వాషింగ్టన్: టెక్ దిగ్గజం యాపిల్ 600 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. మే 27 నుంచి తొలగింపు వర్తిస్తుందంటూ మార్చి 28న 614 మంది వర్కర్లకు పంపిన లేఖలో యాపిల్ పేర్కొంది. ఈ ఉద్యోగులంతా శాంటా క్లారాలోని ఎనిమిది కార్యాలయాల్లో పని చేస్తున్నారు.
కోవిడ్–19 తర్వాత యాపిల్ ఇంత భారీ స్థాయిలో ఉద్వాసనలకు తెర తీయడం ఇదే ప్రథమం. కోవిడ్ సమయంలో భారీగా రిక్రూట్‌మెంట్ చేపట్టిన చాలా మటుకు టెక్ కంపెనీలు గత రెండేళ్లుగా పెద్ద యెత్తున ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment