messages
-
ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక: ఆ లింక్ క్లిక్ చేశారో..
టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతోందో.. సైబర్ మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB).. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు ఓ కొత్త స్కామ్ గురించి హెచ్చరికలు జారీ చేసింది.స్కామర్లు మోసపూరిత సందేశాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు పంపిస్తున్నట్లు తెలిసింది. ఎస్బీఐ రివార్డును రీడీమ్ చేసుకోవడానికి యాప్ డౌన్లోడ్ చేయమని కొందరు మోసపూరిత మెసేజ్‌లను పంపిస్తున్నారు. ఈ మెసేజ్‌ను పీబీఐ షేర్ చేస్తూ.. వినియోగదారులు ఇలాంటి సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరింది. అనుచిత లింకుల మీద క్లిక్ చేయడం, యాప్స్ డౌన్లోడ్ చేయడం వంటివి చేయకూడదని పేర్కొంది.గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ వంటి విశ్వసనీయ మూలాల నుంచి మాత్రమే బ్యాంక్ సంబంధిత యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాలని ఎస్బీఐ వెల్లడించింది. ఇన్స్టాలేషన్ చేయడానికి ముందే దాని గురించి తెలుసుకోవాలని పేర్కొంది. నిజంగానే ఎస్బీఐ రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేసుకోవడానికి కస్టమర్లు అధికారిక రివార్డ్ వెబ్సైట్ సందర్సించాల్సి ఉంటుంది. లేదా కస్టమర్ కేర్‌కు కాల్ చేయాలి.స్కామర్లు పంపించిన మెసేజ్‌లను నిజమని నమ్మి.. లింక్ మీద క్లిక్ చేస్తే తప్పకుండా మోసపోతారు. ఇప్పటికే ఇలాంటి మోసాలకు చాలామంది బలైపోయారు. కాబట్టి వినియోగదారులు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. అనుమానాస్పద లింకుల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు.Beware ‼️Did you also receive a message asking you to download & install an APK file to redeem SBI rewards❓#PIBFactCheck❌@TheOfficialSBI NEVER sends links or APK files over SMS/WhatsApp✔️Never download unknown files or click on such links🔗https://t.co/AbVtZdQ490 pic.twitter.com/2J05G5jJZ8— PIB Fact Check (@PIBFactCheck) November 2, 2024ఇదీ చదవండి: సిద్దమవుతున్న సూపర్ యాప్: ఐఆర్సీటీసీ సర్వీసులన్నీ ఒకే చోట..సైబర్ నేరాలను తగ్గించడంలో ఆర్బీఐరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సైబర్ నేరాలను తగ్గించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మీద పనిచేస్తోంది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఆటోమాటిక్ వార్ణింగ్ సిస్టం రూపొందిస్తోంది. దీని సాయంతో అనుమానాస్పద లింకులు వచినప్పుడు యూజర్లను అలెర్ట్ చేస్తుంది. దీంతో యూజర్ జాగ్రత్త పడవచ్చు. అయితే ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయం తెలియాల్సి ఉంది. -
ఇన్‌స్టాగ్రామ్‌లో సాంకేతిక సమస్య! మీకూ ఎదురైందా?
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల వినియోగదారులు ఇబ్బంది పడినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. మంగళవారం సాయంత్రం 5:14 గంటల సమయంలో ప్రత్యేక్ష సందేశాలు(డైరెక్ట్ మెసేజ్‌లు) పంపించడంలో సమస్య ఎదుర్కొన్నట్లు నెటిజన్లు తెలిపారు. ఈమేరకు ఇతర సమాజిక మాధ్యమాల్లో అందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ పోస్ట్‌లు పెట్టారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ సర్వీస్ అంతరాయాలను ట్రాక్ చేసే డౌన్‌డెటెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం..ఇన్‌స్టాగ్రామ్‌లో డైరెక్ట్ మెసేజ్ పంపించేందుకు వినియోగదారులు కొంత సమయంపాటు ఇబ్బందిపడ్డారు. మంగళవారం సాయంత్రం సుమారు 5:14 గంటల సమయంలో ఈ సమస్య ఉత్పన్నమైంది. దీనిపై దాదాపు రెండువేల కంటే ఎక్కువే ఫిర్యాదులు అందాయి. ఈ సమస్య ఎదురైన యూజర్లు ట్విటర్ వేదికగా ఇంకెవరికైనా ఇలాంటి ఇబ్బంది తలెత్తిందా అని ప్రశ్నించారు. చాలామంది ఈ సమస్యతో ఇబ్బందిపడడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. కాగా, ఈ సాంకేతిక సమస్యకు కారణాలు తెలియరాలేదు. ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా నుంచి ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు.ఇదీ చదవండి: మూడు ప్లాంట్ల మూసివేత.. 10 వేల మందికి ఉద్వాసన!అమెరికాలో అక్టోబర్ 15న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వినియోగదారులకు సాంకేతిక సమస్య ఎదురైంది. దాంతో వేలాది సంఖ్యలో మెటా యూజర్లు ఇబ్బంది పడినట్లు పలు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. దాదాపు 12,000 కంటే ఎక్కువ మంది యూజర్లు ఫేస్‌బుక్‌కు సంబంధించి సమస్య ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సమస్యల గురించి 5,000 కంటే ఎక్కువ మంది ఫిర్యాదు చేశారు. -
ఎయిర్టెల్ సంచలన ఫీచర్.. కస్టమర్లకు ఇక నో టెన్షన్!
స్పామ్, అవాంఛిత కాల్స్, మెసేజ్‌ల బెడద రోజురోజుకీ పెరుగుతోంది. ఇవి మొబైల్ యూజర్లను విసిగించడమే కాకుండా వారిని మోసాలకు సైతం గురిచేస్తున్నాయి. ఈ ముప్పును అరికట్టడానికి భారతీ ఎయిర్టెల్ సంచలన ఫీచర్‌ను తీసుకొచ్చింది. “దేశంలో మొట్టమొదటి ఏఐ శక్తియుత, నెట్వర్క్ ఆధారిత స్పామ్ డిటెక్షన్ సొల్యూషన్”ను ఆవిష్కరించింది. తమ కస్టమర్ల కోసం ఇన్‌హౌస్ టూల్‌గా ఎయిర్టెల్ దీన్ని అభివృద్ధి చేసింది. ఇది అనుమానిత స్పామ్ కాల్స్, మెసేజ్‌లపై కస్టమర్లకు రియల్-టైమ్ అలర్ట్స్‌ను అందిస్తుంది. తద్వారా అటువంటి అవాంఛిత కాల్స్, ఎస్ఎంఎస్లు చాలా వరకు కట్టడయ్యే అవకాశం ఉంటుందని కంపెనీ చెబుతోంది.“స్పామ్ కస్టమర్లకు పెనుముప్పుగా మారింది. మేము గత పన్నెండు నెలలుగా దీనిని సమగ్రంగా పరిష్కరించడం కోసం కృషి చేశాం. దేశ మొట్టమొదటి ఏఐ-ఆధారిత స్పామ్-రహిత నెట్‌వర్క్‌ను ప్రారంభించడం ద్వారా ఈ రోజు ఒక మైలురాయిని సూచిస్తుంది“ అని ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గోపాల్ విట్టల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ఉచితంగా..ఈ ఫీచర్‌ను తమ కస్టమర్లకు ఎయిర్టెల్ ఉచితంగా అందించనుంది. వినియోగదారులందరికీ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ చేస్తారు. అంటే దీని కోసం సర్వీస్ రిక్వెస్ట్ పెట్టాల్సిన పని గానీ, దానిని యాక్సెస్ చేయడానికి ఏదైనా యాప్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం గానీ లేదు.ఇదీ చదవండి: జియో సూపర్‌హిట్ ప్లాన్..ఈ సిస్టమ్ డ్యూయల్-లేయర్డ్ “AI షీల్డ్”ను ఉపయోగించడం ద్వారా పని చేస్తుందని ఎయిర్టెల్ వివరించింది. ఇది నెట్వర్క్ అలాగే ఐటీ సిస్టమ్ స్థాయిలు రెండింటిలోనూ ప్రతి కాల్‌ను, ఎస్ఎంఎస్ని ఫిల్టర్ చేస్తుంది. ఇది సందేశాలను గుర్తిస్తుండగా ప్రతిరోజూ 150 కోట్ల మేసేజ్‌లను, 250 కోట్ల కాల్స్‌ను ప్రాసెస్ చేసి 30 లక్షల స్పామ్ ఎస్ఎంఎస్లు, 10 కోట్ల స్పామ్ కాల్స్ గుర్తించగలదని విట్టల్ వెల్లడించారు. -
వాట్సాప్ నుంచి వేరే యాప్‌లకు మెసేజ్‌లు, కాల్స్..
సోషల్ మీడియాలో మేసేజ్‌లు పంపడానికి, కాల్స్ చేయడానికి విస్తృతంగా వినియోగిస్తున్న యాప్ వాట్సాప్. ఇలాంటివి ఇంకా పలు మెసేజింగ్ యాప్‌లు ఉన్నాయి. ఒక యాప్ నుంచి మరో యాప్‌కి మెసేజ్‌లు, కాల్స్ చేసే వెసులుబాటు ఉంటే ఎంత బాగుంటుంది.. దీనికి సంబంధించే వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా కీలక ప్రకటన చేసింది.యూరోపియన్ యూనియన్ డిజిటల్ మార్కెట్ల చట్టం (DMA)కి అనుగుణంగా తమ ప్రసిద్ధ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లైన వాట్సాప్, మెసెంజర్లను 2027 నాటికి థర్డ్-పార్టీ మెసేజింగ్ సేవలతో ఇంటర్‌ఆపరేబిలిటీకి సపోర్ట్ చేసేలా అభివృద్ధి చేయనున్నట్లు మెటా ప్రకటించింది. దీని ప్రకారం యాజర్లు నేరుగా వాట్సాప్, మెసెంజర్ యాప్‌ల నుంచి ఇతర నాన్-మెటా మెసేజింగ్ యాప్‌లకు నేరుగా మెసేజ్‌లు, కాల్స్ చేయవచ్చు, అందుకోవచ్చు.మెటా ఈ కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్న క్రమంలో యూజర్ల గోప్యత, భద్రత ప్రధాన ప్రాధాన్యతలుగా తీసుకుంది. థర్డ్-పార్టీ చాట్లు ఇప్పటికే ఉన్న వాట్సాప్, మెసెంజర్ కమ్యూనికేషన్ల లాగే ఎన్క్రిప్షన్, వినియోగదారు గోప్యతను నిర్వహించేలా చూసే సాంకేతిక పరిష్కారంపై కంపెనీ పని చేస్తోంది. థర్డ్-పార్టీ చాట్ల గురించి వినియోగదారులకు తెలియజేసే కొత్త నోటిఫికేషన్లను మెటా ప్రవేశపెట్టింది. వాట్సాప్ లేదా మెసెంజర్‌కి వేరే యాప్ అనుసంధానమైన ప్రతిసారీ యూజర్లకు నోటిఫికేషన్ వస్తుంది.కాల్స్ మాత్రం కాస్త ఆలస్యంథర్డ్ పార్టీ యాప్‌లతో అనుసంధానమయ్యే విషయంలో వాట్సాప్, మెసెంజర్ యూజర్లకు సౌలభ్యం ఉంటుంది. ఇందులో భాగంగా అన్ని యాప్‌ల మెసేజ్‌లు ఒకే ఇన్‌బాక్స్‌లో కనిపించే లేదా విడివిడి ఇన్‌బాక్స్‌లలో కనిపించే ఆప్షన్లను ప్రవేశపెట్టే యోచనలో మెటా ఉంది. థర్డ్ పార్టీ యాప్‌లతో రియాక్షన్స్, డైరెక్ట్ రిప్లైస్, టైపింగ్ ఇండికేటర్స్, రీడ్ రిసీపియంట్స్ వంటి మెరుగైన మెసేజింగ్ ఫీచర్లతో పాటు గ్రూప్ చాట్ సౌలభ్యాన్ని కూడా 2025 నాటికి అందుబాటులోకి తెచ్చే పనిలో మెటా ఉంది. అయితే థర్డ్ పార్టీ యాప్‌లతో వాయిస్, వీడియో కాల్స్ ఫీచర్ మాత్రం 2027 నాటికి అందుబాటులోకి రావచ్చు. -
కాల్ చేస్తే కట్ చేయొచ్చు
సిడ్నీ: ఆఫీసులో పని ముగించుకొని, ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో యాజమాన్యం నుంచి ఫోన్లు, మెసేజ్‌లు వస్తే ఎలా ఉంటుంది? చాలా చిరాకు కలుగుతుంది కదా! ఆ్రస్టేలియాలో ఇలాంటి చిరాకు ఇకపై ఉండదు. ఎందుకంటే ‘రైట్ టు డిస్కనెక్ట్’ నిబంధన అమల్లోకి వచ్చింది. పని వేళలు ముగించుకొని ఇంటికెళ్లిన ఉద్యోగులకు యాజమాన్యాలు అనవసరంగా ఫోన్ చేస్తే జరిమానా విధిస్తారు. యాజమాన్యాలు ఫోన్లు, మెసేజ్‌లు చేస్తే ఉద్యోగులు స్పందించాల్సిన అవసరం లేదు. మాట్లాడకపోతే శిక్షిస్తారేమో, ఉద్యోగం పోతోందేమో అనే భయం కూడా అవసరం లేదు. ఆఫీసు అయిపోయాక యాజమాన్యం ఫోన్ చేస్తే ఫెయిర్ వర్క్ కమిషన్(ఎఫ్‌డబ్ల్యూసీ)కు ఫిర్యాదు చేయొచ్చు. అయితే, అత్యవసర పరిస్థితుల్లో యాజమాన్యం నుంచి ఫోన్ వస్తే ఉద్యోగులు స్పందించాల్సి ఉంటుంది. సరైన కారణం లేకుండా ఫోన్‌కాల్‌ను తిరస్కరించకూడదు. ఎఫ్‌డబ్ల్యూసీ నిబంధనలు అతిక్రమిస్తే యాజమాన్యాలకు 94 వేల డాలర్లు, ఉద్యోగులకు 19 వేల డాలర్ల జరిమానా విధిస్తారు. ఆఫీసులో పని ముగిశాక తమకు ఫోన్ చేయవచ్చా? లేదా? అనేది నిర్ణయించుకొనే అధికారాన్ని ఉద్యోగికి కట్టబెట్టారు. ఆ్రస్టేలియాలో ఆఫీసు టైమ్ అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగులు పని చేయడం మామూలే. ఒక్కో ఉద్యోగి ప్రతిఏటా సగటున 281 గంటలు అధికంగా ఆఫీసులో పని చేస్తున్నట్లు గత ఏడాది ఒక సర్వేలో వెల్లడయ్యింది. ఈ ఓవర్‌టైమ్ పనికి అదనపు వేతనం ఉండదు. -
క్రికెటర్ల నుంచి మెసేజ్‌లు.. ఎవరీ అందాల తార? (ఫోటోలు)
-
‘వికసిత్ భారత్’ సందేశాలను ఆపండి: ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసే వికసిత్ భారత్ సంకల్ప్ సందేశాలు ఓటర్ల ఫోన్లకు వాట్సాప్‌లో పంపడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తప్పుబట్టింది. వెంటనే ‘వికసిత్ భారత్’ గంపగుత్త మెసేజ్‌లను వాట్సాప్ ద్వారా పంపడం ఆపేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శికి గురువారం ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం నెలకొనడమే తమ ఉద్దేశమని ఈసీ పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నిబంధనావళి అమల్లోకి వచ్చాక సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభుత్వ పథకాలు, విజయాలను ప్రచారం చేయడం నిషేధమని ఈసీ పేర్కొంది. -
ఆమెకు 25.. అతడికి 42.. బాయ్‌ఫ్రెండ్‌తో సబలెంక (ఫొటోలు)
-
వాట్సాప్ నుంచి వేరే యాప్‌లకూ మెసేజ్‌లు!
న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ వినియోగదారులకు అనువుగా యాప్‌లో మార్పులు చేస్తున్న ‘వాట్సాప్’ త్వరలో మరో ఫీచర్‌ను జతచేయనుంది. ఇకపై వాట్సాప్ నుంచి సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ఇతర యాప్‌లకూ మెసేజ్‌లను పంపుకోవచ్చు. దీనికి అనువుగా కొత్త ఫీచర్‌ను వాట్సాప్‌లో త్వరలో తీసుకురానున్నారు. దీంతో ఇతర సామాజిక మాధ్యమాల వేదికలపైనా వాట్సాప్ నుంచి మెసేజ్‌లను షేర్ చేసుకోవచ్చు. ఇతర చాట్స్ కోసం ప్రత్యేకంగా, విడిగా ఒక చాట్ ఇన్ఫో స్క్రీన్ ఒకటి కనిపించేలా ఫీచర్‌ను వాట్సాప్ సిద్ధంచేస్తోంది. ఈ కొత్త ఫీచర్‌కు తుది మెరుగులు దిద్ది అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ నిపుణులు తలమునకలైనట్లు తెలుస్తోంది. వాట్సాప్‌తో మెసేజ్‌ల షేరింగ్‌లపై సిగ్నల్, టెలిగ్రామ్ యాప్‌లు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదని వాబేటాఇన్ఫో అనే సంస్థ స్పష్టంచేసింది. ఏఏ యాప్‌లతో అనుసంధానం అవ్వాలనేది ఆయా వాట్సాప్ యూజర్ల స్వీయనిర్ణయం, స్వీయ నియంత్రణ పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లదని వివరించింది. బీటీ వెర్షన్‌ను టెస్ట్చేస్తున్న కొన్ని సెలక్ట్ చేసిన గ్రూప్‌లకు మాత్రమే ఈ వాట్సాప్ ప్రొఫైల్ స్క్రీన్‌షాట్ అడ్డుకునే ఫీచర్ అందుబాటులో ఉంది. మరి కొద్ది వారాల్లో ఈ ఫీచర్‌ను యూజర్లు అందరికీ అందుబాటులోకి తేనున్నారు. -
అప్పుడు వాట్సాప్.. ఇప్పుడు మెసేజ్‌లు! బ్లాక్ చేస్తున్న ప్రముఖ బ్యాంకు..
ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ (HSBC Holdings Plc).. తమ ఉద్యోగులు ఆఫీస్ మొబైల్ ఫోన్ల నుంచి మెసేజ్‌లు పంపే వీలు లేకుండా కట్టడి చేస్తోంది. అనధికారిక కమ్యూనికేషన్ పద్ధతులను ఉపయోగించడంపై రెగ్యులేటరీ సంస్థలు ఇటీవల చర్యలు చేపట్టిన నేపథ్యంలో హెచ్ఎస్బీసీ తమ సిబ్బందిని ఆఫీస్ ఫోన్లలో సందేశాలు పంపకుండా బ్లాక్ చేస్తోంది. కంపెనీ ఉద్యోగులకు జారీ చేసిన ఫోన్లలో మెసేజ్ ఫంక్షన్‌ను డిసేబుల్ చేసే ప్రక్రియలో ఉందని విషయం తెలిసిన కొందరు వ్యక్తుల ద్వారా తెలిసింది. అంటే బ్యాంకు సిబ్బంది తమ ఆఫీస్ ఫోన్ల నుంచి సందేశాలను పంపలేరు, స్వీకరించలేరు. కాగా హెచ్ఎస్బీసీ ఇప్పటికే సిబ్బంది వర్క్ ఫోన్లలో వాట్సాప్ ఉపయోగించకుండా బ్లాక్ చేసింది. అయితే కీలకమైన బాధ్యతల్లో ఉన్న కొంతమంది ఉద్యోగులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిసింది. వారు తమ వర్క్ ఫోన్ల నుంచి మెసేజ్‌లు పంపించే అవకాశం ఉంది. ఇక ఉద్యోగుల వ్యక్తిగత ఫోన్లపై ఎలాంటి ఆంక్షలూ లేవు. రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా ఆమోదించిన కమ్యూనికేషన్ పద్ధతులను అవలంభిస్తున్నట్లు హెచ్ఎస్బీసీ బ్యాంక్ ప్రతినిధి చెప్పారు. సమాచారాన్ని పంచుకోవడానికి ట్రేడర్లు, డీల్మేకర్లు ఫోన్లు, సిస్టమ్‌లను ఎలా ఉపయోగిస్తున్నారు.. వారి యజమానులు వీటిని ఎలా ట్రాక్ చేస్తున్నారన్న దానిపై నియంత్రణ సంస్థలు పరిశోధిస్తున్న నేపథ్యంలో ఈ చర్య వచ్చింది. వాల్ స్ట్రీట్‌లోని కొన్ని అతిపెద్ద బ్యాంకులలో మార్కెట్ మానిప్యులేషన్‌కు సంబంధించిన అధిక ప్రొఫైల్ కేసుల తర్వాత ఆర్థిక దుష్ప్రవర్తనను నిరోధించడమే లక్ష్యంగా రెగ్యులేటరీలు ఈ చర్యలు చేపట్టాయి. వందల కోట్ల జరిమానా వాట్సాప్‌తో సహా అనధికారిక మెసేజింగ్ యాప్‌లలో ఉద్యోగుల కమ్యూనికేషన్లను పర్యవేక్షించడంలో విఫలమైనందుకు గానూ హెచ్ఎస్బీసీ ఈ ఏడాది ప్రారంభంలో యూఎస్ రెగ్యులేటరీ సంస్థకు పెద్ద మొత్తంలో జరిమానా కట్టేందుకు అంగీకరించింది. ఇందులో భాగంగా కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్‌కు 30 మిలియన్ డాలర్లు ( దాదాపు రూ. 250 కోట్లు), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు మరో 15 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 124 కోట్లు) చెల్లించింది. -
ఆండ్రాయిడ్ ఫోన్లలో భూకంప హెచ్చరికలు!
న్యూఢిల్లీ: తమ వినియోగదారులకు వారు ఉంటున్న ప్రాంతంలో సంభవించబోయే భూకంపానికి సంబంధించిన తక్షణ సమాచారాన్ని అలర్ట్‌ల రూపంలో గూగుల్ అందించనుంది. ఇందుకోసం ఆండ్రాయిడ్ ఫోన్లలో త్వరలో ‘ఎర్త్‌క్వేక్ అలర్ట్’ సందేశ సేవలను ప్రారంభించనుంది. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ), జాతీయ భూకంప కేంద్రాల సమన్వయంతో కొత్తగా ‘ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్స్ సిస్టమ్’ను భారత్‌లో మొదలుపెట్టనుంది. ‘యూజర్లు ఉంటున్న ప్రాంతంలో ఒకచోట భూకంపం వస్తే దానికి పసిగట్టి వెంటనే ఆ ప్రాంతం, చుట్టుపక్కల ప్రాంతాల ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు అందరికీ అలర్ట్‌లు మెరుపువేగంతో వెళతాయి’ అని గూగుల్ బుధవారం ఒక బ్లాగ్‌లో పేర్కొంది. ఆండ్రాయిడ్ 5, ఆపై అప్డేటెడ్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు ఇన్స్టాల్ అయిన ఫోన్లలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. -
ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇస్తామని మోసాలు
సాక్షి, హైదరాబాద్: విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెర తీస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఇతర ప్రైవేటు వ్యక్తులతో ఉచితంగా ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తున్నట్టు ఫోన్ సందేశాలను పంపుతున్నారు. వాటిలో వివరాలు నమోదు చేయాలంటూ కొన్ని యూఆర్ఎల్ లింక్‌లను జత చేస్తున్నారు. ఇవి నిజమైనవని ఎవరైనా నమ్మి ఆ లింక్‌లను తెరిస్తే అందులో ప్రాథమిక సమాచారం, ఆధార్, ఫోన్, బ్యాంకు ఖాతా నంబర్లు.. ఇలా పూర్తి సమాచారాన్ని కొల్లగొడుతున్నారు. ఫోన్లోకి మాల్వేర్ను మనకు తెలియకుండానే ఇన్స్టాల్ చేస్తున్నారు. ఇలా వారి వలకు ఎవరైనా చిక్కితే సంబంధిత వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను కొల్లగొడుతున్నట్టు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ అధికారులు హెచ్చరించారు. ఉచిత ల్యాప్‌టాప్‌ల పేరిట వచ్చే సందేశాలను నమ్మవద్దని వారు కోరుతున్నారు. స్టే సేఫ్ ఆన్లైన్ క్విజ్ ఆన్లైన్ మోసాలపై అవగాహన.. పోటీల గడువు ఈనెల 31 సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ మోసాల బారిన పడకుండా అవగాహన పెంచేందుకు కేంద్ర హోంశాఖ వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ‘స్టే సేఫ్ ఆన్లైన్..’ నేపథ్యంతో ఆన్లైన్ క్విజ్ పోటీలు నిర్వహిస్తోంది. పోటీలకు ఈనెల 31 వరకు గడువుందని అధికారులు పేర్కొన్నారు. ఆన్లైన్ క్విజ్‌లో పాల్గొనదలచిన వారు https://www.mygov.in/staysafeonline లింక్ పై క్లిక్ చేస్తే అదనపు వివరాలు తెలుస్తాయని వెల్లడించారు. టెలిగ్రామ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, https://t.me/ ssoindia లింక్ ద్వారా గ్రూప్‌లో చేరొచ్చు. ఈ ఆన్లైన్ క్విజ్‌లో పాల్గొనే వారికి ఒక్కొక్కరికి 10 ప్రశ్నలు ఇస్తారు.. 5 నిమిషాల వ్యవధిలో వీటికి సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. క్విజ్‌లో టాప్ 10లో నిలిచే విజేతలకు ఒక్కొ క్కరికి రూ.10 వేల చొప్పున నగదు పురస్కా రం ఇవ్వనున్నారు. క్విజ్‌లో పాల్గొని 50 శాతానికి పైగా మార్కులు సాధించిన వారికి డిజిటల్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. -
30 ఏళ్ల క్రితం ఇండియా ఇలానే ఉండేది..ఇప్పుడు కావలసింది అవే..
