బైరెడ్డి రాజశేఖరరెడ్డి లొంగుబాటు | byreddy rajasekhar reddy surrender at court | Sakshi
Sakshi News home page

బైరెడ్డి రాజశేఖరరెడ్డి లొంగుబాటు

Published Mon, Nov 10 2014 12:09 PM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM

బైరెడ్డి రాజశేఖరరెడ్డి లొంగుబాటు - Sakshi

బైరెడ్డి రాజశేఖరరెడ్డి లొంగుబాటు

కర్నూలు: రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి కోర్టులో లొంగిపోయారు. నందికొట్కూరు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ సాయి ఈశ్వరుడు హత్య కేసులో నిందితుడిగా ఉన్న బైరెడ్డి సోమవారం కోర్టుకు హాజరై లొంగిపోతున్నట్లు ప్రకటించాడు.తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, ఆ క్రమంలోనే తాను లొంగిపోయినట్లు తెలిపాడు. తనకు సాయి ఈశ్వరరెడ్డి హత్య చేయాల్సిన అవసరం లేదని.. రాజకీయంగా దెబ్బతీయడానికే అక్రమ కేసులు బనాయించారని బైరెడ్డి సృష్టం చేశాడు.

 

తన తండ్రి హత్య వెనుక బైరెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన తండ్రి శేషశయనారెడ్డి, సోదరుడి కుమారుడు సిద్ధార్థరెడ్డి, మరికొందరు ఉన్నారంటూ మృతుని కుమారుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై ఏప్రిల్ నెలలో తనపై పోలీసులు నమోదు చేసిన తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ మధ్యంతరం ఉత్తర్వులు ఇవ్వాలని బైరెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. అయితే బైరెడ్డి పిటీషన్ ను హైకోర్టు నిరాకరించింది. అప్పట్నుంచీ అజ్ఞాతంలో ఉన్న బైరెడ్డి ఈరోజు కోర్టులో లొంగిపోయాడు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement