
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు షాపింగ్ మాల్స్, థియేటర్లపై తూనికలు కొలతల శాఖ అధికారులు ఆదివారం మధ్యాహ్నం అకష్మిక తనిఖీలు నిర్వహించారు. బ్రాండెడ్ వస్తువుల పేరుతో నకిలీ, నాణ్యతలేని వస్తువులను అమ్మకాలు చేస్తున్నారని అధికారులు తెలిపారు. కూల్ డ్రింక్ రూ.250. శాండ్‌విచ్ రూ.300, వాటర్ బాటిల్ రూ.80 విక్రయిస్తున్నారని వెల్లడించారు. జీవీకే మాల్, ప్రసాద్ ఐమ్యాక్స్, పీవీఆర్ సెంట్రల్, ఇన్‌ఆర్బిట్ మాల్, పీవీఆర్ కాంప్లెక్స్, మీరజ్ షాపింగ్ మాల్స్, లియెనియో కార్నివాల్, ఏషియన్ మాల్స్‌లలో తనిఖీలు జరిగాయి. కూకట్‌పల్లి ఏషియన్ జీవీఆర్, కొత్త పెట్ మీరాజ్ థియేటర్ పలు మాల్స్‌పై అధికారులు కేసు నమోదు చేశారు.