుంటే పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారమే ఆ పని చేయాలని ఆదేశించింది. ఎవరైనా వ్యక్తి / నిందితుడిని పోలీస్‌స్టేషన్‌కు పిలవాలంటే చట్ట ప్రకారం, పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం ముందస్తు నోటీసు ఇవ్వాలని తేల్చి చెప్పింది. వేలిముద్రల సేకరణ చట్ట నిబంధనలకు అనుగుణంగానే చేయాలని పేర్కొంది. అరెస్ట్ ఉత్తర్వులను అమలు చేసేందుకు, ఏదైనా కేసులో అనుమానితుడు, నిందితుడు అవసరమైనప్పుడు మినహా రాత్రి వేళల్లో వారి ఇళ్లకు వెళ్లరాదని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, జస్టిస్ బండారు శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ జడ్జి తీర్పుపై ప్రభుత్వం అప్పీల్... పోలీసులు రౌడీషీట్లు తెరవడాన్ని, కేసులు కొట్టివేసినా వాటిని కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాదాపు 57 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ సోమయాజులు ఇటీవల తీర్పు వెలువరిస్తూ అసలు పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్‌కు చట్టబద్ధతే లేదని తేల్చి చెప్పారు. చట్టం అనుమతి లేకుండా పీఎస్వో ప్రకారం వ్యక్తులపై రౌడీషీట్లు తెరవడం, కొనసాగించడం, వ్యక్తుల సమాచారాన్ని సేకరించడం లాంటి వాటిని చేయడానికి వీల్లేదన్నారు. పీఎస్ఓ ప్రకారం ఏళ్ల తరబడి చేస్తూ వస్తున్న ఫోటోల సేకరణ, స్టేషన్లలో ప్రదర్శించడం, ఇళ్లను సందర్శించడం, స్టేషన్‌కు పిలిపించడం, స్టేషన్లో గంటల పాటు వేచి ఉండేలా చేయడం తదితరాలన్నీ వ్యక్తుల గోపత్య హక్కుకు విఘాతం కలిగించేవేనన్నారు. పోలీసులు ఇప్పటి నుంచి పోలీసు స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం ఇలాంటి పనులు చేయడానికి, వ్యక్తులపై అనుచిత నిఘా పెట్టడానికి వీల్లేదని ఆదేశిస్తూ ఈ ఏడాది జూలై 15న సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ ముఖ్య కార్యదర్శి ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలుపుదల చేయాలని కోరుతూ ఓ అనుబంధ పిటిషన్ వేశారు. తాజాగా హైకోర్టు ధర్మాసనం దీనిపై తీర్పు వెలువరించింది. 60 ఏళ్లుగా రౌడీషీట్లు తెరుస్తూనే ఉన్నారు.. ‘మద్రాసు నుంచి విడిపోయిన తరువాత 1954 వరకు అప్పటి మద్రాసు ఇన్స్పెక్టర్ జనరల్ జారీ చేసిన పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్‌ను ఆంధ్ర రాష్ట్రం యథాతథంగా అన్వయించుకుంది. ఆంధ్రప్రదేశ్ (ఆంధ్రా ప్రాంత) జిల్లా పోలీసు చట్టం 1859ని పూర్తి స్థాయిలో అమలు చేయడం మొదలైంది. ఇందులో పోలీసుల విధులు, బాధ్యతలు, నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, నేరస్తులను గుర్తించి చట్టం ముందు నిలబెట్టడం లాంటి వాటి గురించి స్పష్టంగా పేర్కొన్నారు. నేరాలను నియంత్రించేందుకు గత 60 ఏళ్లుగా రౌడీషీట్లు తెరవడమన్న ఆచారం కొనసాగుతూనే ఉంది. గతంలో సుంకర సత్యనారాయణ కేసులో పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ కార్యనిర్వాహక మార్గదర్శకాలేనని హైకోర్టు పేర్కొంది. అయినా ఈ కారణంతో రౌడీషీట్లు తెరవడాన్ని మాత్రం కొట్టేయ లేదు. రౌడీషీట్లు తెరవడం, మూసివేయడాన్ని క్రమబదీ్ధకరించే విషయంలో పలు ఆదేశాలు ఇచ్చింది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని రౌడీషీట్ల విష