
ప్రతీకాత్మక చిత్రం
వాట్సాప్, ఫేస్‌బుక్ మెసేంజర్లు నేటి యువత ప్రేమకు వారధులుగా మారుతున్నాయి. ప్రతి క్షణం సందేశాల ప్రవాహాన్ని ఇటునుంచటు, అటునుంచిటు చేరవేస్తూ బంధాలను బలపరుస్తున్నాయి. అంతే కాకుండా సాంకేతిక కారణంగా మనం మాటల్లో చెప్పలేని భావాలను సైతం చిన్న సంజ్ఞలతో చెప్పేస్తున్నాం. అయితే ఒకరికొకరు తమ ప్రేమను తెలుపుకుని మెసేజ్‌ల ద్వారా ప్రతి రోజూ టచ్‌లో ఉండేవారి సంగతి పక్కన పెడితే.. తమ కిష్టమైన వ్యక్తులతో చాటింగ్ చేస్తూ తమ ప్రేమను చెప్పలేక, ఆవతలి వ్యక్తి తమను ప్రేమిస్తున్నారో లేదో తెలియక సతమతమయ్యేవారు చాలా మంది ఉంటారు. అలాంటి వారికి మెసేజ్‌లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మనం ప్రేమించే వ్యక్తులు మనతో చాటింగ్ చేసేటప్పుడు పంపిన మెసేజ్‌లను బట్టి కొంతవరకు మనపై వారికున్న ప్రేమను తెలుసుకోవచ్చు.
1) ముద్దు పేర్లతో సంభోదన
చాలా వరకు మనకు నచ్చిన వ్యక్తులనే ముద్దు పేర్లతో పిలుచుకోవటం జరుగుతుంది. మనకిష్టమైన వ్యక్తి మనతో చాటింగ్ చేస్తున్నపుడు తరుచుగా మనల్ని ముద్దు పేరుతో సంభోదిస్తుంటే ఒకరకంగా మన ప్రేమకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు భావించాలి. తరుచుగా ముద్దు పేర్లతో పిలవటం అన్నది మీ ప్రేమకు ఓ ముందడుగులాంటిది.
2) పర్సనల్ ఎమోజీలు, స్టిక్కర్లు
ఎదుటి వ్యక్తితో మనకున్న అనుబంధాన్ని బట్టే మనం ఆయా రకాల ఎమోజీలు, స్టిక్కర్లు పంపిస్తామని తాజా పరిశోధనల్లో కూడా తేలింది. మామూలు సంభాషణల్లో ఎమోజీలు, స్టిక్కర్ల అవసరం అంతగా రాదు. స్నేహితులతో, మనకు బాగా నచ్చిన వారితోనే పర్సనల్ ఎమోజీలు, స్టిక్కర్లు పంపిస్తాము. మీరు ఇష్టపడేవాళ్లుకూడా మీకు తరుచుగా పర్సనల్ ఎమోజీలు, స్టిక్కర్లు పంపిస్తుంటే మీరంటే వారికి ఇష్టం ఉందని భావించొచ్చు.
3) వాట్సాప్ స్టాటస్‌లు, ఫ్రొఫైల్ పిక్‌పై స్పందన
మీ వాట్సాప్ స్టాటస్‌లు, ఫ్రొఫైల్ పిక్‌లపై తరుచుగా స్పందిస్తూ ఉంటే ఎదుటి వ్యక్తికి మీ మీద ఆసక్తి ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. మీరు అలా వాటిని మార్చగానే ఆవతలినుంచి స్పందన వస్తే వారు మీ వాట్సాప్ మెసేజలను ప్రతిక్షణం గమనిస్తూ ఉన్నారని అర్థమవుతుంది. మీపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించారని తెలిసిపోతుంది.
4) తీపి గుర్తులు పంచుకోవటం
వారికి సంబంధించిన పర్సనల్ విషయాలను ఎక్కువగా పంచుకోవటం, ముఖ్యంగా చిన్నప్పటి ఫొటోలను మీకు పంపటం అన్నది మీ ప్రేమకు శుభసూచకం. మనకు బాగా దగ్గరైన వారికే మనల్ని మనలాగా చూపించుకోవటానికి ప్రయత్నిస్తాం. వారు తరుచుగా ఈ పని చేస్తుంటే వారి దృష్టిలో మీరు ప్రత్యేకం అని భావించాలి.
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment