green card
-
గ్రీన్ కార్డ్ కి సిటిజెన్ షిప్ కి తేడా ఏంటి..?
-
ఇండియన్ కి గ్రీన్ కార్డ్ రావడానికి ఎంత టైం పడుతుంది..!
-
పెళ్లేందుకే రవణమ్మా.. గ్రీన్ కార్డు వస్తలేదు.. ఉద్యోగం దిక్కులేదు
అప్పుడెప్పుడో పదిహేనేళ్ల క్రితం ఆర్థిక మాంద్యం.. సాఫ్ట్వేర్ రంగం నేల చూపులు చూస్తున్న తరుణంలో భాస్కర భట్ల రాసిన వాక్యాలు మళ్ళీ ఇప్పుడు నిజమవుతున్నాయి. కొడుకు చదువు అయిపొయింది.. ఇక ఉద్యోగం రావడమే తరువాయి.. పెళ్లి చేసేద్దాం అనుకుంటున్న రవణమ్మకు కొడుకు ఆనాటి సామాజిక .. ఆర్ధిక పరిస్థితులు వివరిస్తూ ఒక సాంగ్ వేసుకుంటాడు.. అప్పటి పరిస్థితులకు సరిగ్గా కళ్ళకు కట్టినట్లుండే ఆ పాట అప్పట్లో మార్మోగిపోయింది. రికార్డింగ్ డాన్సులు.. ఆర్కెస్ట్రాలు.. యూత్ ఫెస్టివల్స్‌లో బాగా ప్రాచుర్యం పొందింది. ఇంతకూ భాస్కర భట్ల ఏమన్నాడంటేరియల్ ఎస్టేట్ ఏమో కుప్ప కూలిపోయిందిసాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏమో దెబ్బడి పోయిందిఈ సంగతులన్నీ పెద్ద మనసుతోనువ్వు అర్థం చేసుకునిఈ మంగళం మాని వేయ వలయునోఅవునట్టు మర్సిపోయానుఅమెరికా నుంచి మనోళ్లందరూతట్ట బుట్ట సర్దుకునివచ్చేస్తున్నారే తల్లీఎందుకేె రవణమ్మాపెళ్లేందుకే రవణమ్మాఎందుకె రవణమ్మాపెళ్లేందుకే రవణమ్మాతానూ దూర సందు లేదు యోతానూ దూర సందు లేదు యోతానూ దూర సందు లేదుమెడకేమో డోలా రవణమ్మాచిక్కెను ముక్క లేదుచిల్డ్ బీరు చుక్క లేదుగర్ల్ ఫ్రెండు లేదుకాల్చనీకి కింగ్ లేదుఈడ్చి కొడితే దమ్మిడీ లేదుఅప్పు కూడా పుడతా లేదుసినిమా లేదు సరదా లేదుఅతి గతి లేనే లేదుసాలరీలోస్తా లేదుసెల్ బిల్లు కడత లేదుబుర్ర పనిచేస్తా లేదువీకెండు సెలవు లేదుమింగా మెతుకు లేదు యోమింగా మెతుకు లేదు యోమింగా మెతుకు లేదుసంపెంగే నూనె రవణమ్మాసతాయించాకే రవణమ్మాఇలా సాగుతుంది ఆ పాట .. సరిగ్గా ప్రస్తుతం అమెరికాలో కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయ్. డొనాల్డ్ ట్రంప్ వచ్చాక పరిస్థితులు అమాంతం మారిపోయాయి అని చెప్పడం కాదుగానీ.. ముందునుంచే అమెరికన్ సాఫ్ట్ వేర్ పరిశ్రమతోబాటు జాబ్ మార్కెట్ బాగా నేలచూపులు చూస్తున్నాయి. ఆర్థిక మాంద్యం నాటి పరిస్థితులు లేకున్నా మొత్తానికి అమెరికాలో చదువు అవగానే ఉద్యోగం వస్తుంది అనే భ్రమలు ఐతే తొలిగాయి.వాస్తవానికి ఏటా లక్షల్లో భారతీయ విద్యార్థులు.. అమెరికాలో ఎమ్మెస్.. ఎంబీఏ.. ఫార్మా వంటి ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్తారు.. అప్పులు చేసి మరీ అక్కడకు వెళ్లి.. లక్షల్లో ఫీజులు కట్టి ముగ్గురు నలుగురు చిన్న చిన్న రూముల్లో ఇరుక్కుని.. వంట చేసుకుంటూ ఎడ్జస్ట్ అయి చదువుకుంటారు. కొందరు పార్ట్ టైం పేరిట పెట్రోల్ పంపులు.. షాపింగ్ మాల్స్ .. హోటళ్లలో పని చేసి ఖర్చులమందం డబ్బులు తెచ్చుకుని చదువు పూర్తి చేసేవారు. చేతికి మాస్టర్స్ డిగ్రీ రాగానే ఏదో ఉద్యోగం కుదురుకుంటుందన్న నమ్మకం కూడా ఉండేది.అయితే ఇప్పుడు రూల్స్ మారాయి.. దేశంలో రూలింగ్ కూడా మారిపోయింది. అమెరికాలో జన్మించినంతమాత్రాన గ్రీన్ కార్డు ఇవ్వాలన్న రూల్ లేదు అని ట్రంప్ ఒక టెంకి జెల్ల కొట్టారు. క్యాంపస్ దాటి బయటకు వచ్చి పార్ట్ టైం ఉద్యోగం చేయడమూ ఇప్పుడు చట్ట విరుద్ధమే. దీంతో అక్కడి విద్యార్థులు చేతి ఖర్చులకు డబ్బుకోసం ఇంటివైపు చూస్తున్నారు. అటు సాఫ్ట్ వేర్ రంగం కూడా గొప్పగాలేదు. ఇప్పటికే అక్కడ పని చేస్తున్న సీనియర్ల పరిస్థితి కూడా భయంభయంగా ఉంటోంది. దీంతో కొత్తగా డిగ్రీ చదవగానే ఉద్యోగం అనే నమ్మకాలూ పోతున్నాయి. దీంతో దాదాపు యాభై లక్షలు పెట్టి అక్కడ ఎమ్మెస్ చదవడం సాహసమేనని నిపుణులు అంటున్నారు. పైగా దేశంలోకి అక్రమంగా వచ్చేసి ఏదోలా ఉద్యోగం చేసేద్దాం అనుకునేవాళ్ళందరినీ తరిమేస్తామంటూ ట్రంప్ చేసిన ప్రకటన ఇంకోపెద్ద ప్రకంపన పుట్టిస్తోంది. ఇంకా H1-B వీసాల మీదా పరిమితి విధించారు. ఈ నేపథ్యంలో తమకు తెలిసినవాళ్లున్నారని అప్పులు చేసి అమెరికా రావద్దని.. అక్కడున్న తమ పరిస్థితే అంత గొప్పగాలేదని అక్కడివారు చెబుతున్నారు. పరిస్థితులు అంత సానుకూలంగా లేవు : పద్మనాభం సప్తగిరిఅక్కడి ప్రస్తుత పరిస్థితిపై జేపీ మోర్గాన్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పద్మనాభం సప్తగిరి మాట్లాడుతూ ఐటీ రంగం ఇప్పుడు ఒడుదుడుకులు ఎదుర్కొంటోందని.. అసాధారణ ప్రతిభ..నైపుణ్యాలు ఉంటే తప్ప ఉద్యోగం రావడం కష్టం అని అన్నారు. పరిస్థితులు గతంలో లా లేవని..మంచి స్కాలర్ షిప్‌తో మంచి యూనివర్సిటీలో సీట్ వస్తేనే అమెరికా రావాలని..ఇక్కడ ఏదోలా గెటాన్ అయిపోదాం అనుకుంటే కుదరదని అన్నారు. ఉద్యోగావకాశాలు కూడా మునుపు ఉన్నంత గొప్పగా లేవని..సీనియర్స్..ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళకు కొంత ఫరవాలేకున్నా ఫ్రెషర్స్‌కు ఓపెనింగ్స్ అంత సానుకూలంగా లేదని అన్నారు.పద్మనాభం సప్తగిరి, జేపీ మోర్గాన్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ -
ఇండియన్ సీఈఓ ట్వీట్.. మస్క్ రిప్లై: నెట్టింట్లో వైరల్
డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత.. అమెరికాలో అక్రమంగా ఉంటున్న సుమారు 10.45 లక్షల మందిని బయటకు పంపే అవకాశం ఉందని సమాచారం. ఇందులో సుమారు 18వేల మంది భారతీయులు కూడా ఉన్నారు. అంటే ఈ ప్రభావం భారతీయులపై కూడా పడుతుందని స్పష్టమవుతోంది. ఈ తరుణంలో అమెరికాలో ఉంటున్న ఓ ఇండియన్ సీఈఓ చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.అమెరికాలోని పెర్ప్లెక్సిటీ ఏఐ కంపెనీ సీఈఓ అయిన అరవింద్ శ్రీనివాస్.. తన ఎక్స్ ఖాతాలో 'నేను గ్రీన్ కార్డు పొందాలనుకుంటున్నాను' అని ట్వీట్ చేశారు. దీనికి ఇలాన్ మస్క్ 'అవును' అని రిప్లై ఇచ్చారు. మస్క్ రిప్లై చూసిన అరవింద్.. చేతులు జోడించి ఉండే ఎమోజీ, లవ్ సింబల్‌తో రిప్లై ఇచ్చారు.అరవింద్ శ్రీనివాస్ గ్రీన్ కార్డు గురించి ప్రస్తావించడం ఇదే మొదటిసారి కాదు. నేను గ్రీన్ కార్డు కోసం చాలా కాలంగా వేచి చూస్తున్నాను. అయినా నాకు లభించడం లేదని గతంలో కూడా వెల్లడించారు. దీనికి మస్క్ రిప్లై ఇస్తూ క్రిమినల్స్ అమెరికాలో సులభంగా అడుగుపెడుతున్నారు, కాను మేధావులు న్యాయబద్దంగా అమెరికాలో కాలు పెట్టడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నోబెల్ బహుమతి గ్రహీత దేశంలో కాలుపెట్టడం కంటే.. హంతకులు సులభంగా దేశంలోకి వచ్చేస్తున్నారని అన్నారు.Yes— Elon Musk (@elonmusk) December 14, 2024ఎవరీ అరవింద్ శ్రీనివాస్ఐఐటీ మద్రాసులో చదువుకున్న అరవింద్ శ్రీనివాస్.. బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. చదువు పూర్తయిన తరువాత ఓపెన్ ఏఐలో రీసెర్చ్ ఇంటర్న్‌గా కెరీర్ ప్రారంభించి, తరువాత గూగుల్, డీప్ మైండ్ వంటి వాటిలో కూడా పనిచేశారు. ఆ తరువాత పెర్ప్లెక్సిటీ స్థాపించడానికి ముందు.. మళ్ళీ ఓపెన్ఏఐలోనే పనిచేశారు. ఆ తరువాత 2022లో ఆండీ కొన్విన్స్కి, డెనిస్ యారట్స్, జానీ హో వంటి వారితో కలిసి పర్ప్లెక్సిటీని ప్రారంభించారు. -
ఫోన్‌ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. ప్రభాకర్‌రావుకు అమెరికాలో గ్రీన్‌కార్డు?
సాక్షి,హైదరాబాద్:ఫోన్ ట్యాపింగ్ కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటివరకు విచారణకు హాజరుకాని ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు తాజాగా అమెరికాలో గ్రీన్ కార్డు వచ్చినట్లు సమాచారం. అమెరికాలో సెటిల్ అయిన కుటుంబసభ్యుల ద్వారా ఆయన కొద్దిరోజుల క్రితమే గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరయినట్టు తెలుస్తోంది.గ్రీన్ కార్డు మంజూరు విషయం తెలిసి ఫోన్‌ట్యాపింగ్ కేసు దర్యాప్తు అధికారులు ఈ విషయమై ఆరా తీశారు. ప్రభాకర్‌రావుకు గ్రీన్‌కార్డు లభించడంతో దర్యాప్తులో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు పై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు.కాగా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్‌ట్యాపింగ్ జరిగిందని ఆరోపిస్తూ దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో గతంలో ఇంటెలిజెన్స్‌లో పనిచేసిన పలువురు పోలీసు అధికారులను అరెస్టు చేసి విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును కూడా విచారించేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ ఆయన అమెరికా వెళ్లిపోవడంతో అది సాధ్యం కాలేదు. ఇదీ చదవండి: కేసు పెడితే పెట్టుకో.. దేనికైనా రెడీ: కేటీఆర్ -
యూఏఈ వీసా ఆన్ అరైవల్.. షరతులు వర్తిస్తాయి
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)సందర్శించాలనుకునే భారతీయులకు శుభవార్త. యూఏఈ ప్రభుత్వం భారత జాతీయుల కోసం నూతనంగా వీసా ఆన్ అరైవల్ విధానాన్ని ప్రకటించింది. అయితే, ఇందుకు ఓ షరతు విధించింది. అమెరికా, యూకే, ఇతర ఏదైనా యూరోపియన్ యూనియన్ దేశం శాశ్వత నివాస కార్డు లేదా వీసా ఉన్న వ్యక్తులే వీసా ఆన్ అరైవల్‌కు అర్హులు. ఈ విధానం ద్వారా యూఏఈలో అడుగు పెట్టిన వెంటనే వీరికి 14 రోజుల వీసా లభిస్తుంది. అవసరమైన ఫీజు చెల్లించిన పక్షంలో మరో 60 రోజుల వరకు దీనిని పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇందుకుగాను..అమెరికా వీసా, నివాస కార్డు లేక గ్రీన్ కార్డు ఉన్న వారు.. ఏదేని యూరోపియన్ యూనియన్ దేశం లేక యునైటెడ్ కింగ్డమ్ వీసా లేక నివాస ధ్రువీకరణ కార్డు ఉన్నవారు అర్హులు. కనీసం ఆరు నెలల వ్యాలిడిటీ ఉన్న పాస్‌పోర్టు కూడా వీరు చూపాల్సి ఉంటుంది. భారత్–యూఏఈల బంధం బలపడుతున్న వేళ ఈ నూతన విధానం అమల్లోకి రావడం విశేషం. యూఏఈలో ప్రస్తుతం 35 లక్షల మంది భారతీయులు ఉంటున్నారు. -
అమెరికాలో భారతీయులకు గుడ్‌న్యూస్.. మూడేళ్లు పొడిగింపు
అమెరికాలో గ్రీన్ కార్డ్ పునరుద్ధరణ కోసం సుదీర్ఘంగా నిరీక్షిస్తున్న భారతీయులకు ఆ దేశ ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. ఇటువంటివారి గ్రీన్ కార్డ్ చెల్లుబాటును 36 నెలలు పొడిగిస్తున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ప్రకటించింది.ఈ నిర్ణయం సెప్టెంబర్ 10 నుండి అమలులోకి వచ్చింది. యూఎస్సీఐఎస్ ప్రకారం.. గడువు ముగిసిన లేదా ముగింపునకు వచ్చిన గ్రీన్ కార్డ్ పునరుద్ధరణ కోసం ఫారమ్ I-90ని సమర్పించిన దరఖాస్తుదారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఫారమ్ I-90 రసీదు ఉన్నవారికి గతంలో గ్రీన్ కార్డ్ చెల్లుబాటు పొడిగింపు 24 నెలలు ఉండేది. ఇప్పడది 36 నెలలు అయింది.గ్రీన్‌కార్డ్ కాల వ్యవధి ముగిసినప్పుడు యూఎస్‌లో నివాసముంటున్నవారు తమ చట్టపరమైన స్థితికి రుజువుగా గడువు ముగిసిన గ్రీన్ కార్డ్‌తో పాటు కార్డ్ పొడిగింపు నోటీసులను సమర్పించవచ్చు. కొత్త కార్డు కోసం వేచి ఉన్నప్పుడు ఇది ఉపాధి అధికారంగా కూడా పనిచేస్తుంది.అమెరికాలో పనిచేసే వృత్తి నిపుణులకు శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డును జారీ చేస్తారు. దీని కాల వ్యవధి పదేళ్లు ఉంటుంది. ఆ తర్వాత దీన్ని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. గడువు ముగిసినవెంటనే కానీ లేదా మరో 6 నెలల్లో గడువు ముగుస్తుందనగా కానీ పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోవచ్చు.గ్రీన్ కార్డ్ హోల్డర్లు యునైటెడ్ స్టేట్స్ నుంచి బయటి దేశాలకు రాకపోకలు సాగించవచ్చు. అయితే ఏడాది కంటే ఎక్కువ కాలం దేశం విడిచి ఉండేందుకు వీలుండదు. ఒక వేళ అలా ఉంటే వారి గ్రీన్ కార్డ్ రద్దవుతుంది. వారు మళ్లీ దీని కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. -
అమెరికాలో వారి కలలు కల్లలేనా!?
ప్రణీత, జెఫ్రీన్, రోషన్ లాంటి పరిస్థితిని అమెరికాలో 2.50 లక్షల మంది ఎదుర్కొంటున్నారు. వీరిలో చాలామంది భారతీయు లే. వీరంతా చిన్నవయసులో తమ కుటుంబ సభ్యులతో కలిసి చట్టబద్ధంగానే అమెరికాకు చేరుకున్నారు. కానీ, అమెరికాలోనే శాశ్వతంగా ఉండే అవకాశం మాత్రం లేదు. వీసాలను మార్చుకోకపోతే 21 ఏళ్లు దాటగానే స్వదేశాలకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి. వీరిని డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ అని పిలుస్తున్నారు. ఇలాంటి వారికి అమెరికాలో ఉండేందుకు, ఉద్యోగాలు చేసుకొనేందుకు వీలు కలి్పంచాలని అధికార డెమొక్రటిక్ పార్టీ భా విస్తుండగా, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ మాత్రం అంగీకరించడం లేదు. బయటకు పంపించాల్సిందేనని పట్టుబడుతోంది. సెనేట్‌లో రెండు సార్లు వ్యతిరేకంగా ఓటు వేసింది. ఎందుకీ సమస్య? లాంగ్ టర్మ్ వీసా కలిగి ఉన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి డిపెండెంట్‌గా అమెరికాకు వచ్చినవారు 21 ఏళ్ల వయసు వచ్చేదాకా అమెరికాలో ఉండేందుకు వీలుంది. ఆ తర్వాత వీసా మార్చుకోకపోతే బయటకు వెళ్లిపోవాల్సిందే. తల్లిదండ్రులకు/ కుటుంబ సభ్యులకు గ్రీన్‌కార్డు(శాశ్వత నివాస హోదా) లభిస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. డిపెండెంట్లు కూడా అమెరికాలో నివసించేందుకు అవకాశం ఉంది. కానీ, గ్రీన్‌కార్డు లభించడానికి ఇప్పుడు 15 ఏళ్లకుపైగా సమయం పడుతోంది. ఈలోగా డిపెండెంట్లకు 21 ఏళ్ల వయసు దాటేస్తోంది. దాంతో వెనక్కి వెళ్లిపోవాల్సి వస్తోంది. ప్రతిభావంతులను వదులుకుంటారా? డిపెండెంట్లను బయటకు పంపించడాన్ని డెమొక్రటిక్ పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చట్టాన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అమెరికాలో జని్మంచకపోయినా ఇక్కడే పెరిగి, పెద్ద చదువులు చదువుకొని, ఉన్నత ఉద్యోగాలు కూడా చేస్తున్న ప్రతిభావంతులను వదులుకోవడం తెలివైన పని కాదని అంటున్నారు. దేశ అభివృద్ధికి వారి సేవలు అవసరమని చెబుతున్నారు. ఇక్కడ నేర్చుకున్న నైపుణ్యాలను మరో దేశం కోసం ధారపోయడం ఏమిటని వాదిస్తున్నారు. డాక్యుమెంటెడ్ డ్రీమర్స్‌కు అమెరికాలో నివసించే, ఉద్యోగాలు చేసుకొనేందుకు వీలు కలి్పంచే బైపారి్టషన్ అమెరికాస్ చి్రల్డన్స్ యాక్ట్ పెండింగ్‌లో ఉంది. ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చేలోగా తమకు చట్టబద్ధమైన నివాస హోదా కలి్పంచాలని డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ కోరుతున్నారు. → ఇండియాలో జని్మంచిన ప్రణీత 8 ఏళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వచి్చంది. క్లౌడ్ ఇంజనీరింగ్ చదివింది. శాశ్వత నివాస హోదా లేకపోవడంతో 15 ఏళ్లకుపైగా డిపెండెంట్‌గా నివసిస్తోంది. అమెరికాలో ఉండాలంటే తరచుగా వీసాలు మార్చుకోవాల్సి వస్తోంది.→ జెఫ్రీనా 2005లో ఏడేళ్ల వయసులో కుటుంబంతో కలిసి హెచ్4(డిపెండెంట్) వీసాపై అమెరికా వెళ్లింది. 2010లో ఆమె కుటుంబం గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంది. అదెప్పుడొస్తుందో తెలియదు. జెఫ్రీనాకు 21 ఏళ్లు దాటడంతో ఇండియాకు వెళ్లిపోవాలి.→ రోషన్ పదేళ్ల వయసులో తల్లి, సోదరుడితో కలిసి హెచ్4 వీసాపై అమెరికా వచ్చాడు. 16 ఏళ్లు అక్కడే చదువుకున్నాడు. సెమీకండక్టర్ల తయారీ కంపెనీలో చేరాడు. అమెరికాను తన సొంత దేశంగానే ఇన్నాళ్లూ భావించాడు. కానీ, అక్కడి ప్రభుత్వం అతన్ని గత నెలల్లో ఇండియాకు బలవంతంగా తిరిగి పంపించివేసింది. -
గెలిస్తే గ్రాడ్యుయేట్లకు గ్రీన్ కార్డ్.. ట్రంప్ హామీ
భారతదేశంలో మాత్రమే కాకుండా.. చాలా దేశాల్లోని విద్యార్థులు అమెరికాలో గ్రాడ్యుయేట్ చేయాలని ఉవ్విల్లూరుతూ ఉంటారు. అలాంటి వారు గ్రీన్ కార్డు పొందాలని కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ తరుణంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు.జరగబోయే ఎన్నికల్లో తాను గెలిస్తే.. అమెరికాలోని కాలేజీల్లో చదువుకుని గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమాతో పాటే వారికి గ్రీన్ కార్డు ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అధికారిలోకి వచ్చిన మొదటి రోజే ఇది అమలయ్యేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. జూనియర్ కాలేజీలో చదివే విద్యార్థులకు కూడా గ్రీన్ కార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.కరోనా సమయంలో దీన్ని అమలు చేయలేకపోయామని, ఇప్పుడు కూడా అమెరికా, చైనా నుంచి వస్తున్న విద్యార్థులు వీసా సమస్యల కారణంగా మన దేశంలో ఉండలేకపోతున్నారని అన్నారు. అమెరికాలో చదువుకుని వారు సొంత దేశాలకు వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు.గతంలో అమెరికాలోని విదేశీయలను వెళ్లగొట్టిన ట్రంప్ ఇప్పుడు రూటు మార్చారు. రెండోసారి అధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు ఎన్నికల బరిలో డిగ్గనున్నట్లు సమాచారం. సాధారణంగా వలస విధానం మీద తీవ్రంగా విరుచుకుపడే ట్రంప్.. ఈ సారి మాత్రం దీనికి భిన్నంగా వ్యాఖ్యానించారు. గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారికి.. తాను ఎన్నికల్లో గెలిస్తే గ్రీన్ కార్డు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు.అమెరికాలోకి అక్రమంగా చొరబడే వారి వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని.. లీగల్‌గా అమెరికాలోకి వస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ట్రంప్ గతంలోని చాలా సందర్భాల్లో పేర్కొన్నారు. అక్రమ వలసదారుల వల్లే నిరుద్యోగం, నేరాలు, దోపీడీ వంటివి పెరుగుతున్నాయని ట్రంప్ అన్నారు. -
జోబైడెన్ కీలక నిర్ణయం.. అమెరికాలోని విదేశీయులకు భారీ ఊరట!
వాషింగ్టన్ : వీసా దారులకు అమెరికా జోబైడెన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.అమెరికా పౌరుల భాగస్వాములకు సరైన డాక్యుమెంట్లు లేకపోయినా పర్మనెంట్ రెడిడెంట్స్ (గ్రీన్ కార్డ్) పొందే ప్రక్రియను సులభతరం చేస్తూ జో బైడెన్ కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు వైట్ హౌస్ తెలిపింది.నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్, మాజీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్‌లు పోటీపడుతున్నారు.ఈ తరుణంలో అమెరికా పౌరుల్ని ప్రసన్నం చేసుకునేందుకు జోబైడెన్ సర్కార్ పీఆర్ నిబంధనల్ని సడలించేందుకు సిద్ధమైంది.అయితే ఈ కొత్త రూల్స్ ప్రకారం..అమెరికా పీఆర్ కోసం అప్లయ్ చేసుకునేందుకు కాదని, ఇప్పటికే పీఆర్‌కు అర్హులైన వారికి మాత్రమే ఈ కొత్త నిబంధనలు వర్తించనున్నట్లు సమాచారం. గ్రీన్ కార్డ్ కావాలంటే అర్హులైన వారు వారి సొంత దేశంలోని యూఎస్ ఎంబసీ కార్యాలయం నుంచి అప్లయ్ చేసుకోవాల్సి ఉంది. కొత్త రూల్స్ అమెరికా విడిచి వెళ్లే అవసరం లేకుండా అక్కడి నుంచే పీఆర్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు.అమెరికా ఇమిగ్రేషన్ నిర్ణయంతో జూన్ 17,2024 ముందు వరకు వివాహ అయ్యిండి.. కనీసం అమెరికా పౌరులుగా కనీసం 10ఏళ్లు ఉంటే పీఆర్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు.ఇమ్మిగ్రేషన్ అధికారుల అంచనా ప్రకారం..పీఆర్ కోసం అప్లయ్ చేసుకునే వారి సంఖ్య 5లక్షలు ఉండొచ్చని అంచనా.అదనంగా, అమెరికన్ సిటిజన్లు దత్తత తీసుకున్న 50వేల మంది పిల్లలు ఉన్నారు. -
సొంత వాహనంలో చార్ధామ్ యాత్ర.. విధివిధానాలివే!
మే 10 నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపధ్యంలో యాత్రసాగించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం పలు ఏర్పాట్లు చేస్తోంది. రవాణా శాఖ కూడా ప్రయాణికులకు పలు మార్గదర్శకాలు జారీచేసింది. వీటి ప్రకారం గ్రీన్ కార్డ్ లేని వాహనాలను యాత్రా మార్గంలో అనుమతించరు. అలాగే వాహనాల్లో సంగీతాన్ని ప్లే చేయడంపై నిషేధం విధించారు. దీంతో పాటు వాహనాల్లో ప్రథమ చికిత్స బాక్సు తప్పనిసరి చేశారు.తేలికపాటి వాహనాలకు గ్రీన్‌కార్డు రుసుముగా రూ.400, భారీ వాహనాలకు రూ.600గా నిర్ణయించారు. చార్ధామ్ యాత్రకు సంబంధించి గురువారం మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అన్ని శాఖల సన్నాహాలను ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు. ఏప్రిల్ 10 నుంచి చార్ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నాలుగు ధామ్‌లలో హెలికాప్టర్ సర్వీస్ కోసం బుకింగ్ కూడా కొనసాగుతోంది.ఈ ఏడాది చార్ధామ్ యాత్రపై భక్తుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఇప్పటి వరకు 16.37 లక్షల మంది ప్రయాణికులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. హోటళ్లను కూడా ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. ఈ పరిస్థితులను చూస్తుంటే ఈసారి చార్ధామ్ యాత్ర గత రికార్డులను బద్దలు కొడుతుందని రాష్ట్ర పర్యాటక, దేవాదాయ శాఖ మంత్రి సత్పాల్ మహరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని నాలుగు ధామ్‌లను దర్శించుకునేందుకు గత ఏడాది 56.31 లక్షల మంది భక్తులు వచ్చారని తెలిపారు. -
గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కార్డు
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్‌కార్డు పొందాలంటే దరఖాస్తుదారులు చాలా ఏళ్లు ఎదురు చూడాల్సి వస్తోంది. ఇలాంటి వారికి ఊరట కలి్పస్తూ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కార్డు(ఈఏడీ) అందజేయాలని వైట్‌హౌస్ కమిషనర్ గురువారం ప్రభుత్వానికి అధికారికంగా సిఫార్సు చేశారు. అధ్యక్షుడు జో బైడెన్ ఆమోద ముద్ర వేస్తే ఈఏడీ మంజూరు ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనివల్ల లక్షలాది మంది భారతీయులకు లబ్ధి చేకూరుతుంది. -
అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు శుభవార్త!
అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు జో బైడెన్ సర్కారు శుభవార్త చెప్పింది. హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అక్కడ చట్టబద్ధంగా ఎలాంటి ఉద్యోగాలైనా చేసేందుకు అనుమతించే ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్–ఈఏడీ (అంటే వర్క్ పర్మిట్ అన్నమాట) గడువు కాలాన్ని ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు ఈఏడీల కోసం అప్లయ్ చేసుకునే వారికి లేదంటే రెన్యూవల్ కోసం ప్రయత్నిస్తున్న వారికి సైతం వర్తిస్తుంది. అమెరికాలో హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, 21 ఏళ్లలోపు వయసున్న వారి పిల్లలు ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా హెచ్-4 వీసాలు జారీ చేస్తుంటారు. అయితే హెచ్-4 వీసాదారులు అమెరికాలో ఉద్యోగం చేయాలంటే వారు తప్పనిసరిగా ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(ఈఏడీ), ఐ-765 కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు ప్రక్రియ పూర్తయి ఆథరైజేషన్ వస్తేనే వారు ఉద్యోగం చేసేందుకు అవకాశం లభిస్తుంది. అయితే ఈ ప్రక్రియ పూర్తవడానికి 6 నుంచి 8 నెలల సమయం పడుతుంది. కొన్ని సార్లయితే ఏడాదిపైనే పట్టొచ్చు. దీనివల్ల హెచ్-4 వీసాదారులు మంచి ఉద్యోగ అవకాశాలు కోల్పోవాల్సి వస్తోంది. వారి తల్లిదండ్రులకు గ్రీన్ కార్డ్ లేదంటే వారిని విడిచి పెట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతమున్న ఈఏడీ నిబంధనలు మార్చడంతో హెచ్-1 బీ వీసా దారులకు, వారి ఇతర కుటుంబ సభ్యులకు భారీ ఊరట కలిగినట్లైంది ఇటీవల ఓ నివేదిక ప్రకారం.. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ కోసం 1.05 మిలియన్లకు పైగా భారతీయులు క్యూలో ఉన్నారని నివేదిక హైలైట్ చేసింది. వారిలో 4 లక్షల మందికి పైగా భారతీయులు తమ జీవిత కాలంలో గ్రీన్ కార్డ్ కళ్లజూడలేరని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది! ఆ లోపే వారు కన్ను మూస్తారని అభిప్రాయపడింది. అమెరికాలో ఈ ఏడాది ఉద్యోగాధారిత గ్రీన్ కార్డ్ పెండింగు దరఖాస్తులు ఏకంగా 18 లక్షలు దాటాయి. వీటిలో ఏకంగా 63 శాతం, అంటే 11 లక్షలకు పైగా భారతీయులవే! దాదాపు 2.5 లక్షలు, అంటే 14 శాతంతో చైనా రెండో స్థానంలో ఉంది. -
అమెరికాలో సెటిలయ్యేందుకు ‘దొంగపెళ్లి’.. చుక్కలు చూపించిన అధికారులు!
అమెరికాలోని ఇల్లినాయిస్లో ఉంటున్న 35 ఏళ్ల భారతీయుడు యూఎస్‌లో స్థిరపడేందుకు, గ్రీన్ కార్డ్ సంపాదించే ఉద్దేశంతో అక్కడి మహిళను వివాహం చేసుకున్నట్టు దొంగ రుజువులు చూపి, మోసానికి పాల్పడ్డాడు. ఈ నేరానికి పాల్పడిన వివేక్ చౌహాన్‌కు ఈ కేసులో నేరం రుజువైతే గరిష్టంగా ఐదేళ్ల జైలుశిక్ష, 250,000 అమెరికన్ డాలర్ల జరిమానా విధిస్తామని యుఎస్ అటార్నీ ట్రిని ఇ రాస్ ప్రకటించారు. 2018, ఏప్రిల్ 2న చౌహాన్ మసాచుసెట్స్‌లోని వోర్సెస్టర్‌కు చెందిన అమెరికా పౌరురాలిని వివాహం చేసుకున్నాడు. అయితే వారి వివాహం నిజం కాదని పోలీసుల దర్యాప్తులో తేలింది. వివేక్ చౌహాన్ దంపతులు ఎప్పుడూ కలిసి నివసించలేదని, గ్రీన్ కార్డ్ పొందేందుకు వివేక్ చౌహాన్ ఆమెను ‘కాంట్రాక్ట్ మ్యారేజ్’ చేసుకున్నాడని కేసును విచారిస్తున్న అసిస్టెంట్ యూఎస్ అటార్నీ జాన్ డీ ఫాబియన్ పేర్కొన్నారు. 2018, జూన్ 1న వివేక్ చౌహాన్ తన భారతీయ పాస్‌పోర్ట్‌ను చూపించి, మారిన తన వైవాహిక స్థితిని పేర్కొంటూ, అమెరికాలో శాశ్వత నివాసాన్ని పొందేందుకు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి దరఖాస్తును సమర్పించాడు. ఈ నేపధ్యంలో 2019 మే నెలలో యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) అతనిని ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో వివేక్ చౌహాన్ ‘కాంట్రక్ట్ భార్య’ తాను చౌహాన్‌తో కలిసి ఉంటున్నట్లు అధికారులకు తెలియజేసింది. కాగా వివేక్ చౌహాన్‌ను 2021, నవంబర్‌లో యూఎస్సీఐఎస్ రెండవసారి ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో వివేక్ చౌహాన్ తాను తన భార్యతో కలిసి ఉంటున్నట్లు చెప్పాడు. పైగా తన భార్య గర్భవతి అని కూడా వారిని నమ్మబలికాడు. కాగా చౌహాన్‌ను వివాహం చేసుకున్న యూఎస్ మహిళ ఇటువంటి పలు మోసపూరిత వివాహాలకు పాల్పడిందని, యూఎస్సీఐఎస్ ఇంటర్వ్యూలలో అబద్దాలు చెప్పి, అధికారులను తప్పుదారి పట్టించిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. కాగా ఈ ఉదంతంలో చౌహాన్‌కు 2024 జనవరి 26న శిక్ష ఖరారు కానున్నదని సమాచారం. ఇది కూడా చదవండి: ఊహించని పరిస్థితుల్లో నాగసాకిపై అణుబాంబు? -
4 లక్షల భారతీయులు... గ్రీన్ కార్డ్ కళ్లజూడలేరు!
వాషింగ్టన్: అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 4 లక్షల మందికి పైగా తమ జీవిత కాలంలో గ్రీన్ కార్డ్ కళ్లజూడలేరని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది! ఆ లోపే వారు కన్ను మూస్తారని అభిప్రాయపడింది. అమెరికాలో ఈ ఏడాది ఉద్యోగాధారిత గ్రీన్ కార్డ్ పెండింగు దరఖాస్తులు ఏకంగా 18 లక్షలు దాటాయి. వీటిలో ఏకంగా 63 శాతం, అంటే 11 లక్షలకు పైగా భారతీయులవే! దాదాపు 2.5 లక్షలు, అంటే 14 శాతంతో చైనా రెండో స్థానంలో ఉంది. కానీ ఏటా గరిష్టంగా జారీ చేసే గ్రీన్ కార్డుల్లో ఏ దేశానికీ 7 శాతం కంటే ఇవ్వరు. ఈ నిబంధన వల్ల భారతీయులకు తీవ్ర అన్యాయం జరుగుతూ వస్తోంది. ఈ కారణంగా జీవిత కాలంలో గ్రీన్ కార్డు పొందలేని 4.24 లక్షల మందిలో ఏకంగా 90 శాతానికి పైగా భారతీయులే ఉంటారని అధ్యయనం చెబుతోంది. 83 లక్షల కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డు పెండింగ్ దరఖాస్తులు వీటికి అదనం! -
గ్రీన్‌కార్డులపై ‘కంట్రీ లిమిట్’ తొలగించండి
వాషింగ్టన్: గ్రీన్‌కార్డులపై 7 శాతంగా ఉన్న కంట్రీ లిమిట్‌ను తొలగించాలని సిలికాన్ వ్యాలీకి చెందిన ప్రముఖ భారత–అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ జైన్ భుతోరియా అమెరికా పాలకులకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పరిమితి వల్ల గ్రీన్‌కార్డుల కోసం అర్హులైన వారు సుదీర్ఘీకాలం నిరీక్షించాల్సి వస్తోందని చెప్పారు. అమెరికా రాజధాని వాషింగ్టన్లో భారతఅమెరికన్ పార్లమెంట్ సభ్యుడు రో ఖన్నా ఆధ్వర్యంలో తాజాగా జరిగిన యూఎస్–ఇండియా సదస్సులో అజయ్ జైన్ మాట్లాడారు. హెచ్–1 వీసాలపై లేని కంట్రీ లిమిట్ గ్రీన్‌కార్డులపై ఎందుకని ప్రశ్నించారు. అమెరికాలో ఇప్పుడు 8,80,000 మంది గ్రీన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్నారని తెలియజేశారు. వీరిలో భారత్, చైనా నుంచి వచ్చినవారి సంఖ్య అధికంగా ఉందన్నారు. పదేళ్లకుపైగా నిరీక్షిస్తున్నవారు చాలామంది ఉన్నారని గుర్తుచేశారు. చట్టాన్ని మార్చకపోతే మరో 50 సంవత్సరాలు ఎదురు చూడక తప్పదని తేల్చిచెప్పారు. -
Green Card: అమెరికాలో ఉద్యోగాలు కోరుకునే భారతీయులకు గుడ్‌న్యూస్
వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగాలు కోరుకునే భారతీయులకు మేలు చేకూర్చే ప్రక్రియ మరో అడుగు ముందుకు పడింది. ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్ కార్డ్ ఫర్ లీగల్ ఎంప్లాయ్మెంట్(ఈగిల్) యాక్ట్–2022ను అమెరికా అధ్యక్ష భవనం ఓకే చెప్పింది. బిల్లుపై ఈ వారంలోనే అక్కడి పార్లమెంట్ దిగువ సభలో ఓటింగ్ చేపట్టనున్నారు. ఇన్నాళ్లూ ప్రతి సంవత్సరంలో జారీచేసే గ్రీన్‌కార్డుల్లో ఒక్కో దేశానికి సంబంధించిన నిర్దిష్ట సంఖ్యలోనే కార్డులు ఇస్తారు. ఎవరికైనా అధిక వృత్తి నైపుణ్యాలు ఉన్నాసరే.. అప్పటికే ఆ దేశ కోటా పూర్తయితే వారికి గ్రీన్ కార్డు అమెరికా ఇవ్వలేకపోతోంది. ఈ పరిమితిని ఎత్తేస్తోంది. అంటే ఏ దేశంలో పుట్టాడనే అంశంతో సంబంధంలేకుండా అత్యున్నత వృత్తి నైపుణ్యం గల వ్యక్తులను ఒకే దేశం నుంచి ఎక్కువ సంఖ్యలో తీసుకునేందుకు ఈగల్ చట్టం అవకాశం కల్పిస్తుంది. చదవండి: (ఎలన్ మస్క్‌కు చుక్కలు చూపిస్తున్నారు!) -
‘గ్రీన్‌కార్డు’ సిఫార్సుల్లో కీలక కదలిక
వాషింగ్టన్: గ్రీన్ కార్డ్ దరఖాస్తుల ప్రాసెసింగ్, కేటాయింపు సమయాన్ని ఆర్నెల్లకు కుదించడంతో పాటు పెండింగ్ దరఖాస్తులన్నింటినీ 2023 ఏప్రిల్ కల్లా క్లియర్ చేయాలన్న సిఫార్సులపై అమెరికా దృష్టి నిశితంగా సారించింది. ఇవి ప్రస్తుతం డొమెస్టిక్ పాలసీ కౌన్సిల్ పరిశీలనలో ఉన్నాయి. అక్కడ ఆమోదం పొందితే తుది నిర్ణయం కోసం అధ్యక్షుడు జో బైడెన్ వద్దకు వెళ్తాయి. ఈ సిఫార్సులు అమలుకు నోచుకుంటే వేలాదిమంది భారతీయులకు లబ్ధి చేకూరనుంది. ఆసియా అమెరికన్లు తదితరులకు సంబంధించిన సలహా కమిషన్ గత మే నెలలో ఈ కీలక సిఫార్సులు చేయడం తెలిసిందే. భారతీయ మూలాలున్న పారిశ్రామికవేత్త అజయ్ జైన్ భుటోరియా కమిషన్ తొలి భేటీలో ఈ ప్రతిపాదనలు చేయగా ఏకగ్రీవ ఆమోదం లభించింది. బైడెన్‌కు భుటోరియా తొలినుంచీ గట్టి మద్దతుదారు. -
అమెరికాలో సెటిల్ కావడానికి ప్లాన్ చేసిన గొటబయా రాజపక్స!
కొలంబో: శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయా రాజపక్స అమెరికాలో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. యూఎస్ గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారని శ్రీలంక పత్రిక డైలీ మిర్రర్ వెల్లడించింది. గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి గొట బయా అర్హుడే. ఎందుకంటే ఆయన భార్య రోమా కు అమెరికా పౌరసత్వం ఉంది. భార్య, కుమారుడితో కలిసి అమెరికాలో స్థిరపడాలని గొటబయా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఓ హోటల్లో భార్యతో కలిసి ఉంటున్నారు. ఈ నెల 25న శ్రీలంకకు తిరిగివచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది నవంబర్ వరకూ థాయ్లాండ్లోనే ఉండిపోవాలని తొలుత అనుకున్నప్పటికీ స్వదేశానికి వచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. -
భారత నిపుణుల చూపు కెనడా వైపు
వాషింగ్టన్: హెచ్–1బీ వీసాలు, తదితర కాలం చెల్లిన ఇమిగ్రేషన్ విధానాల ఫలితంగా భారతీయ నిపుణులు అమెరికాకు బదులు కెనడాకు తరలిపోతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డు (శాశ్వత నివాస) హోదాను దేశాలవారీ కోటా ప్రకారం మంజూరు చేయడం కూడా ఇందుకు కారణమని తెలిపారు. హెచ్–1బీ వీసా గానీ, శాశ్వత నివాస హోదా పొందడం గానీ కెనడాతో పోలిస్తే అమెరికాలో కష్టతరమైన విషయం కాబట్టే ఇలా జరుగుతోందన్నారు. అమెరికాకు రావాల్సిన భారత నిపుణులు, విద్యార్థులు కెనడా వైపు మొగ్గు చూపడాన్ని ఆపేందుకు తక్షణమే తగు చర్యలు చేపట్టాలని కోరారు. కాంగ్రెస్ అనుమతి కోసం ఎదురుచూడకుండా, ఉద్యోగిత ఆధారంగా భారతీయులకు ఇచ్చే మూడు రకాలైన వీసాల సంఖ్యను ప్రస్తుతమున్న 9,15,497 నుంచి 2030కల్లా 21,95,795కు పెరిగేలా చూడాలని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టువార్ట్ ఆండర్సన్ చెప్పారు. గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్లుగా, దశాబ్దాలుగా ఎదురుచూసే వారి సంఖ్యను 20 లక్షల నుంచి కనీస స్థాయికి తగ్గించాలంటూ ఆయన హౌస్ జ్యుడిషియరీ కమిటీలోని ఇమిగ్రేషన్, సిటిజన్‌షిప్ ఉపకమిటీ ఎదుట హాజరై తెలిపారు. అమెరికా యూనివర్సిటీల్లో ఇంజినీరింగ్ చదివే భారతీయ విద్యార్థుల సంఖ్య 2016–17, 2018–19 సంవత్సరాల్లో 25%పైగా తగ్గుముఖం పట్టిందని చెప్పారు. అమెరికా వర్సిటీల్లోని ఫుల్‌టైమ్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో 75% మంది విదేశీయులు కాగా, వారిలో 2016–17లో మూడింట రెండొంతులు భారతీయులే ఉన్నారని ఆయన వివరించారు. అదే సమయంలో, కెనడాలో చదివే భారతీయ విద్యార్థుల సంఖ్య 2016లో 76,075 కాగా 2018 నాటికి ఇది 127% పెరిగి 1,72,625కు చేరిందని పేర్కొన్నారు. -
Green Card: గ్రీన్ కార్డులకు కోటా రద్దు
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాస హక్కు(గ్రీన్ కార్డు) పొందేందుకు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న భారతీయ ఐటీ నిపుణుల కల సాకారమయ్యే పరిణామమిది. గ్రీన్ కార్డుల జారీకి ఇప్పటివరకు ఉన్న దేశాలవారీ కోటాను ఎత్తివేయాలనే ప్రతిపాదనకు ప్రతినిధుల కాంగ్రెస్ భారీ మెజారిటీతో ఆమోదం తెలిపింది. జో లోఫ్గ్రెన్, జాన్ కర్టిస్ అనే సభ్యులు ‘ది ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్ కార్డ్స్ ఫర్ లీగల్ ఎంప్లాయ్మెంట్(ఈఏజీఎల్ఈ)చట్టం– 2021’ను సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు అనుకూలంగా 365 మంది వ్యతిరేకిస్తూ 65 మంది ఓటేశారు. సెనేట్ ఆమోదం కూడా పొందితే అధ్యక్షుడు బైడెన్ సంతకంతో ఈ ప్రతిపాదనలు చట్ట రూపం దాల్చుతాయి. ప్రస్తుత వలస విధానంలో భారత దేశానికి కేటాయించిన 7 శాతం కోటా.. హెచ్–1బీ వర్కింగ్ వీసాపై అమెరికాలో ఉంటున్న అత్యున్నతస్థాయి భారతీయ నిపుణులకు గ్రీన్‌కార్డు లభించడంలో ప్రధాన అడ్డంకిగా మారింది. తాజా బిల్లులో, 7 శాతం పరిమితిని ఎత్తివేయడంతోపాటు ఈ కోటాను 15 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఇమిగ్రేషన్, సిటిజన్ షిప్‌పై ఏర్పాటైన కాంగ్రెస్ ఉప కమిటీ చైర్మన్ లోఫ్గ్రెన్ మాట్లాడుతూ.. ‘తాజా నిబంధనలు అమలైతే, నైపుణ్యాల ఆధారంగా గ్రీన్‌కార్డులు అందుతాయి. అమెరికా కంపెనీలు ఉత్పత్తులు, సేవలు, ఉద్యోగాలను కల్పించేందుకు గాను అత్యున్నత స్థాయి నిపుణులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది’అని లోఫ్గ్రెన్ పేర్కొన్నారు. ప్రస్తుత నిబంధనలపై సుమారు 10 లక్షల మంది భారతీయ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. -
టెకీల జీవిత భాగస్వాముల కలలు ఆవిరి!
అమెరికాలోని భారతీయ టెకీల జీవిత భాగస్వాముల కలలు ఆవిరవుతున్నాయి. యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సరీ్వసెస్ (యూఎస్సీఐఎస్) వారికి చుక్కలు చూపుతోంది. హెచ్4(డిపెండెంట్) వీసాలు కలిగి ఉండే హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అక్కడ చట్టబద్ధంగా ఎలాంటి ఉద్యోగాలైనా చేసేందుకు అనుమతించే ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్–ఈఏడీ (అంటే వర్క్ పర్మిట్ అన్నమాట) జారీలో తీవ్ర జాప్యం చేస్తోంది. కరోనా పేరు చెప్పి నెలల తరబడి వారి ఈఏడీ రెన్యూవల్ దరఖాస్తులను పక్కన పెట్టేసింది. ఫలితంగా మార్చి 31 నాటికి సుమారు 91 వేల మంది భారతీయ మహిళలు అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయారు. దేశంకాని దేశంలో అహోరాత్రులు కష్టపడి చేస్తున్న ఉద్యోగం హఠాత్తుగా ఊడిపోవడంతో వారంతా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఈఏడీ రెన్యూవల్‌కు 14 నుంచి 16 నెలలు పడుతోందని, ఈ పరిణామం తమ జీవితాలను అస్తవ్యస్తం చేస్తోందని వాపోతున్నారు. తమ గోడును పట్టించుకునే వారు లేక విలవిల్లాడుతున్నారు. హెచ్4 వీసాలు కలిగిన జీవిత భాగస్వాములు ఉద్యోగాలు చేసుకొనే హక్కు కల్పించిన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ అంశంపై స్పందించాలంటూ నిత్యం వందలాది మంది ఆయనకు మెయిల్స్ పంపుతున్నారు. అమెరికా నుంచి కంచర్ల యాదగిరిరెడ్డి హెచ్1బీపై పనిచేస్తూ గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అది లభించడానికి 10 నుంచి 15 ఏళ్లు పడుతుంది. ఈలోగా జీవిత భాగస్వామి ఏదైనా ఉద్యోగం చేసుకోవాలంటే విద్యార్హతలు ఉన్నా అమెరికాలో పని చేయడానికి గతంలో ఆ అవకాశం ఉండేది కాదు. ఇది ఆయా కుటుంబాలకు ఇబ్బందిగా ఉందని గ్రహించిన నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా 2015లో కొత్త ప్రతిపాదన తెచ్చారు. హెచ్1బీపై పనిచేస్తూ గ్రీన్‌కార్డు కోసం వేచి చూస్తున్న వారి జీవిత భాగస్వాములు ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా హెచ్4 ఈఏడీ బిల్లును ప్రతిపాదించారు. దీనికి కాంగ్రెస్ ఉభయ సభలు ఆమోదం తెలపడంతో 2016 నుంచి హెచ్1బీ జీవిత భాగస్వాములకు ఈఏడీ లభిస్తోంది. దీనివల్ల 1.34 లక్షల మంది భారతీయ మహిళలు యూఎస్సీఐఎస్ నుంచి ఈఏడీ పొంది ఉద్యోగాల్లో చేరారు. జీవిత భాగస్వామి హెచ్1బీ గడువుకు అనుగుణంగా హెచ్4 వీసా రెన్యూవల్ చేస్తారు. కానీ ఏడాదిన్నరగా యూఎస్సీఐఎస్ ఈఏడీ రెన్యూవల్ చేయట్లేదు. చాలా మంది 15 నుంచి 20 నెలలుగా రెన్యూవల్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. కరోనా కేసులతోపాటు మరికొన్ని కారణాలను చూపుతూ యూఎస్సీఐఎస్ ఈఏడీల పునరుద్ధరణలో జాప్యం చేస్తోందని, 90 వేల మందికిపైగా భారతీయ గృహిణులు, వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆ సంస్థకు చీమకుట్టినట్లు కూడా లేదని భారతీయ, అమెరికన్ ఇమ్మిగ్రేషన్ నిపుణుడు ఇందర్జిత్ అహ్లూవాలియా మండిపడ్డారు. మునుపెన్నడూ తాను ఇలాంటి దురుసుతనాన్ని చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. హెచ్4 ఈఏడీకి మరికొన్ని సంగతులు... ► హెచ్1బీ వీసా మూడేళ్లు ఉంటే అంతే కాలానికి హెచ్4 ఈఏడీ జారీ చేస్తారు. మామూలుగా ఆరేళ్లుగా రెన్యూవల్‌కు ముందే హెచ్1బీతోపాటే హెచ్4 జారీ చేసేవారు. ఇప్పుడు హెచ్1బీ జారీ అయి ఏడాది దాటినా హెచ్4 ఈఏడీ ఇవ్వడం లేదు. ► హెచ్ 4 ఈఏడీ కలిగి ఉన్న జీవిత భాగస్వాములు అమెరికాలో ఏ ఉద్యోగమైన చేసుకునేందుకు అర్హులు. వీరికి హెచ్1బీ మాదిరి ఆంక్షలు ఉండవు. కేవలం సాఫ్ట్వేర్ ఉద్యోగాలే చేయాలన్న నిబంధనేమీ లేదు. కానీ భారతీయుల్లో 95 శాతం మంది టెకీ ఉద్యోగాలే చేస్తున్నారు. న్యాయస్థానాల్లో డజన్లకొద్దీ కేసులు... తమ ఈఏడీలను రెన్యూవల్ చేయడంలో యూఎస్సీఐఎస్ కావాలని తాత్సరం చేస్తోందంటూ బాధితులు అమెరికాలోని వివిధ రాష్ట్రాల కోర్టుల్లో రోజూ డజన్లకొద్దీ పిటిషన్లు వేస్తున్నారు. ‘‘న్యాయస్థానాలను ఆశ్రయించడం తప్ప మాకు గత్యంతరం లేదు. మేము పడుతున్న ఇబ్బందులను కోర్టులైనా అర్థం చేసుకుంటాయని ఆశిస్తున్నాం’’ అని కంభాలపాటి అనూష అన్నారు. ఆమె టెక్సాస్‌లోని డాలస్ కోర్టులో తనకు న్యాయం చేయాలంటూ మరో 250 మందితో కలసి పిటిషన్ వేసింది. అమెరికన్ ఎకానమీలో భారతీయ వలసదారులు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారంటూ ప్రశంసించడమే తప్ప అవసరమైన సందర్భాలలో ఆదుకోవడానికి అమెరికా కాంగ్రెస్ సభ్యులు ముందుకు రావట్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈఏడీ కార్డు రెన్యూవల్ చేయలేదు హెచ్4 వీసాపై సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న నాకు 10 నెలల నుంచి యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) ఉద్యోగ ఆధారిత కార్డు (ఈఏడీ) రెన్యూవల్ చేయకపోవడంతో మా కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. దానికి తోడు నా రెండేళ్ల కుమారుడు ఆటిజం వ్యాధి చికిత్సకు నెలకు అవసరమైన 2,500 డాలర్లు సమకూర్చలేక నరకయాతన అనుభవిస్తున్నా. – ప్రియాంక జొన్నలగడ్డ 11 నెలలుగా ఉద్యోగం లేదు కేన్సర్ బారిన పడిన నేను 11 నెలలుగా ఉద్యోగం లేక అల్లాడుతున్నా. నా భర్త జీతం కుటుంబ అవసరాలకూ సరిపోవట్లేదు. నా వ్యాధికి చికిత్స తీసుకునేందుకు వీలుగా తిరిగి ఉద్యోగంలో చేరేందుకు ఈఏడీ మంజూరు చేయాలని యూఎస్సీఐఎస్ను వేడుకున్నా. కానీ కేన్సర్ బారినపడిన మీరు ఇంకా పనిచేయగల పరిస్థితిలో ఉన్నారా అంటూ యూఎస్సీఐఎస్ ప్రతినిధి ప్రశ్నించినప్పుడు ఇంకెందుకు బతికున్నానా అనిపించింది’’ – గీతా సుశీల్కర్ అసలే కరోనా.. ఆపై అసలే కరోనా హమమ్మారి, దీనికితోడు కుటుంబంలో ఒకరి ఉద్యోగం పోగొట్టుకున్న 90 వేల మందికిపైగా భారతీయ కుటుంబాలు అప్పటివరకు వస్తున్న ఆదాయానికి గండిపడటంతో సంసారం గడవడం గగనమై చితికి పోయాయి. కెరీర్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న భారతీయ యువతీయువకులు ఇప్పుడు నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. – జాన్ మేయర్ ,హాఫ్ మన్ లా గ్రూపు నిపుణుడు -
గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు ఊరట..
