mrp rates
-
డీఏపీ ధర పెంచవద్దు
న్యూఢిల్లీ: డీఏపీ తదితర యూరియాయేతర ఎరువుల గరిష్ట చిల్లర ధర(ఎమ్మార్పీ)ని పెంచవద్దని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఎరువుల కంపెనీలను ఆదేశించింది. వాటిని పాత రేట్లకే అమ్మాలని స్పష్టం చేసింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయంగా యూరీయాయేతర ఎరువుల రేట్లను పెంచడంపై కేంద్రం ఈ మేరకు ఎరువుల ఉత్పత్తి కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. డీఏపీ(డై అమ్మోనియం ఫాస్పేట్), మ్యూరియేట్ ఆఫ్ పొటాష్(ఎంఓపీ), ఎన్పీకే తదితర నాన్ యూరియా ఎరువుల రిటెయిల్ ధరల నిర్ధారణను ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఆయా ఫర్టిలైజర్ కంపెనీలే ఆ ధరలను నిర్ధారిస్తాయి. అయితే, ప్రభుత్వం ఏటా వాటికి నిర్ధారిత మొత్తంలో సబ్సీడీ ఇస్తుంది. ‘ప్రభుత్వం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, డీఏపీ, ఎంఓపీ, ఎన్పీకే ఎరువుల ధరలను పెంచవద్దని ఫర్టిలైజర్ కంపెనీలకు సూచించింది. గతంలో ఉన్న రేట్లకే వీటిని విక్రయించాలని స్పష్టం చేసింది. దానికి ఆ కంపెనీలు అంగీకరించాయి’ అని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. రైతులకు పాత ధరలకే ఆ ఎరువులు లభిస్తాయన్నారు. అంతర్జాతీయంగా ఎరువుల ముడి సరకుల ధర భారీగా పెరగడంతో ఇటీవల ఈ ఎరువుల ధరలను పెంచుతూ ఫర్టిలైజర్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఏప్రిల్ 1 నుంచి క్రిభ్కో, ఎంసీఎఫ్ఎల్, జువారీ అగ్రో కెమికల్స్, పారాదీప్ ఫాస్పేట్స్ సంస్థలు డీఏపీ చిల్లర ధరను బ్యాగ్‌కు రూ. 17 వందలకు పెంచాయి. 2021–22 ఆర్థిక సంవత్సరానికి పాస్ఫరస్, పొటాషియం ఎరువుల ధరలకు ఇచ్చే సబ్సీడీలో ఎలాంటి మార్పు ఉండబోదని కేంద్రం స్పష్టం చేసింది. గత సంవత్సరం నైట్రోజన్(ఎన్)కు కేజీకి రూ. 18.78 చొప్పున, ఫాస్పేట్(పీ)కు కేజీకి రూ. 14.88 చొప్పున, పొటాష్(కే)కు రూ. 10.11 చొప్పున, సల్ఫర్‌కు రూ. 2.37 చొప్పున సబ్సిడీని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇదే సబ్సిడీ ఈ ఆర్థిక సంవత్సరానికి కూడా కొనసాగనుంది. -
సినిమా చూపిస్త మావా!
రోజువారీ సాధక బాధకాల నుంచి సగటు జీవికి ఊరటనిచ్చే ‘సినిమా’ ప్రస్తుతం ప్రియంగా మారింది. ప్రేక్షకులకు కార్పొరేట్ మల్టీఫ్లెక్స్ థియేటర్లోకి వెళ్లక ముందే యాజమాన్యాలు సినిమా చూపిస్తున్నాయి. పెద్ద హీరో సినిమాకు టికెట్లతోపాటు కాంబో ప్యాక్, ఆర్డినరీ ప్యాక్ కొనుగోలు తప్పనిసరి చేస్తున్నాయి. అప్పటికే చేతిచమురు వదిలించుకున్నప్పటికీ ఇంటర్వెల్లో అసలు సినిమా మొదలవుతోంది. కేవలం స్నాక్స్‌కే రూ.800 నుంచి రూ.1000 వెచ్చించాల్సి వస్తోంది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు మామూళ్లతో సరిపెట్టుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షి, నెల్లూరు : పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే మాత్రం అభిమానుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. మల్టీఫ్లెక్స్ థియేటర్లలోనే అభిమాన హీరోల సినిమాల రిలీజ్ అవుతుండడంతో అక్కడికే వెళ్లి సినిమా చూడాల్సివస్తోంది. కేవలం పాప్ కార్న్, కూల్‌డ్రింక్ బాటిల్ చేతిలో పెట్టి రూ.600 వంతున వసూలు చేస్తున్నారు. థియేటర్లలో టికెట్ రూ.150 వంతున వసూలు చేస్తుండగా కాంబో పేరుతో స్నాక్స్ అంటూ మరో రూ.450 అదనంగా పెంచి టికెట్లు ఇస్తున్నారు. ఎవరు చెప్పినా.. నెల్లూరు నగరంలో 3 మల్టీఫ్లెక్స్ థియేటర్లు ఉన్నాయి. అందులో ఒక్క మల్లీఫ్లెక్స్లో సగటున 6 స్కీన్లు ఉన్నాయి. ప్రతిచోటా స్నాక్స్ పేరుతో అడ్డుగోలు దోపిడీ చేస్తున్నారు. థియేటర్ వెలుపల కొనుగోలు చేసిన ఏ తినుబండారమూ లోనికి అనుమతించడం లేదు. థియేటర్ క్యాంటీన్లోనే కొనుగోలు చేయాలి. ఆఫ్ లీటర్ వాటర్ బాటిల్ రూ.50, చిన్న పాప్‌కార్న్‌కు రూ.170, కోల్డ్ కాఫీ రూ.150, పిజ్జా, కోక్ రూ.200, స్వీట్స్ కేక్స్ రూ.80.. ఇలా 28 రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటీ రూ.100 నుంచి రూ.300 పైనే నిర్ణయించి విక్రయాలు చేస్తున్నారు. ప్రతి స్నాక్స్‌పై జీఎస్టీ బాదుడు అదనంగా వసూలు చేస్తున్నారు. పార్కింగ్ పేరుతో దోపిడీ మల్టీఫ్లెక్స్‌లలో పార్కింగ్ పేరుతో దోపిడీ చేస్తున్నారు. పార్కింగ్ వసతి ఉన్న చోట్ల సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రుసుము వసూలు చేయకూడదు. అయినా నిర్వాహకులు యథేచ్ఛగా వాహనదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. మాల్స్‌లో ద్విచక్రవాహనానికి రూ.20, కారు అయితే రూ.40 వంతున నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తూ పక్కా దోపిడీకి పాల్పడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. న్యాయస్థానం తీర్పుతోనైనా.. మల్టీఫ్లెక్స్ థియేటర్ల దోపిడీపై గతంలో వినియోగదారుల న్యాయస్థానం మొట్టికాయ వేసింది. వినోదం కోసం వెళ్లి వినియోగదారుడు జేబుకు చిల్లు పెట్టుకోవాల్సిరావడంపై న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. మల్టీఫ్లెక్స్ థియేటర్లో దోపిడీపై ఫోరానికి వెళ్లిన బాధితుడికి నష్టపరిహారం చెల్లించేలా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఇచ్చి ఏడాది కావస్తున్నా అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. ఇకనైనా తూనికలు, కొలతల శాఖ అధికారులు న్యాయస్థానం తీర్పును అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయ ఒత్తిళ్లు.. నెలవారీ మామూళ్లు మల్టీఫ్లెక్స్ థియేటర్లలో దోపిడీపై తెలంగాణ రాష్ట్రంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు కన్నెర్ర చేశారు. అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. ప్రతి థియేటర్ వద్ద స్నాక్స్ ఎమ్మార్పీ ధరల పట్టిక తెలుగులో రాసిన బోర్డు పెట్టాలని, నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం మల్టీఫ్లెక్స్ థియేటర్లలోకి అధికారులు వెళ్లే సాహసం చేయడం లేదు. రాజకీయ ఒత్తిళ్లు, నెలవారీ మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు దోపిడీకి గురవుతున్న వినియోగదారుడికి న్యాయం చేయలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఎయిర్‌పోర్టుల్లో ఎమ్మార్పీకే టీ, స్నాక్స్!
న్యూఢిల్లీ: ప్రభుత్వాధీనంలోని 90కి పైగా విమానాశ్రయాల్లో కొన్ని రకాల తినుబండారాలు, పానీయాలు ఇకపై సరసమైన ధరలకే లభించనున్నట్లు భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) శనివారం ప్రకటించింది. ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్న ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మహానగరాల్లోని విమానాశ్రయాలకు ఇది వర్తించదు. పలు వస్తువులను గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)కే అమ్మేందుకు ఎయిర్‌పోర్టుల్లోని వ్యాపారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసుకుంటారని ఏఏఐ అధికారి ఒకరు చెప్పారు. టీ, కాఫీ వంటి వాటినీ అత్యధిక ధరలకు అమ్ముతున్నారంటూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులొస్తున్నాయి. మధ్య తరగతి వారు కూడా విమాన ప్రయాణాలు చేస్తున్న అంశాన్ని పరిగణనలోని తీసుకుని పలు వస్తువులను ఎమ్మార్పీకే అమ్మేందుకు నిర్ణయించామని ఏఏఐ అధికారి చెప్పారు. -
కోత మెషిన్ల ధరలపై చర్యలు చేపట్టండి
న్యూఢిల్లీ: కోత మెషిన్ల(పవర్ టిల్లర్స్)ను కంపెనీలు ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా విక్రయిస్తున్నాయని, దీనిపై కేంద్రం తగు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసింది. దేశంలోని సన్న, చిన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకొని మెషిన్ల ధరలు తగ్గించాల్సిన అవసరముందంది. ఇటీవల ముగిసిన వర్షకాల సమావేశాల్లో కమిటీ తన నివేదికను పార్లమెంటు సమర్పించింది. ధరల విషయంలో కంపెనీలు కమ్మక్కైనట్లు అను మానం వస్తే కేసును కాంపిటీషన్ కమిషన్‌కు సైతం రిఫర్ చేయాలని సిఫార్సు చేసింది. -
మల్టీ దోపిడీకి కళ్లెం ఎప్పుడు?
గుంటూరు ఈస్ట్: తెలంగాణ ప్రభుత్వం లక్షలాదిమంది ప్రేక్షకుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ సినిమా థియేటర్లలో మల్టీప్లెక్స్ దోపిడీకి చెక్ పెట్టింది. కాని ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయం పట్టించుకోవడం లేదు. అయితే విజయవాడలో కొందరు ప్రేక్షకులే వినియోగదారుల ఫోరంలో కేసువేసి అధిక ధరలపై విజయం సాధించడం గమనార్హం. రాజధాని నగరమైన గుంటూరులో కూడా ఎవరో ఒకరు చొరవ తీసుకుని ఫోరంలో కేసు వేస్తే తప్ప మల్టీ దోపిడీకి తెరపడేలా లేదు. మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమా టిక్కెట్ ధరను మించి తినుబండారాల ధరలు నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తూ, ప్రేక్షకుల నడ్డి విరుస్తున్నారు. దీనికి తోడు ప్రధాన ద్వారం వద్దే తనిఖీలు చేసి మంచినీళ్ల బాటిళ్లు, తినుబండారాలు, చివరకు వక్కపొడి ప్యాకెట్లు కూడా లాక్కుంటున్నారు. చివరకు చేతిలో బ్యాగుకు పది రూపాయలు వసూలు చేయడమే కాక, హెల్మెట్లను లోపలకు అనుమతించడం లేదు. ఇదేమని అడిగితే దురుసుగా సమాధానం చెబుతున్నారు. మల్టీప్లెక్స్ థియేటర్ల క్యాంటీన్లో పిజ్జా 150 నుంచి 200 రూపాయలు, కూల్‌డ్రింక్స్, పాప్‌కార్న్ రూ.90 నుంచి రూ.100 రూపాయలకు విక్రయిస్తున్నారు. బయట 10 రూపాయలు ఉండే సమోసా ఇక్కడ 40 రూపాయలు, కూల్‌డ్రింక్ 60 నుంచి 70 రూపాయలు పెట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. వాటర్‌బాటిల్స్‌ను వారిష్టం వచ్చిన ధరకు విక్రయిస్తున్నారు.వాస్తవానికి ఎమ్మార్పీ ధర కంటే అదనంగా వసూలు చేయడం తూనికల కొలతల శాఖ ప్యాకేజ్డ్ కమోడిటీస్ నిబంధనలకు విరుద్ధం. చిన్నపిల్లలని కూడా చూడకుండా... చిన్న పిల్లలతో, అనారోగ్యంతో ఉన్న ప్రేక్షకులను సైతం వదలకుండా వాటర్ బాటిళ్లు, తినుబండారాలు లాక్కోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కృత్తికా శుక్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన కాలంలో సినిమాహాళ్లలోకి తినుబండారాలు అనుమతించాలని ఆదేశించారు. అనుమతించకపోతే తనకు ఫోన్ చేయాలని కోరారు. సినిమా హాళ్ల యజమానులు ఈ ఆదేశాన్ని బేఖాతరు చేస్తున్నారు. హైదరాబాద్, తమిళనాడులనుఎందుకు ఆదర్శంగా తీసుకోరు? హైదరాబాద్‌లో సెప్టెంబర్ 1 నుంచి మల్టీప్లెక్స్, సినిమా థియేటర్లలో విక్రయించే తినుబండారాలన్నీ ఎమ్మార్పీ ధరలకు విక్రయించేలా కఠినమైన చర్యలు చేపట్టారు. హైదరాబాద్ మల్టీప్లెక్స్ థియేటర్లలో ఇప్పటికే వాహనాల పార్కింగ్‌కు ఫీజు వసూలు చేయడం లేదు. తమిళనాడులోనూ ఇదే తరహాలో ప్రభుత్వం కఠినచర్యలు అమలు చేయడం ప్రారంభించింది. ప్రతిదానికి హైదరాబాద్‌తో పోల్చి అంతకంటే గొప్పగా పాలన చేస్తామని చెప్పే ముఖ్యమంత్రి మల్టీప్లెక్స్ దోపిడీ గురించి పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధరలు సామాన్యులకుఅందుబాటులో ఉండాలి థియేటర్లలో సామాన్యులు సైతం కొనుగోలు చేసేలా ఆహార పదార్ధాలు విక్రయించాలని థియేటర్ యజమానులకు సూచించాం. గ్రీన్ చానల్లో శీతల పానీయాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వాటిని బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలకే విక్రయించాలని సూచించాం. పార్కింగ్ రుసుం నామమాత్రంగా విధించాలని చెప్పాం. మల్టీప్లెక్స్ థియేటర్లలో పార్కింగ్ రుసుం వసూలు చేయకూడదన్న ఉత్తర్వులు మాకు ప్రభుత్వం నుంచి అందలేదు.– జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ.ఎం.డి.ఇంతియాజ్ -
హైదరాబాద్ షాపింగ్ మాల్స్‌లో తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు షాపింగ్ మాల్స్, థియేటర్లపై తూనికలు కొలతల శాఖ అధికారులు ఆదివారం మధ్యాహ్నం అకష్మిక తనిఖీలు నిర్వహించారు. బ్రాండెడ్ వస్తువుల పేరుతో నకిలీ, నాణ్యతలేని వస్తువులను అమ్మకాలు చేస్తున్నారని అధికారులు తెలిపారు. కూల్ డ్రింక్ రూ.250. శాండ్విచ్ రూ.300, వాటర్ బాటిల్ రూ.80 విక్రయిస్తున్నారని వెల్లడించారు. జీవీకే మాల్, ప్రసాద్ ఐమ్యాక్స్, పీవీఆర్ సెంట్రల్, ఇన్ఆర్బిట్ మాల్, పీవీఆర్ కాంప్లెక్స్, మీరజ్ షాపింగ్ మాల్స్, లియెనియో కార్నివాల్, ఏషియన్ మాల్స్‌లలో తనిఖీలు జరిగాయి. కూకట్పల్లి ఏషియన్ జీవీఆర్, కొత్త పెట్ మీరాజ్ థియేటర్ పలు మాల్స్‌పై అధికారులు కేసు నమోదు చేశారు. -
ఇక ఎంఆర్పీతో పనిలేదు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : మంత్రిగారి జిల్లాలో ఎక్సైజ్ శాఖ అధికారులు రెచ్చిపోతున్నారు. తాము అడిగినంత ఇస్తే ఎంఆర్పీ ధరలకు అమ్మాల్సిన పనిలేదని పెంచి అమ్మకాలు చేసుకోవచ్చని అనధికారిక ఆదేశాలు జారీ చేశారు. మామూళ్లు ఇచ్చినందుకు నజరానాగా బుధవారం నుంచి చీప్‌లిక్కర్ క్వార్టర్ బాటిల్‌కు పది రూపాయలు, మిగిలిన బ్రాండ్లకు ఐదు రూపాయలు అదనంగా పెంచుకోవచ్చని అంగీకారం తెలిపారు. ఈ మేరకు ఈ పెంపుదల జిల్లా వ్యాప్తంగా అమలులోకి రానుంది. ఏలూరు, చింతలపూడి, జంగారెడ్డిగూడెంలో షాపుకు పది వేల రూపాయల చొప్పున ఆగస్టు నుంచి వసూలు చేస్తున్నారు. ఈ నెల నుంచి మొత్తాన్ని రూ. 15 వేలకు పెంచారు. జిల్లాలో 474 వైన్‌షాపులు, 17 బార్లు ఉన్నాయి. వీటి నుంచి ఇకపై ప్రతి నెలా ఈ మొత్తాన్ని వసూలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఏప్రిల్‌లో మద్యం షాపులు కేటాయించినప్పుడు రెన్యువల్ మామూలు పేరుతో గ్రామీణ ప్రాంతాల షాపుల నుంచి 50 వేల రూపాయలు వసూలు చేశారు. ఇప్పుడు పట్టణాలలో ఉన్న షాపుల వారు రెన్యువల్ మామూలు చెల్లించాలని ఎక్సైజ్ శాఖ నుంచి ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. బార్ల నుంచి ఏకంగా లక్ష రూపాయల చొప్పున ఇండెంట్ వేసినట్లు తెలిసింది. బెల్ట్‌షాపులు ఉన్నా చూసీచూడనట్లు వ్యవహరించడానికి, ఎంఆర్పీ ధరలకు అమ్మకపోయినా పట్టించుకోకుండా ఉండటానికి ఈ మామూళ్లు నిర్ణయించారు. రెన్యువల్ పేరుతో వసూలు చేసే మొత్తం రెండున్నర కోట్ల రూపాయల వరకూ ఉండగా, ప్రతి నెలా మామూళ్ల పేరుతో రూ. 70 లక్షలకు పైగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాలలో వైన్‌షాపులు నడవాలంటే బెల్ట్‌షాపులు ఉండటం తప్పనిసరి. లేకపోతే వారికి గిట్టుబాటు కాదు. దీన్ని అడ్డం పెట్టుకుని ఎక్సైజ్ అధికారులు మామూళ్ల దందాకు శ్రీకారం చుట్టారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బెల్ట్‌షాపుల నియంత్రణ పేరుతో హడావుడి చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎక్సైజ్ అధికారులు మొక్కుబడిగా కేసులు పెట్టారు. ప్రభుత్వ ఒత్తిడి కూడా ఆ శాఖ అధికారులకు కలిసి వచ్చింది. దీన్ని అడ్డం పెట్టుకుని షాపులపై ఇండెంట్లు పెంచేశారు. ఇకపై ప్రతిషాపు యజమాని రూ. 15 వేల రూపాయలు ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేసినట్లు సమాచారం. గతంలో ప్రతి షాపు నుంచి వసూలు చేసిన 10 వేల రూపాయలు సీఐ స్థాయి నుంచి డీసీ స్థాయి వరకే పంచుకుని, కింది సిబ్బందికి వాటా ఇవ్వకపోవడం ఆ శాఖలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో కిందిస్థాయి సిబ్బందికి కూడా ఇవ్వడం కోసం మరో ఐదు వేలు పెంచి రూ 15 వేలు చేసినట్లు సమాచారం. జిల్లాలో ఆ శాఖ ఉన్నతాధికారులు కూడా మూడేళ్ల నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు. బదిలీ కావాల్సి ఉన్నప్పటికీ సామాజిక వర్గ బలంతో కొందరు ఎమ్మెల్యేల మద్దతుతో వారు ఇక్కడే కొనసాగుతున్నారు. ఒక ఉన్నతాధికారి విదేశీ యాత్రకు వెళ్తూ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చి వెళ్లినట్లు సమాచారం. మంత్రిగారి సొంత జిల్లాలోనే ఈ దందా జరుగుతుంటే ఆయన ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. -
మంత్రి ఖాదర్‌కు షాక్ ఇచ్చిన అధిక ధరలు
బొమ్మనహళ్లి( బెల్గాం): స్వయానా రాష్ట్ర మంత్రికి అధిక ధరలు షాక్ ఇచ్చాయి. శీతాలకాల సమావేశాలు జరుగుతున్న బెల్గాం కన్నడ సౌధలోని ఫుడ్‌కోర్టులో బిస్కెట్ కోసం వెళ్లిన రాష్ట్ర ఆహర, పౌరసరఫరాల శాఖ మంత్రి యూ.టి. ఖాదర్ అక్కడి ధరలను పరిశీలించి ఖంగుతిన్నాడు. ఎంఆర్పీ కంటే అధికంగా వసూలు చేస్తుండటంపై మండిపడ్డారు. వెంటనే సదరు ఫుడ్‌కోర్టుపై చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
అలా అమ్మితే.. ఇక జైలుకే
మామూలు దుకాణాల్లో తప్ప బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, థియేటర్లు.. ఇలా ఎక్కడకు వెళ్లినా వాటర్ బాటిళ్ల దగ్గర నుంచి కూల్ డ్రింకుల వరకు ఏవీ ఎంఆర్పీ ధరకు అమ్మరు. దానికంటే ఎంతో కొంత ఎక్కువ ధర పెడితే తప్ప దాహం తీర్చుకోలేని పరిస్థితి ఉంటుంది. కానీ, ఇక ముందు ఇలా అమ్మితే భారీ జరిమానాతో పాటు జైలుకు కూడా పంపుతామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ తెలిపారు. ఎక్కడ చూసినా మంచినీళ్ల బాటిళ్లను గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్పి) కంటే 10-20 శాతం అధిక ధరలకు అమ్ముతున్నారని పాశ్వాన్ అన్నారు. అసలు కొన్ని బాటిళ్ల మీద అయితే దాని ధర ఎంతో కూడా ముద్రించడం లేదని మండిపడ్డారు. 47వ ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తూనికలు కొలతల చట్టంలోని సెక్షన్ 36 ప్రకారం.. ముందుగానే ప్యాక్ చేసిన వస్తువులో ప్రమాణాలు దాని మీద పేర్కొన్నట్లు లేకపోతే.. రూ. 25 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. రెండోసారి కూడా అలాంటి నేరం చేస్తే.. విధించే జరిమానాను ఇప్పుడు రూ. 50 వేలకు పెంచుతున్నారు. ఇంకా పదే పదే అలాగే చేస్తుంటే లక్ష రూపాయల వరకు జరిమానా, లేదా ఏడాది జైలుశిక్ష లేదా రెండూ కూడా విధిస్తారు. 2009 నుంచే ఈ చట్టం అమలులోకి వచ్చినా.. దాని గురించిన పరిజ్ఞానం పౌరులకు పెద్దగా లేదు. ఎంఆర్పి కూడా లేబుల్ మీద ముద్రించే ఉంటుంది కాబట్టి దాన్ని ఉల్లంఘించినా కూడా జైలుశిక్ష, జరిమానా విధిస్తారని పాశ్వాన్ ఈ సందర్భంగా చెప్పారు. వినియోగదారులు అవగాహన పెంచుకుని ఫిర్యాదులు చేయాలని, ఫిర్యాదు అన్నదే లేకపోతే చర్యలు ఎలా తీసుకుంటామని ఆయన అడిగారు. ఈ విషయంలో 2007లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన ప్రస్తావించారు. గత ఫిబ్రవరి నెలలో ఢిల్లీలోని ఒక మల్టీప్లెక్సులో నీళ్ల బాటిల్‌ను ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు అమ్మినందుకు జాతీయ వినియోగదారుల కమిషన్ రూ. 5 లక్షల జరిమానా విధించింది.