Apple Layoffs 2023: After Google, Amazon, Meta Now Apple Looking To Laying Off Employees: Report - Sakshi
Sakshi News home page

షాకింగ్‌ న్యూస్‌: యాపిల్‌ ఉద్యోగుల గుండెల్లో గుబులు

Published Tue, Apr 4 2023 10:08 AM | Last Updated on Tue, Apr 4 2023 1:12 PM

After Google Amazon Meta now Apple looking to laying off employees - Sakshi

న్యూఢిల్లీ: టెక్‌ దిగ్గజం యాపిల్‌ కూడా లేఆఫ్స్‌ బాట పట్టినట్టు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్, మెటా, ఆల్ఫాబెట్, సిస్కో, ఆమెజాన్ఇ లా..దాదాపు  అన్ని టాప్‌ టెక్‌ సంస్థ వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించినప్పటికీ యాపిల్‌ ఇప్పటిదాకా  లేఆఫ్స్‌ మాట ఎత్త లేదు. కానీ ఇపుడిక యాపిల్ కూడా ఉద్యోగాలపై వేటు వేయనుంది. 

(ఇది కూడా చదవండి:  స్టార్‌ బ్యాటర్‌ కోహ్లీ అరుదైన ఘనత: గిఫ్ట్‌గా అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్)

బ్లూమ్‌బెర్గ్ న్యూస్ ప్రకారం, ఐఫోన్‌ మేకర్‌ తన కార్పొరేట్ రిటైల్ టీమ్స్‌లో కోతలను విధిస్తున్నట్టు తెలుస్తోంది. కంపెనీ అభివృద్ధి డెవలప్‌మెంట్‌ అండ్‌ ప్రిజర్వేషన్‌ బృందాలపై ఈ లేఆఫ్స్‌ ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు, అయితే ఎంతమందిని తొలగించనున్నారనే దానిపై స్పష్టతలేదు. మరోవైపు ఉద్యోగాలకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని,లేదంటే తొలగింపులు తప్పవని ఉద్యోగులను  యాపిల్‌ హెచ్చరించినట్టు బిజినెస్ ఇన్‌సైడర్  నివేదించింది. దీనిపై యాపిల్‌ అధికారిక ప్రకటన తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.

కాగా ఫెడ్‌ అధిక వడ్డీ రేట్టు, ప్రపంచ ఆర్థికమాంద్యం ఆందోళన నేపథ్యంలో ఇటీవలి కాలంలో టెక్ కంపెనీలు కూడా ఇప్పటికే భారీగా ఉద్యోగాల కోతను విధించిన సంగతి తెలిసిందే. ఫేస్‌బుక్‌ మాతృసంస్థ రెండు దఫాలుగా 21వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది ప్రారంభంలో గూగుల్ 12వేల మందికి, అమెజాన్‌ పలు రౌండ్లలో ఇప్పటివరకు 27వేల ఉద్యోగాలకు ఉద్వాసన పలికింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement