skip meeting
-
ప్రజాపద్దుల కమిటీ భేటీకి మాధవీ పురి డుమ్మా
న్యూఢిల్లీ: సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) చైర్పర్సన్ హోదాలో ఉంటూ గౌతమ్ అదానీ గ్రూప్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధవీ పురీ బచ్ గురువారం పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) సమావేశానికి గైర్హాజరయ్యారు. సెబీ పనితీరును మాధవీ పురి మసకబార్చారంటూ అమెరికాకు చెందిన షార్ట్‌సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గతంలో ఆరోపణలు చేయడంతో సెబీ పనితీరును ఆమె సమక్షంలోనే సమీక్షించేందుకు పీఏసీ సిద్ధమైన విషయంతెల్సిందే. ఈ క్రమంలో గురువారం ఢిల్లీలో పీఏసీ చైర్మన్, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన సమావేశం ఉదయం 11 గంటల ప్రాంతంలో మొదలైంది. అయితే చివరి నిమిషంలో అత్యవసర పనుల కారణంగా తాను ఢిల్లీలో సమావే శానికి రాలేకపోతున్నానని రెండు గంటలముందు మాధవీ సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె లేకుండా సమీక్ష అనవసరమని భావించి వేణుగోపాల్ సమావేశాన్ని మధ్యాహా్ననికి వాయిదావేశారు. -
G20 summit: చైనా డుమ్మా ఖాయమైనట్లే!
భారత్ ఈ ఏడాదికి అధ్యక్షత వహిస్తూ.. ఆతిథ్యం ఇవ్వబోతున్న జీ20 సదస్సుకు చైనా డుమ్మా కొట్టడం దాదాపుగా ఖాయమైనట్లేనని సంకేతాలు అందుతున్నాయి. ఈ మేరకు ఆదివారం ఇటానగర్(అరుణాచల్ ప్రదేశ్)లో జరిగిన జీ20 సన్నాహాక సమావేశాలకు చైనా దూరంగా ఉండిపోయింది. జీ 20 సదస్సులో భాగంగా.. దేశంలోని యాభై ప్రధాన నగరాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా.. రీసెర్చ్ ఇన్నోవేషన్ ఇన్షియేటివ్, గ్యాదరింగ్ థీమ్‌తో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఆదివారం ఇటానగర్‌లో ఈ సమావేశాన్ని నిర్వహించింది. అత్యంత గోప్యంగా భావించే ఈ సమావేశానికి.. మీడియా కవరేజ్‌ను అనుమతించలేదు. కాకపోతే ప్రతినిధుల బృందం అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీని, ఇటానగర్‌లో ఉన్న బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా కొందరు ఫొటోలు తీశారు. తద్వారా చైనా నుంచి ప్రతినిధులెవరూ హాజరు కాలేదన్న విషయం బయటకు వచ్చింది. దీంతో.. సెప్టెంబర్‌లో ఢిల్లీ వేదికగా జరగబోయే జీ-20 సదస్సుకు చైనా హాజరు కావడంపై అనుమానాలు కలుగుతున్నాయి. నిరసనల్లో భాగంగానే చైనా ఇలా సమావేశానికి దూరంగా ఉండిపోయిందా? లేదంటే మరేయితర కారణం ఉందా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ పరిణామంపై విదేశాంగ శాఖగానీ, చైనా గానీ స్పందించలేదు కూడా. ఇదిలా ఉంటే.. అరుణాచల్ ప్రదేశ్‌ను టిబెట్‌లో అంతర్భాగమంటూ చైనా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ మాత్రం చైనా వాదనను తోసిపుచ్చి.. అది తమ దేశంలోని అంతర్భాగమేనని స్పష్టం చేస్తోంది. మరోవైపు వాస్తవ నియంత్రణ రేఖ వెంట ఇరు దేశాల మధ్య ఆమధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కూడా. ఇదీ చదవండి: అమెరికాలోని గురుద్వార్‌లో కాల్పులు -
అంత భయమెందుకు?
-
మళ్లీ షాకిచ్చిన నితీష్.. లాలూ కేసుపై సైలెన్స్
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ మిత్రపక్షాలకు షాకులమీద షాకులిస్తున్నారు. మొన్నటికి మొన్న రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఝలక్ ఇచ్చిన ఆయన ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో కూడా అలాగే చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో నిలబెట్టే అభ్యర్థిపై నిర్ణయం తీసుకునేందుకు ఎన్డీయేతర పక్షాలన్నీ కూడా మంగళవారం భేటీ అవ్వాలని నిర్ణయించుకోగా ఆ సమావేశానికి తాను హాజరుకావడం లేదంటూ నితీష్ చెప్పారు. దీంతో మరోసారి అసలు నితీష్ మనసులో ఏముందని, ఆయన ఇక మిత్రపక్షాలకు పూర్తిగా దూరమైనట్లేనా అని చర్చలు మొదలయ్యాయి. గతంలో కూడా రాష్ట్రపతి అభ్యర్థిపై ఏర్పాటుచేసిన సమావేశానికి నితీష్ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేతలంతా నితీష్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఆయన్ను ఏ ఒక్కరూ తిట్టొద్దని ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో తమకే మద్దతు ఇస్తున్నారని రాహుల్ సొంత పార్టీ నేతలకు చెప్పారు. అయితే, తాజాగా మాత్రం ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే సమావేశానికి తాను హాజరుకాబోనంటూ నితీష్ నిర్ణయం తీసుకోవడంతో ఇక ఆ ఎన్నికలపై కూడా ఆయన ఎన్డీయేకే జై అంటారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే, ప్రస్తుతం నితీష్‌కు వైరల్ ఫీవర్ ఉందని, ఆ కారణంగానే ఆ సమావేశానికి హాజరుకావడం లేదని ఆయన కార్యాలయం చెబుతున్నా అసలు ఉద్దేశం మాత్రం వేరే ఉందంటూ చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా, లాలూ ఇంటిపై సీబీఐ దాడుల విషయంలో స్పందించేందుకు కూడా నితీష్ నిరాకరించడం గమనార్హం.