
న్యూఢిల్లీ: కోత మెషిన్ల(పవర్ టిల్లర్స్)ను కంపెనీలు ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా విక్రయిస్తున్నాయని, దీనిపై కేంద్రం తగు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసింది. దేశంలోని సన్న, చిన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకొని మెషిన్ల ధరలు తగ్గించాల్సిన అవసరముందంది. ఇటీవల ముగిసిన వర్షకాల సమావేశాల్లో కమిటీ తన నివేదికను పార్లమెంటు సమర్పించింది. ధరల విషయంలో కంపెనీలు కమ్మక్కైనట్లు అను మానం వస్తే కేసును కాంపిటీషన్ కమిషన్‌కు సైతం రిఫర్ చేయాలని సిఫార్సు చేసింది.