అనంతపురం సెంట్రల్ : నగరపాలక సంస్థ మేయర్ మదమంచి స్వరూప, ఎమ్మెల్యే వి.ప్రభాకర్‌చౌదరిలకు సెల్‌ఫోన్ ద్వారా బెదిరింపులతో కూడిన సందేశాలను పంపినది ఓ మహిళ అని తేలింది. అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు.. సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఈ అంశంపై శుక్రవారం రాత్రి మేయర్ స్వరూప ఎస్పీ కార్యాలయానికి వచ్చి వెళ్లారు. మెసేజ్‌లు పంపుతున్న మహిళ పూర్తి వివరాలను మరో రెండు రోజుల్లో పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.