Meta AI
-
20 ఏళ్ల యువతకు ఏఐ గాడ్‌ఫాదర్ సలహా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) శకం కొనసాగుతోంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాదాపు ప్రతి రంగంలోకి ఏఐ ప్రవేశిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఈ రంగంలో తమ కెరియర్ పెంపొందించేకోవాలనే వారికి ‘ఏఐ గాడ్‌ఫాదర్’గా పరిగణించబడే ఫ్రెంచ్-అమెరికన్ శాస్త్రవేత్త యాన్ లెకున్ సూచనలిచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 20 ఏళ్ల వయసు గల యువత తమ కెరియర్ను ఉజ్వలంగా మలుచుకోవాలంటే ఏం చేయాలో చెప్పారు.‘ప్రపంచంలో దాదాపు అన్ని రంగాల్లో ఏఐ వేగంగా విస్తరిస్తోంది. 20 ఏళ్ల వయసుగల వారు తమ భవిష్యత్తు కోసం నన్ను ఏం చేయాలో చెప్పమని అడిగితే ఒక సలహా ఇస్తాను. ఎక్కువగా గణితం, భౌతికశాస్త్రం, కంప్యూటర్ సైన్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ వంటి అంశాలపై పట్టు సాధించాలి. తరువాతి తరం ఏఐ సిస్టమ్‌లను అర్థం చేసుకోవడానికి ఇవి ఎంతో అవసరం. వీటికి భవిష్యత్తులో ఎక్కువ ఆదరణ ఉంటుంది. అదే మొబైల్ యాప్ డెవలప్మెంట్ వైపు తమ కెరియర్ మలుచుకోవాలనుకునే వారికి భవిష్యత్తులో పెద్దగా అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ రంగం ‘షెల్ఫ్‌లైఫ్’(అధిక ఆదరణ ఉండే సమయం) మూడేళ్లుగా నిర్ధారించారు. 30-40 ఏళ్ల వారు చిప్ తయారీ రంగంపై దృష్టి పెట్టండి. ఎందుకంటే వచ్చే ఐదేళ్లలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి’ అన్నారు.ఇదీ చదవండి: వంటనూనె ధరలు మరింత ప్రియం?యాన్ లెకున్ ప్రస్తుతం మెటా సంస్థలో చీఫ్ ఏఐ సైంటిస్ట్‌గా పని చేస్తున్నారు. మెటా ఫండమెంటల్ ఏఐ రీసెర్చ్ (ఫెయిర్) ల్యాబ్‌ను ఏర్పాటు చేసిందని లెకున్ గుర్తు చేశారు. ఇది లార్జ్ ల్యాంగ్వేజ్ మోడళ్ల(ఎల్ఎల్ఎం) కంటే తదుపరి తరం ఏఐ సిస్టమ్‌లపై పరిశోధనలు చేస్తుందన్నారు. ప్రపంచంలోని ప్రధాన కంపెనీలు ఇప్పటికే వాటి ఏఐ ఉత్పత్తులను పరిచయం చేశాయి. నిత్యం అందులో కొత్త అంశాలను అప్డేట్ చేస్తున్నాయి. గూగుల్ జెమిని, మైక్రోసాఫ్ట్ కోపిలట్, ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ, మెటా మెటాఏఐ..వంటివి ప్రత్యేకంగా ఏఐ సేవలందిస్తున్నాయి. -
భారతీయుల కోసం 'మెటా ఏఐ'.. ఇదెలా పనిచేస్తుందంటే?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరుగుతున్న తరుణంలో గూగుల్ జెమిని తీసుకువచ్చింది. ఇప్పుడు తాజాగా ఫేస్బుక్ పేరెంట్ 'మెటా' తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ 'మెటా ఏఐ' భారత్‌లోకి అందుబాటులోకి తెచ్చింది. గత కొన్ని రోజులుగా కంపెనీ పరీక్షించిన ఈ టెక్నాలజీని ఎట్టకేలకు వినియోగదారుల కోసం తీసుకువచ్చింది.కంపెనీ రూపొందించిన కొత్త మెటా ఏఐను వాట్సప్, ఫేస్బుక్, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్ సహా meta.AI పోర్టల్‌లో ఉపయోగించుకోవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. కంపెనీ ఈ టెక్నాలజీని రెండు నెలలకు ముందే యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, సింగపూర్, దక్షిణాఫ్రికా, ఉగాండా, జింబాబ్వేతో సహా 12 దేశాల్లోకి అందుబాటులోకి తెచ్చింది.మెటా ఏఐ అనేది ప్రస్తుతం ఇంగ్లీష్ భాషకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. రాబోయే రోజుల్లో తెలుగుకు కూడా సపోర్ట్ చేసే విధంగా సంస్థ దీన్ని అప్డేట్ చేసే అవకాశం ఉంది. కాగా ఇటీవల ఇండియాలో లాంచ్ అయిన గూగుల్ జెమిని మొత్తం తొమ్మిది (ఇంగ్లీష్ భాషతో పాటు తెలుగు, హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, ఉర్దూ) సపోర్ట్ చేస్తుంది.ఎలా పనిచేస్తుందంటే?ఇది ప్రస్తుతం ఇంగ్లీష్ భాషకు మాత్రమే పరిమితమై ఉంది. కాబట్టి యూజర్ ఏదైనా ప్రశ్నలను అడగలనుకుంటే ఇంగ్లీష్‌లోనే టైప్ చేయాల్సి ఉంటుంది. దీని ఆధారంగా ఏఐ సమాధానాలను ఇస్తుంది. ఇది అన్ని వాట్సప్, ఫేస్బుక్, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్ యూజర్లకు పూర్తిగా ఉచితం. ఇందులో యూజర్స్ ఏఐ ఫోటోలను కూడా రూపొందించవచ్చు.