ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా.. భారతదేశంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ బిజినెస్ కోసం వెరిఫైడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను పరిచయం చేసింది. గత ఏడాది లిమిటెడ్ యూజర్లతో మాత్రమే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ టెస్ట్ చేసిన తరువాత.. ఇప్పుడు మరిన్ని ఫీచర్‌లను అందిస్తుంది.
వెరిఫైడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధరలు రూ. 639 నుంచి రూ. 21000 వరకు ఉన్నాయి. అయితే వివిధ సంస్థలు తమ అవసరాలకు సరిపోయే మెంబర్‌షిప్ ప్యాకేజీని ఎంచుకోవడంలో ఉపయోగకరంగా ఉండటానికి నాలుగు విభిన్న ప్లాన్‌లను అందిస్తోంది. ఈ వెరిఫైడ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి వెరిఫైడ్ బ్యాడ్జ్, భద్రత, కనెక్టివిటీకి సపోర్ట్ చేసే అదనపు ఫీచర్స్ కూడా పొందవచ్చు.
టెస్టింగ్ సమయంలో ఒకే ప్లాన్ అందించిన మెటా.. ఇప్పుడు మొత్తం నాలుగు ప్లాన్స్ అందించినట్లు ప్రకటించింది. ఈ ప్లాన్స్ కేవలం ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. వెరిఫైడ్ సబ్‌స్క్రిప్షన్ అనేది గతంలో ఎక్స్ (ట్విటర్) ప్రారంభించింది. ఇప్పుడు ఈ జాబితాలోకి మెటా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కూడా చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment