పాత పెద్ద నోట్ల రద్దుపై నిర్ణయం ఒక్కరోజులో తీసుకున్నామని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. రూ.500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన మరుసటి రోజే రిజర్వు బ్యాంకు ఒకే చెప్పింది. వీరప్ప మొయిలీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీకి డిసెంబర్ 22న సమర్పించిన ఏడు పేజీల నివేదికలో ఆర్బీఐ ఈ విషయం పేర్కొంది.