
సిబ్బందిపై మండిపడుతున్న మంత్రిఖాదర్
బొమ్మనహళ్లి( బెల్గాం): స్వయానా రాష్ట్ర మంత్రికి అధిక ధరలు షాక్ ఇచ్చాయి. శీతాలకాల సమావేశాలు జరుగుతున్న బెల్గాం కన్నడ సౌధలోని ఫుడ్‌కోర్టులో బిస్కెట్ కోసం వెళ్లిన రాష్ట్ర ఆహర, పౌరసరఫరాల శాఖ మంత్రి యూ.టి. ఖాదర్ అక్కడి ధరలను పరిశీలించి ఖంగుతిన్నాడు. ఎంఆర్‌పీ కంటే అధికంగా వసూలు చేస్తుండటంపై మండిపడ్డారు. వెంటనే సదరు ఫుడ్‌కోర్టుపై చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.