Millionaire Bryan Johnson C Diet Plan Includes 110 Pills Rs 16 Crore Per Year - Sakshi
Sakshi News home page

ఏడాదికి రూ. 16కోట్ల ఖర్చు, నో గర్ల్‌ ఫ్రెండ్,నో సెక్స్‌: టెక్‌ మిలియనీర్‌ సీక్రెట్‌ 

Published Sat, Aug 12 2023 12:19 PM | Last Updated on Sat, Aug 12 2023 3:06 PM

millionaire Bryan Johnson c diet plan includes 110 pills Rs 16 crore per year - Sakshi

Slow Down the Ageing Process: టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనే లక్ష్యంతో ఒక్కో అవయవాన్ని యవ్వనత్వంతో నింపుకుంటున్న బ్రయాన్ జాన్సన్ తాజాగా తన సక్సెస్‌ సీక్రెట్‌ను పంచుకున్నాడు. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేసే ప్రయత్నంలో ప్రతీరోజూ కఠినమైన వ్యాయామంతోపాటు చాలా డబ్బు ఖర్చు చేస్తున్నట్టు కాలిఫోర్నియాకు చెందిన ఐటీ డెవలపర్ బ్రయాన్ జాన్సన్ తెలిపాడు. ప్రస్తుతం తనకు 18 ఏళ్ల యువకుడికి ఉండే ఊపిరి తిత్తులు, 37 ఏళ్లవయసునాటి గుండె ఉన్నాయని జాన్సన్  మరోసారి గుర్తు చేశాడు.  (గోల్డ్‌ హిస్టరీ: అతిపెద్ద పతనం తులం ధర రూ.63.25 లే!)

యవ్వనంగా ఉండాలనే తపనతో  చేసే వ్యాయామం మాత్రమే సరిపోవడంలేదని ఇందుకోసం ఏడాదికి ఏకంగా సుమారు 16.4 కోట్లు(2 మిలియన్ల డాలర్లు) ఖర్చు చేస్తున్నట్టు తెలిపాడు. అయినా చెప్పుకోదగ్గ ప్రయోజనం లేదు. అందుకే మరింత యవ్వనంగా ఉండేందుకు రోజూ 110 మాత్రలు వేసుకుంటున్నట్లు తెలిపాడు. అలాగే ఎప్పుడూ ఒకే సమయంలో నిద్రపోతా. ఉదయం 11 గంటల తర్వాత ఏమీ తినను.. నో సెక్స్‌.. కనీసం గర్ల్‌ ఫ్రెండ్‌ కూడా లేదు అంటూ ఆశ్చర్యకరమైన విషయాలను తెలిపాడు. 

ఉదయం 3 ఔన్సుల వైన్ తీసుకోవడం ప్రయోజనకరమని స్పష్టం చేశాడు.  ఆహారంలో భాగంగా 100కి పైగా మాత్రలు తీసుకుంటా.. అదీ అశ్వగంధ, పసుపు, వెల్లుల్లి, అకార్బోస్ లాంటి ఆయుర్వేద మందులు మాత్రమే. దీంతో పాటు హార్మోన్లు, ఇతర పదార్ధాల సమ్మిళితమైన గ్లూకోసమైన్ సల్ఫేట్ తీసుకుంటానని, ఇవే సుదీర్ఘ జీవితానికి రహస్యమని పేర్కొన్నాడు. అత్యంత రెజిమెంటెడ్‌ షెడ్యూల్, కఠిన ఆహార నియమాలు వ్యాయామంతో పాటుగా నెలవారీ ప్రాతిపదికన అనేక రకాల వైద్య ఆపరేషన్లు తప్పవని వెల్లడించాడు. 30 నిమిషాల పాటు వ్యాయామం అదీ కూడా 30 మంది వైద్యుల సిబ్బంది పర్యవేక్షణలో 20,000 సిట్-అప్‌లకు సమానమైన ఎక్స్‌ర్‌సైజ్‌ చేస్తాడట. ఇందుకోసం ప్రత్యేకమైన పరికరాలను కూడా  ఏర్పాటు చేసుకున్నానన్నాడు. (IT refund scam: తెలుసుకోండి: లేదంటే కొంప కొల్లేరే!)

 

రోజూ 7 రకాల క్రీములు 
జాన్సన్ ప్రతిరోజూ ఏడు వేర్వేరు క్రీములు వాడతాడు. ఇందులో విటమిన్లు  సి, ఇ , బి3, ఫెరులిక్ యాసిడ్ , అజెలైక్ యాసిడ్ లాంటి ఉన్నాయి.  0.1 శాతం ట్రెటినోయిన్ టాపికర్‌ క్రీమ్‌, ప్రతి ఉదయం SPF 30, బాడీ మాయిశ్చరైజింగ్ క్రీమ్‌  పడుకునే ముందు సెరావ్ నైట్ క్రీమ్‌ పూసుకుంటాడు.

ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫేస్‌ ఇంజెక్షన్లు
స్కిన్‌ కేర్‌  కోసం  వీక్లీ యాసిడ్ పీల్స్, లేజర్ థెరపీ, మైక్రోనీడ్లింగ్ అబ్బో ఇలా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఫేస్‌కి ఫ్యాట్‌ ఇంజెక్షన్ (దీనిక తేనెటీగ కుట్టినంత భయంకరంగా ఉబ్బిపోతుందట)  మైక్రోబోటాక్స్ ఇంజెక్షన్లు,  కొల్లాజెన్ ఉత్పత్తి కోసం పలు ఇంజెక్షన్లతో సహా వివిధ చర్మ సంరక్షణ చికిత్సలు తీసుకుంటాడు. 10 ఏళ్ల వయసులో ఉండే  నున్నని మెరుపు, 14 ఏళ్ల వయస్సులో ఉండే మెరిసే చర్మం వచ్చిందట.

దీన్ని కొనసాగించడం కష్టంగాను, చాలా పెయిన్‌పుల్‌గా అనిపించినప్పటికీ "ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ తన వయస్సును1.01 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లడమే తన లక్ష్యమని చెప్పారు. పరిగెత్తుతున్న వృద్ధాప్యమనే  రైలుకు బ్రేక్‌లు వేయాలంటే సామాన్యమైన విషయంకాదు, కఠోర శ్రమ అంతకు మించిన డబ్బు కూడా ఉండాలంటాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement