khadar
-
Karnataka: అసెంబ్లీ స్పీకర్‌గా ఖాదర్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా మలయాళీ కాంగ్రెస్ నేత యూటీ ఖాదర్ సోమవారం నామినేట్ అయ్యారు. ఆయన మంగళవారం ఉదయం ఈ పదవికి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్‌లు అధినేత ఖాదర్‌కు మద్దతుగా నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయనున్నారు. ఖాదర్ విధాన సభ ఎన్నికల్లో ఐదుసార్లు విజయం సాధించారు. ఖాదర్ నేపథ్యం.. ఆయన కేరళలోని కాసర్గోడ్లోని ఉప్పల ప్రాంతానికి చెందినవాడు. మూలాలు కాసర్గోడ్లో ఉన్నప్పటికీ పుట్టి పెరిగింది అంతా మంగళూరులోనే. ఖాదర్ గత కర్ణాటక అసెంబ్లీలో ఉప ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాదర్ దాదాపు 22, 790 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి సతీష్ కుంపలాపై విజయం సాధించారు. అంతేగాదు అంతకమునుపు సిద్ధరామయ్య ప్రభుత్వం హయాంలో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఆరోగ్యం, ఆహారం పౌర సరఫరాల మంత్రిగా కూడా పనిచేశారు. కాగా, ఖాదర్‌ను స్పీకర్‌గా ప్రతిపాదించడం బట్టి కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సంఘాల నాయకులకు అవకాశాలు కల్పించడంపై దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ముఖ్యమైన స్థానాల్లో తమ ప్రాతినిధ్యాన్ని కాపాడుకునేలా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. (చదవండి: 'ది కేరళ స్టోరీ' సినిమా చూసొచ్చి.. బాయ్‌ఫ్రెండ్‌పై కేసు పెట్టిన మహిళ) -
మంత్రి ఖాదర్‌కు షాక్ ఇచ్చిన అధిక ధరలు
బొమ్మనహళ్లి( బెల్గాం): స్వయానా రాష్ట్ర మంత్రికి అధిక ధరలు షాక్ ఇచ్చాయి. శీతాలకాల సమావేశాలు జరుగుతున్న బెల్గాం కన్నడ సౌధలోని ఫుడ్‌కోర్టులో బిస్కెట్ కోసం వెళ్లిన రాష్ట్ర ఆహర, పౌరసరఫరాల శాఖ మంత్రి యూ.టి. ఖాదర్ అక్కడి ధరలను పరిశీలించి ఖంగుతిన్నాడు. ఎంఆర్పీ కంటే అధికంగా వసూలు చేస్తుండటంపై మండిపడ్డారు. వెంటనే సదరు ఫుడ్‌కోర్టుపై చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
తాడిపత్రి టౌన్ : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. తాడిపత్రిలోని సీబీ రోడ్డులో లారీ ఢీకొని కావేటిసముద్రం గ్రామానికి చెందిన సోమశేఖర్‌రెడ్డి(45) అనే వ్యాపారి మృతిచచెందినట్లు పోలీసులు తెలిపారు. ఆయన బతుకుదెరువు కోసం స్వగ్రామం వదిలి కొన్నేళ్లుగా తాడిపత్రిలోని నంద్యాల రోడ్డులో వ్యాపారం చేసుకుంటున్నారు. నాటి మధ్యామ్నం వ్యాపార నిమిత్తం బైక్‌లో బయలుదేరగా ఎదురొచ్చిన లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వివరించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. కొడికొండ చెక్‌పోస్టు సమీపంలో మరొకరు.. చిలమత్తూరు (హిందూపురం) : చిలమత్తూరు మండలం కొడికొండ సమీపంలోని జువారి సీడ్స్ ఫ్యాక్టరీ సమీపంలో జరిగిన ప్రమాదంలో టాటా ఏస్ ఆటో డ్రైవర్ ఖాదర్(45) మరణించినట్లు ఎస్ఐ జమాల్‌బాషా తెలిపారు. మాంసం వ్యర్థాల లోడుతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఆటో మార్గమధ్యంలో జువారి సీడ్స్ వద్దకు రాగానే చెడిపోయిందన్నారు. దీంతో ఫ్యాక్టరీ సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని నిలబెట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఖాళీ సిలిండర్లతో బెంగళూరు వైపునకు బయలుదేరి వచ్చిన ఈచర్ వాహనం వెనుక వైపు నుంచి ఆటోను ఢీకొనడంతో ఖాదర్ తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. అతన్ని కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
గుండెపోటుతో అగ్రిగోల్డ్ బాధితుడు మృతి
హిందూపురం: అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన అగ్రిగోల్డ్ బాధితుడు షేక్ ఖాదర్ బాషా గుండెపోటుకు గురై మృతిచెందాడు. అగ్రిగోల్డ్‌లో పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయో లేవో అనే మనస్థాపంతో గత రెండు రోజులుగా ఖాదర్ బాధపడుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో శుక్రవారం ఖాదర్ గుండెపోటుకు గురై మృతిచెందాడు. కాగా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ ప్రతిపక్ష పార్టీ శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీసిన విషయం తెలిసిందే. అయితే ఆ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం... ఎదురుదాడికి దిగింది. ఈ నేపథ్యంలో సీఎం ప్రకటనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అగ్రిగోల్డ్ బాధితులకు తీవ్ర నిరాశే మిగిలింది. జరుగుతున్న పరిణామాలతో తీవ్ర మనస్తాపం చెందడం వల్లే గుండెపోటుతో ఖాదర్ మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. -
నకిలీనోట్ల కేసులో నాలుగేళ్ల జైలు
మదనపల్లి రూరల్ (చిత్తూరు): నకిలీ నోట్ల చెలమాణీ కేసులో ఇద్దరు వ్యక్తులకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి రూరల్ మండలంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మదనపల్లికి చెందిన విశ్వనాథ్, ఖాదర్‌లు నకలీ నోట్ల చెలామణీ కేసులో ఇటీవల అరెస్టు అయ్యారు. వీరిని దోషులుగా నిర్ధరించిన కోర్టు నిందితులకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. -
వాగులో మునిగి యువకుడి మృతి
మేళ్లచెరువు: నల్గొండ జిల్లా మేళ్లచెరువు వద్ద గల పులిచింతల వాగులో ఈతకు వెళ్లి ఒక యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాలు.. కృష్ణా జిల్లా చిల్లకల్లుకు చెందిన ఖాదర్ (30) అత్తగారి ఊరైన నల్గొండ జిల్లా మల్లారెడ్డిగూడెంకు వచ్చాడు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ముగ్గురు స్నేహితులతో కలిసి ఈతకొట్టేందుకు పులిచింతల వాగుకు వెళ్లారు. వాగులో ఈతకొడుతుండగా ప్రమాదవశాత్తూ ఖాదర్ నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. -
ఆహారం కోసం వ్యవసాయం...ఆరోగ్యం కోసం ఆహారం
రాయచూరు, న్యూస్‌లైన్ : ఆహారం కోసం వ్యవసాయం, ఆరోగ్యం కోసం ఆహారం.. ఈ సూత్రంతో ముందుకు వెళితే భూములు బీడుబారకుండా ఉంటాయని మైసూరుకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త, ప్రవసాంధ్ర ప్రముఖుడు డాక్టర్ ఖాదర్ అన్నారు. మంగళవారం స్థానిక కృషిక్ భారత్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. మానవులతో పాటు భూములకు ముప్పు వాటిల్లకుండా ఉండాలంటే అడవి వ్యవసాయం ఒక్కటే శరణ్యమన్నారు. అలాకాకుండా ఒకే పద్ధతిలో ఒకే పంట వేస్తూ పోతే భూమి నిస్సారమై పోతుందన్నారు. ఈ విషయంపై అవగాహనతో మైసూరు సమీపంలోని బిదరహళ్లిలో 8 ఎకరాల పొలంలో అటవీ వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తు లాభాలు గడిస్తున్నారన్నారు. అడవుల్లో ఉన్న సూక్ష్మక్రిములతో కూడిన సత్తువ గల మట్టిని తెచ్చి భూముల్లో కలిపి వ్యవసాయం చేసే విధానమే ఇదన్నారు. ఇక్కడి భూములు నిస్సారమైనందున అడవిలోని మట్టిని తెచ్చి సమపాళ్లలో భూమిపై చల్లితే సారవంతమవుతుందన్నారు. రసాయనిక ఎరువుల ప్రభావంతో గత పదేళ్ల నుంచి భూమి నిస్సారమైందన్నారు. వాతావరణంలో వైపరీత్యాలు చోటు చేసుకోవడంతో 30 శాతం ఉత్పత్తి తగ్గిపోతోందన్నారు. ఈ విషయంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రభుత్వ మేధావులు దూర దృష్టితో ఆలోచించడం లేదన్నారు. తాత్కాలిక లాభాల కోసం అల్పవ్యవధిలో దిగుబడి సాధనకు అనుసరిస్తున్న విధానాల వల్ల మున్ముందు ముప్పు తప్పదన్నారు. మొత్తం ప్రపంచంలో ఏడెనిమిది పంటలపై తప్ప ఇతరత్రా ఆసక్తి చూపడం లేదని చెప్పారు. ఇప్పటికైనా కనీసం 25 శాతం భూముల్లో అడవుల సాగుకు కృషి చేయాలన్నారు. పత్రిక సంపాదకులు మాట్లాడుతూ... ఖాదర్ తనకు కావాల్సిన పంటలన్నీ తానే పండించుకుంటూ లాభాల బాటలో నడుస్తున్నారన్నారు. కార్యక్రమంలో రామనగౌడ, బండెప్పగౌడ, రామకృష్ణప్ప పాల్గొన్నారు. -
అవయవ దానంపై అవరోధాలను తొలగిస్తాం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో అవయవ దానంపై చట్ట పరంగా ఉన్న అవరోధాలను తొలగిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి యూటీ. ఖాదర్ హామీ ఇచ్చారు. అవయవ దానంపై అవగాహన కల్పించడానికి ఇక్కడి యశవంతపురలోని కొలంబియా ఆసియా రెఫరల్ ఆస్పత్రిలో గురువారం ఏర్పాటు చేసిన చర్చా గోష్టిలో ఆయన ప్రసంగించారు. అవయవ దాతలు, వాటి కోసం ఎదురు చూస్తున్న వారి మధ్య ఎంతో అంతరం ఉందని చెప్పారు. మరణానికి ముందే అవయవ దానంపై అవగాహన కల్పిస్తే ప్రయోజనం ఉంటుందని, మరణానంతరం దీనిపై కుటుంబ సభ్యులను ఒప్పించడం అంత తేలిక కాదని అన్నారు. అవయవాలు ఎవరికి కావాలి.. దానం చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు లాంటి వాస్తవ సమాచారం చాలా అవసరమన్నారు. దీని కోసం ఓ సమాచార కేంద్రాన్ని ప్రారంభిస్తే బాగుంటుందని సూచించారు. ఈ విషయంలో స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రముఖ పాత్రను పోషించాల్సి ఉంటుందని సూచించారు. ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు వారంలో కనీసం రెండు గంటల పాటు ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలను అందించడం ద్వారా పేదలకు అండగా నిలవాలని ఆయన కోరారు. నటుడు శివ రాజ్ కుమార్ మాట్లాడుతూ తొలుత కళ్లు, తర్వాత తన దేహాన్నే దానం చేశానని తెలిపారు. ఈ విషయంలో అవసరమైన సహాయ సహకారాలను అందిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర న్యాయ కమిషన్ అధ్యక్షుడు వీఎస్. మళిమఠ్ మాట్లాడుతూ అవయవ దానంపై 1994లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని ఉపసంహరించుకోవాలని సూచించారు. కొత్త చట్టం ద్వారా అవయవ దానాన్ని సులభతరం చేయాలని సలహా ఇచ్చారు. కొలంబియా ఆసియా ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ నంద కుమార్ జైరాం ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లోని చట్టాలను రాష్ట్రంలోనూ తీసుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర అదనపు పోలీసు కమిషనర్ కమల్ పంత్ ప్రభృతులు పాల్గొన్నారు. -
ఏపీఎల్ కార్డుదార్లకూ ఆరోగ్య బీమా
= త్వరలో పథకం అమల్లోకి.. = ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు పంపాం = అనతి కాలంలోనే అనుమతి లభించవచ్చు = జీవన శైలి మార్పులతో కొత్త రోగాలు = ప్రభుత్వాస్పత్రుల్లో తక్కువ ఖర్చుతోనే మెరుగైన వైద్యం = ఆరోగ్యంపై చైతన్యం తీసుకొచ్చేలాకార్యక్రమాలు = ఆరోగ్య శాఖ మంత్రి ఖాదర్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ప్రస్తుతం బీపీఎల్ (దారిద్య్ర రేఖకు దిగువనున్న) కార్డుదార్లకు అమలు చేస్తున్న ఆరోగ్య బీమా పథకాన్ని త్వరలో ఏపీఎల్ కార్డుదార్లకు కూడా విస్తరిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి యూటీ. ఖాదర్ తెలిపారు. ఇక్కడి నిమ్హాన్స్ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన ‘క్లినికల్ కార్డియాలజిస్ట్ అప్డేట్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఏపీఎల్ కార్డుదార్లకు ఆరోగ్య బీమాను విస్తరించడానికి సంబంధించిన ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంపించామని వెల్లడించారు. త్వరలోనే దీనికి అనుమతి లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, కాలుష్యం వల్ల మధుమేహం, రక్తపోటు తదితర వ్యాధులతో ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవన శైలిలో వచ్చిన మార్పుల వల్ల అనేక కొత్త రోగాలు ప్రబలుతున్నాయని అన్నారు. పరిశోధకులు, వైద్యులు ఈ రోగాలను నయం చేసే ఔషధాలను కనుక్కొనే దిశగా చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. ప్రభుత్వాస్పత్రుల్లో తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తున్నామని చెబుతూ, ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆస్పత్రుల్లో అధునాతన సదుపాయాలను కల్పించామని, నిపుణులైన వైద్యులు కూడా అందుబాటులో ఉంటారని తెలిపారు. అయినప్పటికీ ఎక్కువ మంది ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తూ, అప్పుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత రూ.2 గుట్కాకు అలవాటు పడి ప్రాణాంతకమైన కేన్సర్ మహమ్మారి బారిన పడుతోందని వాపోయారు. వారిలో చైతన్యం తీసుకు వచ్చే కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. కాగా వైద్యులు స్వచ్ఛందంగా గ్రామీణ సేవకు సిద్ధం కావాలని ఉద్బోధించారు. ఒక అభ్యర్థి వైద్యుడు కావాలంటే ప్రభుత్వం రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతో వైద్య విద్యను అభ్యసించి, గ్రామాల్లో సేవలు చేయకపోతే ఎలాగని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో పాల్గొన్న నారాయణహృదయాలయ అధ్యక్షుడు డాక్టర్ దేవి శెట్టి మాట్లాడుతూ ‘డిప్లొమా ఇన్ కార్డియాలజీ’ కోర్సు వల్ల వైద్య రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. ప్రభుత్వం దీనిని గమనించి తాలూకా, జిల్లా ఆస్పత్రుల్లో కూడా వినియోగించుకోవాలని సూచించారు.