యంలో సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వ న్యాయవాది వాదనను తోసిపుచ్చలేం.. ‘కేఎస్ పుట్టస్వామి కేసులో గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకుంటూ రౌడీషీట్లు తెరవడం, నిందితులపై నిఘా ఉంచడం లాంటివి వ్యక్తి గోప్యతా హక్కుకు విఘాతం కలిగించేవని తేల్చారు. అయితే ప్రభుత్వ న్యాయవాది (హోం) మాత్రం పుట్టస్వామి కేసుకు ఈ కేసుతో ఎంతమాత్రం సంబంధం లేదని అంటున్నారు. ఆధార్ కార్డు జారీ సమయంలో వ్యక్తుల వివరాలను అడగడం గోప్యత హక్కుకు విఘాతమని సుప్రీంకోర్టు చెప్పిందని ప్రభుత్వ న్యాయవాది ఈ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఆ వాదన ప్రకారం ఈ కేసు నేరాన్ని నియంత్రించేందుకు అనుమానితులు, నిందితులపై తెరిచిన రౌడీషీట్లకు సంబంధించింది మాత్రమే. ప్రభుత్వ న్యాయవాది వాదనను ఈ దశలో ఏ రకంగానూ మేం తోసిపుచ్చలేం. ఒక వ్యక్తిపై రౌడీషీట్ తెరవడం అతడికి రాజ్యాంగం ప్రసాదించిన గోప్యత హక్కుకు భంగం కలిగించినట్లా? అన్నది ఇక్కడ ప్రశ్న. దీనిపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది’ అని ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుతం తమ ముందున్న ప్రాథమిక ఆధారాలను బట్టి సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. -
మధ్యంతర ఉత్తర్వులన్నీ నెల పొడిగింపు
సాక్షి, అమరావతి: హైకోర్టుతో పాటు కింది కోర్టులు, ట్రిబ్యునళ్లు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులన్నింటినీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో నెల రోజులపాటు హైకోర్టు పొడిగించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారాన్ని న్యాయస్థానం సుమోటోగా తీసుకొని బుధవారం విచారణ జరిపింది. కరోనా కేసులు, ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రతను దృష్టిలో పెట్టుకున్న న్యాయస్థానం.. న్యాయవాదులు, కక్షిదారుల సౌకర్యార్థం బుధవారం నాటికి అమలులో ఉన్న మధ్యంతర ఉత్తర్వులన్నింటినీ పొడిగిస్తున్నట్లు తెలిపింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది. -
తెలంగాణలో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనకు రావాలని విద్యార్థులను బలవంతం చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ప్రత్యక్ష తరగతులకు హాజరుకాని వారిపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తెలిపింది. ఆన్లైన్ ద్వారా ప్రత్యక్ష బోధనపై విద్యా సంస్థలదే నిర్ణయం అని హైకోర్డు పేర్కొంది. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవద్దని కోర్టు పేర్కొంది. ప్రత్యక్ష బోధన నిర్వహించే పాఠశాలలకు మార్గదర్శకాలు జారీ చేయాలని కోర్టు విద్యాశాఖను ఆదేశించింది. వారంలోగా మార్గదర్శకాలు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. గురుకులాలు, రెడిడెన్షియల్ స్కూళ్లలో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు స్టే విధించింది. గురుకులాలు, విద్యాసంస్థల్లో వసతి గృహాలు తెరవొద్దని కోర్టు ఆదేశించింది. గురుకులాలు, హాస్టళ్లలో వసతులపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 4కి కోర్టు వాయిదా వేసింది. ఇవీ చదవండి: Banjara Hills: భర్తతో విడిపోయి, మరొకరితో సహజీవనం.. బాలికపై అత్యాచారం పహాడీషరీఫ్: 38 రోజుల్లో నాలుగు హత్యలు, హడలెత్తుతున్న స్థానికులు -
