వాట్సాప్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు వాడే సోషల్ మెసేజింగ్ యాప్. సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్ సొంతం. తన యూజర్ల కోసం వాట్సాస్ ఎప్పుడు సరికొత్త ఫీచర్లతో ముందుకు వస్తుంటుంది. తాజాగా వాట్సాప్ యాప్‌లో వాయిస్ మెసేజ్ సర్వీస్‌లకు మరో అద్బుతమైన ఫీచర్‌ను వాట్సాప్ యాడ్ చేయనుంది.
చదవండి: 11 ఏళ్లకు అంతా ఉల్టా పల్టా? ఫేస్‌బుక్ డిలీట్ అంటూ కవర్ పేజీ
మనం వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్‌లను పంపిస్తూ ఉంటాం. వాయిస్ మెసేజెస్‌ను స్పీకర్ ఐకాన్‌పై ప్రెస్ చేసి మెసేజ్‌లను రికార్డు చేసి ఇతర యూజర్లకు పంపుతాం. స్పీకర్ ఐకాన్‌పై ఆన్‌ప్రెస్ చేయగానే వాయిస్ మెసేజ్ ఇతర యూజర్లకు వెళ్లిపోతుంది. వాయిస్ మెసేజ్ రికార్డు చేసే సమయంలో మెసేజ్‌లను ‘పాజ్’ చేసి తిరిగి మరల రికార్డు చేసే సౌకర్యాన్ని వాట్సాప్ త్వరలోనే తీసుకురానుంది. వాయిస్ మెసేజ్ రికార్డు విషయంలో కొత్తగా పాజ్, ప్లే బటన్లను వాట్సాప్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా డిలీట్, సెండ్ బటన్ కూడా అందుబాటులో ఉంచనుంది. ఈ ఫీచర్‌తో మనకు నచ్చిన అప్పుడు ఎక్కడంటే అక్కడ వాయిస్ మెసేజ్‌ను రికార్డు చేసే సౌకర్యాన్ని పొందవచ్చును. WABetainfo ప్రకారం... ఈ కొత్త ఫీచర్ త్వరలోనే వాట్సాప్ బెటా ఐవోఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉండనుంది.
చదవండి: టాక్స్ పేయర్లకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్...!
Comments
Please login to add a commentAdd a comment