ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరుగుతున్న తరుణంలో గూగుల్ జెమిని తీసుకువచ్చింది. ఇప్పుడు తాజాగా ఫేస్‌బుక్ పేరెంట్ 'మెటా' తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ 'మెటా ఏఐ' భారత్‌లోకి అందుబాటులోకి తెచ్చింది. గత కొన్ని రోజులుగా కంపెనీ పరీక్షించిన ఈ టెక్నాలజీని ఎట్టకేలకు వినియోగదారుల కోసం తీసుకువచ్చింది.
కంపెనీ రూపొందించిన కొత్త మెటా ఏఐను వాట్సప్, ఫేస్‌బుక్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్ సహా meta.AI పోర్టల్‌లో ఉపయోగించుకోవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. కంపెనీ ఈ టెక్నాలజీని రెండు నెలలకు ముందే యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, సింగపూర్, దక్షిణాఫ్రికా, ఉగాండా, జింబాబ్వేతో సహా 12 దేశాల్లోకి అందుబాటులోకి తెచ్చింది.
మెటా ఏఐ అనేది ప్రస్తుతం ఇంగ్లీష్ భాషకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. రాబోయే రోజుల్లో తెలుగుకు కూడా సపోర్ట్ చేసే విధంగా సంస్థ దీన్ని అప్డేట్ చేసే అవకాశం ఉంది. కాగా ఇటీవల ఇండియాలో లాంచ్ అయిన గూగుల్ జెమిని మొత్తం తొమ్మిది (ఇంగ్లీష్ భాషతో పాటు తెలుగు, హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, ఉర్దూ) సపోర్ట్ చేస్తుంది.
ఎలా పనిచేస్తుందంటే?
ఇది ప్రస్తుతం ఇంగ్లీష్ భాషకు మాత్రమే పరిమితమై ఉంది. కాబట్టి యూజర్ ఏదైనా ప్రశ్నలను అడగలనుకుంటే ఇంగ్లీష్‌లోనే టైప్ చేయాల్సి ఉంటుంది. దీని ఆధారంగా ఏఐ సమాధానాలను ఇస్తుంది. ఇది అన్ని వాట్సప్, ఫేస్‌బుక్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు పూర్తిగా ఉచితం. ఇందులో యూజర్స్ ఏఐ ఫోటోలను కూడా రూపొందించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment