Voice message
-
అనుమతి లేకుండా అమితాబ్ పేరు వాడొద్దు.. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ పేరు, స్వరం, ఫొటోలు, ఆయనకు సంబంధించిన క్లిప్పింగ్‌లను ఎవరూ అనధికారికంగా వాడరాదంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒక ప్రముఖుడిగా తన ప్రచార హక్కులకు భంగం కలిగిస్తూ ‘కేబీసీ లాటరీ’ నిర్వాహకుడు సహా పలువురు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ అమితాబ్ వేసిన పిటిషన్‌పై విచారణ శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. పేరుప్రఖ్యాతులున్న బచ్చన్‌కు ఈ దశలో ఉపశమనం కల్పించకపోతే తీవ్ర నష్టాన్ని, చెడ్డపేరును చవిచూసే అవకాశం ఉందని ఈ సందర్భంగా జస్టిస్ నవీన్ చావ్లా పేర్కొన్నారు. విచారణను వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేశారు. -
ఏం చేస్తున్నావంటూ భార్యకు వాయిస్ మెసేజ్ పెట్టాడని..
కాకినాడ రూరల్: రమణయ్యపేట గ్రామ పరిధి గైగోలుపాడు గంజావారి వీధికి చెందిన ఓ వ్యక్తి బుధవారం హత్యకు గురయ్యాడు. సర్పవరం పోలీసుల కథనం ప్రకారం.. గైగోలుపాడుకు చెందిన సూరంపూడి దుర్గాప్రసాద్ బుధవారం వాసంశెట్టి నాగేశ్వరరావుపై దాడి చేశాడు. గతంలో వీరి కుటుంబాలు పక్కపక్కనే నివాసం ఉండేవి. బుధవారం మధ్యాహ్నం దుర్గాప్రసాద్ భార్యకు నాగేశ్వరరావు ఏం చేస్తున్నావని వాయిస్ మెసేజ్ పెట్టడం హత్యకు దారితీసినట్టు పోలీసులు భావిస్తున్నారు. చదవండి: కొత్త పెళ్లికొడుకు ప్రాణం తీసిన శోభనం..? మెసేజ్ చూసిన దుర్గాప్రసాద్‌కు కోపం రావడంతో పాటు తన భార్యతో వివాహేతర సంబంధం ఉండవచ్చని అనుమానించి నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి ఇనుప నీటి గొట్టంతో దాడి చేశాడు. తలపై బలమైన గాయాలవ్వడంతో నాగేశ్వరరావును స్థానికులు జీజీహెచ్‌లో చేర్చగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వదిన రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఎన్.సురేష్‌బాబు తెలిపారు. కేసును సీఐ మురళీకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు. -
WhatsApp: మీరు ఎక్కడంటే అక్కడ ఆపొచ్చు..!
వాట్సాప్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు వాడే సోషల్ మెసేజింగ్ యాప్. సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్ సొంతం. తన యూజర్ల కోసం వాట్సాస్ ఎప్పుడు సరికొత్త ఫీచర్లతో ముందుకు వస్తుంటుంది. తాజాగా వాట్సాప్ యాప్‌లో వాయిస్ మెసేజ్ సర్వీస్‌లకు మరో అద్బుతమైన ఫీచర్‌ను వాట్సాప్ యాడ్ చేయనుంది. చదవండి: 11 ఏళ్లకు అంతా ఉల్టా పల్టా? ఫేస్బుక్ డిలీట్ అంటూ కవర్ పేజీ మనం వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్‌లను పంపిస్తూ ఉంటాం. వాయిస్ మెసేజెస్ను స్పీకర్ ఐకాన్‌పై ప్రెస్ చేసి మెసేజ్‌లను రికార్డు చేసి ఇతర యూజర్లకు పంపుతాం. స్పీకర్ ఐకాన్‌పై ఆన్ప్రెస్ చేయగానే వాయిస్ మెసేజ్ ఇతర యూజర్లకు వెళ్లిపోతుంది. వాయిస్ మెసేజ్ రికార్డు చేసే సమయంలో మెసేజ్‌లను ‘పాజ్’ చేసి తిరిగి మరల రికార్డు చేసే సౌకర్యాన్ని వాట్సాప్ త్వరలోనే తీసుకురానుంది. వాయిస్ మెసేజ్ రికార్డు విషయంలో కొత్తగా పాజ్, ప్లే బటన్లను వాట్సాప్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డిలీట్, సెండ్ బటన్ కూడా అందుబాటులో ఉంచనుంది. ఈ ఫీచర్‌తో మనకు నచ్చిన అప్పుడు ఎక్కడంటే అక్కడ వాయిస్ మెసేజ్‌ను రికార్డు చేసే సౌకర్యాన్ని పొందవచ్చును. WABetainfo ప్రకారం... ఈ కొత్త ఫీచర్ త్వరలోనే వాట్సాప్ బెటా ఐవోఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉండనుంది. చదవండి: టాక్స్ పేయర్లకు ఎస్బీఐ గుడ్‌న్యూస్...! -
వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇకపై..!
వాట్సాప్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు వాడే సోషల్ మెసేజింగ్ యాప్. సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్ సొంతం. తరుచుగా తన వినియోగదారుల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా మరో ఫీచర్‌ను మరికొద్ది రోజుల్లోనే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. కొత్త ఫీచర్లో భాగంగా వాట్సాప్‌లో వినియోగదారులకు కనిపించే వాయిస్ మెసేజ్ సీక్ బార్ మారనున్నట్లు తెలుస్తోంది. సీక్బార్ స్థానంలో తరంగాల రూపంలో(వేవ్ ఫార్మ్స్) కనిపించనుంది. వాట్సాప్ బిజినెస్ అకౌంట్ వాడుతున్న వినియోగదారులకు కూడా శుభవార్తను అందించింది. భవిష్యత్తులో బిజినెస్ అకౌంట్ వాడుతున్న వారికి ఆన్లైన్లో ఉన్నట్లుగా ఉండే ఆప్షన్ ఇతర వాట్సాప్ వినియోగదారులకు కనిపించదని వాట్సాప్ ఒక ప్రకటనలో తెలిపింది. బిజినెస్ అకౌంట్ వాడుతున్నవారికి ఇతరులకు లాస్ట్‌సీన్ కూడా కనిపించదని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫీచర్లు టెస్టింగ్ దశలో ఉన్నాయి. కాగా ఈ ఫీచరును ఏప్పుడు రిలీజ్ చేస్తారనే విషయాన్ని వాట్సాప్ చెప్పలేదు. చదవండి: వాట్సాప్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేయండిలా.! -
ఆట సందీప్‌కు వాయిస్ మెసేజ్ పంపిన మెగాస్టార్ చిరంజీవి
ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్- జ్యోతీ రాజ్ దంపతులకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ మెసేజ్ పంపించారు. 'మీ థ్యాంక్యూ మెసేజ్ నాకు అందింది. అమ్మ మాటలు, ఆమె దీవెనలు నాకు కొండంత బలాన్ని ఇస్తున్నాయి. మీరు ఇద్దరు చేసే డ్యాన్స్ బిట్స్ అప్పుడప్పుడు నా దృష్టికి వస్తుంటాయి. మీ కపుల్స్ చాలా లవ్లీ డ్యాన్సర్స్. మీ క్రేజ్ నన్ను బాగా ఆకటుకుంటుంది. భవిష్యత్తులో మీరు ఇంకా పెద్ద కొరియోగ్రాఫర్‌గా రాణించాలని మనస్పూర్థిగా కోరుకుంటున్నాను' అని స్వయంగా చిరంజీవి పంపిన వాయిస్ మెసేజ్‌ను ఆట సందీప్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ఆధ్వర్యంలో చిరంజీవి ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా ఆట సందీప్ తల్లికి కూడా వ్యాక్సిన్ వేయించినట్లు తెలుస్తోంది. లాక్డౌన్ వల్ల ఎంతోమంది డ్యాన్సర్లు కూడా పని లేక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి అండగా నిలుస్తూ, గత కొన్ని రోజులుగా డ్యాన్సర్లకు సందీప్ దంపతులు నిత్యవసర వస్తువులు పంపిస్తున్న సంగతి తెలిసిందే. షో, ఆడియో ఫంక్షన్లు, సంగీత్ వంటి కార్యక్రమాలు ఆగిపోవడంతో గ్రూప్ డ్యాన్సర్లు సహా చాలామందికి ఆదాయం లేకుండా పోయింది. దీనివల్ల పూట గడవక చాలామంది బాధపడుతున్నారు. వాళ్లను ఆదుకునేందుకు ఆట సందీప్ దంపతులు తమవంతు సహాయం చేస్తున్నారు. మరోవైపు సందీప్‌కు మరింత సహకారం అందించేందుకు చిరంజీవి అల్లుడు, హీరో కల్యాణ్ దేవ్ సైతం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు స్వయంగా చిరంజీవి నుంచి వాయిస్ మెసేజ్ అందడంతో ఆట సందీప్ దంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన నోటి నుంచి తమ పేరు రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇక ఆట సందీప్ పోస్టుపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. చిరంజీవి నుంచి మెసేజ్ రావడం నిజంగా సూపర్ అంటూ అభినందిస్తున్నారు. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) చదవండి : సినీ కార్మికులందరికి ఉచితంగా వ్యాక్సిన్ : చిరంజీవి 'ఆట ఫేమ్ గీతిక ఎన్ని కష్టాలు పడుతుందో'.. ఆమె ఏం చెప్పిందంటే! -
వాట్సాప్ లో కొత్త ఫీచర్...వాయిస్ మెసేజ్‌లను...
వాట్సాప్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు వాడే సోషల్ మెసేజింగ్ యాప్. సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్ సొంతం. వాట్సాప్ ద్వారా సందేశాలను ఇతరులకు పంపుతాము. అప్పుడప్పుడు మనం పంపే మెసేజ్‌ల్లో ఏమైనా తప్పులు ఉన్నాయో లేదో..చూసి మెసేజ్‌లను పంపుతాం. ఈ సౌలభ్యం కేవలం వాట్సాప్‌లో మెసేజ్‌లకు మాత్రమే ఉంది. వాయిస్ మెసేజ్‌లకు లేదు. వాయిస్ మెసేజ్‌లను ఎలాంటి పునః పరిశీలన చేయకుండానే పంపుతుంటాం. మనలో కొంత మంది అరేరే..! తప్పుగా వాయిస్ మెసేజ్ సెండ్ చేశానే..!అని నాలుక కర్చుకుంటారు. కొన్ని సందర్భాల్లో మనలో కొందరు వాటివల్ల అనేక పర్యవసానాలను కూడా ఎదుర్కొని ఉంటారు. ఈ సమస్యకు వాట్సాప్ త్వరలోనే చెక్ పెట్టనుంది. అవును మీరు విన్నది నిజమే... రానున్న రోజుల్లో వాట్సాప్ తీసుకురానున్న ఈ ఫీచర్‌తో వాయిస్ మెసేజ్‌లను తిరిగి ఒకసారి వినే వీలు కల్గుతుంది. ఈ ఫీచర్‌ను ప్రస్తుతం వాట్సాప్ పరీక్షిస్తోంది. అంతేకాకుండా వాయిస్ మెసేజ్‌లను యూజర్లు ఎంపిక చేసుకున్న స్పీడ్‌ల్లో మెసేజ్‌లను వినవచ్చును. ఈ ఫీచర్‌తో యూజర్లు వాయిస్ మెసేజ్ ప్లేబ్యాక్ వేగాన్ని నియంత్రించవచ్చును. రానున్న రోజుల్లో వాయిస్ మెసేజ్‌లను పంపేటప్పడు ‘రివ్యూ’ బటన్ ఉండేలా వాట్సాప్ ఏర్పాటు చేస్తోంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లలో వాట్సాప్ తీసుకురానుంది. చదవండి: కరోనా: వాట్సాప్ ‘స్టేటస్’ మారిపోతోంది! -
క్యాపిటల్ బిల్డింగ్ విమానంతో కూల్చేస్తాం!
వాషింగ్టన్: అమెరికా దాడిలో మరణించిన ఇరాన్ సైనిక జనరల్ ఖాసీం సొలైమని మృతికి ప్రతీకారంగా అమెరికా క్యాపిటల్ బిల్డింగ్‌లోకి విమానం పంపి కూల్చేస్తామనే ఆడియో మెసేజ్ కలకలం సృష్టించింది. సోమవారం ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ ఫ్రీక్వెన్సీల మధ్యలో ఈ మెసేజ్ వినిపించింది. దీంతో ఎఫ్‌బీఐ, ఎఫ్ఏఏలు రంగంలోకి దిగి విచారణ చేపట్టాయని సీబీఎస్ సంస్థ తెలిపింది. ‘బుధవారం మేము క్యాపిటల్ బిల్డింగ్‌లోకి విమానం పంపి ధ్వంసం చేస్తాం. సొలైమని మృతికి ప్రతీకారం తప్పదు’ అని ఎవరూ గుర్తుపట్టకుండా డిజిటైజ్డ్ వాయిస్‌తో ఈ మెసేజ్ రికార్డు చేశారు. బుధవారం ఈ బిల్డింగ్‌లో యూఎస్ కాంగ్రెస్ సమావేశమై బైడెన్ గెలుపును ధ్రువీకరించనుంది. 2020 జనవరి 3న సొలైమని మిస్సైల్ దాడిలో మరణించారు. ఇది జరిగిన సంవత్సరం తర్వాత సొలైమని మృతికి ప్రతీకారమంటూ మెసేజ్ వినిపించడం రక్షణ వర్గాల్లో కలకలం సృష్టించింది. సొలైమని మరణం ఇరాన్లో తీవ్ర భావావేశాలు రేకెత్తించింది. ఇందుకు ప్రతిగా ఇరాక్‌లో పలుమార్లు పలువురు యూఎస్ వ్యక్తులపై, ఎంబసీపై దాడులు జరిగాయి. ఇరాన్ కోర్టులు ట్రంప్ సహా పలువురు యూఎస్ అధికారులపై అరెస్టు వారెంటులు జారీ చేశాయి. -
రైతుల రంది తీర్చే మొబైల్ స్టార్టర్
బాల్కొండ : మొబైల్ స్టార్టర్ కనెక్షన్ ఉన్న మోటర్‌కు సంబంధించిన ప్రతి వివరం రైతు ఫోన్‌కు ఎస్సెమ్మెస్ రూపంలో లేదా వాయిస్ మెసేజ్ రూపంలో వస్తుంది. మొబైల్ స్టార్టర్ బిగించిన మోటర్లకు విద్యుత్ సరఫరా అయ్యి మోటర్ ఆన్ అయిన పది సెకండ్లలో రైతు ఫోన్ నంబర్‌కు మెస్సేజ్ వెళ్తుంది. మోటర్ పనిచేయకపోతే ఏ కారణం చేత నడవడం లేదో కూడా గుర్తించి రైతుకు సమాచారాన్ని చేరవేస్తుంది. తెలుగులోనూ వాయిస్ మెస్సేజ్ అందుబాటులో ఉంది. ‘మీ మోటర్ ప్రారంభం కాలేదు’ అని స్పష్టంగా తెలుపుతుంది. ఇది మోటర్‌కు విద్యుత్ ఎప్పుడు ప్రసారమైంది, ఎప్పుడు ఆగి పోయింది అన్న టెన్షన్ రైతుకు లేకుండా చేస్తుందని లింగారెడ్డి వివరించారు. పంపు సెట్లకు రక్షణ ఈ యంత్రం మోటర్ ఆన్, ఆఫ్ సమాచారం తెలపడానికి మాత్రమే కాకుండా పంపు సెట్లకు రక్షణగా కూడా కల్పిస్తుంది. బావిలో, బోరులో నీరు అయిపోయిన సందర్భంలో రైతుకు మెస్సేజ్ పంపుతుంది. దీంతో రైతు ఆ మోటర్‌ను ఆఫ్ చేసుకోవచ్చు. ఎవరైనా పైప్లైన్లను పగుల గొట్టాలని గేట్ వాల్వులు తిప్పి నీటిని జామ్ చేసినా.. రైతుకు వెంటనే సమాచారాన్ని అంది స్తుంది. స్కాన్ చేసుకుని మోటర్లను ఆఫ్ చేస్తుంది. బిందు సేద్యానికి ప్రయోజనకరం బిందు సేద్యం చేసే రైతులకు ఈ మొబైల్ స్టార్టర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతు లింగారెడ్డి తెలిపారు. డ్రిప్ పైప్‌లలో ఏ వాల్వ్ పని చేయకపోయినా రైతు ఫోన్‌కు మెస్సేజ్ వస్తుంది. దీంతో దానికి మరమ్మతులు చేసుకోవచ్చు. గ్రామంలో లేకున్నా మెకానిక్కు ఫోన్ చేసి ఫలానా మోటర్లో ఫలానా సమస్య వచ్చిందని చెప్పే అవకాశం రైతుకు ఉంటుంది. మొబైల్ స్టార్టర్‌తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని రైతు లింగారెడ్డి పేర్కొన్నారు. త్రీఫేజ్ కరెంట్ ఉందా లేదా అని రైతులు ట్రాన్స్‌కో అధికారులకు కాకుండా తనకే ఫోన్ చేసి అడుగుతున్నారన్నారు. ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటికి 20 మంది వరకు రైతులు ఈ స్టార్టర్‌ను ఉపయోగిస్తున్నారని, దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.