ఫ్యూచర్–రిలయన్స్ డీల్‌కు బ్రేక్
న్యూఢిల్లీ: ఫ్యూచర్ రిటైల్‌ను (ఎఫ్ఆర్ఎల్) రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసే ప్రతిపాదనకు బ్రేక్ పడింది. ఈ డీల్‌ను సవాల్ చేస్తూ సింగపూర్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ప్యానెల్ (ఎస్ఐఏసీ)ని ఆశ్రయించిన అమెజాన్‌కు ఊరట లభించింది. ఈ ఒప్పందంపై 90 రోజుల పాటు స్టే విధిస్తూ ఎస్ఐఏసీ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఫ్యూచర్, అమెజాన్ గ్రూప్‌ల నుంచి చెరొక సభ్యుడు, తటస్థంగా ఉండే మరో సభ్యుడితో త్రిసభ్య ఆర్బిట్రేషన్ ప్యానెల్ ఏర్పాటు కావొచ్చని, వివాదంపై 90 రోజుల్లోగా తుది నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్బిట్రేషన్ ప్యానెల్ ఆదేశాలు స్వాగతిస్తున్నట్లు అమెజాన్ ప్రతినిధి వెల్లడించారు. దాదాపు 1 లక్ష కోట్ల డాలర్ల పైగా విలువ చేసే దేశీ రిటైల్ మార్కెట్లో ఆధిపత్యం సాధించేందుకు రిలయన్స్‌తో అమెజాన్ పోటీపడుతోన్న సంగతి తెలిసిందే. దీనికి ఈ వివాదం మరింత ఆజ్యం పోయనుంది. అమెజాన్ భారత మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే ఫ్యూచర్ రిటైల్ వంటి భారతీయ భాగస్వామి అవసరం చాలా ఉంది. మరోవైపు, దూకుడుగా దూసుకెడుతున్న రిలయన్స్ రిటైల్‌కి ఫ్యూచర్ రిటైల్ లభిస్తే .. తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు అవకాశం దక్కనుంది. సత్వరం డీల్ కుదుర్చుకుంటాం: రిలయన్స్ ఆర్బిట్రేషన్ ప్యానెల్ ఉత్తర్వులపై రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) స్పందించింది. ఒప్పందం ప్రకారం తమకు దఖలు పడ్డ హక్కులను వినియోగించుకుంటామని, మరింత జాప్యం జరగకుండా డీల్ కుదుర్చుకుంటామని స్పష్టం చేసింది. ఇక, ఆర్బిట్రేషన్ ప్యానెల్ ఉత్తర్వులను సవాలు చేయనున్నట్లు ఫ్యూచర్ రిటైల్ సంకేతాలు ఇచ్చింది. వివాదం ఇదీ..: ఫ్యూచర్ గ్రూప్‌లో కీలకమైన ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్ఆర్ఎల్)లో ఫ్యూచర్ కూపన్స్ సంస్థకు 7.3% వాటాలు ఉన్నాయి. అమెజాన్ గతేడాది ఈ ఫ్యూచర్ కూపన్స్‌లో 49% వాటాలు కొనుగోలు చేసింది. తద్వారా అమెజాన్‌కూ ఎఫ్‌ఆర్‌ఎల్‌లో వాటాలు దక్కాయి. ఫ్యూచర్ కూపన్స్‌తో డీల్ కుదుర్చుకున్నప్పుడే .. మూడు నుంచి పదేళ్ల వ్యవధిలో ఎఫ్‌ఆర్‌ఎల్‌ను కూడా కొనుగోలు చేసేందుకు తమకు హక్కులు దఖలు పడ్డాయని అమెజాన్ చెబుతోంది. ఇటీవలే కరోనా వైరస్‌పరమైన సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఫ్యూచర్ రిటైల్‌కు చెందిన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్ తదితర వ్యాపారాలను ఆర్ఆర్వీఎల్కి విక్రయిస్తున్నట్లు ఆగస్టు 20న ఫ్యూచర్ గ్రూప్ ప్రకటించింది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 24,713 కోట్లు. దేశవ్యాప్తంగా ఆర్ఆర్వీఎల్ వేగంగా రిటైల్ రంగంలో విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ డీల్‌ను అమెజాన్ వ్యతిరేకిస్తోంది. ఫ్యూచర్ గ్రూప్‌తో ఒప్పందం ప్రకారం ఎఫ్ఆర్ఎల్ కొనుగోలుకు సంబంధించి తమ హక్కులకు భంగం కలుగుతోందంటూ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ప్యానెల్‌ను ఆశ్రయించింది. ఫ్యూచర్ గ్రూప్ షేర్లు 10 శాతం పతనం... రిలయన్స్ రిటైల్ – ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు ఒప్పందానికి తాత్కాలిక బ్రేక్ పడటంతో ఇంట్రాడేలో ఫ్యూచర్ గ్రూప్ షేర్లు 10 శాతం వరకు పతనమయ్యాయి. ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్ షేరు 10 శాతం నష్టపోయి రూ.78.15 వద్ద ముగిసింది. ఫ్యూచర్ రిటైల్ షేరు 5 శాతం క్షీణించి రూ.73.85 వద్ద స్థిరపడింది. ఇక ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్, ఫ్యూచర్ కన్జూమర్ లిమిటెడ్ షేర్లు 5 శాతం మేర పతనమై లోయర్ సర్క్యూట్ వద్ద ఫ్రీజ్ అయ్యాయి. -
పీజీ మెడికల్ ఫీజుల ఉత్తర్వుల మార్పు
సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్ కోర్సుల ఫీజులపై హైకోర్టు వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులను మంగళవారం సవరించింది. గత 20వ తేదీ నాటి ఉత్తర్వుల వల్ల విద్యార్థులపై ఫీజుల భారం 75 శాతం వరకు ఉంటుందని సుదీప్ శర్మ సహా 121 మంది పీజీ మెడికల్ విద్యార్థులు అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం ఇరుపక్షాల వాదనల తర్వాత విద్యార్థుల వాదనను ఆమోదించింది. ఫీజుల్ని పెంచుతూ గత ఏప్రిల్ 14న జారీ చేసిన జీవో 20లో ప్రకటించిన ఫీజుల మొత్తంలో ఏ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం, బీ కేటగిరీ విద్యార్థులు 60 శాతం చెల్లించాలని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. గత ఉత్తర్వుల్లో 2016 నాటి ఫీజుతో పాటు తాజాగా పెంచిన ఫీజులో 50/60 శాతం చొప్పున ఆ రెండు కేటగిరీల వారూ చెల్లించాలంది. ఈ విధంగా ఫీజుల వసూళ్లకు అనుమతినివ్వాలని, మధ్యంతర ఉత్తర్వులను మార్పు చేయవద్దని కాలేజీ యాజమాన్యాల న్యాయవాదులు కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది సందీప్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ నెల 20 నాటి మధ్యంతర ఉత్తర్వులను మార్పు చేయాలని, లేకపోతే పాత జీవోలోని మొత్తం ఫీజు, కొత్త జీవోలో 50/60 శాతం వసూలు చేయాలన్న ఉత్తర్వుల వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, కాలేజీ యా జమాన్యాలకే మేలు జరుగుతుందని చెప్పారు. ఇరుపక్షాల వాదనల తర్వాత ధర్మాసనం.. కొత్త జీవో 20లో నిర్ణయించిన ఫీజులో 50/60 శాతం చొప్పున ఆ రెండు కేటగిరీలు చెల్లించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను వాయిదా వేసింది. -
పీజీ మెడికల్ సీట్ల అప్పగింతకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యలో రెండేళ్ల పీజీ డిప్లొమో సీట్లను అప్పగించి మూడేళ్ల పీజీ సీట్లను పొందేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. 2020–21 విద్యా సంవత్సరంలో ఆ విధంగా అమలు చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసీఏ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని డాక్టర్ పి.భావన సవాల్ చేస్తూ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ఆరు ప్రైవేటు మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ కాలేజీల్లోని 18 పీజీ డిప్లొమో సీట్లను ప్రభుత్వానికి అప్పగించి మెడికల్ సీట్లు పొందాయని, వీటిని నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కామినేని, కాకతీయ, ఎంఎన్ఆర్, ప్రతిమ, గాంధీ మెడికల్ కాలేజీలకు నోటీసులు జారీ చేసింది. విచారణను వచ్చే నెల 1కి వాయిదా వేసింది. గ్రామీణ ప్రాంత ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే 50 శాతం వారికి ఉన్న రిజర్వేషన్ల అవకాశాలు దెబ్బతింటాయని, పిటిషనర్ కూడా నష్టపోయారని ఆమె న్యాయవాది వాదించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే వారు రెండేళ్ల పీజీ డిప్లమోతో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారనే విషయాన్ని ఎంసీఏ, ప్రభుత్వం పట్టించుకోలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా వేళ వైద్య విద్యను వృద్ధి చేయాలని, నైపుణ్యతను పెంచాలని ప్రభుత్వం భావించి ఉంటే ఈ నిర్ణయం తీసుకుని ఉండేది కాదని, ఇది ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు మేలు జరిగేలా ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. -
శ్రీనిధి, వాసవి కాలేజీలకు సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని వాసవి, శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. వాసవి, శ్రీనిధి కాలేజ్‌లు విద్యార్థుల నుంచి అధిక ఫీజు వసూలు చేస్తున్నాయంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ కళాశాలల ఫీజు నియంత్రణ కమిటీ నిబంధనల ఆధారంగానే ప్రస్తుతానికి విద్యార్థుల నుంచి ఫీజుల వసూలు చేయాలని కోర్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ పేరెంట్స్ అసోషియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌తో పాటే తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. తదుపరి విచారణను జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలతో ఈ కాలేజ్‌ల్లో చదువుతున్న విద్యార్థులకు ఉపశమనం కలిగినట్టయింది. -
ధర్నాచౌక్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇందిరా పార్క్ వద్ద ధర్నాచౌక్‌ను కొనసాగించాలని మంగళవారం హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందనే కారణంతో ప్రభుత్వం ధర్నాచౌక్‌ను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో నిరసనలు తెలుపడంపై నిషేధం విధించారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు హైకోర్టును ఆశ్రయించారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నాచౌక్‌ను యథావిధిగా కొనసాగించాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ధర్నాచౌక్ పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఆరు వారాల వరకు ధర్నా చౌక్‌ను యథావిధిగా కొనసాగించాలని న్యాయస్థానం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆరు వారాలు పరిశీలించిన తర్వాత ఈ అంశంపై పూర్తి స్థాయిలో స్పందిస్తామని తెలిపింది. ఇకపై ధర్నా చౌక్‌లో యథావిధిగా నిరసనలు తెలుపడానికి కోర్టు అనుమతినిచ్చింది. -
మధ్యంతర ఉత్తర్వులుండవ్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వోద్యోగాల్లో ప్రమోషన్ల విషయంలో క్రీమీలేయర్ వర్తింపుపై 2006నాటి తీర్పు (ఎం.నాగరాజ్ తీర్పు అనికూడా పిలుస్తారు)కు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోమని స్పష్టంచేసింది. ‘2006 తీర్పు’ను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని ధర్మాసనం ఆదేశించింది. మధ్యంతర ఉపశమన చర్యలు ఇచ్చేందుకు కేసు విచారించబోమని, కూలంకషంగా చర్చిస్తామని స్పష్టం చేసింది. ‘ఈ విషయాన్ని రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుంది. ఇందుకోసం ఎం నాగరాజు తీర్పుపై విచారించేందుకు ఏడుగురు సభ్యులతో ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తాం’ అని వెల్లడించింది. తదుపరి విచారణ ఆగస్టు 3న జరుగుతుందని స్పష్టం చేసింది. నియామకాలు ఆగిపోయాయ్: కేంద్రం వివిధ న్యాయపరమైన ప్రకటనల కారణంగా రైల్వేలు, ఇతర సేవా రంగాల్లో లక్షల ఉద్యోగాల నియామకాలు ఆగిపోయాయని, దీనిపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టాలని అటార్నీ జనరల్ వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వాదన వినిపిస్తూ.. వివిధ బెంచ్‌లు, హైకోర్టులు ఇటీవల ఇచ్చిన తీర్పుల కారణంగా రిజర్వేషన్లపై గందరగోళం నెలకొందన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల విషయంలో ‘స్టేటస్ కో’ నెలకొందంటూ ఓ హైకోర్టు తీర్పు వెల్లడించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వం పదోన్నతులకు సిద్ధమవుతున్న సమయంలో జస్టిస్ కురియన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును పెండింగ్‌లో పెట్టిందన్నారు. ధావన్ వాదనలను వేణుగోపాల్ సమర్థించారు. పదోన్నతుల్లో రిజర్వేషన్‌పై గందరగోళం నెలకొందని.. ఈ పరిస్థితికి ముగింపు పలకాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వం తరపున వాదిస్తున్న మరో సీనియర్ న్యాయవాది శేఖర్ నాఫడే మాత్రం.. ఈ విషయంలో గందరగోళం లేదన్నారు. పలు పక్షాలు వాదిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. క్రీమీలేయర్ వర్తించదు: నాటి తీర్పులో సుప్రీం 2006 నాటి ‘ఎం నాగరాజ్, ఇతరులు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం’ తీర్పును పునఃపరిశీలించాలా వద్దా? అనే అంశాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయిస్తుందని గతేడాది నవంబర్ 15న ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వోద్యోగాల పదోన్నతుల్లో క్రీమీలేయర్ వర్తించదంటూ ఎం నాగరాజు తీర్పులో 2006లో సుప్రీం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
వేకువజామున మూడింటిదాకా కేసుల విచారణ
ముంబై: వేసవి సెలవుల నేపథ్యంలో ముంబై హైకోర్టు జడ్జీలంతా సాయంత్రం ఐదింటికి విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లిపోగా ఒక్కరు మాత్రం తెల్లవారేదాకా కేసుల పరిష్కారంలో తలమునకలై ఉన్నారు. ఆయన.. జస్టిస్ షారుఖ్ జె కథావాలా..! జస్టిస్ కథావాలా శుక్రవారం ఉదయం 10 గంటలకు విధులకు హాజరై, శనివారం వేకువజాము 3.30 గంటల దాకా కోర్టులో ఉండి, అత్యవసర మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన దాదాపు 100 పిటిషన్లను విచారించారని జడ్జి ఒకరు చెప్పారు. గత వారం కూడా ఆయన అర్ధరాత్రి దాకా కేసులు విచారించారని చెప్పారు. ‘జస్టిస్ కథావాలా 3.30దాకా పనిచేసినా ఆయన ముఖంలో ఎలాంటి అలసటా కనిపించలేదు.ఆఖరుగా విచారించిన పిటిషన్లలో నాది కూడా ఒకటి. నా వాదనలను ఆయన చాలా ప్రశాంతంగా, ఓపిగ్గా విని ఉత్తర్వులు జారీ చేశారు’ అని న్యాయవాది ప్రవీణ్ సందాని చెప్పారు. తెల్లవారుజాము దాకా అత్యవసర ఉత్తర్వులను జారీ చేసి వెళ్లిన ఆయన.. తిరిగి శనివారం ఉదయం తన కార్యాలయానికి వచ్చి పెండింగ్ పనులు పూర్తి చేశారని చెప్పారు. మిగతా జడ్జీల కంటే గంట ముందుగా ప్రతిరోజూ ఆయన ఉదయం 10 గంటలకే కోర్టు విధులను ప్రారంభిస్తారు. కోర్టు వేళలు ముగిసేదాకా తన సీటులోనే ఉంటారని కోర్టు సిబ్బంది తెలిపారు. కాగా, ముంబై హైకోర్టుకు ఈనెల 7వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు వేసవి సెలవులున్నాయి. -
