slow down
-
తగ్గుతున్న ఆటో డీలర్ల ఆదాయం!.. రిపోర్ట్
ఆటోమొబైల్ రంగంలో దేశం దూసుకెళ్తోంది. అయితే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆటో డీలర్ల ఆదాయ వృద్ధి గణనీయంగా తగ్గుతున్నట్లు క్రిసిల్ రేటింగ్స్ నివేదికలు చెబుతున్నాయి.గత ఏడాది 14 శాతంగా ఉన్న ఆదాయ వృద్ధి.. ఈ ఆర్థిక సంవత్సరంలో 7 శాతం నుంచి 9 శాతానికి తగ్గుతుందని అంచనా. దీనికి కారణం ధరల పెరుగుదల అని తెలుస్తోంది. వాహన విక్రయాలు తగ్గడం వల్ల డీలర్లు డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ వంటివి ప్రకటించారు. దీంతో ఆదాయం కొంత తగ్గుముఖం పట్టింది. ఈ ప్రభావంలో ఎక్కువ భాగం తయారీదారులచే భరించబడినప్పటికీ, ఆటో డీలర్ల లాభదాయకతను కూడా 3 శాతానికి తగ్గిస్తుందని నివేదికలో వెల్లడైంది.పండుగల సీజన్లో అధిక తగ్గింపుల మధ్య విక్రయాలు పుంజుకోవడంతో ద్వితీయార్ధంలో కూడా ఇన్వెంటరీ కాస్త తగ్గుతుందని క్రిసిల్ అంచనా వేస్తోంది. క్రిసిల్ రేటింగ్స్.. 110 మంది ఆటో డీలర్ల నుంచి సమాచారం సేకరించి ఈ నివేదికను వెల్లడించింది.నిజానికి భారతదేశంలో ఆటోమొబైల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశీయ వాహన తయారీ సంస్థలు మాత్రమే కాకుండా.. విదేశీ కంపెనీలు ఇండియాలో తమ ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నాయి. కొత్త వాహనాలు మాత్రమే కాకుండా అప్డేటెడ్ వాహనాలు కూడా మార్కెట్లో లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో ఫ్యూయెల్ వెహికల్స్ మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వెహికల్స్ కూడా ఉన్నాయి. -
ఏడాదికి రూ.16 కోట్లు, నో గర్ల్ ఫ్రెండ్, నో సెక్స్: టెక్ మిలియనీర్ సీక్రెట్
Slow Down the Ageing Process: టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనే లక్ష్యంతో ఒక్కో అవయవాన్ని యవ్వనత్వంతో నింపుకుంటున్న బ్రయాన్ జాన్సన్ తాజాగా తన సక్సెస్ సీక్రెట్‌ను పంచుకున్నాడు. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేసే ప్రయత్నంలో ప్రతీరోజూ కఠినమైన వ్యాయామంతోపాటు చాలా డబ్బు ఖర్చు చేస్తున్నట్టు కాలిఫోర్నియాకు చెందిన ఐటీ డెవలపర్ బ్రయాన్ జాన్సన్ తెలిపాడు. ప్రస్తుతం తనకు 18 ఏళ్ల యువకుడికి ఉండే ఊపిరి తిత్తులు, 37 ఏళ్లవయసునాటి గుండె ఉన్నాయని జాన్సన్ మరోసారి గుర్తు చేశాడు. (గోల్డ్ హిస్టరీ: అతిపెద్ద పతనం తులం ధర రూ.63.25 లే!) యవ్వనంగా ఉండాలనే తపనతో చేసే వ్యాయామం మాత్రమే సరిపోవడంలేదని ఇందుకోసం ఏడాదికి ఏకంగా సుమారు 16.4 కోట్లు(2 మిలియన్ల డాలర్లు) ఖర్చు చేస్తున్నట్టు తెలిపాడు. అయినా చెప్పుకోదగ్గ ప్రయోజనం లేదు. అందుకే మరింత యవ్వనంగా ఉండేందుకు రోజూ 110 మాత్రలు వేసుకుంటున్నట్లు తెలిపాడు. అలాగే ఎప్పుడూ ఒకే సమయంలో నిద్రపోతా. ఉదయం 11 గంటల తర్వాత ఏమీ తినను.. నో సెక్స్.. కనీసం గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు అంటూ ఆశ్చర్యకరమైన విషయాలను తెలిపాడు. ఉదయం 3 ఔన్సుల వైన్ తీసుకోవడం ప్రయోజనకరమని స్పష్టం చేశాడు. ఆహారంలో భాగంగా 100కి పైగా మాత్రలు తీసుకుంటా.. అదీ అశ్వగంధ, పసుపు, వెల్లుల్లి, అకార్బోస్ లాంటి ఆయుర్వేద మందులు మాత్రమే. దీంతో పాటు హార్మోన్లు, ఇతర పదార్ధాల సమ్మిళితమైన గ్లూకోసమైన్ సల్ఫేట్ తీసుకుంటానని, ఇవే సుదీర్ఘ జీవితానికి రహస్యమని పేర్కొన్నాడు. అత్యంత రెజిమెంటెడ్ షెడ్యూల్, కఠిన ఆహార నియమాలు వ్యాయామంతో పాటుగా నెలవారీ ప్రాతిపదికన అనేక రకాల వైద్య ఆపరేషన్లు తప్పవని వెల్లడించాడు. 30 నిమిషాల పాటు వ్యాయామం అదీ కూడా 30 మంది వైద్యుల సిబ్బంది పర్యవేక్షణలో 20,000 సిట్-అప్‌లకు సమానమైన ఎక్స్‌ర్‌సైజ్ చేస్తాడట. ఇందుకోసం ప్రత్యేకమైన పరికరాలను కూడా ఏర్పాటు చేసుకున్నానన్నాడు. (IT refund scam: తెలుసుకోండి: లేదంటే కొంప కొల్లేరే!) రోజూ 7 రకాల క్రీములు జాన్సన్ ప్రతిరోజూ ఏడు వేర్వేరు క్రీములు వాడతాడు. ఇందులో విటమిన్లు సి, ఇ , బి3, ఫెరులిక్ యాసిడ్ , అజెలైక్ యాసిడ్ లాంటి ఉన్నాయి. 0.1 శాతం ట్రెటినోయిన్ టాపికర్ క్రీమ్, ప్రతి ఉదయం SPF 30, బాడీ మాయిశ్చరైజింగ్ క్రీమ్ పడుకునే ముందు సెరావ్ నైట్ క్రీమ్ పూసుకుంటాడు. ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఫేస్ ఇంజెక్షన్లు స్కిన్ కేర్ కోసం వీక్లీ యాసిడ్ పీల్స్, లేజర్ థెరపీ, మైక్రోనీడ్లింగ్ అబ్బో ఇలా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఫేస్‌కి ఫ్యాట్ ఇంజెక్షన్ (దీనిక తేనెటీగ కుట్టినంత భయంకరంగా ఉబ్బిపోతుందట) మైక్రోబోటాక్స్ ఇంజెక్షన్లు, కొల్లాజెన్ ఉత్పత్తి కోసం పలు ఇంజెక్షన్లతో సహా వివిధ చర్మ సంరక్షణ చికిత్సలు తీసుకుంటాడు. 10 ఏళ్ల వయసులో ఉండే నున్నని మెరుపు, 14 ఏళ్ల వయస్సులో ఉండే మెరిసే చర్మం వచ్చిందట. దీన్ని కొనసాగించడం కష్టంగాను, చాలా పెయిన్పుల్గా అనిపించినప్పటికీ "ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ తన వయస్సును1.01 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లడమే తన లక్ష్యమని చెప్పారు. పరిగెత్తుతున్న వృద్ధాప్యమనే రైలుకు బ్రేక్‌లు వేయాలంటే సామాన్యమైన విషయంకాదు, కఠోర శ్రమ అంతకు మించిన డబ్బు కూడా ఉండాలంటాడు. -
మార్చిలో ‘సేవలు’ అంతంతే..!
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం మార్చిలో పేలవ పనితీరును కనబరిచింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఫిబ్రవరికన్నా తక్కువకు పడిపోయి 57.8కి చేరింది. సూచీ ఫిబ్రవరిలో 12 నెలల గరిష్ట స్థాయి 59.4ను చూసిన సంగతి తెలిసిందే. కొత్త బిజినెస్ ఆర్డర్లు అంతంత మాత్రంగానే పెరిగినట్లు ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్‌లో ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియానా డి లిమా పేర్కొన్నారు. కాగా, సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన వరుసగా 20 నెలల నుంచి సూచీ వృద్ధి ధోరణిలో పయనిస్తోంది. తయారీ–సేవల రంగం కలిపినా డౌన్! కాగా, తయారీ–సేవల రంగం కలిపినా ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ ఫిబ్రవరిలో 59.0 వద్ద ఉంటే, మార్చిలో 58.4కు పడిపోయింది. మరోవైపు ఒక్క తయారీ రంగం చూస్తే మార్చిలో మంచి పురోగతి కనబరచింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) మార్చిలో మూడు నెలల గరిష్ట స్థాయిలో 56.4కు వద్దకు చేరింది. డిమాండ్ ఊపందుకోవడంతో కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి పెరిగినట్లు నెలవారీ సర్వే పేర్కొంది. ద్రవ్యోల్బణం ఒత్తిడులు తగ్గినట్లూ వివరించింది. ఫిబ్రవరిలో పీఎంఐ 55.3గా నమోదయ్యింది. 400 మంది తయారీదారుల ప్యానల్లో కొనుగోళ్లు జరిపే మేనేజర్ల స్పందన ఆధారంగా ఈ సూచీ కదలికలను నమోదు చేస్తారు. భారత్ ఎకానమీలో సేవల రంగం వాటా 60%. పరిశ్రమల రంగం వాటా దాదాపు 15% అయితే, అందులో తయారీ రంగం వెయిటేజ్ 70% ఉంటుంది. -
Layoff Crisis: వేలాదిమందిని తొలగిస్తున్న మరో దిగ్గజ కంపెనీ
న్యూఢిల్లీ: టెలికా గేర్ మేకర్, మొబైల్ సంస్థ ఎరిక్సన్ కూడా ఉద్యోగాల తీసివేతకు నిర్ణయించింది. భారీగా ఖర్చులను తగ్గించుకోవాలని భావిస్తున్న సంస్థ స్వీడన్లో దాదాపు1400 మంది, పలు దేశాల్లో కొంతమంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. అంతేకాదు రాబోయే రోజుల్లో వివిధ దేశాల్లో అనేక వేల ఉద్యోగాల కోతలను ప్రకటించ వచ్చని అంచనాలు నెలకొన్నాయి. ఉత్తర అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ మందగించడంతో 2023 చివరి నాటికి ఖర్చులను 880 మిలియన్ డాలర్ల క తగ్గించుకోవాలని యోచిస్తున్నట్లు ఎరిక్సన్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వ్యయాలను తగ్గించే విస్తృత ప్రణాళికలో భాగంగానే ఈ తొలగింపులను కంపెనీ పేర్కొంది. 2017లో ప్రత్యర్థుల పటీ, నిర్వహణ వ్యయాలు విపరీతంగా పెరగడంతో 25 వేల మంది ఉద్యోగులను తొలగించి ఎరిక్సన్ దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తోంది. ఖర్చుల తగ్గింపును ఎలా నిర్వహించాలనే దానిపై కంపెనీ స్వీడన్‌లోని ఉద్యోగుల సంఘంతో నెలల తరబడి చర్చలు జరుపుతోంది. సర్వీస్ ప్రొవైడర్లకు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ICT)అందించే ప్రముఖ సంస్థలలో ఎరిక్సన్ ఒకటి. ఎరిక్సన్ ఇటీవల ప్రకటించిన నాల్గవ త్రైమాసిక ఫలితాల్లో ఊహించిన దానికంటే తక్కువగా లాభాలు నమోదైన నెల తర్వాత ఈ నిర్ణయం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికా లాంటి అధిక మార్జిన్ మార్కెట్లలో 5జీ పరికరాల విక్రయాలు మందగించడంతో ఈ కంపెనీ షేర్లు తాజా కనిష్ట స్థాయిలను తాకాయి. దీంతో కన్సల్టెంట్లు, రియల్ ఎస్టేట్ , ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం లాంటి కాస్ట్ కట్ చర్యలపై ప్రణాళికలు వేస్తోందని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కార్ల్ మెల్లాండర్ వార్తా సంస్థ రాయిటర్స్‌తో చెప్పారు. తాము వివిధ దేశాల కార్మిక చట్టాలను పరిగణనలోకి తీసుకుని యూనిట్లవారీగా తొలగింపు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. -
జనవరిలో ‘తయారీ’ నెమ్మది
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం జనవరిలో నెమ్మదించింది. మొత్తం అమ్మకాల్లో వేగం లేకపోవడం దీనికి కారణం. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జనవరిలో 55.4గా నమోదయ్యింది. డిసెంబర్లో ఈ సూచీ 57.8 వద్ద ఉంది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తగినంత సిబ్బంది ఉండడం వల్ల ఈ సంఖ్యలో ఎటువంటి పెరుగుదలా నమోదుకాలేదని తమ సర్వే వెల్లడించినట్లు ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్‌లో ఎకనామిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీలిమా పేర్కొన్నారు. కాగా, సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా ఆ దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన సూచీ 19 నెలలుగా అప్‌ట్రెండ్‌లోనే ఉందన్నమాట. నెలవారీగా నెమ్మదించినప్పటికీ, తయారీ రంగం అప్‌ట్రెండ్ దోరణిలోనే ఉన్నట్లు పోలీయానా డీ లిమా తెలిపారు. కాగా, ద్రవ్యోల్బణానికి సంబంధించి డిసెంబర్లో కొంత ఒత్తిడి ఉన్నట్లు తమ సర్వేలో వెల్లడయినట్లు డీ లిమా పేర్కొన్నారు. చదవండి: Union Budget 2023-24: పెరిగేవి, తగ్గేవి ఇవే! -
అడుగంటిన విదేశీ మారక నిల్వలు
ఇస్లామాబాద్: పీకల్లోతు ఆర్థిక సంక్షోభంతో అష్టకష్టాలు పడుతున్న పాకిస్తాన్‌కు విదేశీ రుణాలు సైతం దొరకడం లేదు. 2022లో జూలై నుంచి డిసెంబర్ వరకు కేవలం 5.6 బిలియన్ డాలర్ల రుణాలు లభించాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) రుణ కార్యక్రమాన్ని పునరుద్ధరించే విషయంలో సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందంటున్నారు. విదేశీ మారక నిల్వలు 3.1 బిలియన్ డాలర్లకు అడుగంటాయి. కొత్త అప్పులు పుట్టడం లేదు. తీసుకున్న అప్పులపై వడ్డీలు భారీగా పెరిగిపోతున్నాయి. వాటి చెల్లింపుకూ అప్పులే గతి! క్రెడిట్ రేటింగ్ దెబ్బ పాకిస్తాన్‌కు డిసెంబర్లో 532 మిలియన్ డాలర్ల రుణం లభించింది. ఇందులో 44 శాతం అంటే.. 231 మిలియన్ డాలర్లను ఆసియన్ అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) రుణంగా ఇచ్చింది. పాక్ ప్రభుత్వం చాలా దేశాలకు చెల్లింపులు చేయాల్సి ఉంది. గత ఏడు రోజుల్లో చైనా ఆర్థిక సంస్థలకు 828 మిలియన్ డాలర్లు చెల్లించింది. -
Russia-Ukraine war: నెమ్మదించిన రష్యా
ఖర్కీవ్: యుద్ధంలో రష్యాకు నానాటికీ ప్రతికూల పరిణామాలే ఎదురవుతున్నాయి. తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్ను పూర్తిగా స్వాధీనం చేసుకోవడం ద్వారా యుద్ధాన్ని గౌరవప్రదంగా ముగించాలన్న రష్యా ఆశలు ఫలించడం లేదని అమెరికా అంటోంది. అక్కడ కూడా రష్యా దాడులను ఉక్రెయిన్ సమర్థంగా అడ్డుకుంటోంది. దాంతో రష్యా యుద్ధ ప్రణాళిక బాగా నెమ్మదించిందని యూఎస్ రక్షణ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలతో పుతిన్ సేనల నైతిక స్థైర్యం నానాటికీ మరింతగా దిగజారుతోందని ఇంగ్లండ్ అభిప్రాయపడింది. శనివారం లుహాన్స్క్లో పలు ప్రాంతాలపై దాడికి దిగిన రష్యా సైనికుల్లో అత్యధికులను హతమార్చినట్టు స్థానిక గవర్నర్ తెలిపారు. డోన్బాస్ను పూర్తిగా నేలమట్టం చేయాలని, అక్కడున్న వారందరినీ హతమార్చాలని రష్యా ప్రయత్నిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఆరోపించారు. ఖర్కీవ్‌లో సగానికి పైగా నివాస సముదాయాలు మరమ్మతులకు వీలు కానంతగా దెబ్బ తిన్నాయని నగర మేయర్ చెప్పారు. ఆంక్షల దెబ్బకు రష్యా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 10 శాతానికి పైగా కుంచించుకుపోతుందని ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ అంచనా వేసింది. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు పాశ్చాత్య దేశాలే తూట్లు పొడుస్తున్నాయని రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ ఆరోపించారు. -
1946 తరువాత ఎన్నడూ లేనంత పతనం
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక వ్యవస్థ గత 74 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత పతనాన్ని 2020లో నమోదుచేసుకుంది. క్షీణత 3.5 శాతంగా నమోదయ్యింది. అయితే నాల్గవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) 4 శాతం వృద్ధి నమోదుకావడం కొంత ఊరటనిచ్చే అంశం. వార్షికంగా చూస్తే, 1946 తరువాత ఇంత తీవ్ర పతనాన్ని చూడ్డం ఇదే తొలిసారని వాణిజ్య మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. కోవిడ్–19 నేపథ్యంలో రెస్టారెంట్లు, ఎయిర్‌లైన్స్ వంటి పలు సేవా రంగాలు తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాయని, దాదాపు కోటి మంది అమెరికన్లు ఉపాధి కోల్పోయారని... ఈ ఫలితం గురువారం విడుదలైన వార్షిక గణాంకాల్లో కనిపించందనీ ఉన్నత స్థాయి వర్గాలు వ్యాఖ్యానించాయి. జూన్, సెప్టెంబర్ త్రైమాసికాల్లో అమెరికా జీడీపీ 33 శాతంపైగా పతనమైన సంగతి తెలిసిందే. జనవరి–మార్చి త్రైమాసికంలో క్షీణరేటు 5 శాతంగా ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు సమయం 1946లో 11.6 క్షీణత తర్వాత ప్రపంచ ఆర్థిక సంక్షోభం 2009 కాలంలో ఎకానమీ 2.5 శాతం పతనమైంది. 1932 తీవ్ర మాంద్యం సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ 12.9 శాతం పతనమైంది. అమెరికా జీడీపీ వృద్ధి గణాంకాలను మూడుసార్లు సవరించడం జరుగుతుంది. దీని ప్రకారం తాజా– డిసెంబర్ త్రైమాసిక గణాంకాలను మరో రెండు సార్లు సవరిస్తారు. 2021 సంవత్సరానికి సంబంధించి ఎకానమీ అవుట్‌లుక్ అనిశ్చితిగానే కొనసాగుతుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. వ్యాక్సినేషన్ దేశ వ్యాప్తంగా లభ్యం అయ్యేంత వరకూ క్లిష్ట పరిస్థితులు తప్పవని హెచ్చరిస్తున్నారు. -
భారత్ ఎకానమీ అస్తవ్యస్తం
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందిలో ఉందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఎస్ అండ్ పీ పేర్కొంది. 2021 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 5% క్షీణిస్తుందని తాజా నివేదికలో పేర్కొంది. కరోనా వైరస్ కట్టడిలో కష్టాలు, విధాన పరమైన నిర్ణయాల అమల్లో జాప్యం, పైనాన్షియల్ రంగంసహా పలు విభాగాల్లో అనిశ్చితి ధోరణి వంటి అంశాలు దీనికి కారణం. అయితే బేస్ ఎఫెక్ట్ కారణంగా 2021–22లో ఆర్థిక వ్యవస్థ కొంత వృద్ధిని నమోదుచేసుకునే అవకాశం ఉందని అంచనావేసింది. కరోనా ఎఫెక్ట్‌తో ఆసియా–పసిఫిక్ ప్రాంతం మూడు ట్రిలియన్ డాలర్లను నష్టపోయే వీలుందని తెలిపింది. ఈ ప్రాంతం ఆర్థిక వ్యవస్థ 2020లో 1.3 శాతం నష్టపోతుందని అయితే 2021లో 6.9 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుందని పేర్కొంది. కాగా చైనా ఆర్థికాభివృద్ధి 2020, 2021ల్లో వరుసగా 1.2 శాతం, 7.4 శాతాలుగా నమోదవుతాయని అంచనావేసింది. డీ అండ్ బీ చెప్పింది ఇదే: దేశంలోని పలు ప్రాంతాల్లో లాక్డౌన్ అమలు, కోవిడ్–19 కేసులు పెరుగుతుండడం వంటి అంశాలు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని ఆర్థిక విశ్లేషణా దిగ్గజ సంస్థ డీ అండ్ బీ పేర్కొంది. ఇక సరఫరాల చైన్ దెబ్బతింటే ఆహార ధరలూ తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. వ్యవస్థలో డిమాండ్ మందగమనం కొనసాగుతుందని, వలస కార్మికుల కొరత కారణంగా కంపెనీలకు ప్రత్యేకించి లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపింది. -
బ్యాంకులకు ‘కరోనా’ స్ట్రెస్ టెస్టులు
ముంబై: కరోనా వైరస్ పరిణామాలతో మందగమన పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో మొండిబాకీల స్థాయిని మదింపు చేసేందుకు బ్యాంకులు స్ట్రెస్ టెస్టులు నిర్వహించాయి. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియేనని, ఆర్బీఐ ప్రత్యేకంగా బ్యాంకులకు ఆదేశాలివ్వాల్సిన అవసరం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆఖరు త్రైమాసికం కూడా ముగియడంతో ఆర్థికపరమైన ఒత్తిళ్ల గురించి ఒక అవగాహన కోసం ఈ సమీక్షల నిర్వహణ శ్రేయస్కరమని పేర్కొన్నాయి. అసెట్ క్వాలిటీ దిగజారే అవకాశమున్న కేసులను ముందుగా గుర్తించేందుకు, ఒకవేళ పరిస్థితి చేయి దాటితే సమకూర్చుకోవాల్సిన మూలధనం తదితర అంశాలపై ఒక అంచనాకు వచ్చేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. దీనివల్ల మేనేజ్మెంట్కు, నియంత్రణ సంస్థకు ఆయా బ్యాంకుల ఆర్థిక స్థితిగతుల గురించి ముందస్తుగా ఒక అవగాహన ఉంటుంది. మొండిబాకీలను సకాలంలో గుర్తించడం ద్వారా మెరుగ్గా ఉన్న పద్దులపై ప్రతికూల ప్రభావాలు పడకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు బ్యాంకులకు ఈ స్ట్రెస్ టెస్ట్ తోడ్పడుతుందని కేపీఎంజీ ఇండియా పార్ట్నర్ (ఫైనాన్షియల్ సర్వీసెస్ అడ్వైజరీ) సంజయ్ దోషి తెలిపారు. బ్యాంకింగ్ వ్యవస్థ స్థాయిలో నెలకొన్న ఒత్తిళ్ల గురించి తెలియజేసేందుకు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఏటా రెండు సార్లు ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) విడుదల చేస్తుంది. గతేడాది డిసెంబర్లో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2019 సెప్టెంబర్‌లో 9.3 శాతంగా ఉన్న బ్యాంకుల స్థూల మొండిబాకీల నిష్పత్తి 2020 సెప్టెంబర్ నాటికి 9.9 శాతానికి పెరగనుంది. మొండిబాకీలు పెరుగుతుండటం, రుణ వృద్ధి తగ్గుతుండటం, స్థూల ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు తదితర అంశాలు ఇందుకు కారణం కాగలవని ఆర్బీఐ నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల మొండిబాకీల (జీఎన్‌పీఏ) నిష్పత్తి 2019 సెప్టెంబర్‌లో 12.7%గా ఉండగా.. 2020 సెప్టెంబర్ నాటికి 13.2%కి పెరగవచ్చని అంచనా వేసింది. అలాగే ప్రైవేట్ బ్యాంకుల జీఎన్‌పీఏ నిష్పత్తి 3.9 శాతం నుంచి 4.2 శాతానికి పెరగవచ్చని పేర్కొంది. -
టెక్ దిగ్గజాలకు మహమ్మారి ముప్పు..
బెంగళూర్ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంటే ఐటీ దిగ్గజాలు ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు క్షీణిస్తుందని అంచనా వేస్తున్నాయి. కోవిడ్-19తో జనజీవనం స్తంభించడమే కాకుండా వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోతుండటంతో ఐటీ ఎగుమతులపైనా పెనుప్రభావం ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ అమలు నేపథ్యంలో అమెరికా, యూరప్ క్లయింట్లు టెక్నాలజీపై వ్యయాల్లో కోత విధిస్తుండటం దేశీ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్లపై ప్రతికూల ప్రభావం పడనుందని ఐటీ విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న ఆరునెలల్లో ఐటీ రంగంలో రాబడి 2 నుంచి 7 శాతం తగ్గుతుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ విశ్లేషించిందని ఓ వార్తాసంస్ధ వెల్లడించింది. వైరస్ ప్రభావంతో నిర్ణయాలు తీసుకోవడం, వాటి అమలులో జాప్యాలు వంటి కారణాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసాల్లో రాబడి గణనీయంగా తగ్గవచ్చని మరికొందరు నిపుణులు విశ్లేషించారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ ఈ ఏడాది ప్రధమార్ధంలో వృద్ధి రేటు మందగమనాన్ని ఎదుర్కొంటాయని అంచనా వేశారు. ఐటీ కంపెనీలు ధరల ఒత్తిళ్లను ఎదుర్కొంటాయని, ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ ప్రభావంతో రాబడి నష్టం వాటిల్లుతుందని ఐసీఐసీఐ డైరెక్ట్‌కు చెందిన దేవాంగ్ భట్ పేర్కొన్నారు. కోవిడ్-19 ప్రభావంతో వ్యాపారం దెబ్బతినే క్రమంలో వృద్ధి రేటును యాక్సెంచర్ 6-8 శాతం నుంచి 3-6 శాతానికి కుదించిన బాటలోనే భారత ఐటీ కంపెనీలు నడుస్తాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు రవాణాపై ఆంక్షలు సైతం ప్రాజెక్టుల అమలులో జాప్యానికి కారణమవుతున్నాయి. ట్రావెల్, హాస్పిటాలిటీ, ఎయిర్‌లైన్స్, రిటైల్, హైటెక్, ఫైనాన్షియల్, తయారీ రంగాలకు చెందిన క్లయింట్ల నుంచి వచ్చే వ్యాపారం వైరస్ మహమ్మారి కారణంగా దెబ్బతినవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కరోనా కేంద్రస్ధానమైన చైనాలో ఆర్థిక మందగమనం కూడా భారత ఐటీ రంగంపై పరోక్ష ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. చదవండి : పీఎం కేర్స్ ఫండ్ : నిర్మలా సీతారామన్ సాయం -
స్లోడౌన్ సెగలు : భారీగా తగ్గిన ఐఐపీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనంతో అన్ని రంగాలు కుదేలవుతుంటే తాజా గణాంకాలు మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అక్టోబర్‌లో దేశ పారిశ్రామిక ఉత్పాదకత 3.8 శాతం పతనమైందని, విద్యుత్, మైనింగ్, తయారీ రంగాలు మెరుగైన సామర్థ్యం ప్రదర్శించకపోవడమే ఇందుకు కారణమని గురువారం వెల్లడైన గణాంకాలు స్పష్టం చేశాయి. పారిశ్రామిక ఉత్పాదకత గత ఏడాది అక్టోబర్‌లో 8.4 శాతం పెరిగింది. గత ఏడాది అక్టోబర్‌లో తయారీ రంగం 8.2 శాతం వృద్ధి నమోదు చేయగా, ఈ ఏడాది అక్టోబర్‌లో 2.1 శాతం తగ్గడం స్లోడౌన్ భయాలను పెంచుతోంది. ఇక గత ఏడాది అక్టోబర్‌లో 10.8 శాతం విద్యుత్ ఉత్పత్తి పెరగ్గా, తాజాగా అది 12.2 శాతం పతనమైంది. మైనింగ్ ఉత్పత్తి గత ఏడాది ఇదే నెలలో 7.3 శాతం పెరగ్గా, ప్రస్తుతం 8 శాతం మేర పడిపోయింది. మరోవైపు ఆహారోత్పత్తుల ధరలు ఎగబాకడంతో నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం మూడేళ్ల గరిష్టస్ధాయిలో 5.54 శాతానికి ఎగిసింది. -
ఆర్థిక మంత్రి ప్రకటనతో భారీ రిలీఫ్..
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకులకు అదనంగా సమకూర్చిన రూ 70,000 కోట్ల నిధులను మంజూరు చేశామని దీంతో రుణ వితరణ భారీగా పెరుగుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్బీఐ రెపో రేట్లు తగ్గించడంతో ఆయా ప్రయోజనాలను రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా ఖాతాదారులకు చేరవేసేందుకు బ్యాంకులు అంగీకరించాయని తెలిపారు. దీంతో గృహ, వాహన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గి ఈఐఎంల భారం దిగివచ్చే అవకాశం ఉంది. ఇక ఖాతాదారులు రుణాన్ని పూర్తిగా తిరిగి చెల్లించిన తర్వాత 15 రోజుల్లోగా లోన్ డాక్యుమెంట్లను తిరిగి కస్టమర్లకు చేర్చేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు సిద్ధమయ్యాయని వెల్లడించారు. వృద్ధికి ఊతం ఇచ్చేలా నిర్ణయాలు తీసుకుంటామని శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె భరోసా ఇచ్చారు. స్టాక్ మార్కెట్లలో దీర్ఘకాలిక, స్వల్పకాల క్యాపిటల్ గెయిన్స్‌పై పెంచిన సర్చార్జ్ను తొలగించినట్టు మంత్రి వెల్లడించారు. ఎఫ్‌పీఐలు, సూపర్ రిచ్‌పై అదనంగా విధించిన సర్చార్జ్ను తొలగిస్తున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించడంతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే మదుపరులకు వెసులుబాటు కల్పించినట్టయింది. ఇక జీఎస్టీలో సంక్లిష్టతలను సవరించి పన్ను వ్యవస్థను మరిత సరళతరం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఆర్థిక మందగమనం నివారించేందుకు పలు చర్యలు చేపడతామని చెప్పారు. అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదుపులకు లోనవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విలీనాలు, స్వాధీన ప్రక్రియలకు అనుమతులను సరళతరం చేస్తామని చెప్పారు.. ఐటీ ఆదేశాలు, సమన్లు, లేఖలు అక్టోబర్ 1 నుంచి కేంద్రీకృత వ్యవస్థ ద్వారా వెల్లడవుతాయని పేర్కొన్నారు. ఆదాయ పన్నుకు సంబంధించిన అన్ని అసెస్మెంట్లు మూడు నెలల్లో పరిష్కారమయ్యేలా చర్యలు చేపడతామని అన్నారు. . డీపీటీఐటీ వద్ద నమోదైన స్టార్టప్‌లకు ఐటీ యాక్ట్56 2(బీ) వర్తించదని చెప్పారు. -
ఆర్థిక వ్యవస్థకు మోదీ టానిక్!
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగ పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన తర్వాత ప్రధాని నేరుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మందగమన పరిస్థితులు ఒకదాని తర్వాత మరో రంగానికి వేగంగా విస్తరిస్తుండడం, ఉద్యోగాలు, సంపదకు విఘాతం కలుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని ఈ సమీక్ష నిర్వహించడం గమనార్హం. ఆర్థిక మందగమనానికి సహజ కారణాలు, దీర్ఘకాలిక ప్రభావాన్ని అంచనా వేయడానికే ఈ భేటీ జరిగినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. రంగాలవారీగా ఉద్దీపన చర్యలను ప్రభుత్వం ప్రకటించవచ్చన్న అంచనాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దేశ జీడీపీ వృద్ధి 2018–19లో 6.8%కి తగ్గిపోగా, 2014–15 తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయి. వినియోగ విశ్వాసం క్షీణిస్తుండడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కుంగుదల వంటి అంశాలు ప్రభుత్వాన్ని సైతం ఆందోళనకరం. అంతర్జాతీయంగా అమెరికా–చైనా మధ్య ముదిరిన వాణిజ్య, కరెన్సీ యుద్ధం పరిస్థితులను మరింత ప్రతికూలంగా మారుస్తోంది. అయితే, ప్రభుత్వం నుంచి ఇతమిద్ధంగా ఈ చర్యలు ఉంటాయన్న స్పష్టత అయితే ఆర్థిక శాఖ ఇంత వరకు వ్యక్తపరచలేదు. గత 2 వారాల వ్యవధిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకర్లు, వివిధ రంగాల పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు నిర్వహించడంతోపాటు ఆర్థిక రంగ వృద్ధికి అవరోధంగా ఉన్న అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం నుంచి త్వరలోనే చర్యలు ఉంటాయని ఆ సందర్భంగా పారిశ్రామిక వేత్తలకు హామీ కూడా ఇచ్చారు. దీంతో ప్రభుత్వం ప్రకటించే చర్యల కోసం మార్కెట్లు, పారిశ్రామిక వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆర్బీఐ సైతం తనవంతుగా రెపో రేట్లను కూడా మరోమారు తగ్గించింది. ఆందోళన కలిగిస్తున్న పరిస్థితులు ► వాహన రంగం అయితే గత రెండు దశాబ్దాల కాలంగా అత్యంత దారుణ పరిస్థితులను చవిచూస్తోంది. వాహనాల అమ్మకాలు ప్రతీ నెలా భారీగా తగ్గిపోతున్నాయి. ► కార్లు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 19 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఇప్పటి వరకు 300 డీలర్‌షిప్‌లు మూతపడ్డాయని, 2.30 లక్షల వరకు ఉద్యోగాలు పోయాయని అంచనా. ఆటో పరిశ్రమలో 10 లక్షల ఉద్యోగాలపై ప్రభావం పడినట్టు వాహన కంపెనీల సంఘం ప్రకటించింది. ► రియల్టీ పరిస్థితీ ఆశాజనకంగా లేదు. అమ్ముడుపోని ఇళ్లు భారీగానే ఉన్నాయి. ► ఎఫ్ఎంసీజీ కంపెనీల అమ్మకాల వృద్ధి సైతం గతంలో పోలిస్తే జూన్ త్రైమాసికంలో తగ్గింది. హిందుస్తాన్ యూనిలీవర్ జూన్ క్వార్టర్లో అమ్మకాల పరంగా కేవలం 5.5 శాతం పెరుగుదల నమోదు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వృద్ధి 12 శాతంగా ఉంది. డాబర్ అమ్మకాల వృద్ధి సైతం 21 శాతం నుంచి 6 శాతానికి పరిమితం అయింది. బ్రిటానియా అమ్మకాల వృద్ధి 12% నుంచి 6 శాతానికి క్షీణించింది. ► ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో బ్యాంకుల నుంచి పరిశ్రమలకు రుణాలు అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 0.9%నుంచి 6.6%కి పెరగడం కాస్త ఆశాజనకం. కానీ, అత్యధికంగా ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి మాత్రం రుణాల పంపిణీ 0.7 శాతం నుంచి 0.6 శాతానికి తగ్గింది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు కేవలం 1.4 శాతమే పెరగ్గా, జీఎస్టీ వసూళ్లు జూలై వరకు 9% పెరిగాయి. 18% వృద్ధి సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. -
అమ్మకాల క్షీణత, ఉద్యోగాల కోత
సాక్షి, ముంబై : దేశీయ వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకి తాత్కాలిక ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకొంది. ఖర్చులు తగ్గించుకునే క్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొంది. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు పడిపోవడంతో ఉద్యోగులపై వేటు వేసింది. ఈ మేరకు మారుతి సుజుకి రాయిటర్స్ కిచ్చిన సమాచారంలో వెల్లడించింది. చైర్మన్ ఆర్సీ భార్గవ మాట్లాడుతూ, వ్యాపార మందగమనం నేపథ్యంలో, ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను తగ్గించుకోవాల్సి వస్తోందన్నారు. తాత్కాలిక ఉద్యోగుల నియామకాలకు కూడా ఇదే కారణమన్నారు. అయితే భవిష్యత్తులో ఎంతమంది ఉద్యోగులపై వేటు వేయనున్నారనే దానిపై వివరాలు ఇవ్వలేదు. ఈ తిరోగమనం కొనసాగితే మార్జినల్, వీక్ కంపెనీలు మనుగడ సాగించడం కష్టమని వ్యాఖ్యానించారు. జూన్ 30 తో ముగిసిన ఆరు నెలల్లో సగటున 18,845 మంది తాత్కాలిక కార్మికులను నియమించినట్లు మారుతి సుజుకి రాయిటర్స్‌కు పంపిన ఇమెయిల్‌లో పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 6 శాతం లేదా 1,181 తగ్గిందని వెల్లడించింది. ఏప్రిల్ నుంచి ఉద్యోగాల కోత పెరిగిందని కంపెనీ తెలిపింది. భారతదేశంలో పాసెంజర్ వాహన విక్రయాల్లో టాప్‌లో ఉండే మారుతి సుజుకి, జూలై, 2018 తో పోలిస్తే, ఈ ఏడాది జూలైలో (33.5 శాతం) అమ్మకాలు 109 265 యూనిట్లకు పడిపోయాయి. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఉత్పత్తిని 10.3 శాతం తగ్గించామని గతంలో సుజుకి ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతదేశ ఉత్పాదక ఉత్పత్తిలో దాదాపు సగం వాటాను సొంతం చేసుకున్న ఆటో మొబైల్ రంగం దాదాపు ఒక దశాబ్దం కాలంగా మందగమనాన్ని ఎదుర్కొంటోంది. వాహన అమ్మకాలు కూడా అంతే వేగంగా పడిపోతున్నాయి. మరోవైపు ప్రభుత్వ నిరుద్యోగ గణాంకాలు పాతవని, విశ్వసనీయత లేదని ఆర్థికవేత్తలు అంటున్నారు. ప్రస్తుతం భారత్‌లో నిరుద్యోగ రేటు పెరిగి జులై నాటికి 7.51 శాతానికి చేరింది. ఈ ఏడాది ప్రారంభం ఇది 5.66 శాతంగా ఉండేదని సీఎంఐఈ తెలిపింది. వీరిలో రోజువారీ కూలీలను కలపలేదు. మారుతి ఉద్యోగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కుల్దీప్ జంఘు మాట్లాడుతూ మానేసర్, గురుగ్రామ్ ప్లాంట్లలో తాత్కాలిక కార్మికుల సగటు వేతనం నెలకు 250 డాలర్లుగా ఉందనన్నారు. కాగా ఈ రెండు ప్లాంట్లు కలిపి సంవత్సరానికి 1.5 మిలియన్లకు పైగా వాహనాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ సంస్థ 1983 లో గురుగ్రామ్ ప్లాంట్ నుంచే తన ప్రసిద్ధ మారుతి 800 మోడల్‌ను విడుదల చేసింది. ఆటోరంగ అమ్మకాల తిరోగమనం పరిశ్రమ అంతటా ఉద్యోగాలను ప్రమాదంలో పడేస్తోంది. ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎసిఎంఎ) మాట్లాడుతూ, ఈ తిరోగమనం కొనసాగితే విడిభాగాల తయారీదారులు తమ 5 మిలియన్ల మంది కార్మికుల్లో 5వ వంతును తగ్గించుకోవచ్చని పేర్కొంది. -
27 ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి రేటు
బీజింగ్: చైనా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు రెండవ త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో కేవలం 6.2 శాతంగా నమోదయ్యింది. గడచిన 27 సంవత్సరాల్లో ఒక త్రైమాసికంలో ఇంత తక్కువ జీడీపీ వృద్ది రేటు నమోదుకావడం చైనాలో ఇదే తొలిసారి. అమెరికా వాణిజ్య యుద్ధం, బలహీన గ్లోబల్ డిమాడ్ వంటి అంశాలు వృద్ధి పడిపోడానికి కారణమని చైనా పేర్కొంది. మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) జీడీపీ రేటు 6.4 శాతంగా నమోదయ్యింది. 2019 మొదటి ఆరు నెలల కాలంలో (జనవరి–జూన్) చైనా జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతంగా నమోదయ్యింది. విలువలో ఇది 45.09 ట్రిలియన్ యన్స్ (దాదాపు 6.56 ట్రిలియన్ డాలర్లు) అని చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్బీఎస్) పేర్కొంది. 2018లో చైనా వృద్ధి రేటు 6.6 శాతం. 2019లో కేవలం 6 నుంచి 6.5 శాతం శ్రేణిలోనే వృద్ధిరేటు ఉంటుందని చైనా అంచనా వేస్తోంది. ఈ అంచనాలకు అనుగుణంగా తాజా గణాంకాలు వెలువడ్డం గమనార్హం. చైనా జీడీపీలో 54.9 శాతం వెయిటేజ్ ఉన్న సేవల రంగం మొదటి ఆరు నెలల కాలంలో 7 శాతం పురోగతిని నమోదుచేసుకుంది. -
ఇక యూజర్ల ఇష్టం : ఆపిల్ సీఈఓ
శాన్ఫ్రాన్సిస్కో : టెక్ దిగ్గజం ఆపిల్ పాత ఐఫోన్లను కావాలనే స్లో డౌన్ చేసిందని వస్తున్న ఆరోపణలపై ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ స్పందించారు. ఏబీసీ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్య్యూలో మాట్లాడుతూ.. ఐఫోన్ బ్యాటరీ సమర్థత విషయంలో మరింత పారదర్శకంగా ఉండేలా ఆపిల్ తదుపరి ఐఓఎస్ అప్ డేట్ ఉంటుందని పేర్కొన్నారు. బ్యాటరీ ఎక్కువ కాలం మన్నిక కోసం ఫోన్ స్లో డౌన్ చేసుకోవాలా లేదా అనేది యూజర్లే మానిటర్ చేసుకోవచ్చు అని తెలిపారు. ఇంతకు ముందులేని విధంగా బ్యాటరీ పరిస్థితిని యూజర్లే విజిబుల్‌గా చెక్ చేసుకునే అవకాశం ఇచ్చి మరింత పాదర్శకంగా ఆపిల్ ఉండనుందని చెప్పారు. బ్యాటరీ మన్నిక కోసం స్లోడౌన్ చేసుకోవాలని సూచనలు వస్తే.. అది పూర్తిగా యూజర్ల ఇష్టంపైనే అధారపడి ఉంటుందన్నారు. బ్యాటరీ విషయంలో తలెత్తుతున్న సమస్యల పట్ల యూజర్లను ఆపిల్ గత ఏడాది డిసెంబర్లో తన వెబ్సైట్లో క్షమాపణలు కోరిన విషయం తెలిసిందే. పాత ఐఫోన్ మోడల్స్ స్లోగా మారడానికి తామే కారణమని ఆ సంస్థ వెల్లడించింది. అయితే యూజర్ల విధేయతను గుర్తించడానికి, నమ్మకాన్ని మళ్లీ చూరగొనడానికి ఐఫోన్లలో పలు మార్పులు చేపడుతున్నట్టు తెలిపింది. అంతేకాక పాత ఐఫోన్ల బ్యాటరీలను రిప్లేస్ చేయడానికి సంస్థ అంగీకరించింది. చాలా తక్కువ ధరకు ఆపిల్ కొత్త బ్యాటరీలను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 79 డాలర్లు(సుమారు రూ.5000)గా ఉన్న బ్యాటరీ రీప్లేస్మెంట్ ధరను 29 డాలర్లకు(రూ.1,850) తగ్గించినట్టు పేర్కొంది. త్వరలోనే ఈ ప్రక్రియను చేపడుతున్నామని తెలిపింది. కొత్త ఐఫోన్లను కస్టమర్లు కొనుగోలు చేయాలనే ఉద్దేశంతోనే కంపెనీ పాత ఫోన్లను స్లో డౌన్ చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఫోన్ లైఫ్‌ను పెంచేందుకే వాటిని స్లోడౌన్ చేసినట్లు ఆపిల్ పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఐఫోన్ డివైజ్‌లను స్లోడౌన్ చేసిందని కంపెనీపై కాలిఫోర్నియా, న్యూయార్క్ వంటి దేశాల్లో ఎనిమిది దావాలు నమోదయ్యాయి. ఫ్రాన్స్‌లో లీగల్ ఫిర్యాదు కూడా దాఖలైంది. ఫిర్యాదుదారులు మిలియన్ డాలర్లను పరిహారంగా కూడా కోరుతున్నారు. ఇజ్రాయిల్ ఇదే సమస్యపై సుమారు 120 మిలియన్ డాలర్లకు ఓ దావా దాఖలైంది. -
ఏలేరు.. కానరాని జోరు!
ఆధునికీకరణపై ప్రభుత్వం నాన్చుడు ధోరణి వైఎస్ హయాంలో శంకుస్థాపన మొదటి విడతగా రూ.138 కోట్ల కేటాయింపు ఆయన మరణానంతరం నిధులివ్వని సీఎంలు మొక్కుబడిగా తొలిదశ పనులు {పతిపాదనలకే పరిమితమైన రెండో దశ జగ్గంపేట : జిల్లాలోని మెట్టప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడంలో కీలక భూమిక పోషిస్తున్న ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణలో ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. 24 టీఎంసీల సామర్థ్యమున్న ఏలేరు జలాశయం కింద ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం నియోజకర్గాల పరిధిలోని ఏడు మండలాల్లో 67 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నుంచి శివారు ఆయకట్టుకు సక్రమంగా నీరందడం లేదు. దీంతో నీటి ఎద్దడి సమయంలో శివారు రైతులు నష్టపోతున్నారు. ఇదే సమయంలో వరదలు వచ్చినప్పుడు ముంపు బారిన పడి నష్టం చవిచూస్తున్నారు. వాస్తవానికి ఏలేరు కింద ప్రస్తుతం 53 వేల ఎకరాలే సాగవుతోంది. వీరవరం, వేలంక, సింహద్రిపురం, జగపతినగరం తదితర గ్రామాల్లో శివారు ప్రాంతాలకు నీరందడం లేదు. దీంతో శివారు ఆయకట్టు రైతులు బోర్లపై ఆధారపడుతున్నారు. పూడుకుపోయిన కాలువలు, ఎత్తుపల్లాలు, దెబ్బతిన్న స్లూయిజ్‌లు, బెడ్ రెగ్యులేటర్లవంటివాటితో ఏలేరు నీటిపారుదల వ్యవస్థ దెబ్బ తింది. దీంతో ఆధునికీకరణ అంశం తెరపైకి వచ్చింది. ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి ఈ ప్రాంత రైతులు ఏలేరు ఆధునికీకరణ అంశాన్ని తీసుకువచ్చారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత ఏలేరు ఆధునికీరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. 2009 ఫిబ్రవరిలో ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద రూ.138 కోట్లతో ఏలేరు ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన రెండోసారి అధికారంలోకి రావడంతో ఏలేరు పనులు పూర్తవుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఆయన హఠాన్మరణం చెందడంతో.. తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ఏలేరు ఆధునికీకరణకు నిధుల విడుదలలో జాప్యం చేస్తువచ్చారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, పెండెం దొరబాబు, తోట సుబ్బారావునాయుడు, చలమలశెట్టి సునీల్ తదితరులు ఏలేశ్వరం నుంచి పిఠాపురం వరకూ పాదయాత్ర చేయడంతో నిధులు మంజూరయ్యాయి. వైఎస్ ఇచ్చిన జీఓ ప్రకారం రూ.138 కోట్లు కేటాయించగా.. వీటిలో ప్రాజెక్టు హెడ్వర్క్సకు రూ.7 కోట్లు, తిమ్మరాజుచెరువుకు రూ.3 కోట్లు కేటాయించారు. మిగిలిన రూ.127.54 కోట్లలో భూసేకరణకు సుమారు రూ.20 కోట్లు, వ్యాట్, సెస్వంటివాటికి రూ.10 కోట్లు పోను మిగిలిన రూ.97 కోట్లతో తొలి దశ పనులు చేపట్టాల్సి ఉంది. తొలిదశ కాంట్రాక్టును హైదరాబాద్‌కు చెందిన గాయత్రీ ప్రాజెక్టు సంస్థ పొందింది. తొలిదశ ప్రతిపాదిత పనులివే.. తొలిదశలో ఏలేరు ఇరిగేషన్ కాలువకు 16 బెడ్ రెగ్యులేటర్ల నిర్మాణం, డబ్బకాల్వ, యర్రకాల్వ, గొర్రిఖండి, వీరవరం కాల్వలు వెడల్పు చేసి ఆధునికీకరించడం చేపట్టాల్సి ఉంది. ఇందుకు 182 ఎకరాల భూము లు సేకరించాలి. ఈ ప్రతిపాదనలను ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే కలెక్టర్‌కు పంపారు. భూసేకరణ పూర్తయితేనే పనులు జరుగుతాయి. అలాగే ఎస్.తిమ్మాపురం వద్ద బెడ్ రెగ్యులేటర్ నిర్మించాల్సి ఉంది. దివిలివద్ద బెడ్ రెగ్యులేటర్ పనులు మాత్రం మొక్కుబడిగా చేపట్టారు. రెండో దశలో రూ.167 కోట్లతో ప్రతిపాదనలు ఏలేరు రెండో విడత ఆధునికీకరణకు ఇరిగేషన్ అధికారులు రూ.167 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. సుమారు 75 వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలో కలిసేలా ఎస్.తిమ్మాపురంవద్ద బెడ్ రెగ్యులేటర్ నుంచి గొర్రిఖండి, సుద్దగెడ్డ మీదుగా యు.కొత్తపల్లి వరకూ ఒకవైపు, కాండ్రకోటవైపు దబ్బ కాలువ, నగరం ఖండిల మీదుగా రెండోవైపు కాలువలను ఆధునికీకరించాలని నిర్ణయించారు. ప్రాజెక్టు కమిటీకి సవాల్‌గా మారిన ఆధునికీకరణ ఏలేరుకు తొలిసారిగా ప్రాజెక్టు కమిటీని నియమించారు. దానిముందు ఆధునికీకరణ అంశం సవాల్‌గా ఉంది. సర్కారు నాన్చుడు ధోరణి నేపథ్యంలో ఈ కమిటీ ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే. ప్రాజెక్టులో రబీకి సరిపడే నీరు లేనందున పనులు చేపట్టే ఆలోచనలో ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. అయితే రబీకి నీరవ్వకపోతే నష్టపోతామని రైతులు అంటున్నారు. దీనిపై కమిటీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.