పేపర్ తెరిస్తే ఘోరమైన వార్తలు. రక్త సంబంధాల మధ్య కూడా కక్షలు, కార్పణ్యాలు. మానవ సంబంధాలపై విశ్వాసం పోయేలా సంఘటనలు.ఇటువంటి సమయంలో ఒక ట్విటర్ పోస్ట్ చాలామందికి హాయినిచ్చింది. ‘గాయత్రీ... ఇడ్లీలు చేశా. ఇంటికి రా’ అని తన పొరుగింటివారు వాట్సప్ మెసేజ్ పెట్టినసంగతిని మైసూర్‌కు చెందిన ఒక మహిళ షేర్ చేస్తూ తమ కాలనీలో అందరూ ఎంత స్నేహంగా ఉంటారో చెప్పింది. ‘ముప్పై ఏళ్ల క్రితం ఇండియా ఇలాగే ఉండేది’ అని అందరూ రెస్పాండ్ అవుతున్నారు. ఏం... ఇప్పుడు ఎందుకు అలా ఉండకూడదు? నిజమే. పక్కింటి పాప తలుపు తట్టి ‘బీరకాయ కూర చేసింది అమ్మ. ఇచ్చి రమ్మంది’ అని చెప్తే చాలా బాగుంటుంది. ‘గడి ముందుకేసి కూరగాయలకు వెళుతున్నా. కాస్త చూస్తుండక్కా’ అని ఎదురింటి వాళ్లతో అంటే ‘అదేం భాగ్యం. వెళ్లిరా’ అని సొంతింటి కన్నా ఈ ఇంటి పైనే దృష్టి పెట్టే వాళ్లు దొరికితే మరెంతో బాగుంటుంది. ఇలా ఉండటానికే మనుషులు ఇష్టపడేవాళ్లు. కాని ఇప్పుడు ఇలా ఉండటం ‘భాగ్యం’ అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నాం. మైసూర్లో ఒక కాలనీ ‘గాయత్రి. ఇడ్లీలు చేశా. ఇంటికి రా’ అని తనకు వచ్చిన మెసేజ్‌ను ట్విటర్లో పోస్ట్ చేస్తూ ‘మా కాలనీలో అంతా ఇలాంటి స్నేహమే’ అని గాయత్రి జయరామన్ అనే మైసూర్ జర్నలిస్ట్ ట్వీట్ చేసింది. 20 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్న గాయత్రి ‘హూ మి, పూర్’ అనే పుస్తకం రాసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే గాయత్రి పక్కింటావిడ ఇడ్లీలకు పిలవడంతో సంతోషపడి తన కాలనీ స్నేహాలన్నీ ట్వీట్లుగా రాసింది. ‘యోగా సెంటర్‌కు రాపిడో బుక్ చేద్దామని ఇంటి బయట నిలబడతానా... ఎవరో ఒకరు దింపడానికి వస్తారు. నా కుక్కపిల్ల నేను బయటికెళ్తే గోల చేస్తుంది. నేను ఇంట్లోనే ఉన్నాననే భావన కలిగించడానికి తలుపు తెరిచి పెట్టి పనుల కోసం బయటకు వెళితే మా కాలనీలో అందరూ కాపలా కాసేవాళ్లే. ఒక రోజు ఒకావిడ బిసిబేలాబాత్ పంపుతారు. నిన్న ఒకామె సాంబార్ పంపింది. మా కాలనీలో ఒకరి గిన్నెలు మరొకరి వంట గదిలో ఉండటం మామూలే. ఇలాంటి స్నేహాలతో మేమంతా ఉండటం సంతోషంగా ఉంది’ అని రాసింది. దాంతో చాలామంది కనెక్ట్ అయ్యారు. ‘మేము గవర్నమెంట్ క్వార్టర్స్‌లో ఉన్నప్పుడు అందరం ఇలాగే ఉండేవాళ్లం’ అని ఒకరు రాస్తే ‘మైసూర్లో అందరూ ఇలా ఉండొచ్చు. బెంగళూరులో ఈ వాతావరణం మిస్ అవుతున్నాను’ అని మరొకరు రాశారు.‘ముప్పై ఏళ్ల క్రితం అందరూ ఇలా ఉన్నవాళ్లే. ఇప్పుడెక్కడ’ అని మరొకరు బాధ పడ్డారు. ‘లాక్డౌన్ సమయంలో కొంతకాలం మాత్రం ఇలా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ ఎవరి గుహల్లోకి వాళ్లు వెళ్లిపోయారు’ అని మరొకరు రాశారు. ఇరుగు పొరుగుతో స్నేహంగా ఉండటం, ‘ఏం బాబాయ్’ అంటే ‘ఏం అల్లుడూ’ అని పలకరించుకోవడం.. ‘ఆంటీ ఇంటి నుంచి టీ పౌడర్ తీసుకురాపో’ అని పంపించడం కూడా అసాధ్యమైన విషయాలుగా మారిపోతే ఏ ఊతంతో ఏ స్పందనలతో జీవించాలి మనం? శ్రుతి మించి ప్రైవసీ పల్లెల్లో అయినా పట్నాల్లో అయినా ప్రతి ఒక్కరూ శ్రుతి మించిన ప్రైవసీలోకి జారుకుంటున్నారు. మొదట ఉమ్మడి కుటుంబాలు వద్దనుకున్నారు. ఆ తర్వాత తల్లిదండ్రుల నుంచి పిల్లలు విడిపోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇరుగు పొరుగు వారిని వద్దనుకుంటున్నారు. కేవలం ఎప్పుడూ ఇళ్లకు కూడా రాని కొందరు స్నేహితులు, పరిచయస్తులు చాలనుకునే స్థితికి చేరుకున్నారు. ‘మన బతుకులో ఎవరి జోక్యం అక్కర్లేదు’ అనే భావనలో ఉన్న సౌకర్యం ఎలా ఉన్నా ‘ఎవరి సాయం, తోడు లేకుండా బతుకు ఎలా ఉంటుంది’ అనే ప్రశ్నకు జవాబు దొరకడం లేదు. ప్రైవసీ పిచ్చి ఒంటరితనంలోకి, ఏకాంతంలోకి, మనకు ఎవరూ లేరని భావనలోకి నెట్టి అభద్రతకు, ఆందోళనకు గురి చేస్తుంది. ‘ఎదుటివారి లోపాలు వెతకడం, జడ్జ్ చేయడం, మనకు హితవు చెప్పిన వారిని కూడా పగవారిని చేసుకోవడం, అనుబంధాలు ఆర్థికపరమైన సాయాలు కోరతాయనే మిషతో అందరినీ దూరం పెట్టడం’ ఇవి నేడు ప్రతి మనిషిని కేవలం కుటుంబ జీవితానికి, కుటుంబ అనుబంధాలకి (అవి కూడా సరిగ్గా ఉంటే) పరిమితం చేస్తున్నాయి. పక్కింటామె ‘ఇడ్లీ తిందూరా’ అని పిలవడమే వార్తగా మారి, అది చదివి ఆనంద బాష్పాలు వచ్చే స్థితికి మనం చేరుకుంటే ఆ తప్పు ఇడ్లీదో చట్నీదో కాదు. మనదే. ప్రేమ, అభిమానాలే ఇంధనాలు ఒక దూరప్రయాణం పరిచయస్తులు ఎవరూ లేని రైలులో చేస్తుంటే ఎలా ఉంటుందో, జీవన ప్రయాణం ప్రేమ, అభిమానాలు పంచేవాళ్లు లేకుంటే అలా ఉంటుంది. నలుగురు స్నేహితులతో సాగే పిక్నిక్ యాత్రలా జీవితం ఎందుకు ఉండకూడదు? కనీసం అప్పుడప్పుడన్నా వీధి అరుగుపై ఇరుగు పొరుగుతో కబుర్లు చెప్పుకునే కమ్మదనంతో జీవితం ఎందుకు ఉండకూడదు? పిల్లలు కూడా తల్లిదండ్రులను చూసి ఇరుగు పొరుగు పిల్లలతో స్నేహం చేయడం మానేస్తున్నారు. దీనివల్ల వారి మానసిక ఆరోగ్యం ఎలా ఉండబోతోందో ఆలోచించారా? (చదవండి: అర్చన... అనుకున్నది సాధించింది) -
సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తు.. ‘పింక్ వాట్సాప్’!
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ ద్వారా ప్రజల నుంచి భారీగా డబ్బు కాజేసేందుకు సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త మార్గాలను తెరపైకి తెస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ఫోన్ల వినియోగదారుల్లో అత్యధికం మంది ఉపయోగించే వాట్సాప్ ద్వారా మాల్వేర్లను చొప్పించే ప్రణాళికను ఇటీవల కాలంలో అమలు చేస్తున్నారు. ఆకుపచ్చ రంగులో కనిపించే వాట్సాప్... సరికొత్త ఫీచర్లతో గులాబీ రంగులో (పింక్) వచ్చిందంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ఇందుకోసం వాట్సాప్‌ను అప్డేట్ చేసుకోవాలంటూ సైబర్ నేరగాళ్లు లింక్‌లు పంపుతున్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు. సాధారణ ఎస్ఎంఎస్లతోపాటు వాట్సాప్ మెసేజ్‌ల రూపంలో ఈ లింక్‌లు పంపుతున్నట్లు తెలిపారు. ఎవరైనా ఈ లింక్‌లను క్లిక్ చేసి అది అడిగే అప్డేట్ కోసం ఫోన్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేస్తే ఫోన్లోని ఫొటోలు, కాంటాక్ట్ నంబర్లు, బ్యాంకుల పాస్‌వర్డ్‌ల వంటి వివరాలన్నీ సైబర్ నేరస్తుల చేతుల్లోకి వెళ్లిపోతాయని పోలీసులు చెబుతున్నారు. అలాగే ఆయా వ్యక్తులు సభ్యులుగా ఉండే వాట్సాప్ గ్రూప్లలోకి ఆటోమేటిక్‌గా పింక్ వాట్సాప్ పేరిట లింక్‌లు షేర్ అవుతాయని పేర్కొన్నారు. కీబోర్డ్ ఆధారిత మాల్వేర్లను పింక్ వాట్సాప్‌లోకి చొప్పించడం ద్వారా బ్యాంకు పాస్‌వర్డ్‌లను తస్కరించి సైబర్ నేరగాళ్లు డబ్బు కొట్టేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పింక్ వాట్సాప్ పేరిట వచ్చిన లింక్‌లను ఓపెన్ చేసి ఎవరైనా ఇన్స్టాల్ చేసుకొని ఉంటే వాటిని వెంటనే అన్ఇన్స్టాల్ చేయాలని సూచిస్తు న్నారు. అన్ఇన్స్టాల్ చేస్తేనే ఆ నకిలీ లింక్‌లను షేర్ కాకుండా ఆపగలుగుతామని చెబుతున్నారు. ఒకవేళ మనకు తెలిసిన వారి నుంచి ఇలా పింక్ వాట్సాప్ పేరిట ఏవైనా మెసేజ్‌లు వస్తే వారిని వెంటనే అప్రమత్తం చేయాలని సూచిస్తున్నారు. -
ఇబ్బంది పెట్టే కాల్స్‌కు చెక్.. టెలికాం సంస్థలకు ట్రాయ్ కీలక ఆదేశాలు!
అవాంఛిత ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ల నుంచి యూజర్లకు ఉపశమనం కలిగేలా టెలికాం సంస్థలకు టెలికాం నియంత్రణాధికార సంస్థ (ట్రాయ్) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఫోన్ కాల్స్, మెసేజ్‌లు యూజర్లకు పంపాలంటే వారి అనుమతి తీసుకోవాలి. ఇందుకోసం 2 నెలల్లోపు ఓ యూనిఫైడ్ డిజిటల్ వేదికను అభివృద్ధి చేయాలని సూచించింది. ముందుగా అడ్వైర్టెజ్‌మెంట్ మొబైల్ ఫోన్ కాల్స్ అందుకోవడానికి సబ్స్క్రైబర్లు తమ సంసిద్ధతను తెలియజేయాల్సి ఉంటుంది. సంస్థలు కస్టమర్లను సంప్రదించి వారి అంగీకారం మేరకు వాణిజ్య ప్రకటనలు పంపడం ఆరంభిస్తాయంటూ ఓ ప్రకటనలో ట్రాయ్ వివరించింది. ప్రస్తుతం సంస్థలు ప్రమోషనల్ కాల్స్,మెసేజెస్ పంపుతున్నామని, అందుకు వినియోగదారుల అనుమతి కోరేలా ఎలాంటి వ్యవస్థ లేదు. అందుకే 2 నెలల్లో యూనిఫైడ్ డిజిటల్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని టెలికాం సంస్థలకు స్పష్టం చేసింది. సమ్మతి కోరుతూ పంపే సందేశాలు ‘127’తో మొదలయ్యేలా కామన్ షార్ట్ కోడ్‌ను వినియోగించాలని ఆయా సంస్థలను ట్రాయ్ ఆదేశించింది. చదవండి👉 సూపర్, మైండ్ బ్లోయింగ్.. ఉక్కిరి బిక్కిరి అవుతున్న టిమ్ కుక్! -
ఈ కాల్స్‌తో జాగ్రత్త..!
సాక్షి, హైదరాబాద్: వాట్సాప్ వాడకం పరిపాటిగా మారింది. ఇప్పుడు వాట్సప్‌ను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. అంతర్జాతీయ ఫోన్ నంబర్ల నుంచి స్పామ్ కాల్స్, మెసేజ్‌లు చేస్తూ మోసాలకు తెరతీస్తున్నారు. ప్రధానంగా +254, +84, +63, +374 , +1(218), +1(803) ...తో ప్రారంభయ్యే నంబర్ల నుంచి వచ్చే వాట్సాప్ కాల్స్, మెజేస్‌లు నమ్మవద్దంటున్న సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నంబర్ల నుంచి వచ్చే మిస్డ్కాల్స్కు సైతం స్పందించవద్దని వారు సూచిస్తున్నారు. స్పామ్ కాల్స్‌తో సైబర్ నేరగాళ్లు అమాయకుల నుంచి బ్యాంకు ఖాతా వివరాలు సేకరిస్తున్నారని, తర్వాత మోసాలకు పాల్పడుతున్నారని వారు తెలిపారు. అదేవిధంగా విదేశీ కోడ్‌తో ఉంటున్న ఈ నంబర్ల నుంచి వస్తున్న వాట్సాప్ సందేశాల్లో లింక్‌లను పంపుతున్న సైబర్ కేటుగాళ్లు వాటిపై క్లిక్ చేస్తే మన ఫోన్లోకి మాల్వేర్ను పంపించి, మన ఫోన్‌ను వారి కంట్రోల్‌కి తీసుకుంటున్నారు. దాని నుంచి మన బ్యాంకు లావాదేవీల వివరాలు, పాస్వర్డ్లు చోరీ చేసి డబ్బులు కొల్లగొడుతున్నట్టు వారు హెచ్చరించారు. ఇలాంటి కోడ్ నంబర్‌తో వచ్చే వాట్సాప్ కాల్స్‌ను లిఫ్ట్ చేయవద్దని, అలాంటి నంబర్లను బ్లాక్ చేయడంతోపాటు పోలీసులకు సమాచారం అందించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలో పనిచేసే ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) సూచించింది. సింగపూర్,వియత్నాంలనుంచి ఆ ఫోన్లు ప్రధానంగా ఈ ఫోన్ కాల్స్ సింగపూర్,వియత్నాం, మలేషియా ప్రాంతాల నుంచి వస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ తరహా నంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ ఎక్కువగా ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య, లేదంటే తెల్లవారుజామున వస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ తరహా స్పామ్‌కాల్స్ బెడద నుంచి కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే బయటపడొచ్చని సైబర్ఇంటెలిజెన్స్ నిపుణుడు ప్రసాద్ తెలిపారు. ఈ జాగ్రత్తలు మరవొద్దు.. ♦ కొత్త కొత్త కోడ్ నంబర్లలో వచ్చే అంతర్జాతీయ ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు, లింక్‌లకు స్పందించవద్దు. ♦ అనుమానాస్పదంగా ఉండే అంతర్జాతీయ ఫోన్ నంబర్లను వెంటనే బ్లాక్ చేయాలి. ♦ ఫోన్‌కాల్, లేదా చాటింగ్‌లో మన వ్యక్తిగత, బ్యాంకు ఖాతా సమాచారాన్ని అడిగితే పంచుకోవద్దు. ♦ సైబర్ క్రైం పోలీసులకు లేదా సైబర్ క్రైం వెబ్సైట్లో సంబంధిత నంబర్లపై ఫిర్యాదు చేయాలి. ♦ మొబైల్‌ఫోన్, కంప్యూటర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, యాంటి వైరస్‌లను ఇన్స్టాల్ చేసుకోవాలి. వాటినిబ్లాక్ చేయాలి.. మనకు కొత్త కొత్త కోడ్ నంబర్లతో వచ్చే స్పామ్ కాల్స్‌ను ఎప్పటికప్పుడు బ్లాక్ చేయాలి. పదేపదే ఇలాంటి కాల్స్ వస్తుంటే ఆన్లైన్ ద్వారా సైబర్ క్రైం సిబ్బంది దృష్టికి తేవాలి. అదేవిధంగా వాట్సాప్‌లో ఇతర దేశాల కోడ్ నంబర్లతో మొదలయ్యే నంబర్ల నుంచి వచ్చే వీడియో, ఆడియోకాల్స్కి ఆన్సర్ చేయవద్దు. ఆ నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లో ఉండే లింక్‌లను ఓపెన్ చేయవద్దు. – శ్రీనివాస్ , ఇన్స్పెక్టర్ -
ఇబ్బందికర సందేశాలకు అడ్డుకట్ట
న్యూఢిల్లీ: ఇబ్బందికర సందేశాలను అరికట్టేందుకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కసరత్తు ప్రారంభించింది. టెలిమార్కెటింగ్ సందేశాల టెంప్లేట్ల దుర్వినియోగంపై 30 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని టెలికం ఆపరేటర్లను ట్రాయ్ శుక్రవారం ఆదేశించింది. కంపెనీల హెడర్లు, కంటెంట్ టెంప్లేట్లను కొంతమంది టెలిమార్కెటర్లు దుర్వినియోగం చేస్తున్నారని తాము గుర్తించామని తెలిపింది. ‘తాము కోరని వాణిజ్య ప్రకటనలు అందుకోవడం అనేది ప్రజల అసౌకర్యానికి ప్రధాన మూలం. వ్యక్తుల గోప్యతకు ఇవి ఆటంకం కలిగిస్తాయి. వీటిని అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం’ అని ట్రాయ్ తెలిపింది. టెలికం కమర్షియల్ కమ్యూనికేషన్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్–2018 కింద మెసేజ్ టెంప్లేట్ల దుర్వినియోగాన్ని ఆపడానికి ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. అధీకృత టెలిమార్కెటింగ్ కంపెనీలు సందేశాల కోసం మొబైల్ నంబర్లకు బదులుగా కంపెనీ పేరును సూచించే హెడర్లను ప్రదర్శిస్తాయి. టెలిమార్కెటింగ్ సందేశాల శీర్షికలు, కంటెంట్ టెంప్లేట్ల విధానంలో (కోడ్ ఆఫ్ ప్రాక్టీసెస్) మార్పులు చేయాలని టెలికం ఆపరేటర్లను ట్రాయ్ ఆదేశించింది. ఇతర కంపెనీల పేర్లను పోలిన మెసేజ్ టైటిల్స్, హెడర్లు వినియోగదార్లలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. కొన్ని సంస్థలు తమ లాభాల కోసం వీటిని దుర్వినియోగం చేస్తున్నాయని ట్రాయ్ స్పష్టం చేసింది. బ్లాక్‌చెయిన్ ఆధారిత మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో నమోదైన అన్ని హెడర్లను 30 రోజుల్లోపు తిరిగి ధృవీకరించాలని.. ధృవీకరించని హెడర్లను బ్లాక్ చేయాలని ట్రాయ్ ఆదేశించింది. 30 రోజుల పాటు ఉపయోగించని అన్ని హెడర్లను తాత్కాలికంగా నిష్క్రియం (డీయాక్టివేట్) చేయడానికి 60 రోజుల్లోపు ఒక వ్యవస్థను అభివృద్ధి చేయాలని టెలికం ఆపరేటర్లను ట్రాయ్ కోరింది. -
'నేను డేంజర్లో ఉన్నా' అని లవర్‌కు మెసేజ్.. కాసేపటికే ముగ్గురూ బీచ్‌లో..
క్విటో: బీచ్‌లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ముగ్గురు యువతులు దారుణ హత్యకు గురయ్యారు. చనిపోవడనికి ముందు తమ ప్రియమైన వారికి వీరు పంపిన సందేశాలు కన్నీరు పెట్టిస్తున్నాయి. తాము డేంజర్లో ఉన్నామని, ఎదో జరగబోతుందని ముందే పసిగట్టి వారు మెసేజ్‌లు పంపిన కాసేపటికే కిరాతకంగా హత్యకు గురయ్యారు. దండగులు వీరి గొంతులు కోసి చిత్ర హింసలకు గురి చేసి హతమార్చారు. ఈక్వెడార్‌లోని క్వినెడే సమీపంలో ఎస్మరాల్డస్ బీచ్‌లో ఏప్రిల్ 5న జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ముగ్గురు యువతుల పేర్లు.. డెన్నిసి రేనా(19), యులియానా మాసియస్(21), నయేలి తాపియా(22). ఏప్రిల్ 4న అదృశ్యమైన వీరు ఆ మర్నాడే దారుణంగా హత్యకు గురయ్యారు. మంచి స్నేహితులైన వీరు బీచ్‌కు వెళ్లి సరదాగా గపడపాలని ప్లాన్ చేసుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకుని ఏప్రిల్ 4న అనుకున్నట్టే బీచ్‌కు వెళ్లారు. స్విమ్ సూట్ లాంటి దుస్తులు ధరించి అక్కడే హాయిగా సేదతీరారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ ఈ ముగ్గురూ ఊహించని ప్రమాదంలో పడ్డారు. ఎవరో వారిని వెంబడించారు. దీంతో తమకు ఏదో జరగబోతుందని భావించి తమ ప్రియమైన వారికి సందేశాలు పంపారు. అయితే మెసేజ్‌లు రాత్రి 11:10 గంటల సమయంలో పంపడంతో కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళన చెందారు. వారు అనుకున్నట్టే.. జరగకూడని ఘటన జరిగింది. నయేలి, డెన్నిసి చనిపోయే ముందు నయేలి తన సోదరికి వాట్సాప్ సందేశం పంపింది. 'ఏదో జరగబోతుంది అని నాకు అనిపిస్తుంది. అందుకే మెసేజ్ చేస్తున్నా' అని నయేలి మెసేజ్ చేసింది. సోదరి వెంటనే ఆమెకు కాల్ చేయగా.. స్విచాఫ్ వచ్చింది. నయేలికి పెళ్లైంది. నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది. దీంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరో యువతి డెన్నిస్ హత్యకు గురికావడానికి ముందు తన బాయ్‌ఫ్రెండ్‌కు సందేశం పంపింది. 'ఏదో జరగబోతుందని నాకు అన్పిస్తుంది. ఒకవేళ నాకేదైనా జరిగితే.. ఒక్క విషయం గుర్తుంచుకో.. ఐ లవ్ యూ వెరీ మచ్' అని మెసేజ్ చేసింది. జాలర్లు చూసి.. ఆ తర్వాత కాసేపటికే ముగ్గురిని ఎవరో దారుణంగా హత్య చేశారు. బీచ్‌లో అర్ధనగ్నంగా ఉన్న వీరిని చిత్ర హింసలు పెట్టి పదునైన ఆయుధాలతో గొంతులు కోశారు. ఆ తర్వాత శవాలను పూడ్చిపెట్టారు. ఏప్రిల్ 5న చేపల వేటకు వెళ్లిన జాలర్లు.. ఓ కుక్క వీరి మృతదేహాల వద్ద తవ్వడం చూసి అక్కడకు వెళ్లగా శవాలు కన్పించాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ హత్యలు ఎవరు చూసి ఉంటారనే విషయంపై పోలీసులకు ఇంకా ఎలాంటి క్లూ లభించలేదు. ముగ్గురిలో ఓ యువతి బీచ్‌కు వెళ్లినరోజు సమీపంలోని ఓ హోటల్లో గడిపింది. దీంతో అధికారులు క్లూ కోసం సీసీటీవీ రికార్డులను పరిశీలిస్తున్నారు. ముగ్గురిలో ఇద్దరు మంచి భవిష్యత్ కోసం వేరే దేశం వెళ్లి స్థిరపడాలనుకున్నారని, కానీ ఇంతలోనే ఇలా ప్రాణాలు కోల్పోతారని ఊహించలేదని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చదవండి: వేరొకరి ఇంటి డోర్‌బెల్ మోగించాడని చంపేందుకు యత్నం..చివరికి.. -
పాన్ అప్డేట్ అంటూ సందేశాలు.. క్లిక్ చేస్తే డబ్బులు గోవిందా!
ఆధార్ అప్డేట్, పాన్ కార్డు అప్డేట్ వంటివి వినియోగదారులు ఆన్లైన్లో సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అయితే ఇటీవల కొంతమంది అప్డేట్ యువర్ పాన్ అనే సందేశంతో కొన్ని ఫేక్ మెసేజస్ పంపిస్తున్నారు. ఇలాంటి వాటిపై క్లిక్ చేయకూడదని ప్రభుత్వం ఆదేశిస్తోంది. గత కొన్ని రోజులుగా స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా పేరుతో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేరుతో కొన్ని ఫేక్ మెసేజిలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి ఇవి నకిలీ సందేశాలైనప్పటికీ @TheOfficialSBI అనే పేరుతో రావడం గమనార్హం. ఇందులో మీ పాన్ కార్డు అప్డేట్ చేసుకోవాలని, లేకపోతే బ్యాంకు అకౌంట్ నిలిచిపోతుందని ఉంటుంది. దీనికి భయపడి కొంతమంది దానిపైన క్లిక్ చేసి సైబర్ దాడులకు బలైపోతున్నారు. ఇలాంటి ఫేక్ సందేశాలపై ఎవరూ క్లిక్ చేయవద్దని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వివరించింది. SBI ఎప్పుడూ మీ పర్సనల్ డీటైల్స్, అకౌంట్ వివరాలు సందేశాల ద్వారా అడగదు, కావున వినియోగదారుడు తప్పకుండా వీటిని గమనించి జాగ్రత్త వహించాలి. ఇదిలా ఉండగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి కూడా ఫేక్ మెసేజస్ వస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిసింది. ఇందులో గ్యాస్ ఏజెన్సీ డీలర్‌షిప్‌ల ప్రీ అప్రూవల్ కోసం కేవైసీ డాక్యుమెంట్స్ కావాలని కోరుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి వచ్చినట్లుగా ఈ మెసేజ్ వైరల్ అవుతోంది. దీనిని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పంపించలేదని, దానికి ఎవరూ స్పందించవద్దని అధికారులు చెబుతున్నారు. A #Fake message issued in the name of @TheOfficialSBI is asking recipients to update their PAN on a suspicious link to prevent their account from getting expired.#PIBFactCheck ✅ Beware of such frauds. ✅ SBI never sends emails/SMS asking for personal/banking details. pic.twitter.com/1u8tFywQcf — PIB Fact Check (@PIBFactCheck) March 24, 2023 -
అవాంఛిత కాల్స్‌పై టెల్కోలతో ట్రాయ్ భేటీ
న్యూఢిల్లీ: అవాంఛిత కాల్స్, మెసేజీలను కట్టడి చేసే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందుకోసం ’వ్యాపారపరమైన అవాంఛిత కమ్యూనికేషన్ (యూసీసీ) డిటెక్ట్’ విధానాన్ని అభివృద్ధి చేయడం, అమలు చేయడానికి సంబంధించి మార్చి 27న టెల్కోలతో సమావేశం కానుంది. (ఇదీ చదవండి: హిండెన్‌బర్గ్ లేటెస్ట్ రిపోర్ట్: భారత సంతతి ఎగ్జిక్యూటివ్ అమృత ఆహూజా పాత్ర ఏంటి?) డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (డీఎల్టీ) ప్లాట్‌ఫాంపై అవాంఛిత సందేశాలను టెల్కోలు గుర్తించడం, వాటిని పంపే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడం, కృత్రిమ మేథ ఆధారిత యాంటీ–ఫిషింగ్ సిస్టమ్‌ను వినియోగించడం తదితర అంశాలపై ఇందులో చర్చించనున్నారు. సాంకేతిక సొల్యూషన్స్, నియంత్రణ, ఆదేశాలు, నిశిత పర్యవేక్షణ వంటి బహుముఖ వ్యూహాలతో అవాంఛిత కాల్స్, మెసేజీల సమస్యను పరిష్కరించే దిశగా టెల్కోలతో సమావేశం ఉండనున్నట్లు ట్రాయ్ పేర్కొంది. (మండే వేసవిలో ప్రయాణికులకు గుడ్ న్యూస్: రైల్వే కీలక నిర్ణయం) -
వాటమ్మా.. వాట్సాప్ ‘స్పామ్’మ్మా
ఆఫీస్‌లోనో.. ఇంట్లోనో పనిలో నిమగ్నమై ఉండగా వాట్సాప్ నోటిఫికేషన్ వస్తుంది. ఎవరు మెసేజ్ పంపారో.. ఏంటోనని పని ఆపేసి మరీ చూస్తే.. ‘ఫలానా షోరూమ్‌లో పండుగ ఆఫర్ ఉంది. త్వరగా షాపింగ్ చేయండి. ఆఫర్ వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి’ అనే మెసేజ్ కనిపిస్తుంది. అలాంటివి చూడగానే చిర్రెత్తుకొస్తుంది. ఇలాంటి మెసేజ్‌లు దేశంలోని వాట్సాప్ వినియోగదారుల్లో 95 శాతం మందిని విసిగిస్తున్నాయి. రోజుకు కనీసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్పామ్ మెసేజ్‌లు వాట్సాప్ వస్తున్నాయి. ‘లోకల్ సర్కిల్’ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. తెలియని నంబర్ల నుంచి వస్తున్న ఇలాంటి మెసేజ్‌లపై దేశవ్యాప్తంగా 351 జిల్లాల్లో 51 వేల మంది వాట్సాప్ వినియోగదారులను వివిధ అంశాలపై ప్రశ్నించారు. వీటిల్లో ఎక్కువగా రియల్ ఎస్టేట్, వాణిజ్య ప్రకటనలు, ఉద్యోగ అవకాశాలు, వైద్య సేవలు వంటివి ఉంటున్నట్లు తేలింది. ఇలా చేయండి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు మన వాట్సాప్‌కు అభ్యంతరకర, అసభ్యమైన మెసేజ్‌లు పంపినా.. పదేపదే స్పామ్ మెసేజ్‌లతో ఇబ్బంది పెడుతున్నా సంబంధిత కాంటాక్ట్‌లను బ్లాక్ చేసే అవకాశం వాట్సాప్‌లో ఉంది. ఇలా చేస్తే వాట్సాప్ ఫిర్యాదుల బృందానికి రిపోర్ట్ ఫార్వర్డ్ చేయబడుతుంది. ఒకే కాంటాక్ట్‌పై ఎక్కువ రిపోర్ట్లు నమోదైతే ఆ కాంటాక్ట్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తారు. -
వర్రీ ‘గుడ్ మార్నింగ్: 2 వేల కోట్లకు పైగా కొత్త ఏడాది శుభాకాంక్షలు
ఉదయం నిద్ర లేవగానే చాలా మంది మొదట చేతిలోకి తీసుకునేది సెల్‌ఫోనే. మొబైల్ ఓపెన్ చేయగానే టపటపా వచ్చిపడే మెస్సేజీలలో ‘గుడ్ మార్నింగ్’ సందేశాలే అధికం. ఒకప్పుడు బాగానే ఉన్నా ఇప్పుడవి చిరాకు పుట్టిస్తున్నాయి. ఎవరు పంపారో చూడకుండానే తొలగించే ప్రక్రియతో రోజు ప్రారంభించాల్సిన పరిస్థితి. గుడ్ మార్నింగ్ సందేశాలు స్మార్ట్‌ఫోన్‌కు పెద్ద సమస్యగా మారుతున్నాయి. భారత్‌లో ఈ మెస్సేజ్‌ల వల్ల మూడో వంతు ఫోన్లు పనిచేయడం లేదని, ప్రతి మూడు స్మార్ట్ ఫోన్లలో ఒకటి మెమరీ ఫుల్ అయిపోతోందని అమెరికాకు చెందిన కంప్యూటర్ డ్రైవ్ తయారీ, డేటా నిల్వ సంస్థ ‘వెస్ట్రన్ డిజిటల్ కార్పొరేషన్’ తెలిపింది. – సాక్షి, అమరావతి 10 రెట్లు పెరిగిన సెర్చింగ్ భారతీయుల గుడ్ మార్నింగ్ సందేశాలు రోజూ కోట్ల సంఖ్యలో ఇంటర్నెట్ను ముంచెత్తుతున్నాయి. అపరిమిత డేటా అందుబాటులో ఉండడంతో గత ఐదేళ్లలో గుడ్ మార్నింగ్ సందేశాల కోసం గూగుల్‌లో సెర్చ్ చేయటం 10 రెట్లు పెరిగింది. దేశంలో పింటరెస్ట్ యాప్ నుంచి సందేశాలతో కూడిన ఫొటోల డౌన్లోడ్ ఏడాదిలో 9 రెట్లు పెరిగింది. భారత్‌లో 2 వేల కోట్ల న్యూ ఇయర్ మెస్సేజ్‌లు సోషల్ మీడియా గ్రూప్‌లో వాట్సాప్ క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల మంది వాట్సాప్ వాడుతుండగా మన దేశమే అతిపెద్ద మార్కెట్. భారత్‌లో 48.75 కోట్ల మంది వాట్సాప్ యూజర్లు ఉండగా 39 కోట్ల మంది నిత్యం గ్రూపుల్లో చురుగ్గా ఉంటున్నట్లు వెస్టర్న్ డిజిటల్ కార్పొరేషన్ సర్వే తేల్చింది. నూతన సంవత్సరం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 100 బిలియన్ల సందేశాలు పంపితే భారత్ నుంచి 20 బిలియన్లకు పైగా (2 వేల కోట్లకు పైగా) సందేశాలు వెల్లువెత్తాయని, ఇది ప్రపంచ రికార్డుగా ఆ సంస్థ ప్రకటించింది. ఇలా వచ్చిపడే సందేశాలతో చాలామంది ఫోన్లు స్తంభించిపోతున్నాయి. వాటిని చదివి ప్రతిస్పందించడం కష్టంగా మారింది. అమెరికాలో నిత్యం ప్రతి పది మందిలో ఒకరి ఫోన్ మెమరీ సందేశాలతో నిండిపోతుండగా మనదేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు వెస్టర్న్ డిజిటల్ కార్పొరేషన్ వెల్లడించింది. ఈ సమస్యకి పరిష్కారంపై అధ్యయనం చేసిన గూగుల్ ‘ఫైల్స్ గో’ అనే కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ సగటున ఒక్కో యూజర్‌కు ఒక గిగాబైట్ వరకూ డేటాను క్లియర్ చేసిందని గూగుల్ ప్రకటించింది. ఆఫ్లైన్లోనూ సేవలు వినియోగించుకునే అవకాశం ఉండడం ఈ యాప్ ప్రత్యేకత. -
యుద్ధం తర్వాత గుణపాఠం నేర్చుకున్నాం: పాక్ ప్రధాని కీలక వ్యాఖ్యలు
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్‌తో మూడు యుద్ధాలు చేసి గుణపాఠం నేర్చుకున్నామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో తాము తమ పొరుగుదేశం భారత్‌తో శాంతిని కోరుకుంటున్నాం అన్నారు. కాశ్మీర్ వంటి అంశాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీతో నిజాయితీతో కూడిన చర్చలు జరగాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు దుబాయ్‌కి చెందిన అల్ అరేబియా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ ప్రధాని షరీఫ్ మాట్లాడుతూ.."భారత ప్రధాని మోదీకి నా సందేశం ఏంటంటే?.. మన మధ్య చిచ్చు రేపుతున్న బర్నింగ్ పాయింట్లను పరిష్కరించడానికి టేబుల్‌పై కూర్చోని చిత్తశుద్ధితో చర్చలు జరుపుదాం. శాంతియుతంగా జీవిద్దాం. పరస్పరం కలిహించుకోవడంతో సమయం, వనరులు వృధా చేస్తున్నాం" అని అన్నారు. తాము భారత్‌లో చేసిన మూడు యుద్ధాల కారణంగా పాక్ ప్రజలకు తీరని కష్టాలను మిగిల్చాయి. వారంతా తీవ్ర పేదరికం, నిరుద్యోగాన్ని ఎదుర్కొవాల్సి వచ్చింది. అదీగాక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్న పాక్ తమకు సాయం చేయమంటూ ప్రపంచ దేశాలను వేడుకుంటున్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రజలు ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరత కారణంగా గోధుమపిండి కోసం ఘోరంగా ఆర్రుల చాజుతున్నారు. మరోవైపు అక్కడి ప్రజలు తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) ఉగ్రవాద దాడులను తీవ్రంగా ఎదుర్కొంటోన్నారు. గతేడాది చివర్లోనే దేశ భద్రతా దళాలతో కాల్పులు విరమించింది. ఈ పరిస్థితుల దృష్ట్యా పాక్ ప్రధాని షెహబాజ్ పోరుగు దేశంతో ముక్కుసూటిగా నిజాయితీగా వ్యహిరిస్తాం అని పిలుపునిచ్చారు. ఇరుదేశాల్లోనూ నైపుణ్యవంతులైన వైద్యులు, ఇంజనీర్లు, కార్మికులు ఉన్నారని, ఆ వనరులను ఉపయోగించుకుని శాంతి నెలకొల్పాలని కోరుకుంటున్నానని చెప్పారు. అలాగే మందుగుండు సామాగ్రి కోసం వనరులను దుర్వినియోగం చేయాలనుకోవటం లేదని తెలిపారు. ఈ క్రమంలో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ..పాకిస్తాన్ శాంతిని కోరుకుంటుందని, కాశ్మీర్లో జరుగుతున్న వాటిని ఆపాలని అన్నారు. ఈ మేరకు తీవ్ర సంక్షోభంతో సతమతమవుతున్న పాక్ భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధమంటూ నేరుగా సంకేతాలిస్తోంది. (చదవండి: వద్దన్నా! పట్టుబట్టి డ్యూటీకి వెళ్లింది..ఓ నాన్న ఆవేదన) -
WhatsApp: వాట్సాప్‌లో కెప్ట్ మెసేజ్ ఫీచర్
ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ‘కెప్ట్ మెసేజ్’ అనే కొత్త ఫీచర్‌ని పరీక్షిస్తోంది. దీనితో డిజపీయరింగ్ మెసేజ్‌లను సేవ్ చేయవచ్చు. చాట్లకు సంబంధించి మరింత కంట్రోల్‌కు యూజర్లకు ఉపకరించే ఫీచర్ ఇది. 2021లో స్నాప్‌చాట్... మొదలైన వాటి స్ఫూర్తితో వాట్సాప్ ‘డిజప్పియరింగ్ మెసేజ్’ ఫీచర్‌ను ప్రవేశ పెట్టింది. ఎవరికైనా మెసేజ్ పంపినప్పుడు నిర్ణీతమైన కాలవ్యవధి తరువాత మెసేజ్ దానికదే డిలీట్ అయిపోతుంది. మళ్లీ దాన్ని చూడడం కుదరదు. అయితే ‘కెప్ట్ మెసేజ్’ టూల్ డిజప్పియరింగ్ చాట్‌లో కూడా మెసేజ్‌లను ప్రిజర్వ్ చేస్తుంది. (క్లిక్ చేయండి: ఇన్‌స్టాలో డిలీట్ చేసిన కంటెంట్‌ను రీస్టోర్ చేసుకోవడానికి...) -
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్: ‘సీక్రెట్’ ఫీచర్ ఒక్కసారే!
సాక్షి, ముంబై: మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం మరో కొత్త అప్డేట్ తీసుకు రాబోతోంది. నిత్యం సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే వాట్సాప్ తాజాగా కొత్త ఫీచర్‌పై పరీకక్షిస్తోంది. వ్యూ వన్స్ టెక్ట్స్ ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ఇదీ చదవండి: లేడీ బాస్ సర్ప్రైజ్ బోనస్ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు! వాట్సాప్‌లో మెసేజ్‌ను ఒకసారి రిసీవర్ ఒకసారే మాత్రమే చూడగలరు. రిసీవర్ చదవిన వెంటనే ఆ మెసేజ్ ఆటో మేటిక్‌గా డిలీట్ అవుతుందన్న మాట. అటు మెసేజ్ పంపిన వారికి, అందుకున్న వారికి కూడా ఆ మెసేజ్ కనపించదు. తమ వాట్సాప్ చాట్‌ను ఎవరూ చూడకుండా సీక్రెట్‌గా ఉండాలనుకునే యూజర్లకు ఇది బాగా ఉపయోగ పడనుంది. (WhatsApp 3D Avatar: వాట్సాప్ అవతార్ వచ్చేసింది..మీరూ కస్టమైజ్ చేసుకోండి ఇలా!) వేబేటా ఇన్ఫో ప్రకారం ఈ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో అందుబాటులో ఉంది. పూర్తిస్థాయిలో యూజర్లందరికీ ఎప్పుడు అందుబాటులోకి తెస్తారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. వాట్సాప్ అధికారికంగా లాంచ్ చేసేవరకు వెయిట్ చేయాల్సిందే. కాగాఇప్పటికే వాట్సాప్‌లో వన్స్ వ్యూ ఫీచర్.. వీడియోలు, ఫొటోలకు వినియోగంలో ఉంది. వీడియోలు లేదా ఫొటోలకు వన్స్ వ్యూ ఫీచర్ ఆప్షన్ ద్వారా ఒక్కసారి మాత్రమే కనిపించి ఆ తరువాత అదృశ్యమవుతాయి.దీన్ని ఫార్వార్డ్ చేయడం, స్క్రీన్ షాట్ తీసుకోవడం కూడా కుదరదు. ఇదే ఫీచర్‌ను టెక్ట్స్ ఫార్మాట్ కోసం వ్యూ వన్స్ ఫీచర్‌ను పరీక్షిస్తుండటం గమనార్హం.