సోషల్ మీడియాలో మేసేజ్‌లు పంపడానికి, కాల్స్ చేయడానికి విస్తృతంగా వినియోగిస్తున్న యాప్ వాట్సాప్. ఇలాంటివి ఇంకా పలు మెసేజింగ్ యాప్‌లు ఉన్నాయి. ఒక యాప్ నుంచి మరో యాప్‌కి మెసేజ్‌లు, కాల్స్ చేసే వెసులుబాటు ఉంటే ఎంత బాగుంటుంది.. దీనికి సంబంధించే వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా కీలక ప్రకటన చేసింది.
యూరోపియన్ యూనియన్ డిజిటల్ మార్కెట్ల చట్టం (DMA)కి అనుగుణంగా తమ ప్రసిద్ధ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లైన వాట్సాప్, మెసెంజర్‌లను 2027 నాటికి థర్డ్-పార్టీ మెసేజింగ్ సేవలతో ఇంటర్‌ఆపరేబిలిటీకి సపోర్ట్ చేసేలా అభివృద్ధి చేయనున్నట్లు మెటా ప్రకటించింది. దీని ప్రకారం యాజర్లు నేరుగా వాట్సాప్, మెసెంజర్ యాప్‌ల నుంచి ఇతర నాన్-మెటా మెసేజింగ్ యాప్‌లకు నేరుగా మెసేజ్‌లు, కాల్స్ చేయవచ్చు, అందుకోవచ్చు.
మెటా ఈ కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్న క్రమంలో యూజర్ల గోప్యత, భద్రత ప్రధాన ప్రాధాన్యతలుగా తీసుకుంది. థర్డ్-పార్టీ చాట్‌లు ఇప్పటికే ఉన్న వాట్సాప్, మెసెంజర్ కమ్యూనికేషన్‌ల లాగే ఎన్‌క్రిప్షన్, వినియోగదారు గోప్యతను నిర్వహించేలా చూసే సాంకేతిక పరిష్కారంపై కంపెనీ పని చేస్తోంది. థర్డ్-పార్టీ చాట్‌ల గురించి వినియోగదారులకు తెలియజేసే కొత్త నోటిఫికేషన్‌లను మెటా ప్రవేశపెట్టింది. వాట్సాప్ లేదా మెసెంజర్‌కి వేరే యాప్ అనుసంధానమైన ప్రతిసారీ యూజర్లకు నోటిఫికేషన్ వస్తుంది.
కాల్స్ మాత్రం కాస్త ఆలస్యం
థర్డ్ పార్టీ యాప్‌లతో అనుసంధానమయ్యే విషయంలో వాట్సాప్, మెసెంజర్ యూజర్లకు సౌలభ్యం ఉంటుంది. ఇందులో భాగంగా అన్ని యాప్‌ల మెసేజ్‌లు ఒకే ఇన్‌బాక్స్‌లో కనిపించే లేదా విడివిడి ఇన్‌బాక్స్‌లలో కనిపించే ఆప్షన్లను ప్రవేశపెట్టే యోచనలో మెటా ఉంది. థర్డ్ పార్టీ యాప్‌లతో రియాక్షన్స్, డైరెక్ట్ రిప్లైస్, టైపింగ్ ఇండికేటర్స్, రీడ్ రిసీపియంట్స్ వంటి మెరుగైన మెసేజింగ్ ఫీచర్లతో పాటు గ్రూప్ చాట్ సౌలభ్యాన్ని కూడా 2025 నాటికి అందుబాటులోకి తెచ్చే పనిలో మెటా ఉంది. అయితే థర్డ్ పార్టీ యాప్‌లతో వాయిస్, వీడియో కాల్స్ ఫీచర్ మాత్రం 2027 నాటికి అందుబాటులోకి రావచ్చు.
Comments
Please login to add a commentAdd a comment