Parliamentary panel
-
ప్రజాపద్దుల కమిటీ భేటీకి మాధవీ పురి డుమ్మా
న్యూఢిల్లీ: సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) చైర్పర్సన్ హోదాలో ఉంటూ గౌతమ్ అదానీ గ్రూప్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధవీ పురీ బచ్ గురువారం పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) సమావేశానికి గైర్హాజరయ్యారు. సెబీ పనితీరును మాధవీ పురి మసకబార్చారంటూ అమెరికాకు చెందిన షార్ట్‌సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గతంలో ఆరోపణలు చేయడంతో సెబీ పనితీరును ఆమె సమక్షంలోనే సమీక్షించేందుకు పీఏసీ సిద్ధమైన విషయంతెల్సిందే. ఈ క్రమంలో గురువారం ఢిల్లీలో పీఏసీ చైర్మన్, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన సమావేశం ఉదయం 11 గంటల ప్రాంతంలో మొదలైంది. అయితే చివరి నిమిషంలో అత్యవసర పనుల కారణంగా తాను ఢిల్లీలో సమావే శానికి రాలేకపోతున్నానని రెండు గంటలముందు మాధవీ సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె లేకుండా సమీక్ష అనవసరమని భావించి వేణుగోపాల్ సమావేశాన్ని మధ్యాహా్ననికి వాయిదావేశారు. -
ఈయనే నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోతున్నట్లుంది సార్!
ఈయనే నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోతున్నట్లుంది సార్! -
పార్లమెంటరీ ‘చర్చ’ జరగాల్సిందే
న్యూఢిల్లీ: విపక్ష సభ్యుల ఐఫోన్లపైకి ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లు దాడికి తెగబడ్డారన్న ఆరోపణలను విపక్షాలు తీవ్రతరం చేశాయి. ఈ అంశంపై పార్లమెంటరీ స్థాయి సంఘంలో చర్చించాల్సిందేనని పట్టుబట్టాయి. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంశంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘానికి కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టస్‌లు లేఖ రాశారు. స్టాండింగ్ కమిటీని అత్యవసరంగా సమావేశపరిచి హెచ్చరిక అలర్ట్‌లు అందుకున్న ఎంపీలతోపాటు ఐఫోన్ తయారీదారు యాపిల్ సంస్థ ప్రతినిధులనూ చర్చకు పిలవాలని లేఖలో డిమాండ్‌చేశారు. స్థాయి సంఘంలో చర్చకు అధికార బీజేపీ ససేమిరా అంటోంది. ‘ యాపిల్ సబ్స్రైబర్లకు సంబంధించిన ఈ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది. హ్యాకింగ్ దాడిని ఎదుర్కొన్నాయంటున్న ఐఫోన్లను చెక్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసులది. ఈ అంశాన్ని స్థాయీ సంఘంలో చర్చించాల్సిన అవసరమే లేదు’ అని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే వ్యాఖ్యానించారు. అందుకే కేంద్రాన్ని వేలెత్తిచూపుతున్నారు: చిదంబరం గతంలో పెగసస్ సాఫ్ట్వేర్ సాయంతో దేశంలో పలు రంగాల వ్యక్తులపై కేంద్రప్రభుత్వం నిఘా పెట్టిందన్న ఆరోపణల నడుమ ఐఫోన్ల హ్యాకింగ్ వెలుగుచూడటంతో అందరూ సహజంగానే కేంద్రప్రభుత్వం వైపే వేలెత్తిచూపుతారని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం వ్యాఖ్యానించారు. ‘2019లో పలువురు సామాజిక కార్యకర్తలు, విపక్ష సభ్యులు, ప్రముఖ పాత్రికేయులు, జడ్జీల ఫోన్లపై పెగసస్ సాఫ్ట్‌వేర్‌తో కేంద్రం నిఘా పెట్టిందని దేశమంతటా కలకలం రేగడం తెల్సిందే. ఇప్పుడు వందలాది విపక్ష నేతలకు యాపిల్ ఐఫోన్ హ్యాకింగ్ అలర్ట్‌లు వచ్చాయనేది వాస్తవం. కేవలం విపక్ష నేతలకు మాత్రమే ఎందుకొచ్చాయి? హ్యాకింగ్ వల్ల భారీ ప్రయోజనం ఒనగూరేది ఎవరికి ?. ఈ ప్రశ్నలు తలెత్తినపుడు అందరూ అనుమానంతో కేంద్ర నిఘా సంస్థలవైపే వేలు చూపిస్తారు. ఎందుకంటే అనుమానించదగ్గ సంస్థలు అవి మాత్రమే’ అని చిదంబరం ఆరోపించారు. రక్షణ కలి్పంచండి: లోక్‌సభ స్పీకర్‌కు మొయిత్రా లేఖ ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే హ్యాకర్ల దాడుల నుంచి విపక్ష ఎంపీలను రక్షించాలని లోక్‌సభ స్పీకర్ బిర్లాను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కోరారు. ఈ మేరకు బిర్లాకు ఆమె లేఖ రాశారు. నిఘాకు రూ.1,000 కోట్లు! ‘అంతర్జాతీయ సంస్థలైన యాక్సెస్ నౌ, సిటిజెన్ ల్యాబ్ వంటి సంస్థలు సెపె్టంబర్‌లోనే ఇలాంటి యాపిల్ సంస్థ జారీచేసే హెచ్చరిక నోటిఫికేషన్ల విశ్వసనీయతను నిర్ధారించాయి. ఇంటెలెక్సా అలయెన్స్ వంటి సంస్థలతో కలిసి నిఘా కాంట్రాక్ట్‌లను కుదుర్చుకునేందుకు భారత ప్రభుత్వం తన బడ్జెట్ కేటాయింపులను పెంచుకుంటోందని ఇటీవలే ‘ది ప్రెడేటర్ ఫైల్స్’ పేరిట ఫైనాన్షియల్ టైమ్స్ ఒక పరిశోధనాత్మక సమగ్ర కథనాన్ని వెలువరిచింది. ఈ నిఘా ఒప్పందాల విలువ దాదాపు 1,000 కోట్లు ఉంటుందని అంచనావేసింది’ అని మొయిత్రా తన లేఖలో పేర్కొన్నారు. 2014 తర్వాత ఏదైనా నిఘా సాఫ్ట్‌వేర్‌ను కొన్నదీ లేనిదీ కేంద్రం బయటపెట్టాల్సిందేనని స్వతంత్ర రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ డిమాండ్‌చేశారు. కాగా, అలర్ట్ ఘటనపై వివరణ కోరుతూ యాపిల్ సంస్థకు సమన్లు జారీ చేయాలని పార్లమెంటరీ కమిటీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
సబ్సిడీ బకాయిలు విడుదల చేయాలి
న్యూఢిల్లీ: తమకు రావాల్సిన రూ.1,200 కోట్ల సబ్సిడీ బకాయిలు విడుదల చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సూచించాలని పార్లమెంటరీ ప్యానెల్‌ను ఎలక్ట్రిక్ వాహన తయారీదారుల సంఘం (ఎస్ఎంఈవీ) కోరింది. పరిశ్రమ నిధుల సమస్యను ఎదుర్కొంటుండడం ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణకు అవరోధంగా నిలుస్తోందని పేర్కొంది. ‘‘ఇప్పుడు యావత్‌దేశం ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి సరఫరా వ్యవస్థతో సిద్ధంగా ఉంది. ప్రభుత్వం వద్ద రూ.1,200 కోట్ల సబ్సిడీలు నిలిచిపోవడంతో పరిశ్రమ తీవ్ర నిధుల సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రభుత్వం, పరిశ్రమ కలసి సమస్యలను పరిష్కరించుకుని, ఎలక్ట్రిక్ వాహన లక్ష్యాలను చేరుకునేందుకు పనిచేయాల్సిన అవసరం ఉంది’’అని ఈవీ పరిశ్రమ కోరింది. ఫేమ్ పథకం కింద సబ్సిడీలను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నట్టు ఆరోపణలు రావడం తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు సైతం తెలిపింది. ఫేమ్–2 పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల కాలానికి ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు రూ.10వేల కోట్లను ప్రోత్సాహకాలను 2019 నుంచి ఇస్తోంది. -
ఎన్పీఏల తగ్గింపునకు ఐఐఎఫ్‌సీఎల్ చర్యలు
న్యూఢిల్లీ: నిరర్థక రుణాలను (వసూలు కానివి/ఎన్పీఏలు) కట్టడి చేయడంలో ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సీఎల్) తీసుకున్న చర్యలు, పని తీరును పార్లమెంటరీ ప్యానెల్ అభినందించింది. ఐఐఎఫ్‌సీఎల్ చర్యలు ఎన్పీఏలను నియంత్రిస్తాయని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ కంపెనీగా తన సేవలను అందించడానికి వీలు పడుతుందని పార్లమెంటరీ ప్యానెల్ పేర్కొంది. ఐఐఎఫ్‌సీఎల్ అనేది మౌలిక రంగానికి రుణ వితరణ కోసం 2006 జనవరిలో కేంద్రం ఏర్పాటు చేసిన సంస్థ. ప్రభుత్వరంగ సంస్థలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ తన నివేదికను ఇటీవలే పార్లమెంట్‌కు సమర్పించింది. ఐఐఎఫ్‌సీఎల్ తీసుకున్న చర్యలు దీర్ఘకాలంలో సంస్థ బలోపేతానికి సాయపడతాయని కమిటీ అభిప్రాయపడింది. ఎన్పీఏల పరిష్కారానికి బోర్డు ఆమోదిత మేనేజ్మెంట్ పాలసీని అమల్లో పెట్టడాన్ని ప్రస్తావించింది. -
హిందీ రుద్దితే ఊరుకోం
చెన్నై: దేశంలో కొన్ని ఉద్యోగాలు చేయాలంటే తప్పనిసరిగా హిందీ నేర్చుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్ చేసిన సిఫార్సులను తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. హిందీని బలవంతంగా తమ నెత్తిపై రుద్దితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి స్టాలిన్ లేఖ రాశారు. భిన్నత్వంలో ఏకత్వమున్న మన దేశంలో రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో ఉన్న 22 భాషలనూ సమానంగా చూడాలని హితవు పలికారు. దేశంలో హిందీ మాట్లాడే వారి కంటే, ప్రాంతీయ భాషలు మాట్లాడే వారి సంఖ్యే ఎక్కువని గుర్తు చేశారు. -
అమ్మో..! వసూలు కానీ పన్ను బకాయిలు ఇన్ని లక్షల కోట్లున్నాయా!
న్యూఢిల్లీ: వ్యవస్థలో పేరుకుపోయిన లక్షలాది కోట్ల పన్ను బకాయిలను రాబట్టుకోడానికి రెవెన్యూ శాఖ పక్కా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటయిన పార్లమెంటరీ స్థాయి సంఘం ఒకటి సూచించింది. ఇదే సమయంలో నిజాయితీ పన్ను చెల్లింపుదారులు వేధింపులకు గురికాకుండా చూడాలని సూచించింది. ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులపై మాత్రమే చర్యలు ఉండేలా జాగ్రత్త పడాలని పేర్కొంది. ఇందుకు వీలుగా సోదాలు, స్వాదీనం వంటి చర్యలకు ముందు రెవెన్యూ శాఖ తగిన శ్రద్ధ వహించాలని స్పష్టం చేసింది. బీజేపీ సభ్యుడు జయంత్ సిన్హా నేతృత్వంలోని స్థాయి సంఘం నివేదికా అంశాలు. ► 21 లక్షల కోట్లకు పైగా (ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ. 18.66 లక్షల కోట్లు, పరోక్ష పన్నుల రూపంలో రూ. 2.95 లక్షల కోట్లు) బకాయిలు ఉన్నందున వీటిని రాబట్టుకునేందుకు రెవెన్యూ ప్రత్యేక దృష్టి పెట్టాలి. ► బకాయి డిమాండ్‌లో ఎక్కువ భాగం ‘కష్టతరమైన రికవరీ’ కిందకు వస్తోంది. మొత్తం బకాయిల్లో ఈ విభాగం వాటా 94 శాతం. ► పరోక్ష పన్నులకు సంబంధించి రూ. 2.95 లక్షల కోట్లలో రూ. 2.58 లక్షల కోట్ల మొత్తం వసూలు చేయలేని పరిమాణం. అంటే బకాయి డిమాండ్‌లో దాదాపు 88 శాతం వసూలు చేయలేనిదన్నమాట. ఇక మిగిలిన 12 శాతం వసూలు చేయగలిగే పరిస్థితి ఉంది. వీటి వసూళ్ల ప్రక్రియ ప్రారంభం కాలేదు. ► కోవిడ్ మహమ్మారి పన్ను రికవరీలపై తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు భారీ బకాయిలు పెండింగులో ఉండడం పన్ను శాఖ పాలనా తీరుపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. అవినీతిపై ఇలా... పార్లమెంటరీ కమిటీ నివేదిక ప్రకారం, సోదాలు జరుగుతున్నప్పుడు తమను రెవెన్యూ అధికారులు ‘‘నేరస్థులు’’గా పరిగణిస్తున్నారని చాలా మంది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు అధికారులు ‘లంచాలు’’ అడిగుతున్నారనీ ఆరోపణలు వచ్చాయి. తద్వారా సోదాలు, జప్తు పక్రియను కుదించడమో లేక, పూర్తిగా నిలిపివేయడమో జరుగుతోందని పార్లమెంటరీ కమిటీకి తెలుస్తోంది. అటువంటి తప్పుడు పనులపై పూర్తిగా దర్యాప్తు చేయవలసిందిగా రెవెన్యూ శాఖను పార్లమెంటరీ కమిటీ కోరుతోంది. తప్పు చేసిన వారిపై రహస్యంగా ఫిర్యాదులు చేయడానికి పన్ను చెల్లింపుదారులకు అవకాశం కల్పించాలి. పన్ను బకాయిలు ఏటా పెరుగుతున్నాయి. సమయానుకూలమైన ఫాస్ట్‌ట్రాక్ మెకానిజం ద్వారా బకాయిలను రాబట్టుకోడానికి చర్యలు అవసరం. ఇందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక అవసరం. - పార్లమెంటరీ కమిటీ -
బీఎస్ఎన్ఎల్ లాభాలు: పార్లమెంటరీ ప్యానెల్ అంచనాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి లాభాలను ఆర్జించొచ్చని.. ఇది కూడా పునరుద్ధరణ ప్యాకేజీలో భాగంగా రూపొందించిన విధానాలు, ప్రణాళికల అమలు, మిగులు భూముల విక్రయంపైనే ఆధారపడి ఉంటుందని ఐటీ రంగానికి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభిప్రాయపడింది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ నిర్వహణపరమైన లాభాల్లోకి మాత్రమే అడుగు పెట్టినట్టు గుర్తు చేసింది. అంటే పన్ను, వడ్డీ, తరుగుదలకు ముందు లాభాల్లో ఉండడం. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్ర ప్రభుత్వం 2019 అక్టోబర్‌లో ఆమోదం తెలిపిన విషయం గమనార్హం. ఇందులో భాగంగా అధిక శాతం మంది ఉద్యోగులను స్వచ్చంద పదవీ విరమణ పథకం కింద తగ్గించుకుని నిర్వహణ వ్యయాలను ఆదా చేసుకోవడం ఒకటి. ఇది అమలైంది. అలాగే, ఈ సంస్థలకు ఉన్న భూముల విక్రయాలు, 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపు కూడా ప్యాకేజీలో భాగమే. -
ట్విట్టర్‌పై పార్లమెంటరీ కమిటీ ఆగ్రహం
న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమం ట్విట్టర్ తన లొకేషన్ సెట్టింగ్‌లలో లద్దాఖ్‌లోని లేహ్ ప్రాంతాన్ని చైనాలో అంతర్భాగంగా చూపించడంపై ఇచ్చిన వివరణ సరిగా లేదని పార్లమెంటరీ సంయుక్త కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంలో బుధవారం ట్విట్టర్ అధికారుల్ని ప్రశ్నించిన పార్లమెంటరీ కమిటీ లేహ్ ప్రాంతాన్ని అలా చూపించడం దేశ ద్రోహం కిందకి వస్తుందని తెలిపింది. డేటా ప్రొటెక్షన్ బిల్లు పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరైన ట్విట్టర్ అధికారుల్ని కమిటీ సభ్యులు దాదా పుగా రెండు గంటల సేపు ప్రశ్నించారు. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన సున్నితమైన ఈ అంశాన్ని తాము గౌరవిస్తామని ట్విట్టర్ అధికారులు తెలిపారు. తాము చేసిన పొరపాటుకు క్షమాపణ కూడా కోరారు.ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించామని అన్నారు. తమ సంస్థ అత్యంత పారదర్శకంగా పని చేస్తుందని, ఎప్పటికప్పుడు కేంద్రానికి తాము సరి చేసిన అంశాలను తెలియజెప్పామన్నారు. -
పార్లమెంటరీ ప్యానెల్ ముందుకు అజిత్ మోహన్
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ఫేస్బుక్ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు రాజకీయ దుమారానికి దారితీసిన నేపథ్యంలో ఆ కంపెనీ భారత్ చీఫ్ అజిత్ మోహన్ బుధవారం పార్లమెంటరీ ప్యానెల్ ఎదుట హాజరయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ ఆధ్వర్యంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఫేస్బుక్ ప్రతిని«ధుల్ని కమిటీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడం, పౌర హక్కుల పరిరక్షణ, డిజిటల్ మీడియాలో మహిళా భద్రత అనే అంశాలే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం సాగినట్టు అధికారులు వెల్లడించారు. ఫేస్బుక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ రెండు గంటలపైగా ప్యానెల్‌తో చర్చించారు. దాదాపు 90 ప్రశ్నలను ఆయనకు అందజేసిన ప్యానల్ వీటికి లిఖిత పూర్వక సమాధానాలు ఇవ్వాలని కోరింది. ఇదే అంశంపై చర్చించడానికి ప్యానెల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ప్రతినిధుల్ని కూడా పిలిచింది. ప్యానెల్ చైర్మన్ థరూర్ సహా 18 మంది సభ్యులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఫేస్బుక్లో బీజేపీ సభ్యుల విద్వేషపూరిత పోస్టులను ఫేస్బుక్ చూసీచూడనట్టుగా వదిలేస్తోందని, ఆ పార్టీపై పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందని ఆరోపణలు చేస్తూ ఇటీవల వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఆ అంశంపై కూడా చర్చించాలని ప్యానెల్ చైర్మన్ శశి థరూర్ పట్టుబట్టగా, ప్యానెల్‌లోని బీజేపీ ప్రతినిధులు ఆయనని తీవ్రంగా వ్యతిరేకించారు. పార్లమెంటరీ ప్యానెల్‌ని శశిథరూర్ తన సొంత రాజకీయ ఎజెండాకి వాడుకోవడం ఎంత వరకు కరెక్టని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ప్రశ్నించారు. మరోవైపు బీజేపీకి కొమ్ము కాసేలా ఫేస్బుక్ వ్యవహరిస్తోందని, దీనికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయంటూ ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు తృణమూల్ కాంగ్రెస్ లేఖ రాసింది. -
దేశానికే అవమానం!
న్యూఢిల్లీ: రక్షణ రంగంపై ఏర్పాటైన పార్లమెంటరీ ప్యానెల్లో వివాదాస్పద భోపాల్ ఎంపీ ప్రగ్యాసింగ్ ఠాకూర్‌ను సభ్యురాలిగా చేర్చడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాద కేసులో నిందితురాలు, మహాత్మాగాంధీని చంపిన నాథురాం గాడ్సే ఆరాధకురాలైన ప్రగ్యాసింగ్‌ను డిఫెన్స్ పార్లమెంటురీ ప్యానెల్లో చేర్చడం ద్వారా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు దేశాన్ని అవమానించిందని కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో రక్షణ రంగంపై ఏర్పాటైన పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీలో మొత్తం 21మంది సభ్యులు ఉన్నారు. ఈ కమిటీలో మహారాష్ట్ర మాలెగావ్ పేలుళ్ల కేసు నిందితురాలైన బీజేపీ ఎంపీ ప్రగ్యాసింగ్ కూడా సభ్యురాలుగా ఉన్నారు. ఈ చర్యను తప్పుబడుతూ కాంగ్రెస్ పార్టీ ట్విటర్లో విమర్శలు గుప్పించింది. ‘డిఫెన్స్ పార్లమెంటరీ ప్యానెల్లో సభ్యురాలిగా ప్రగ్యాసింగ్‌ను బీజేపీ సర్కార్ నామినేట్ చేయడం దేశ భద్రతా బలగాలను, దేశ పౌరులను అమమానించడమే’ అని ట్వీట్ చేసింది. సచ్ఛీలత, నిజాయితీ గల నేతలను నియమించడానికి బదులు ఇలాంటి వారిని నియమించడం విడ్డూరమని ఎద్దేవా చేసింది. కోర్టుల్లో కేసులు ఎదుర్కొంటున్న ఇలాంటి వ్యక్తులను నియమించడం ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదని, బీజేపీకి 303 మంది ఎంపీలు ఉన్నారని, డిఫెన్స్ ప్యానెల్లో సచ్ఛీలురను నియమించడానికి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయని, ఐనా కావాలనే బీజేపీ ఈ చర్యకు పాల్పడిందని కాంగ్రెస్ దుయ్యబట్టింది. -
ట్విటర్ సీఈఓకు ఊరట..!
సాక్షి, న్యూఢిల్లీ : సమాచార సాంకేతికతపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానెల్ నిర్ణయంతో ట్వీటర్ సీఈవో జాక్ డోర్సేకు ఊరట లభించింది. ప్యానెల్ ఎదుట డోర్సే హాజరు కావాల్సిన అవసరం లేదని వెల్లడించింది. అతని తరపున కంపనీ పబ్లిక్ పాలసీ హెడ్ కోలిన్ క్రోవెల్ హాజరు కావొచ్చని లోక్‌సభ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్ తెలిపింది. సోషల్ మీడియాలో పౌరుల సమాచారం లీక్ అవుతుందనే భయాల నేపథ్యంలో ట్విట్టర్ సీఈవోతోపాటు ఇతర ఉన్నత అధికారులు ఫిబ్రవరి 25లోగా తమముందు హాజరుకావాలని ప్యానెల్ అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. (ట్విటర్‌కు పార్లమెంటరీ కమిటీ అల్టిమేటం) అయితే, జాక్ డోర్సే కాకుండా అతని తరపున ట్విటర్ ఇండియా ప్రతినిధులు ప్యానెల్ ఎదుట హాజరయ్యేందుకు ఫిబ్రవరి 11న పార్లమెంటుకు వెళ్లినప్పటికీ వారిని కలిసేందుకు సభ్యులు నిరాకరించారు. సంస్థ సీఈఓ నేరుగా హాజరు కావాలని ప్యానెల్ తేల్చిచెప్పింది. దాంతో జాక్ డోర్సే ప్యానెల్ ఎదుట హాజరవుతాడని అందరూ భావించారు. అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాల్లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఫేస్బుక్, ట్విటర్ వంటి సోషల్ మీడియా సంస్థల్లో యూజర్ల డాటా లీక్ కావడాన్ని, ఆ సమాచారాన్ని ఎన్నికల్లో ఒక రాజకీయ పక్షానికి అనుకూలంగా ఉపయోగించుకున్నట్టు కథనాలు వచ్చిన నేపథ్యంలో ఈమేరకు భారత ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఐటీపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానెల్ ట్విటర్ సీఈఓ తమ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ప్యానెల్ తాజా నిర్ణయంతో కోలిన్ క్రోవెల్ ఇండియాకు రానున్నారు. (ట్విట్టర్ రెక్కలు కత్తిరిస్తారా?) -
ట్విట్టర్‌కి అల్టిమేటం జారీ చేసిన పార్లమెంటరీ కమిటీ
-
ట్విటర్‌కు పార్లమెంటరీ కమిటీ అల్టిమేటం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్‌కు పార్లమెంటరీ కమిటీ షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో పౌరహక్కుల పరిరక్షణ విషయమై ట్విట్టర్ సీఈవోతోపాటు ఇతర ఉన్నత అధికారులు 15 రోజుల్లోగా తమముందు హాజరుకావాలని అల్టిమేటం జారీ చేసింది. సమాచార సాంకేతికతపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని పార్లమెంటురీ కమిటీ ఈ మేరకు సోమవారం నిర్ణయం తీసుకుంది. ట్విటర్ అంతర్జాతీయ విభాగం సీఈవో జాక్ డొర్సేతోపాటు ఉన్నతాధికారులు తమ ముందు హాజురు కావాల్సిందేనని, వారు హాజరయ్యేవరకు ఇతర ట్విటర్ అధికారులను తము కలువబోమని పార్లమెంటరీ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ట్విటర్ ఇండియా ప్రతినిధులు సోమవారం పార్లమెంటరీ కమిటీ ముందు హాజరవ్వడానికి పార్లమెంటుకు వెళ్లినప్పటికీ.. వారిని కలిసేందుకు కమిటీ నిరాకరించింది. అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాల్లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఫేస్బుక్, ట్విటర్ వంటి సోషల్ మీడియా సంస్థల్లో యూజర్ల డాటా లీక్ కావడాన్ని, ఆ సమాచారాన్ని ఎన్నికల్లో ఒక రాజకీయ పక్షానికి అనుకూలంగా ఉపయోగించుకున్నట్టు కథనాలు వచ్చిన నేపథ్యంలో ఈమేరకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ముఖ్యంగా రైట్‌వింగ్ వాదుల అభిప్రాయల పట్ల ట్విటర్ పక్షపాతపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై స్పందించిన ట్విటర్.. తమ వేదికపై ప్రజల రాజకీయ అభిప్రాయాల పట్ల ఎలాంటి పక్షపాతమూ చూపించడం లేదని స్పష్టత ఇచ్చింది. -
కోత మెషిన్ల ధరలపై చర్యలు చేపట్టండి
న్యూఢిల్లీ: కోత మెషిన్ల(పవర్ టిల్లర్స్)ను కంపెనీలు ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా విక్రయిస్తున్నాయని, దీనిపై కేంద్రం తగు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసింది. దేశంలోని సన్న, చిన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకొని మెషిన్ల ధరలు తగ్గించాల్సిన అవసరముందంది. ఇటీవల ముగిసిన వర్షకాల సమావేశాల్లో కమిటీ తన నివేదికను పార్లమెంటు సమర్పించింది. ధరల విషయంలో కంపెనీలు కమ్మక్కైనట్లు అను మానం వస్తే కేసును కాంపిటీషన్ కమిషన్‌కు సైతం రిఫర్ చేయాలని సిఫార్సు చేసింది. -
పార్లమెంటరీ ప్యానల్ ముందుకు పీఎస్‌బీల సారథులు
న్యూఢిల్లీ: పార్లమెంటరీ ప్యానల్ ముందు 11 ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్బీ) అధినేతలు ఈ మంగళవారం హాజరు కాబోతున్నారు. పెరిగిపోతున్న మొండి బకాయిల సమస్యలు, మోసపూరిత కేసులపై తమ అభిప్రాయాలను తెలియజేయనున్నారు. కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ సారథ్యంలోని ఆర్థిక శాఖ స్థాయీ సంఘం దేశ బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై అధ్యయనం చేస్తోంది. ఈ కమిటీ ముందు ఐడీబీఐ బ్యాంకు, యూకో బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, దేనా బ్యాంకు, ఓరియెంటల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యునైటెడ్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు అధినేతలు మంగళవారం హాజరై తమ ప్రతిపాదనలు సమర్పించడంతోపాటు, కమిటీ సభ్యులు అడిగే ప్రశ్నలకు బదులు ఇవ్వనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఇదే కమిటీ ముందు ఈనెల మొదట్లో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్పటేల్ హాజరై పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. బ్యాంకింగ్ రంగంలో నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ) రూ.8.99 లక్షల కోట్లకు పెరిగిపోయిన విషయం తెలిసిందే. వీటిలో ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్పీఏలే రూ.7.77 లక్షల కోట్లు కావడం గమనార్హం. మరోపక్క మోసపూరిత కేసు లూ పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే అంశం. -
డోక్లాం పర్యటనకు రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: దేశంలోని పలు సరిహద్దు ప్రాంతాల పర్యటనకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని స్టాండింగ్ కమిటి సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో వచ్చే నెలలో పర్యటించనుంది. 31 మంది సభ్యుల గల కమిటి ఈ పర్యటనకు వెళ్లనుందని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సహా,పలువురు సీనియర్ నేతలు దీనిలో పాల్గొననున్నారు. వివాదస్పద డోక్లాం ప్రాంతంలో కూడా పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు. డోక్లాం వివాదంతో భారత్-చైనా మధ్య గత కొంతకాలం యుద్ద వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. డోక్లాం ప్రాంతంలో భారత్- చైనా సైనిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వివాదానికి కారణం ఏంటి అనే అంశాలను ఈ కమిటి పరిశీలించనుందని విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు. ఏరియల్ వ్యూ కోసం ప్రత్యేక చాపర్‌ను ఉపయోగించనున్నారు. డోక్లాం ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న రోడ్డుకు భారత్ అభ్యంతరం తెలుపుతున్న విషయం తెలిసిందే. డోక్లాం వద్ద చైనా-భూటాన్ మధ్యకూడా సరిహద్దు వివాదం ఉంది. డోక్లాం విషయంలో భూటాన్ మొదటి నుంచి భారత్‌కు అనుకూలంగానే ఉంది. గతంలో డోక్లాం వివాదంపై భారత విదేశాంగ అధికారులను రాహుల్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. డోక్లాం వద్ద చైనా సృష్టిస్తున్న వివాదంపై చైనా అధికారులతో రాహుల్ గతంలో చర్చించారు. -
నల్లధనంపై మూడు రిపోర్టులు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోనూ, విదేశాల్లోనూ దాగున్న నల్లధనం వివరాలు బహిర్గతం కానున్నాయి. నల్లధనానికి చెందిన మూడు అధ్యయన రిపోర్టులను ఆర్థికమంత్రిత్వ శాఖ, పార్లమెంట్ ప్యానల్‌కు పంపించింది. మూడేళ్ల తర్వాత ఈ రిపోర్టులను ప్రభుత్వానికి సమర్పించినట్టు అధికారులు చెప్పారు. యూపీఏ హయాంలోనే ఢిల్లీకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ ఫరిదాబాద్‌లు ఈ అధ్యయనాన్ని చేపట్టాయి. ఈ మూడు సంస్థలు ప్రస్తుతం ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీకి తమ రిపోర్టులు అందించాయని అధికారులు తెలిపారు. ఒక్కసారి కమిటీ కూడా వీటిని క్లియర్‌చేసిన అనంతరం, ఇవి పార్లమెంట్ ముందుకు రానున్నాయి. ప్రస్తుతం భారత్‌లో, విదేశాల్లో ఎంత నల్లధనం ఉందో అధికారికంగా వెల్లడించలేదు. కానీ అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్సియల్ ఇంటిగ్రిటీ అధ్యయనం ప్రకారం 2005-14 కాలంలో 770 బిలియన్ డాలర్ల నల్లధనం భారత్‌లోకి ప్రవేశించిందని పేర్కొంది. -
మరోసారి ఉర్జిత్ పటేల్‌కు నోటీసులు?
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు మరోసారి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 20 న కమిటీ ముందు హాజరు కావాల్సిందిగా కోరింది. డీమానిటైజేషన్ కాలంలో(50 రోజులు) ఎన్ని పాత కరెన్సీ నోట్లు వెనక్కి వచ్చాయి, రీమానిటైజేషన్ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది తదితర అంశాలపై కాంగ్రెస్ నాయకుడు వీరప్ప మొయిలీ సారథ్యంలోని పార్లమెంటరీ ప్యానెల్ ఉర్జిత్‌ను ప్రశ్నించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు ఆర్థికవ్యవహారాల కార్యదర్శి శక్తి కాంత్ దాస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యదర్శి అంజులే చిబ్ దుగ్గల్ ని కూడా కమిటీ ముందు హాజరు కావాలని కమిటీ కోరింది. జనవరి 18 న సమావేశమైన కమిటీ ఏప్రిల్ 20 న తిరిగి సమావేశమయ్యేందుకు నిర్ణయించింది. ఈమేరకు ఆర్బీఐకి, ఆర్థిక అధికారులకు నోటీసులు జారీ చేసింది. కమిటీ తన తుది నివేదికను రూపొందించే క్రమంలో ఓరల్ ఎవిడెన్స్ నిమిత్తం జరగనున్న చివరి సమావేశం కావచ్చని భావిస్తున్నారు. అలాగే ఏప్రిల్ 20 సమావేశానికి ఉర్జిత్ పటేల్ హాజరుకాని పక్షంలో మరో సమావేశం నిర్వహించాల్సి వస్తుందనే సూచన కూడా ఇచ్చనట్టు తెలుస్తోంది. 31మంది సభ్యుల స్టాండింగ్ కమిటీలో బీజేపీ నుంచి నిషికాంత్ దూబే, బిజెపి కిరిత్ సోమయ్య, నరేష్ అగర్వాల్(ఎస్పీ) దినేష్ త్రివేది(టీఎంసీ) సతీష్ చంద్ర మిశ్రా (బీఎస్పీ) తదితరులు ఉన్నారు. అయితే గత సమావేశంలో నగదు విత్‌డ్రాపై పరిమితి, ఎత్తివేతపై కాంగ్రెస్ ఎంపి దిగ్విజయ్ సింగ్ పలు ప్రశ్నలు సంధించిన సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను ఆదుకున్నారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పద్దని పటేల్‌కు సలహా ఇచ్చారట.. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఉర్జిత్ పటేల్‌ను ప్రశ్నించి ఒత్తిడికి గురిచేసింది. మన్మోహన్ సింగ్ మధ్యలో కల్పించుకుని ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పవద్దని ఉర్జిత్‌కు సలహా ఇచ్చారని సమాచారం. నగదు పరిస్థితి ఎప్పుడు సాధారణ పరిస్థితికి వస్తుందనే దానిపై ఉర్జిత్ పటేల్ సమాధానం ఇవ్వలేదు. రూ.500, రూ.1000 పాత నోట్లను రద్దు చేసే విషయంలో ప్రభుత్వం నుంచి సలహాను నవంబర్ 7న అందుకున్నామని, మరునాటి దీనికిఆర్బీఐ సమ్మతించిందని లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించింది. దీనికి కొన్ని గంటల తరువాత ప్రధాని టీవీలో ఈ షాకింగ్ ప్రకటన చేసినట్టు వివరణ ఇచ్చింది. అలాగే 86 శాతం చలామణిలోఉన్న పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎంత నగదు బ్యాంకులకు జమ అయిందో స్పష్టంగా చెప్పలేకపోయారు. రద్దైన మొత్తం పెద్దనోట్ల విలువ రూ.15.44 లక్షల కోట్లు కాగా, రూ.9.2లక్షల కోట్ల కొత్త నోట్లు చలామణిలోకి వచ్చాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నోట్ల రద్దు: ఆర్బీఐ కీలక నివేదిక!
-
నోట్ల రద్దు: ఆర్బీఐ కీలక నివేదిక!
న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్ల రద్దుపై నిర్ణయం ఒక్కరోజులో తీసుకున్నామని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. రూ.500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన మరుసటి రోజే రిజర్వు బ్యాంకు ఒకే చెప్పింది. వీరప్ప మొయిలీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీకి డిసెంబర్ 22న సమర్పించిన ఏడు పేజీల నివేదికలో ఆర్బీఐ ఈ విషయం పేర్కొంది. ‘పాత పెద్ద నోట్లు రద్దు చేయాలని 2016, నవంబర్ 7న ఆర్బీఐకి కేంద్ర ప్రభుత్వం సూచించింది. నకిలీ నోట్ల చెలామణిని అడ్డుకునేందుకు, తీవ్రవాదుల ఆర్థిక మూలాలను పెకలించేందుకు, నల్లధనం వెలికితీసేందుకు రూ. 500, వెయ్యి రూపాయల నోట్లను ఉపసంహరించుకోవాలని రిజర్వు బ్యాంకుకు కేంద్రం కోరింద’ని నివేదికలో తెలిపింది. నల్లధనం పెరగడానికి పెద్ద నోట్లు దోహదకారిగా ఉన్నాయని, బ్లాక్ మనీ లేకుండా చేస్తే దేశ ఆర్థికవ్యవస్థకు మేలు జరుగుతుందని కేంద్రం చెప్పినట్టు వెల్లడించింది. గత ఐదేళ్లలో నకిలీ రూ. 500, వెయ్యి రూపాయల చెలామణి పెరగడంతో తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వివరించింది. కేంద్రం సూచన చేసిన తర్వాత రోజు(నవంబర్ 8) సమావేశమైన ఆర్బీఐ సెంట్రల్ బోర్డు పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ఆమోదం తెలిపింది. అదేరోజు రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ పాత పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. నవంబర్ 8 అర్థరాత్రి తర్వాత పాత పెద్ద నోట్లు చెల్లవనీ చెబుతూ పరిమితులు, నియంత్రణలు విధించారు. 50 రోజుల తర్వాత పాత 500, వెయ్యి రూపాయల నోట్ల చెలామణిని పూర్తిగా రద్దు చేశారు. -
ఉర్జిత్ పటేల్ అంతా వివరిస్తారట!
-
ఉర్జిత్ పటేల్ అంతా వివరిస్తారట!
న్యూఢిల్లీ : పాత నోట్ల రద్దుపై ఆర్బీఐ మాటైనా మాట్లాడటం లేదని, దాని ప్రభావంపై కనీసం వివరణ ఇచ్చేందుకు కూడా గవర్నర్ ఉర్జిత్ పటేల్ ముందుకు రావడం లేదని పలు విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ.500, రూ.1000 నోట్ల రద్దుపై పార్లమెంటరీ కమిటీకి వివరణ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు ఉర్జిత్ పటేల్. డిసెంబర్ 22న పాత నోట్ల రద్దు, దాన్ని ప్రభావంపై పూసగుచ్చినట్లు పార్లమెంటరీ కమిటీ ఆన్ ఫైనాన్స్ ముందు వివరించనున్నారు. పార్లమెంట్ అనెక్స్ బిల్డింగ్‌లో గురువారం ఉదయం 11 గంటలకు ఉర్జిత్ పటేల్ బ్రీఫింగ్ ప్రారంభమవుతుందని పార్లమెంట్ వెబ్సైట్ పేర్కొంది. పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసినప్పటి నుంచి ప్రజలకు ఎన్నో వెసులుబాటులను ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే. సర్వీసు పన్నుల్లో రాయితీలు, డిజిటల్ పేమెంట్లు సులభతరం చేసేందుకు పలు ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ నగదుతో జరిగే లావాదేవీలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రజలకు నగదు కొరత తీర్చడానికి సిస్టమ్‌లోకి మళ్లీ కొత్త రూ.2000, రూ.500 నోట్లను, చిన్న డినామినేషన్ నోట్లను ఆర్బీఐ ప్రవేశపెడుతోంది. కానీ చిల్లర దొరకక ఓ వైపు, నగదు కొంతమంది చేతుల్లోకి వెళ్లి మరోవైపు సాధారణ ప్రజానీకం కష్టాలు ఎదుర్కొంటున్నారు. స్వల్పకాలంలో కష్టాలు ఎదుర్కొన్నా, పాత నోట్ల రద్దు దీర్ఘకాలంలో ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తుందని ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తోంది. ఆర్బీఐ వద్ద కూడా సరిపడ నగదు ఉందని ప్రజలు ఆందోళన చెందాల్సినవసరం లేదని పేర్కొంటోంది. ఈ విషయాలన్నింటిపై ఆర్బీఐ గవర్నర్ క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. -
గిరిజనులకు భూమి హక్కులు కల్పించాలి
న్యూఢిల్లీ: అడవుల్లో నివసించే గిరిజనులు, ఇతర జాతులవారికి భూమిపై హక్కు కల్పించేందుకు వీలుగా ప్రస్తుత చట్టాన్ని సవరించాలని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. గిరిజన వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ బుధవారం లోక్‌సభకు తమ 18వ నివేదికను సమర్పించింది. తమ సిఫారసులను తీవ్రంగా పరిశీలించాలని కమిటీ ఆయా శాఖలను కోరింది. అడవుల్లో నివసించే గిరిజనులకు కనీస వసతులు, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కల్పించే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. ప్రస్తుత చట్టం ప్రకారం గిరిజనులకు అడవుల్లో భూములపై హక్కులకు సంబంధించి తగిన నిబంధనలు లేనందున తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే చట్టాన్ని సవరించాలని కమిటీ సిఫారసు చేసింది. -
వంద శాతం పెంపు సిఫార్సుపై పునఃసమీక్ష
న్యూఢిల్లీ: ఎంపీల జీతాలను, నియోజకవర్గ, ఆఫీసు అలవెన్సులను 100 శాతం పెంచాలన్న సిఫార్సులపై విమర్శలు చెలరేగడంతో ఎంపీల జీతాలు, అలవెన్సులపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ పునఃసమీక్షించనుంది. బీజేపీ ఎంపీ ఆదిత్యనాథ్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ నేడు సమావేశం కానుంది. కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించలేదని, ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. సోమవారం తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. చివరిసారిగా ఎంపీల జీతాలను 2010లో పెంచారు. ప్రస్తుతం ఒక్కో ఎంపీ రూ. 50 వేలు జీతంగా, రూ.45 వేలు నియోజకవర్గ అలవెన్సుగా.. రూ.45 వేలు ఆఫీసు అలవెన్సుగా మొత్తం నెలకు రూ.1.4 లక్షలు పొందుతున్నారు. దీనిని రూ. 2.8 లక్షలు చేయాలని కమిటీ ప్రభుత్వాన్ని కోరుతోంది. జీతాల పెంపునకు సంబంధించి పలువురు సభ్యులు సూచించిన డిమాండ్లపై పార్లమెంటరీ కమిటీ సానుకూలంగా ఉంది.