tech CEOs
-
మాజీ రెజ్లర్‌ను పెళ్లాడిన టెక్ సీఈఓ అంకుర్ జైన్.. ఫోటోలు
భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త, బిలినీయర్ 'అంకుర్ జైన్' గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. భారతీయ మూలాలున్న ఈయన బిల్ట్ రివార్డ్స్ సీఈఓగా ఉన్నారు. ఇటీవల ఈయన మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ 'ఎరికా హమ్మండ్'ను వివాహం చేసుకుని ఓ ఇంటివారయ్యారు.అంకుర్ జైన్, ఎరికా హమ్మండ్ ఏప్రిల్ 26న ఈజిప్ట్‌లోని పిరమిడ్స్ ఎదురుగా పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లి వేడుకలకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు.. పలువురు వ్యాపార, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.పెళ్లి కొంత భిన్నంగా ఉండాలనే ఆలోచనతోనే వారు దక్షిణాఫ్రికాలోని సఫారీ సందర్శనలో మొదలు పెట్టి ఈజిప్ట్‌లో పెళ్లి వేడుకలను ముగించారు. న్యూయార్క్ సిటీకి చెందిన భారత సంతతి బిలియనీర్ అంకుర్ జైన్ రంబుల్ బాక్సింగ్ జిమ్‌కి వెళ్లే సమయంలో.. ఎరికా హమ్మండ్, అంకుర్‌కు ఫిజికల్ ట్రైనర్‌గా వ్యవహరించారు. ఈ పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది.ఎవరీ ఎరికా హమ్మండ్?ఎరికా హమ్మండ్ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్. ఆమె రెజ్లింగ్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఫిట్నెస్ కోచ్‌గా మారింది. ఈ సమయంలోనే బిలినీయర్ 'అంకుర్ జైన్'ను కలుసుకున్నారు. ఈమె స్ట్రాంగ్ అనే యాప్ కూడా స్టార్ట్ చేశారు. View this post on Instagram A post shared by Ankur Jain (@ankurjain) -
పక్క కంపెనీల నుంచి లాగేసుకోవడం కరెక్టేనా? టెక్ సీఈవోల మాటలు ఇవే..
అన్ని పరిశ్రమల్లోనూ పోటీ అనేది సర్వసాధారణం. అయితే ఇది ఐటీ పరిశ్రమలో మరీ ఎక్కువైంది. పోచింగ్ (ఉద్యోగుల అక్రమ వలసలు) ఐటీ కంపెనీల మధ్య అనారోగ్యకరమైన పోటీకి దారితీస్తోంది. దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది. దేశీయ ఐటీ దిగ్గజాలు విప్రో, ఇన్ఫోసిస్‌ల నుంచి చాలా మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లు బయటికి వెళ్లిపోయారు. వీరిలో చాలా మంది ప్రత్యర్థి కాగ్నిజెంట్‌లో చేరారు. కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ తాను ఇంతకుముందకు పనిచేసిన ఇన్ఫోసిస్, విప్రో నుంచి దాదాపు 20 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకున్నట్లు సమాచారం. విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ హక్ సహా 10 మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లను కాగ్నిజెంట్‌కు కోల్పోయింది. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయడానికి కాగ్నిజెంట్‌పై దావా వేసింది. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు సీఎఫ్ఓ జతిన్ దలాల్‌ను రూ.25.15 కోట్ల నష్టపరిహారం కోరింది. ఐటీ కంపెనీల మధ్య సాగుతున్న ఈ పోచింగ్ వార్‌పై ఆయా కంపెనీల సీఈవోలు స్పందించారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా సీఎన్‌బీసీ-టీవీ18తో ఎవరెవరు ఏమేమి అన్నారో ఇప్పుడు చూద్దాం.. ఒప్పందాన్ని గౌరవించడం ముఖ్యం తాము ఎవరికీ ఉపాధి లేదా ఉద్యోగ అవకాశాలను నిరోధించడం లేదని, సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించడం చాలా ముఖ్యం, ఇదేమీ అసమంజసమైన అభ్యర్థన కాదని విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ అన్నారు. ఒప్పంద ఉల్లంఘనతో తమ సంస్థ సమాచార గోప్యతకు భంగం కలగకుండా తమను తాము రక్షించుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు. మేము అదృష్టవంతులం ఇన్ఫోసిస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సలీల్ పరేఖ్ స్పందిస్తూ "మేము అదృష్టవంతులం. మాకు నాయకత్వ కొరత లేదు. కంపెనీ నాయకత్వ పునర్నిర్మాణాన్ని చాలా త్వరగా పూర్తి చేశాం. కంపెనీలో ఉన్న చాలా మందిని పెద్ద బాధ్యతాయుతమైన పాత్రలలోకి తీసుకున్నాం. అది నిజంగా బాగా పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది. కాబట్టి నాకు ఎటువంటి ఆందోళనా కనిపించడం లేదు. నిజానికి మార్పు వల్ల కొన్నిసార్లు ప్రయోజనం కలుగుతుంది" అన్నారు. మాకేం డోకా లేదు "మేము చాలా కాలం నుంచి చాలా స్థిరమైన నాయకత్వాన్ని కలిగి ఉన్నాం. మా తోటివారిలో కొందరికి ఇది రాజీగా అనిపిస్తుంది. కానీ మేము మంచి స్థానంలో ఉన్నందుకు సంతోషిస్తున్నాము" అని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సి.విజయకుమార్ పేర్కొన్నారు. నా పని మాత్రమే చేస్తున్నా.. “నేను నా పని మాత్రమే చేస్తున్నాను. నేను కాగ్నిజెంట్‌ను ఉద్యోగులు కోరుకునే కంపెనీగా మార్చాలనుకుంటున్నాను” అని కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ అన్నారు. "ఇది స్థిరమైన ప్రక్రియ. నేను మొదటి నుంచి ఇదే చెప్తున్నాను. కంపెనీ కోసం సమర్థులైనవ్యక్తులను అన్వేషించడమే నా పని. మాకు క్లయింట్ సెంట్రిసిటీ డీఎన్ఏ ఉంది. కంపెనీ వారసత్వాన్ని నేను పునరుద్ధరిస్తున్నాను” అన్నారాయన. -
అప్పట్లో గూగుల్‌లో అత్యధిక జీతం.. ఇప్పుడు ఏకంగా బిలియనీర్
నేటి రోజుల్లో బిలియనీర్ అవడం అనేది అసాధ్యమైన విషయమేమీ కాదు.. పాలో ఆల్టో నెటవర్క్స్ సీఈవో నికేష్ అరోరా (Nikesh Arora)నే అందుకు ఉదాహరణ. ఒకప్పుడు గూగుల్‌లో అత్యధిక జీతం అందుకున్న ఆయన ఇప్పుడు ఏకంగా బిలియనీర్ అయ్యారు. గూగుల్‌లో ఎగ్జిక్యూటివ్ స్థాయిలో పనిచేసిన నికేష్ అరోరా అత్యధిక వేతనం అందుకున్నారు. ఆ తర్వాత సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ ఆయన్ను ప్రపంచంలోనే అత్యుత్తమ ప్యాకేజీ చెల్లించి నియమించుకుంది. ప్రస్తుతం పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌లో చేరిన ఆయన బిలియనీర్ల జాబితాలోకి అడుగుపెట్టాడు. సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ పరిశ్రమ బూమ్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదే ఉదాహరణ. నికేష్ అరోరా నెట్‌వర్త్ ఇప్పుడు 1.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.12 వేల కోట్లు)గా ఉంది. అరుదైన టెక్ సీఈవో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. వ్యవస్థాపకుడు కాకుండా బిలియనీర్ అయిన అరుదైన టెక్ సీఈవోగా నికేష్ అరోరా నిలిచారు. పాలో ఆల్టో నెట్వర్క్స్ 2018లో నికేష్ అరోరాను నియమించుకున్నప్పుడు 125 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్లను ఆయనకు అందించింది. హై-ప్రొఫైల్ హ్యాకింగ్లు ఎక్కువవుతన్న నేపథ్యంలో వ్యాపార సంస్థలకు సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ ఆవశ్యకత పెరిగింది. ఈ క్రమంలో కంపెనీ షేర్ ధర నాలుగు రెట్లు పెరిగింది. దీంతో అరోరా వాటా 830 మిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతకంతకూ పెరిగిన సంపద ఈ స్టాక్‌లు, వేతనం, సంస్థలో చేరినప్పుడు లభించిన 3.4 మిలియన్ డాలర్లు ఇలా అన్ని కలుపుకొని నికేష్ అరోరా నెట్‌వర్త్ ఇప్పుడు సుమారు 1.5 బిలియన్ డాలర్లకు చేరింది. కాగా అరోరా 2023లో దాదాపు 300 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించినట్లు నివేదిక పేర్కొంది. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌లో అరోరా గతేడాది అందుకున్న పరిహారంలో అత్యధికంగా 7.5 లక్షల స్టాక్‌లు ఉన్నాయి. వీటి విలువ ప్రస్తుతం 220 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. -
ఏడాదికి రూ.16 కోట్లు, నో గర్ల్ ఫ్రెండ్, నో సెక్స్: టెక్ మిలియనీర్ సీక్రెట్
Slow Down the Ageing Process: టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనే లక్ష్యంతో ఒక్కో అవయవాన్ని యవ్వనత్వంతో నింపుకుంటున్న బ్రయాన్ జాన్సన్ తాజాగా తన సక్సెస్ సీక్రెట్‌ను పంచుకున్నాడు. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేసే ప్రయత్నంలో ప్రతీరోజూ కఠినమైన వ్యాయామంతోపాటు చాలా డబ్బు ఖర్చు చేస్తున్నట్టు కాలిఫోర్నియాకు చెందిన ఐటీ డెవలపర్ బ్రయాన్ జాన్సన్ తెలిపాడు. ప్రస్తుతం తనకు 18 ఏళ్ల యువకుడికి ఉండే ఊపిరి తిత్తులు, 37 ఏళ్లవయసునాటి గుండె ఉన్నాయని జాన్సన్ మరోసారి గుర్తు చేశాడు. (గోల్డ్ హిస్టరీ: అతిపెద్ద పతనం తులం ధర రూ.63.25 లే!) యవ్వనంగా ఉండాలనే తపనతో చేసే వ్యాయామం మాత్రమే సరిపోవడంలేదని ఇందుకోసం ఏడాదికి ఏకంగా సుమారు 16.4 కోట్లు(2 మిలియన్ల డాలర్లు) ఖర్చు చేస్తున్నట్టు తెలిపాడు. అయినా చెప్పుకోదగ్గ ప్రయోజనం లేదు. అందుకే మరింత యవ్వనంగా ఉండేందుకు రోజూ 110 మాత్రలు వేసుకుంటున్నట్లు తెలిపాడు. అలాగే ఎప్పుడూ ఒకే సమయంలో నిద్రపోతా. ఉదయం 11 గంటల తర్వాత ఏమీ తినను.. నో సెక్స్.. కనీసం గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు అంటూ ఆశ్చర్యకరమైన విషయాలను తెలిపాడు. ఉదయం 3 ఔన్సుల వైన్ తీసుకోవడం ప్రయోజనకరమని స్పష్టం చేశాడు. ఆహారంలో భాగంగా 100కి పైగా మాత్రలు తీసుకుంటా.. అదీ అశ్వగంధ, పసుపు, వెల్లుల్లి, అకార్బోస్ లాంటి ఆయుర్వేద మందులు మాత్రమే. దీంతో పాటు హార్మోన్లు, ఇతర పదార్ధాల సమ్మిళితమైన గ్లూకోసమైన్ సల్ఫేట్ తీసుకుంటానని, ఇవే సుదీర్ఘ జీవితానికి రహస్యమని పేర్కొన్నాడు. అత్యంత రెజిమెంటెడ్ షెడ్యూల్, కఠిన ఆహార నియమాలు వ్యాయామంతో పాటుగా నెలవారీ ప్రాతిపదికన అనేక రకాల వైద్య ఆపరేషన్లు తప్పవని వెల్లడించాడు. 30 నిమిషాల పాటు వ్యాయామం అదీ కూడా 30 మంది వైద్యుల సిబ్బంది పర్యవేక్షణలో 20,000 సిట్-అప్‌లకు సమానమైన ఎక్స్‌ర్‌సైజ్ చేస్తాడట. ఇందుకోసం ప్రత్యేకమైన పరికరాలను కూడా ఏర్పాటు చేసుకున్నానన్నాడు. (IT refund scam: తెలుసుకోండి: లేదంటే కొంప కొల్లేరే!) రోజూ 7 రకాల క్రీములు జాన్సన్ ప్రతిరోజూ ఏడు వేర్వేరు క్రీములు వాడతాడు. ఇందులో విటమిన్లు సి, ఇ , బి3, ఫెరులిక్ యాసిడ్ , అజెలైక్ యాసిడ్ లాంటి ఉన్నాయి. 0.1 శాతం ట్రెటినోయిన్ టాపికర్ క్రీమ్, ప్రతి ఉదయం SPF 30, బాడీ మాయిశ్చరైజింగ్ క్రీమ్ పడుకునే ముందు సెరావ్ నైట్ క్రీమ్ పూసుకుంటాడు. ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఫేస్ ఇంజెక్షన్లు స్కిన్ కేర్ కోసం వీక్లీ యాసిడ్ పీల్స్, లేజర్ థెరపీ, మైక్రోనీడ్లింగ్ అబ్బో ఇలా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఫేస్‌కి ఫ్యాట్ ఇంజెక్షన్ (దీనిక తేనెటీగ కుట్టినంత భయంకరంగా ఉబ్బిపోతుందట) మైక్రోబోటాక్స్ ఇంజెక్షన్లు, కొల్లాజెన్ ఉత్పత్తి కోసం పలు ఇంజెక్షన్లతో సహా వివిధ చర్మ సంరక్షణ చికిత్సలు తీసుకుంటాడు. 10 ఏళ్ల వయసులో ఉండే నున్నని మెరుపు, 14 ఏళ్ల వయస్సులో ఉండే మెరిసే చర్మం వచ్చిందట. దీన్ని కొనసాగించడం కష్టంగాను, చాలా పెయిన్పుల్గా అనిపించినప్పటికీ "ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ తన వయస్సును1.01 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లడమే తన లక్ష్యమని చెప్పారు. పరిగెత్తుతున్న వృద్ధాప్యమనే రైలుకు బ్రేక్‌లు వేయాలంటే సామాన్యమైన విషయంకాదు, కఠోర శ్రమ అంతకు మించిన డబ్బు కూడా ఉండాలంటాడు. -
అత్యధిక వేతనాలు అందుకుంటున్న టాప్ టెక్ కంపెనీ సీఈవోలు వీరే.. (ఫొటోలు)
-
ఇక వర్క్ ఫ్రం ఆఫీస్.. ఫ్లాట్ అద్దె రూ.2.5 లక్షలు.. 25 లక్షల అడ్వాన్స్!
బెంగళూరు: ఫ్లాట్ అద్దె అడ్వాన్సు రూ.25 లక్షలంటూ వచ్చిన ట్వీట్‌పై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ అనంతరం టెక్ ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోం నుంచి తిరిగి ఆఫీసులకు వస్తుండటంతో బెంగళూరులో ఇళ్ల అద్దెలు ఏ స్థాయిలో పెరిగాయనేందుకు ఉదాహరణ ఇది. నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఓ ఫ్లాట్‌కు అద్దె నెలకు రూ.2.5 లక్షలు కాగా, అడ్వాన్స్ రూ.25 లక్షలంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు పెద్ద సంఖ్యలో యూజర్లు ఛలోక్తులు సంధించడంతోపాటు మండిపోతున్న ధరలపై ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా అనంతరం ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోంతోపాటు ఆఫీసుల్లోనూ విధులకు హాజరవ్వాలంటూ ఉద్యోగులకు ఆప్షన్ ఇచ్చాయి. చాలా వరకు కంపెనీలు మళ్లీ ఆఫీసులకొచ్చి డ్యూటీ చేయాలంటూ ఆదేశాలిచ్చాయి. ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు చేరుతుండటంతో ఇళ్ల అద్దెలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఖరీదైన ప్రాంతాల్లోనైతే యజమానులు మరీ ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని తేజస్వీ శ్రీవాస్తవ అనే టెక్ కంపెనీ సీఈవో ట్విట్టర్లో ప్రస్తావించారు. హెచ్ఎస్ఆర్ లేఔట్‌లోని 4 బీహెచ్‌కే ఫ్లాట్‌కు నెల వారీ రెంట్ రూ.2.5 లక్షలు, డిపాజిట్ రూ.25 లక్షలంటూ ఉన్న ప్రకటనను చూసి ఆయన షాకయ్యారు. అడ్వాన్స్‌కు అవసరమైన మొత్తానికి లోన్ ఆప్షన్ కూడా ఉండటం ఆయన్ను మరింత షాక్‌కు గురి చేసింది. ఆయన ఈ ప్రకటనను స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్లో పెట్టారు. ‘కిడ్నీ అమ్ముకోవడానికి కూడా ఆప్షన్ ఉంటే బాగుండేది’అంటూ శ్రీవాస్తవ క్యాప్షన్ ఇచ్చారు. ఆ ట్వీట్లపై కామెంట్లు పోటెత్తాయి. కొందరు నెటిజన్లు ఇంటి అద్దెలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా ఇంకొందరు రుణం కోసం దరఖాస్తు చేసుకునే ఆప్షన్‌పై మండిపడ్డారు. చివరి రెండు సున్నాల ముందు చుక్క పెట్టడం మరిచిపోయారేమో అంటూ మరో వ్యక్తి వ్యంగ్యంగా కామెంట్ చేశారు. They should add an option: Apply for Kidney Donation.#Bangalore #HouseRent#Bengaluru #HSRLayout@peakbengaluru pic.twitter.com/KPyeKmkfyF — Tejaswi Shrivastava (@trulytazz) July 27, 2023 -
జాగింగ్‌కు వెళ్లిన టెక్ సీఈవో.. కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే..
ముంబైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ప్రైవేట్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'రాజలక్ష్మి విజయ్ రామకృష్ణన్' ఆదివారం ఉదయం మరణించారు. వర్లీ సముద్ర తీరంలో ఆమె జాగింగ్ చేస్తుండగా కారు ఆమెను ఢీకొట్టడం వల్ల మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆల్ట్రుయిస్ట్ టెక్నాలజీస్ (Altruist Technologies) బాస్ రాజలక్ష్మి విజయ్ ఆరోగ్యం పట్ల ఎప్పుడు శ్రద్ధ వహిస్తూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ప్రతి రోజూ జాగింగ్ చేస్తూ ఉండే రాజలక్ష్మి 2023 టాటా ముంబయి మారథాన్ పూర్తి చేసింది. అయితే నిన్న అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మరణించడం కుటుంబసభ్యులను ఒక్కసారిగా శోకసంద్రంలో ముంచేసింది. జాగింగ్ చేస్తున్న సమయంలో కారు వేగంగా వచ్చి ఆమెను ఢీ కొట్టడం వల్ల తలకు తీవ్రంగా గాయాలయ్యాయి, దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు మద్యం మత్తులో ఈ పని చేసి ఉండవచ్చని పొలిసులు భావిస్తున్నారు. ఒక టెక్ కంపెనీ సీఈఓ చనిపోవడంతో ముంబయి టెక్ పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. రాజలక్ష్మి విజయ్ రామకృష్ణన్ మృతికి కారణమైన డ్రైవర్ సుమెర్ ధర్మేష్ మర్చంట్‌గా గుర్తించారు, ఇప్పటికే అతని మీద వివిధ కేసులు నమోదైనట్లు పోలీసుల విచారణలో తేలింది. అంతే కాకుండా అతడు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పని చేస్తున్నట్లు, తన ఇంట్లో పార్టీ జరిగిన తరువాత తన ఫ్రెండ్‌తో కలిసి మహిళా సహోద్యోగిని ఇంటి దగ్గర డ్రాప్ చేసేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. దీనిపైన ఇంకా సమగ్రమైన విచారణ జరుగుతోంది. -
టెక్ దిగ్గజాలతో అధ్యక్షుడి భేటీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజాలతో భేటీ కానున్నారు. ఆపిల్ ఇంక్, అమెజాన్.కామ్ వంటి టెక్నాలజీ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ లతో ఆయన సోమవారం సమావేశం కానున్నట్టు తెలిసింది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించి, సర్వీసులను మెరుగుపర్చేందుకు ప్రైవేట్ రంగం సాయం కోసం వైట్ హౌజ్ చూస్తోందని తెలుస్తోంది. ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వ్యయాలను తగ్గించి 10 ఏళ్లలో 1 ట్రిలియన్ డాలర్లను అంటే దాదాపు రూ.64,47,170కోట్లకు పైగా పొదుపుచేసేందుకు ఓ ఆర్థిక అవకాశం ఉన్నట్టు అడ్మినిస్ట్రేటివ్ నమ్ముతోంది. ఈ నేపథ్యంలో మొత్తం 20 మంది చీఫ్ ఎగ్జిక్యూటివ్ లతో ఆయన చర్చలు చేపట్టనున్నారు. ఐటీని మెరుగుపరచడం ద్వారా ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ ఏజెన్సీల అవినీతి రూపుమొద్దించడం వంటి వాటిని కూడా చేపట్టాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఎగ్జిక్యూటివ్ లు ట్రంప్ రెగ్యులేటరీ విధానాలు, ఇతర కారణాలతో కొత్త అడ్మినిస్ట్రేషన్ కు అనుకూలంగా పనిచేస్తున్నారు. మే నెలలో ట్రంప్ అమెరికన్ టెక్నాలజీ కౌన్సిల్ ను కూడా ఏర్పాటుచేశారు. ట్రంప్ నిర్వహించబోయే ఈ భేటీలో పాల్గొనే వారిలో ఆల్ఫాబెట్ ఇంక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎరిక్, వెంచర్ క్యాపిటల్ సంస్థ క్లీనర్ పెర్కిన్స్ చైర్మన్ జాన్ దోర్ర్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఇంటెల్, క్వాల్ కామ్, ఒరాకిల్, అడోబ్ సిస్టమ్స్ ఇంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లు ఉన్నట్టు వైట్ హౌజ్ అధికారులు చెప్పారు. వచ్చే దశాబ్దం కల్లా ప్రభుత్వం ఖర్చులను 3.6 ట్రిలియన్ డాలర్ల(రూ.2,32,09,812కోట్లు) మేర తగ్గించాలని ట్రంప్ చట్టసభ్యులను ఆదేశించారు. బడ్జెట్ లో పేదవారికి ఆహారం అందించే ప్రొగ్రామ్స్, హెల్త్ కేర్ వంటి వాటిపై ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాక రక్షణ రంగంలో కూడా వ్యయాలను పెంచాలని ట్రంప్ భావిస్తున్నారు. ఐటీపై వార్షికంగా 80 బిలియన్ డాలర్లకు పైననే అమెరికా ప్రభుత్వం వెచ్చిస్తుందని 2016 యూఎస్ గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఆఫీసు రిపోర్టు అంచనావేసింది. దీనిలో క్లాసిఫైడ్ ఆపరేషన్లను కలుపలేదు. అదేవిధంగా ఈ భేటీలోనే ఏప్రిల్ లో అమెరికా తీసుకొచ్చిన వీసా ప్రొగ్రామ్ ను కూడా సమీక్షించనున్నారని తెలిసింది. అమెరికన్లకే పెద్దపీట వేసేలా వీసా ప్రొగ్రామ్ నిబంధనలను ట్రంప్ కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ల నుంచి ఆరా తీయనున్నారు.