
న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ పేరు, స్వరం, ఫొటోలు, ఆయనకు సంబంధించిన క్లిప్పింగ్‌లను ఎవరూ అనధికారికంగా వాడరాదంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒక ప్రముఖుడిగా తన ప్రచార హక్కులకు భంగం కలిగిస్తూ ‘కేబీసీ లాటరీ’ నిర్వాహకుడు సహా పలువురు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ అమితాబ్ వేసిన పిటిషన్‌పై విచారణ శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
పేరుప్రఖ్యాతులున్న బచ్చన్‌కు ఈ దశలో ఉపశమనం కల్పించకపోతే తీవ్ర నష్టాన్ని, చెడ్డపేరును చవిచూసే అవకాశం ఉందని ఈ సందర్భంగా జస్టిస్ నవీన్ చావ్లా పేర్కొన్నారు. విచారణను వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేశారు.