Rice Cutting Machine
-
కోత మెషిన్ల ధరలపై చర్యలు చేపట్టండి
న్యూఢిల్లీ: కోత మెషిన్ల(పవర్ టిల్లర్స్)ను కంపెనీలు ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా విక్రయిస్తున్నాయని, దీనిపై కేంద్రం తగు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసింది. దేశంలోని సన్న, చిన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకొని మెషిన్ల ధరలు తగ్గించాల్సిన అవసరముందంది. ఇటీవల ముగిసిన వర్షకాల సమావేశాల్లో కమిటీ తన నివేదికను పార్లమెంటు సమర్పించింది. ధరల విషయంలో కంపెనీలు కమ్మక్కైనట్లు అను మానం వస్తే కేసును కాంపిటీషన్ కమిషన్‌కు సైతం రిఫర్ చేయాలని సిఫార్సు చేసింది. -
వరికోత మిషన్‌లో పడి తల్లికొడుకులు మృతి
వలగుండ: కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. వరికోత మిషన్‌లో పడి తల్లీకొడుకులు మృతిచెందిన సంఘటన జిల్లాలోని వలగుండ మండలం సులువాయి గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన లక్ష్మి(42), జగదీష్(16)లు తమ పొలం వద్ద పంటను కోయిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు వరికోత మిషన్‌లో పడి మృతి చెందారు. ఈ ప్రమాదంతో గ్రామంలో విషాదం నెలకొంది. -
‘వరికోత’..ఆ చిన్నారి గుండెకోత
తిప్పర్తి:వరికోత యంత్రం ఓ చిన్నారి గుండెను నిలువునా చీల్చింది. ఈ హృదయ విదారక సంఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. తిప్పర్తి మండలం మాడ్గులపల్లి వద్ద అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై వరికోత యంత్రం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుడిపల్లి వెంకట్‌రెడ్డి(34), ఆయన కూతురు శ్రీజ(4) అక్కడికక్కడే మృతి చెందారు. వరికోత యంత్రానికి ఉన్న ఇనుపరాడ్లు చిన్నారి శ్రీజ గుండెల్లో గునపాల్లా గుచ్చుకున్నాయి. ఇదే ఘటనలో వెంకట్‌రెడ్డి భార్య జ్యోతి, కుమారుడు సంతోష్‌రెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.