ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్ ఇంక్(Meta) చర్యలను భారత పార్లమెంటరీ ప్యానెల్ పరిశీలిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలపై కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీకి సారథ్యం వహిస్తున్న డాక్టర్ నిషికాంత్ దూబే నేతృత్వంలోని ప్యానెల్ మెటాకు సమన్లు జారీ చేయాలని యోచిస్తోంది.
అసలేం జరిగిందంటే..
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మెటా సీఈఓ మాట్లాడుతూ.. కోవిడ్ -19 మహమ్మారిని నిర్వహించడంలో భారత ప్రభుత్వం విఫలమైందన్నారు. దాంతో ప్రస్తుత ప్రభుత్వం 2024 ఎన్నిక(2024 Lok Sabha elections)ల్లో విజయం సాధించబోదని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఈ అంశంపై అప్పట్లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ మార్క్ జూకర్‌బర్గ్ మాటలు తప్పని రుజువైందన్నారు. ప్రజలు తమ పార్టీకే స్పష్టమైన మెజార్జీ అందించారని చెప్పారు. జూకర్‌బర్గ్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.
తప్పుడు సమాచారం..
కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీకి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ దూబే ప్రజాస్వామ్య దేశంలో ఖచ్చితమైన సమాచారం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ‘ఈ తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేసినందుకు కమిటీ(parliamentary panel) మెటాపై చర్య తీసుకోవాలని చూస్తుంది. ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా తప్పుడు సమాచారం దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తుంది. ఈ పొరపాటుకు ఆ సంస్థ భారత పార్లమెంటుకు, ఇక్కడి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’ అన్నారు దూబే అన్నారు.
ఇదీ చదవండి: పనితీరు సరిగాలేదా? సర్దుకోవాల్సిందే..
సమాచార నిర్ధారణకు బాధ్యత
మెటాకు సమన్లు జారీ చేయాలని పార్లమెంటరీ ప్యానెల్ తీసుకున్న నిర్ణయం.. తప్పుడు సమాచారం వ్యాప్తి, ప్రజాస్వామ్య వ్యవస్థలో దాని ప్రభావంపై పెరుగుతున్న ఆందోళనలను నొక్కి చెబుతుంది. ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల పాత్రపై కూడా చర్చ జరగాల్సి ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. తమ ప్లాట్‌ఫామ్‌లో పంచుకునే సమాచారం ఖచ్చితత్వాన్ని నిర్ధారించడంలో టెక్ దిగ్గజాలు బాధ్యత వహించాలని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment