
న్యూఢిల్లీ: సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) చైర్‌పర్సన్ హోదాలో ఉంటూ గౌతమ్ అదానీ గ్రూప్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధవీ పురీ బచ్ గురువారం పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) సమావేశానికి గైర్హాజరయ్యారు.
సెబీ పనితీరును మాధవీ పురి మసకబార్చారంటూ అమెరికాకు చెందిన షార్ట్‌సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గతంలో ఆరోపణలు చేయడంతో సెబీ పనితీరును ఆమె సమక్షంలోనే సమీక్షించేందుకు పీఏసీ సిద్ధమైన విషయంతెల్సిందే.
ఈ క్రమంలో గురువారం ఢిల్లీలో పీఏసీ చైర్మన్, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన సమావేశం ఉదయం 11 గంటల ప్రాంతంలో మొదలైంది. అయితే చివరి నిమిషంలో అత్యవసర పనుల కారణంగా తాను ఢిల్లీలో సమావే శానికి రాలేకపోతున్నానని రెండు గంటలముందు మాధవీ సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె లేకుండా సమీక్ష అనవసరమని భావించి వేణుగోపాల్ సమావేశాన్ని మధ్యాహా్ననికి వాయిదావేశారు.
Comments
Please login to add a commentAdd a comment