‘వరికోత’..ఆ చిన్నారి గుండెకోత
తిప్పర్తి:వరికోత యంత్రం ఓ చిన్నారి గుండెను నిలువునా చీల్చింది. ఈ హృదయ విదారక సంఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. తిప్పర్తి మండలం మాడ్గులపల్లి వద్ద అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై వరికోత యంత్రం బైక్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో గుడిపల్లి వెంకట్‌రెడ్డి(34), ఆయన కూతురు శ్రీజ(4) అక్కడికక్కడే మృతి చెందారు. వరికోత యంత్రానికి ఉన్న ఇనుపరాడ్లు చిన్నారి శ్రీజ గుండెల్లో గునపాల్లా గుచ్చుకున్నాయి. ఇదే ఘటనలో వెంకట్‌రెడ్డి భార్య జ్యోతి, కుమారుడు సంతోష్‌రెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.