గుండెపోటుతో అగ్రిగోల్డ్ బాధితుడు మృతి
గుండెపోటుతో అగ్రిగోల్డ్ బాధితుడు మృతి
Published Fri, Mar 24 2017 12:55 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
హిందూపురం: అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన అగ్రిగోల్డ్ బాధితుడు షేక్ ఖాదర్ బాషా గుండెపోటుకు గురై మృతిచెందాడు. అగ్రిగోల్డ్‌లో పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయో లేవో అనే మనస్థాపంతో గత రెండు రోజులుగా ఖాదర్ బాధపడుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో శుక్రవారం ఖాదర్ గుండెపోటుకు గురై మృతిచెందాడు.
కాగా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ ప్రతిపక్ష పార్టీ శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీసిన విషయం తెలిసిందే. అయితే ఆ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం... ఎదురుదాడికి దిగింది. ఈ నేపథ్యంలో సీఎం ప్రకటనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అగ్రిగోల్డ్ బాధితులకు తీవ్ర నిరాశే మిగిలింది. జరుగుతున్న పరిణామాలతో తీవ్ర మనస్తాపం చెందడం వల్లే గుండెపోటుతో ఖాదర్ మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.
Advertisement
Advertisement