న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం జనవరిలో నెమ్మదించింది. మొత్తం అమ్మకాల్లో వేగం లేకపోవడం దీనికి కారణం. ఎస్‌అండ్‌పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జనవరిలో 55.4గా నమోదయ్యింది. డిసెంబర్‌లో ఈ సూచీ 57.8 వద్ద ఉంది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తగినంత సిబ్బంది ఉండడం వల్ల ఈ సంఖ్యలో ఎటువంటి పెరుగుదలా నమోదుకాలేదని తమ సర్వే వెల్లడించినట్లు ఎస్‌అండ్‌పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్‌లో ఎకనామిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీలిమా పేర్కొన్నారు.
కాగా, సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా ఆ దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన సూచీ 19 నెలలుగా అప్‌ట్రెండ్‌లోనే ఉందన్నమాట. నెలవారీగా నెమ్మదించినప్పటికీ, తయారీ రంగం అప్‌ట్రెండ్ దోరణిలోనే ఉన్నట్లు పోలీయానా డీ లిమా తెలిపారు. కాగా, ద్రవ్యోల్బణానికి సంబంధించి డిసెంబర్‌లో కొంత ఒత్తిడి ఉన్నట్లు తమ సర్వేలో వెల్లడయినట్లు డీ లిమా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment