
న్యూఢిల్లీ: నిరర్థక రుణాలను (వసూలు కానివి/ఎన్‌పీఏలు) కట్టడి చేయడంలో ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సీఎల్) తీసుకున్న చర్యలు, పని తీరును పార్లమెంటరీ ప్యానెల్ అభినందించింది. ఐఐఎఫ్‌సీఎల్ చర్యలు ఎన్‌పీఏలను నియంత్రిస్తాయని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ కంపెనీగా తన సేవలను అందించడానికి వీలు పడుతుందని పార్లమెంటరీ ప్యానెల్ పేర్కొంది.
ఐఐఎఫ్‌సీఎల్ అనేది మౌలిక రంగానికి రుణ వితరణ కోసం 2006 జనవరిలో కేంద్రం ఏర్పాటు చేసిన సంస్థ. ప్రభుత్వరంగ సంస్థలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ తన నివేదికను ఇటీవలే పార్లమెంట్‌కు సమర్పించింది. ఐఐఎఫ్‌సీఎల్ తీసుకున్న చర్యలు దీర్ఘకాలంలో సంస్థ బలోపేతానికి సాయపడతాయని కమిటీ అభిప్రాయపడింది. ఎన్‌పీఏల పరిష్కారానికి బోర్డు ఆమోదిత మేనేజ్‌మెంట్ పాలసీని అమల్లో పెట్టడాన్ని ప్రస్తావించింది.