ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్ నిలిపివేత
‘మెటా అకౌంట్‌లను ఎలా డెలిట్ చేయాలి?’.. గూగుల్‌లో ట్రెడింగ్
మెటా గ్రూప్ తన ఆన్‌లైన్ సర్వీసులైన ఫేస్‌బుక్, థ్రెడ్స్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో ఫ్యాక్ట్ చెకింగ్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కంపెనీకి చుక్కెదురవుతుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్‌ను ఎలా డెలిట్ చేయాలని గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు అనలిటిక్స్ ద్వారా తెలిస్తుంది. ప్రస్తుతం ఆయా అకౌంట్లను ఎలా నిలిపేయాలని అధిక సంఖ్యలో గూగుల్‌లో సెర్చ్ చేస్తుండడంతో ప్రస్తుతం అవి ట్రెడింగ్‌లో ఉన్నాయి. ఇందుకు ఇటీవల మెటా తీసుకున్న నిర్ణయమే కారణమని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మెటా యాప్స్‌లో థర్డ్‌పార్టీ ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్‌ను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు బదులుగా కంపెనీ ‘కమ్యూనిటీ నోట్స్’ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది. కమ్యూనిటీ నోట్స్ అనే కమ్యూనిటీ ఆధారిత వ్యవస్థ వల్ల తప్పుదోవ పట్టించే పోస్ట్‌లను కట్టడి చేయవచ్చని మెటా తెలిపింది. ఇప్పటికే ఈ వ్యవస్థను ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో వాడుతున్నట్లు తెలుస్తుంది.
ట్రంప్ మెప్పు పొందేందుకేనా..?
ట్రంప్ త్వరలో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న తరుణంలో మెటా ఇలా ఫ్యాక్ట్ చెకింగ్ సదుపాయాన్ని నిలిపేస్తున్న తీసుకున్న నిర్ణయంపట్ల కంపెనీపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలని నిపుణులు అంటున్నారు. అయితే ఇప్పటికే ప్రధాన కంపెనీలు కొత్త ప్రభుత్వం పట్ల అభిమానాన్ని చూరగొనేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మార్పుపై ట్రంప్ అధికారులకు మెటా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్ అధినేత, ట్రంప్ చిరకాల మిత్రుడు డానా వైట్‌ను మెటా బోర్డులో చేర్చుకున్నట్లు కంపెనీ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఇప్పటికే ప్రకటించారు.
కఠిన నిర్ణయాలు తప్పవు
రాబోయే రోజుల్లో అమెరికాలో మార్పు రావాలని ఆశిస్తున్నట్లు మార్క్ చెప్పారు. అందరూ స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేయలని నొక్కి చెప్పారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తుందన్నారు. దాంతో కంపెనీలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. దీనివల్ల కొందరి పోస్టులను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ‘వినాశనమే తప్ప విజయం కాదు.. వివరణతో దిగజారారు’
తప్పుడు సమాచారం తగ్గుతుందా..?
మార్క్ ఇటీవల తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి నెటిజన్ల మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇప్పటివరకు మెటా అనుసరించిన ఫ్యాక్ట్ చెకింగ్ విధానంతో ఇటీవల అధికారంలోకి వచ్చిన కన్జర్వేటివ్‌పార్టీ నేతలను అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నట్లు గతంలో భావించారు. ట్రంప్ అధికారంలోకి వస్తే మెటాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందేమోనని భావించి ముందుగానే మార్క్ ఈ మార్పులు చేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కన్జర్వేటివ్ మిత్రపక్షాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. అయితే అనేక డిజిటల్ హక్కుల సంఘాలు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. కంపెనీ తీసుకున్న నిర్ణయంతో తప్పుడు సమాచారం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment