ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల వినియోగదారులు ఇబ్బంది పడినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. మంగళవారం సాయంత్రం 5:14 గంటల సమయంలో ప్రత్యేక్ష సందేశాలు(డైరెక్ట్ మెసేజ్‌లు) పంపించడంలో సమస్య ఎదుర్కొన్నట్లు నెటిజన్లు తెలిపారు. ఈమేరకు ఇతర సమాజిక మాధ్యమాల్లో అందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ పోస్ట్‌లు పెట్టారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ సర్వీస్ అంతరాయాలను ట్రాక్ చేసే డౌన్‌డెటెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం..ఇన్‌స్టాగ్రామ్‌లో డైరెక్ట్ మెసేజ్ పంపించేందుకు వినియోగదారులు కొంత సమయంపాటు ఇబ్బందిపడ్డారు. మంగళవారం సాయంత్రం సుమారు 5:14 గంటల సమయంలో ఈ సమస్య ఉత్పన్నమైంది. దీనిపై దాదాపు రెండువేల కంటే ఎక్కువే ఫిర్యాదులు అందాయి. ఈ సమస్య ఎదురైన యూజర్లు ట్విటర్ వేదికగా ఇంకెవరికైనా ఇలాంటి ఇబ్బంది తలెత్తిందా అని ప్రశ్నించారు. చాలామంది ఈ సమస్యతో ఇబ్బందిపడడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. కాగా, ఈ సాంకేతిక సమస్యకు కారణాలు తెలియరాలేదు. ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా నుంచి ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు.
ఇదీ చదవండి: మూడు ప్లాంట్ల మూసివేత.. 10 వేల మందికి ఉద్వాసన!
అమెరికాలో అక్టోబర్ 15న ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు సాంకేతిక సమస్య ఎదురైంది. దాంతో వేలాది సంఖ్యలో మెటా యూజర్లు ఇబ్బంది పడినట్లు పలు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. దాదాపు 12,000 కంటే ఎక్కువ మంది యూజర్లు ఫేస్‌బుక్‌కు సంబంధించి సమస్య ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సమస్యల గురించి 5,000 కంటే ఎక్కువ మంది ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment