► రూ.900 కోట్లతో నిర్మాణం
► ఫోనిక్స్ మిల్స్ కంపెనీ ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: ఫోనిక్స్ మిల్స్ కంపెనీ , షాపింగ్ మాల్,హైదరాబాద్ నగరంలో భారీ షాపింగ్‌మాల్ నిర్మించేందుకు ముందు కువచ్చింది.ఈ కంపెనీ ప్రతినిధి బృందం సోమవారం పరిశ్రమ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్‌ఐఐసీ) చైర్మన్ గ్యాదరి బాల మల్లుతో భేటీ అయ్యింది.
కంపెనీ జాయింట్ మేనేజింగ్‌డైరెక్టర్ శిశిర్ శ్రీవాస్తవ, సౌత్ ఇండియా రిటైల్ విభాగం అధ్యక్షుడు శశికుమార్, డెవలప్‌మెంట్ డైరెక్టర్ రాఘవ్ బజోరియా, ఫైనాన్స్ వింగ్ ఉపాధ్యక్షుడు పవన్ కకుమాను ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో బహుళ అంతస్థుల నిర్మాణ రంగం లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. ముంబై, బెంగళూరు నగరాల్లో ఫోనిక్స్ మిల్స్ కంపెనీ తరఫున వ్యాపార బహుళఅంతస్తుల భవనాల ప్రాజెక్టులు నిర్మించామని తెలిపారు.
హైదరాబాద్‌లో 10 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే, రూ.800 కోట్ల నుంచి రూ.900 కోట్ల పెట్టుబడులతో అంతర్జాతీయ స్థాయిలో షాపింగ్ మాల్‌ను నిర్మిస్తామని పేర్కొన్నారు. దీనికి బాలమల్లు సానుకూలంగా స్పందిస్తూ.. మహానగరం లో ఐటీ, ఇతర వ్యాపారరంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నందున షాపింగ్ మాల్స్ నిర్మాణానికి మంచి డిమాండ్ ఉందన్నారు. ప్రభుత్వంతో చర్చించి షాపింగ్ మాల్ నిర్మాణంలో ఫోనిక్స్ కంపెనీకి హైదరాబాద్‌లో అను వైన స్థలాన్ని కేటాయించేలా చూస్తానని హామీ ఇచ్చారు.