గరుడ వేగ సినిమా ప్రదర్శించొద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ హీరో రాజశేఖర్ నటించిన ‘పీయస్వీ గరుడ వేగ’ చిత్రాన్ని ప్రదర్శించరాదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గరుడ వేగ సినిమాపై డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(యూసీఐ) అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌కు విచారించిన సివిల్ కోర్టు ఇకపై గరుడవేగ చిత్రాన్ని టీవీల్లో గానీ, యూట్యూబ్, సోషల్ మీడియాల్లో గానీ ప్రదర్శించరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించవద్దంటూ దర్శకనిర్మాలతో పాటు, యూట్యూబ్‌కు కోర్టు నోటీసులు పంపింది. అసలేం జరిగింది? గరుడ వేగ సినిమా తమ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై కోర్టు నాల్గవ జూనియర్ సివిల్ జడ్జి కె.కిరణ్‌కుమార్ విచారణ చేపట్టారు. చిత్రం మొత్తం యురేనియం కార్పొరేషన్లో జరిగిన కుంభకోణం నేపథ్యంలో సాగిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. సదరు సంస్థకు చెందిన యురేనియం ప్లాంట్ ఏపీలోని తుమ్మలపల్లిలో ఉందన్నారు. ఈ ప్లాంట్ నుంచి అక్రమంగా ప్లూటోనియం, థోరియం తరలించినట్టు.. ఈ స్కాంలో తుమ్మలపల్లి ఎమ్మెల్యే, హోంమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రిత్వశాఖ అధికారులు, యురేనియం కార్పొరేషన్ ఛైర్మన్, ఉన్నతాధికారులు పాత్రధారులైనట్లు చిత్రీకరించి కించపరిచారని పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ స్కాంను ఎన్ఐఏ అసిస్టెంట్ కమిషనర్ పాత్రధారుడిగా హీరో వెలికి తీసినట్టు చూపారని లాయర్ పేర్కొన్నారు. అందువల్ల చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని కోరారు. దీంతో పిటిషనర్ వాదనలను పరిశీలించిన జడ్జి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు చిత్ర ప్రదర్శన, ప్రచార కార్యక్రమాలు, ప్రెస్మీట్లు వంటివి నిర్వహించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా వేశారు. చాలా కాలంగా సరైన హిట్‌కోసం ఎదురుచూస్తున్న రాజశేఖర్‌కు గతేడాది నవంబరులో వచ్చిన గరుడ వేగ మంచి విజయం అందించిన విషయం తెలిసిందే . సినిమా విడుదలైన ఆరు నెలల తర్వాత మధ్యంతర ఉత్తర్వులు రావడం గమనార్హం. -
టీఆర్టీ ఫలితాల విడుదలపై మధ్యంతర ఉత్తర్వులు
