డిసెంబర్‌లో వృద్ధి 4 శాతమే
న్యూఢిల్లీ: కీలక మౌలిక(ఇన్‌ఫ్రా) రంగ వృద్ధి 2024 డిసెంబర్ నెలలో కాస్త మందగించింది. 4 శాతానికి పరిమితమైంది. 8 మౌలిక రంగాల వృద్ధి అంతక్రితం ఏడాది ఇదే నెలలో 5.1 శాతంగా నమోదైంది. నెలవారీగా చూస్తే అంటే 2024 నవంబర్‌లోనూ 4.4 శాతం పురోగతి సాధించింది. అధికారిక గణాంకాల ప్రకారం నేచురల్ గ్యాస్ ఉత్పత్తి క్షీణతను చవిచూసింది. అంతేకాకుండా వివిధ రంగాలలో ఉత్పత్తి నీరసించింది. బొగ్గు 5.3 శాతం, రిఫైనరీ ప్రొడక్టులు 2.8 శాతం, ఎరువులు 1.7 శాతం, స్టీల్ 5.1 శాతం చొప్పున వృద్ధి సాధించాయి.
అయితే అంతక్రితం డిసెంబర్‌లో వీటి ఉత్పత్తిలో వరుసగా 10.8 శాతం, 4.1 శాతం, 5.9 శాతం, 8.3 శాతం చొప్పున పురోగతి నమోదైంది. కాగా.. సిమెంట్ తయారీ 4 శాతం, విద్యుదుత్పత్తి 5.1 శాతం వృద్ధిని అందుకున్నాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) ఏప్రిల్–డిసెంబర్‌లో కీలక రంగాలు బొగ్గు, చమురు, నేచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి 4.2 శాతం పుంజుకుంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో 8.3 శాతం వృద్ధి నమోదైంది. ఈ 8 కీలక మౌలిక రంగాలు దేశీ పారిశ్రామిక ప్రగతిని సూచించే పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ)లో 40 శాతానికిపైగా వాటాను కలిగి ఉన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment