డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత.. అమెరికాలో అక్రమంగా ఉంటున్న సుమారు 10.45 లక్షల మందిని బయటకు పంపే అవకాశం ఉందని సమాచారం. ఇందులో సుమారు 18వేల మంది భారతీయులు కూడా ఉన్నారు. అంటే ఈ ప్రభావం భారతీయులపై కూడా పడుతుందని స్పష్టమవుతోంది. ఈ తరుణంలో అమెరికాలో ఉంటున్న ఓ ఇండియన్ సీఈఓ చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
అమెరికాలోని పెర్‌ప్లెక్సిటీ ఏఐ కంపెనీ సీఈఓ అయిన అరవింద్ శ్రీనివాస్.. తన ఎక్స్ ఖాతాలో 'నేను గ్రీన్ కార్డు పొందాలనుకుంటున్నాను' అని ట్వీట్ చేశారు. దీనికి ఇలాన్ మస్క్ 'అవును' అని రిప్లై ఇచ్చారు. మస్క్ రిప్లై చూసిన అరవింద్.. చేతులు జోడించి ఉండే ఎమోజీ, లవ్ సింబల్‌తో రిప్లై ఇచ్చారు.
అరవింద్ శ్రీనివాస్ గ్రీన్ కార్డు గురించి ప్రస్తావించడం ఇదే మొదటిసారి కాదు. నేను గ్రీన్ కార్డు కోసం చాలా కాలంగా వేచి చూస్తున్నాను. అయినా నాకు లభించడం లేదని గతంలో కూడా వెల్లడించారు. దీనికి మస్క్ రిప్లై ఇస్తూ క్రిమినల్స్ అమెరికాలో సులభంగా అడుగుపెడుతున్నారు, కాను మేధావులు న్యాయబద్దంగా అమెరికాలో కాలు పెట్టడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నోబెల్ బహుమతి గ్రహీత దేశంలో కాలుపెట్టడం కంటే.. హంతకులు సులభంగా దేశంలోకి వచ్చేస్తున్నారని అన్నారు.
Yes
— Elon Musk (@elonmusk) December 14, 2024
ఎవరీ అరవింద్ శ్రీనివాస్
ఐఐటీ మద్రాసులో చదువుకున్న అరవింద్ శ్రీనివాస్.. బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. చదువు పూర్తయిన తరువాత ఓపెన్ ఏఐలో రీసెర్చ్ ఇంటర్న్‌గా కెరీర్ ప్రారంభించి, తరువాత గూగుల్, డీప్ మైండ్ వంటి వాటిలో కూడా పనిచేశారు. ఆ తరువాత పెర్‌ప్లెక్సిటీ స్థాపించడానికి ముందు.. మళ్ళీ ఓపెన్ఏఐలోనే పనిచేశారు. ఆ తరువాత 2022లో ఆండీ కొన్‌విన్స్‌కి, డెనిస్ యారట్స్, జానీ హో వంటి వారితో కలిసి పర్‌ప్లెక్సిటీని ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment