మహిపాల్‌ కేసులో మధ్యంతర ఉత్తర్వులకు నో | high court not accepting for giving Interim orders to mahipal reddy case | Sakshi
Sakshi News home page

మహిపాల్‌ కేసులో మధ్యంతర ఉత్తర్వులకు నో

Published Fri, Jan 8 2016 2:47 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

high court not accepting for giving Interim orders to mahipal reddy case

సాక్షి, హైదరాబాద్:  మెదక్ జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి(టీఆర్‌ఎస్)కి జీతభత్యాలు చెల్లించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలన్న బీజేపీ నేత రఘునందన్‌రావు అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఓ పరిశ్రమ యజమానిని బెదిరించి బలవంతంగా రూ.15 లక్షల చెక్కు రాయించుకున్న కేసులో మహిపాల్‌రెడ్డికి రెండున్నరేళ్ల జైలు శిక్ష, జరి మానా విధిస్తూ సంగారెడ్డి కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసును లోతుగా విచారించాల్సిఉందని, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదని కోర్టు తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement