Phoenix Mills Company
-
ఓరియంట్ బెల్- ఫీనిక్స్ మిల్స్.. జూమ్
ప్రసిద్ధ ఇన్వెస్టర్ పొరింజు వెలియత్.. ఈక్విటీ వాటా కొనుగోలు చేసిన వార్తలతో సిరామిక్ టైల్స్ తయారీ కంపెనీ ఓరియంట్ బెల్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. మరోవైపు సింగపూర్ ప్రభుత్వం మైనారిటీ వాటాను సొంతం చేసుకున్నట్లు వెల్లడికావడంతో రియల్టీ సంస్థ ఫీనిక్స్ మిల్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. ఓరియంట్ బెల్ లిమిటెడ్ కంపెనీలో పొరింజు వెలియత్‌కు చెందిన ఈక్విటీ ఇంటెలిజెన్స్ తాజాగా వాటా కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో ఓరియంట్ బెల్ కౌంటర్ జోరందుకుంది. తొలుత ఎన్ఎస్ఈలో ఈ షేరు 13 శాతం దూసుకెళ్లింది. రూ. 105ను తాకింది. తదుపరి కొంత మందగించింది. ప్రస్తుతం 7 శాతం లాభంతో రూ. 99 వద్ద ట్రేడవుతోంది. షేరుకి రూ. 91.87 ధరలో ఈక్విటీ ఇంటెలిజెన్స్ 80,000 ఓరియంట్ బెల్ షేర్లను కొనుగోలు చేసింది. ఇప్పటికే అంటే.. జూన్‌కల్లా ఓరియంట్ బెల్లో 1.57 శాతం వాటాను ఈక్విటీ ఇంటెలిజెన్స్ కలిగి ఉంది. ఫీనిక్స్ మిల్స్ లిమిటెడ్ క్విప్ ద్వారా రియల్టీ అభివృద్ధి సంస్థ ఫీనిక్స్ మిల్స్‌లో సింగపూర్ ప్రభుత్వం 74.38 లక్షల షేర్లను సొంతం చేసుకుంది. దీంతో ఫీనిక్స్ మిల్స్‌లో సింగపూర్ ప్రభుత్వ వాటా 4.3 శాతానికి చేరింది. ఈ బాటలో ఐసీఐసీఐ ఎంఎఫ్‌కు 12.39 లక్షల షేర్లు, ఎస్బీఐ ఎంఎఫ్‌కు 12.39 లక్షల షేర్లు, ఏబీ సన్ లైఫ్ ఎంఎఫ్‌కు 5.17 లక్షల షేర్లు చొప్పున ఫీనిక్స్ విక్రయించింది. దీంతో మ్యూచువల్ ఫండ్స్ వాటా తాజాగా 12.61 శాతాన్ని తాకింది. క్విప్‌లో భాగంగా షేరుకి రూ. 605 ధరలో ఫీనిక్స్ 1.81 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేసింది. తద్వారా రూ. 1,100 కోట్లు సమీకరించింది. క్విప్ తదుపరి ఫీనిక్స్ ఈక్విటీ క్యాపిటల్ రూ. 34.32 కోట్లకు ఎగసింది. ఈ నేపథ్యంలో ఫీనిక్స్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 6.3 శాతం జంప్‌చేసి రూ. 738ను తాకింది. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 713 వద్ద ట్రేడవుతోంది. -
హైదరాబాద్‌లో భారీ షాపింగ్ మాల్
► రూ.900 కోట్లతో నిర్మాణం ► ఫోనిక్స్ మిల్స్ కంపెనీ ఆసక్తి సాక్షి, హైదరాబాద్: ఫోనిక్స్ మిల్స్ కంపెనీ , షాపింగ్ మాల్,హైదరాబాద్ నగరంలో భారీ షాపింగ్‌మాల్ నిర్మించేందుకు ముందు కువచ్చింది.ఈ కంపెనీ ప్రతినిధి బృందం సోమవారం పరిశ్రమ భవన్లో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్ఐఐసీ) చైర్మన్ గ్యాదరి బాల మల్లుతో భేటీ అయ్యింది. కంపెనీ జాయింట్ మేనేజింగ్డైరెక్టర్ శిశిర్ శ్రీవాస్తవ, సౌత్ ఇండియా రిటైల్ విభాగం అధ్యక్షుడు శశికుమార్, డెవలప్మెంట్ డైరెక్టర్ రాఘవ్ బజోరియా, ఫైనాన్స్ వింగ్ ఉపాధ్యక్షుడు పవన్ కకుమాను ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో బహుళ అంతస్థుల నిర్మాణ రంగం లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. ముంబై, బెంగళూరు నగరాల్లో ఫోనిక్స్ మిల్స్ కంపెనీ తరఫున వ్యాపార బహుళఅంతస్తుల భవనాల ప్రాజెక్టులు నిర్మించామని తెలిపారు. హైదరాబాద్‌లో 10 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే, రూ.800 కోట్ల నుంచి రూ.900 కోట్ల పెట్టుబడులతో అంతర్జాతీయ స్థాయిలో షాపింగ్ మాల్‌ను నిర్మిస్తామని పేర్కొన్నారు. దీనికి బాలమల్లు సానుకూలంగా స్పందిస్తూ.. మహానగరం లో ఐటీ, ఇతర వ్యాపారరంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నందున షాపింగ్ మాల్స్ నిర్మాణానికి మంచి డిమాండ్ ఉందన్నారు. ప్రభుత్వంతో చర్చించి షాపింగ్ మాల్ నిర్మాణంలో ఫోనిక్స్ కంపెనీకి హైదరాబాద్‌లో అను వైన స్థలాన్ని కేటాయించేలా చూస్తానని హామీ ఇచ్చారు.