హైదరాబాద్ : టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్(టీఆర్టీ), సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) ఖమ్మం , వరంగల్ జిల్లాల ఫలితాల విడుదలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించ తలపెట్టిన టీఆర్టీ, ఎస్జీటీ పోస్టులలో డీఎస్సీ-2012 లో భర్తీ కాకుండా మిగిలిపోయిన వికలాంగ అభ్యర్థుల పోస్టులను టీఆర్టీ-2017లో వికలాంగ అభ్యర్థులకు కేటాయించకపోవటాన్ని సవాలు చేస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన మురళి, వరంగల్ జిల్లాకు చెందిన మల్లికార్జున్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 2012 డీఎస్సీలో వికలాంగ అభ్యర్థులకు కేటాయించిన ఎస్జీటీ పోస్టులలో ఖమ్మం జిల్లాలో 6 పోస్టులు, వరంగల్ జిల్లాలో 19 పోస్టులు మిగిలిపోయానని, అయితే జీవో 23, 99 ప్రకారం బ్యాక్లాగ్ పోస్టులను తరవాత వచ్చే వరుస మూడు నోటిఫికెషన్లలలో కూడా వికలాంగ అభ్యర్థులతో మాత్రమే భర్తీ చేయాలని తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 తెలియ చేస్తుందని న్యాయవాది బూర రమేష్ వాదించారు. ఖమ్మం జిల్లాలో మిగిలిపోయిన 6 పోస్టులలో కేవలం ఒక పోస్టును, వరంగల్ జిల్లాలో 19 పోస్టులలో కేవలం 10 పోస్టులు మాత్రమే వికలాంగ అభ్యర్థులకు కేటాయించారు అని బూర రమేష్ హైకోర్ట్ దృష్టికి తీసుకొచ్చారు. ఇది తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 కి విరుద్ధమని వాదించారు. బూర రమేష్ వాదనలతో ఉన్నత న్యాయస్థానం ఏకీభవించింది. అయితే పరీక్ష నిర్వహించుకోవచ్చుననీ ఈ వాజ్యం పై తుది తీర్పు వెలువడేవరకు ఖమ్మం, వరంగల్ జిల్లాలో టీఆర్టీ, ఎస్జీటీ ఫలితాలు ప్రకటించటానికి వీలు లేదు అని టీఎస్పీఎస్సీ, ఉన్నత విద్యా శాఖలకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆ ఆర్మీ అధికారులపై చర్యలు వద్దు: సుప్రీం
న్యూఢిల్లీ: షోపియాన్ జిల్లాలో అల్లరిమూకలపై కాల్పులు జరిపిన ఘటనలో ఆర్మీ మేజర్ అదిత్య కుమార్ సహా ఇతర అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని జమ్మూకశ్మీర్ పోలీసుల్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. మేజర్ కుమార్ తండ్రి కల్నల్ కరమ్‌వీర్ సింగ్ దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం.. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ పిటిషన్ వివరాలను అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కార్యాలయంతో పాటు జమ్మూకశ్మీర్ ప్రభుత్వంతో పంచుకోవాలని అత్యున్నత న్యాయస్థానం కల్నల్ సింగ్‌కు సూచించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ కేసులో సుప్రీంకోర్టు ముందస్తు అనుమతి లేకుండా పోలీసులు ఆర్మీ అధికారుల్ని అరెస్ట్ చేయడం కుదరదు. -
అవి అభివృద్ధి ప్రతిబంధకాలు: వెంకయ్య
న్యూఢిల్లీ: జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) వంటి ట్రిబ్యునల్స్ జారీచేస్తున్న మధ్యంతర ఉత్తర్వులు తరచుగా అభివృద్ధి ప్రతిబంధకాలుగా పరిణమిస్తున్నాయని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. పర్యావరణంపై ఎన్జీటీ నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో శుక్రవారం ఆయన మాట్లాడుతూ,.. ‘ట్రిబ్యునల్స్ ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నాయి. ట్రిబ్యునల్స్‌తో పాటు ఇతర నియంత్రణ సంస్థలు పనిని మరింత సులభతరం చేసేలా వ్యవహరించాలి. అంతేగాని అభివృద్ధి ప్రతిబంధకాలుగా ఉండకూడదు’ అని సూచించారు. వివాదం పరిష్కారమైతే మంచిదే గానీ..వివాదాన్ని వాయిదావేస్తే అభివృద్ధిని అడ్డుకున్నట్లేనని వెంకయ్య పేర్కొన్నారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వ సరి–బేసి వాహన విధానాన్ని ఆయన తప్పుబట్టారు.