వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ 'ఛానెల్స్' వచ్చేసింది..ఇక సెలబ్రిటీలను | Mark Zuckerberg Announces The Launch Of WhatsApp Channels; What Is It, How It Works- Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ 'ఛానెల్స్' వచ్చేసింది..ఇక సెలబ్రిటీలను

Published Wed, Sep 13 2023 7:09 PM | Last Updated on Wed, Sep 13 2023 8:52 PM

Mark Zuckerberg announced WhatsApp Channels here is how to use it - Sakshi

WhatsApp Channels: మెటా  యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్  మోస్ట్‌ఎవైటెడ్‌ ఫీచర్‌ను ఇండియాలో లాంచ్‌ చేసింది. 'ఛానెల్స్' అనే కొత్త టూల్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వన్‌-వే బ్రాడ్‌కాస్ట్ టూల్ ఛానెల్‌ల ఫీచర్‌తో మనకిష్టమైన సెలబ్రిటీలను ఫాలో అవ్వొచ్చు. యూజర్లు ఫాలో అయ్యేందుకు ఎంచుకున్న ఛానల్ నుంచి కీలకమైన అప్‌డేట్‌లను పొందవచ్చు. 9 దేశాలలో ఛానెల్‌లను సృష్టించే ,అనుసరించే సామర్థ్యాన్ని విడుదల చేసిన తర్వాత,  iOS, Android , డెస్క్‌టాప్ కోసం WhatsApp  తాజా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసిన వినియోగదారులు  ఈ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్  బుధవారం ప్రకటించారు.  వేలాది కొత్త ఛానెల్‌లను జోడిస్తున్నాం మీరు కొత్త 'అప్‌డేట్‌లు' ట్యాబ్‌లో ఛానెల్‌లను కనుగొనవచ్చు అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లో వెల్లడించారు. (రుణగ్రహీతలకు భారీ ఊరట: ఆర్‌బీఐ కీలక ఆదేశాలు)

మీ సొంత వాట్సాప్‌ ఛానల్‌ స్టార్ట్‌ అయిన తరువాత ఇప్పటికే వాట్సాప్‌లో ప్రముఖ ప్రముఖులు, క్రీడా కారులు కళాకారులు, ఇన్‌ఫ్యూయర్స్‌, సంస్థలను ఫాలో అవ్వవచ్చు. ఉదాహరణకు, భారత క్రికెట్ జట్టు,  ప్రభాస్‌, క్రేజీ స్టార్లు, కత్రినా కైఫ్, దిల్జిత్ దోసాంజ్, అక్షయ్ కుమార్, నేహా కక్కర్‌ ఇలా మనకిష్టమైన వారిని ఫాలో అవ్వొచ్చు. అంతెందుకు వాట్సాప్‌ యజమాని  మార్క్ జుకర్‌బర్గ్‌ను కూడా అనుసరించ వచ్చు. దేశం ఆధారంగా స్వయంచాలకంగా ఫిల్టర్ అయిన ఛానెల్‌లను ఎంచుకోవచ్చు. సెర్చ్‌ చేయవచ్చు.మీ ఫాలోవర్స్‌ను బట్టి ఆధారంగా కొత్త, అత్యంత యాక్టివ్, జనాదరణ పొందిన ఛానెల్‌లను కూడా వీక్షించవచ్చు. ఇప్పటివరకు చిలీ కొలంబియా, ఈజిప్ట్, కెన్యా, మలేషియా, మొరాకో, పెరూ, సింగపూర్ , ఉక్రెయిన్‌లలో ఈ ఛానెల్‌లను లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే.

WhatsApp ఛానెల్‌లను ఎలా ఉపయోగించాలి
మీ WhatsApp యాప్‌ని Google Play Store లేదా App Store నుండి తాజా వెర్షన్‌కి అప్‌డేట్ చేయండి.
 WhatsAppఓపెన్‌ చేసి, స్క్రీన్ దిగువన ఉన్న అప్‌డేట్స్‌ ట్యాబ్‌పై నొక్కండి. ఇక్కడ  ఛానెల్స్‌ లిస్ట్‌కనిపిస్తుంది.
ఫాలో  అవ్వాలనుకున్న సంబంధిత ఛానెల్‌ని  పక్కన ఉన్న ‘+’ బటన్‌పై క్లిక్‌ చేయాలి. ఇక్కడ డిస్క్రిప్షన్‌,  ప్రొఫైల్ ,  ఛానెల్ పేరు  కూడా చూడవచ్చు.
 ఛానెల్  అప్‌డేట్‌ రియాక్షన్‌ కోసం మెసేజ్‌ మీద ప్రెస్‌ చేసి, నొక్కి పట్టుకుంటే చాలు. (యాపిల్‌ ఐఫోన్‌ 15 సిరీస్‌ : ప్రత్యర్థుల దారుణమైన ట్రోలింగ్‌ )

WhatsApp ఛానెల్‌ కొత్త అప్‌డేట్‌

  మెరుగైన డైరెక్టరీ: వినియోగదారులు ఇప్పుడు అధునాతన ఫిల్టర్‌లను ఉపయోగించడం ద్వారా కొత్త ఛానెల్‌లను అన్వేషించవచ్చు.
 రియాక్షన్స్‌ ఛానెల్‌లలో షేర్‌ అయిన కంటెంట్‌కు సంబంధించి వారి అభిప్రాయాలను  తెలియజేయవచ్చు.
♦ మెసేజ్ ఫార్వార్డింగ్ ఫీచర్: ఫార్వార్డ్ చేసిన మెసేజ్‌లు ఛానెల్‌కి  లింక్‌ బ్యాంక్‌ అవుతాయి. యూజర్లకు  జాయిన్‌ కావడం ఈజీ అవుతుంది. 
♦ డిలీట్‌ అప్‌డేట్‌ ఫర్‌ ఎవ్రీ వన్‌: ఛానెల్ క్రియేటర్లకు 30 రోజులలోపు  మెసేజ్‌ను తొలగించే సామర్థ్యాన్ని అందరికీ ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement