పాత నోట్ల రద్దుపై ఆర్బీఐ మాటైనా మాట్లాడటం లేదని, దాని ప్రభావంపై కనీసం వివరణ ఇచ్చేందుకు కూడా గవర్నర్ ఉర్జిత్ పటేల్ ముందుకు రావడం లేదని పలు విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ.500, రూ.1000 నోట్ల రద్దుపై పార్లమెంటరీ కమిటీకి వివరణ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు ఉర్జిత్ పటేల్. డిసెంబర్ 22న పాత నోట్ల రద్దు, దాన్ని ప్రభావంపై పూసగుచ్చినట్లు పార్లమెంటరీ కమిటీ ఆన్ ఫైనాన్స్ ముందు వివరించనున్నారు. పార్లమెంట్ అనెక్స్ బిల్డింగ్లో గురువారం ఉదయం 11 గంటలకు ఉర్జిత్ పటేల్ బ్రీఫింగ్ ప్రారంభమవుతుందని పార్లమెంట్ వెబ్సైట్ పేర్కొంది.