వాషింగ్టన్: ట్రంప్ అమెరికా అధినేతగా ఉన్నప్పు డు తీసుకున్న ఎన్నో నిర్ణయాలను తిరగతోడుతున్న అధ్యక్షు డు బైడెన్ గ్రీన్ కార్డు దరఖాస్తుదా రులకి ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. కరోనా సంక్షోభ సమయంలో దేశంలోకి అడుగుపెట్ట కుండా వీసాలపై ట్రంప్ హయాంలో విధించిన నిషేధాన్ని వెనక్కి తీసుకు న్నారు. ఈ మేరకు బుధవారం అధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉద్దేశించిన గ్రీన్‌కార్డుల దరఖాస్తుకు వీలు కల్పిస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. కరోనా సమయంలో ఏర్పడిన నిరుద్యోగాన్ని గాడిలో పెట్టాలంటే వీసాలపై నిషేధమే సరైనదంటూ అప్పట్లో ట్రంప్ నిర్ణయిం చారు. అయితే బైడెన్ ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వీసాలపై నిషే«ధం ఉండడం వల్ల ఎందరో ఉద్యోగులు కుటుంబాలకు దూరమై మానసిక వేదన అనుభవిస్తారని, దాని ప్రభావం అమెరికా వాణిజ్యంపైనే పడుతుందని అన్నారు. ‘‘ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికాలో ఎన్నో పరిశ్రమలపై ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావం తుల సేవల్ని వినియోగించు కోకుండా నిరోధిస్తుంది. ఇక అమెరికాలో ఉద్యోగ అవకాశాలు పొందిన వారు రానివ్వకుండా చేస్తోంది. ఇప్పటికే అమెరికాలో ఉన్న ఉద్యోగుల్ని వారి కుటుంబ సభ్యులు కలవనివ్వకుండా చేస్తోంది. అందుకే వీసాపై నిషేధాన్ని ఎత్తేస్తున్నాను’’ అని బైడెన్ చెప్పారు. బైడెన్ నిర్ణయంతో హెచ్–1బీ వీసాపైన అమెరికాలో ఉన్న ఎందరో భారతీయ టెక్కీలు ఊపిరి పీల్చుకున్నారు. -
అదిగదిగో గ్రీన్ కార్డు
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఉద్దేశించిన గ్రీన్ కార్డు కోసం భారతీయులు ఇకపై ఏళ్లకి ఏళ్లు ఎదురు చూసే పని లేదు. వేలాదిమంది భారతీయ టెక్కీలు, వారి కుటుంబసభ్యులతో పాటు విదేశీయులెందరికో లబ్ధి చేకూరేలా బైడెన్ సర్కార్ అడుగు ముందుకు వేసింది. గ్రీన్‌కార్డుపై దేశాల కోటా పరిమితిని ఎత్తేయడంతో పాటుగా దేశంలో చట్టవిరుద్ధంగా తలదాచుకుంటున్న 1.1కోట్ల మంది అక్రమ వలసదారులకు పౌరసత్వం కల్పించడానికి వీలు కల్పించే అమెరికా పౌరసత్వ బిల్లు 2021ని గురువారం కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును కాంగ్రెస్ ఉభయ సభలు ఆమోదించి, అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేస్తే అమెరికాలో ఉంటున్న వేలాదిమంది భారతీయ ఐటీ నిపుణులకి, వారి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది. దేశంలో అక్రమంగా నివసిస్తున్నవారితో పాటు చట్టబద్ధంగా ఉంటున్న వారికి కూడా లబ్ధి చేకూరేలా ఈ బిల్లుని రూపొందించారు. దీనిని సెనేటర్ బాబ్ మెనెండెజ్, కాంగ్రెస్ సభ్యురాలు లిండా సాంచెజ్లు చట్టసభలో ప్రవేశపెట్టారు. వలస విధానంలో సమూల సంస్కరణల ద్వారా వలసదారుల్లో భయం లేకుండా వారికి ఆర్థిక భద్రత కల్పించేలా అమెరికా పౌరసత్వ బిల్లు 2021ని తీసుకువచ్చినట్టుగా వారు మీడియాకు చెప్పారు. ‘‘నా తల్లిదండ్రులు మెక్సికో నుంచి వచ్చారు. ఈ దేశంలో వలసదారులు భయాందోళనలు లేకుండా జీవించేలా వలస విధానాన్ని రూపొందించడానికే నేను శ్రమిస్తున్నాను’’ అని సాంచెజ్ అన్నారు. వలస దారులంటే పొరుగువారు, స్నేహితులని చెప్పారు. కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో డెమొక్రాట్లకు పూర్తి మెజారిటీ ఉంది. ఎగువ సభ అయిన సెనేట్‌లో రెండు పార్టీలకు 50 చొప్పున సీట్లు ఉన్నాయి. సెనేట్‌లో ఈ బిల్లు పాస్ కావాలంటే మరో 10 మంది రిపబ్లికన్ల మద్దతు అవసరం. వారి కలలు నెరవేరుద్దాం: బైడెన్ దేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నుదన్నుగా ఉన్న వలసదారుల సంక్షేమం కోసం రిపబ్లికన్లు ఈ బిల్లుకి మద్దతునిస్తారని డెమొక్రాట్లు ఆశిస్తున్నారు. బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం అధ్యక్షుడు జో బైడెన్ గత ప్రభుత్వ తప్పిదాలను సరవిస్తూ వలసదారులకి న్యాయం జరిగేలా చూద్దామని ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. వలస కుటుంబాలను కలుపుతూ వారికి భద్రమైన జీవితాన్ని ఇవ్వడానికి మానవత్వంతో కూడిన వలస విధానాన్ని ముందుకు తీసుకువెళదామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘వలస విధానంలో సంస్కరణల వల్ల అమెరికాలో ఉండాలనుకునే వారి కలలు ఫలించి, మన దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. ఈ సంస్కరణలు డెమొక్రాట్లు, రిపబ్లికన్ల ప్రాధాన్యత కాదు. అమెరికా ప్రజల ప్రాధాన్యం కోసమే ఈ బిల్లుని తెచ్చాం. మన దేశం కోసం కష్టపడే వారి కలలు తీరుద్దాం’’ అని బైడెన్ వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నుదన్నుగా ఉన్న వలసదారుల సంక్షేమం కోసం రిపబ్లికన్లు ఈ బిల్లుకి మద్దతునిస్తారని డెమొక్రాట్లు ఆశిస్తున్నారు. బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం అధ్యక్షుడు జో బైడెన్ గత ప్రభుత్వ తప్పిదాలను సరవిస్తూ వలసదారులకి న్యాయం జరిగేలా చూద్దామని ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. వలస కుటుంబాలను కలుపుతూ వారికి భద్రమైన జీవితాన్ని ఇవ్వడానికి మానవత్వంతో కూడిన వలస విధానాన్ని ముందుకు తీసుకువెళదామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘వలస విధానంలో సంస్కరణల వల్ల అమెరికాలో ఉండాలనుకునే వారి కలలు ఫలించి, మన దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. ఈ సంస్కరణలు డెమొక్రాట్లు, రిపబ్లికన్ల ప్రాధాన్యత కాదు. అమెరికా ప్రజల ప్రాధాన్యం కోసమే ఈ బిల్లుని తెచ్చాం. మన దేశం కోసం కష్టపడే వారి కలలు తీరుద్దాం’’ అని బైడెన్ వివరించారు. బిల్లులో ఏముంది ? ► గ్రీన్‌కార్డు మంజూరులో ఏడుశాతం దేశాల కోటాను ఎత్తేస్తూ మొదట దరఖాస్తు చేసుకునే వారికి మొదట గ్రీన్‌కార్డు జారీ చేసేలా నిబంధనల్లో మార్పు చేశారు. దీంతో పదేళ్లకు పైబడి గ్రీన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్న భారతీయులకు బిల్లు చట్టరూపం దాల్చగానే లబ్ధి చేకూరనుంది ► హెచ్1–బీ వీసాదారుల జీవిత భాగస్వాములు ఉద్యోగం చేసుకునే వీలు ఉంటుంది. గతంలో ట్రంప్ ప్రభుత్వం ఈ వర్క్ ఆథరైజేషన్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే. ► విదేశాల్లో పుట్టి తల్లిదండ్రులతో కలిసి అమెరికాలో ఉంటున్న పిల్లలందరికీ వారి వయసుతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం కల్పించే అన్ని సదుపాయాలు లభిస్తాయి. ► అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న 1.1 కోట్ల మంది అక్రమ వలసదారులకి మూడేళ్లలో పౌరసత్వం లభిస్తుంది. ► ఎల్జీబీటీక్యూ హక్కుల పరిరక్షణ, వారి కుటుంబసభ్యులకి, అనాథలకి చట్టపరమైన రక్షణ కలుగుతుంది. ► అమెరికా యూనివర్సిటీల్లో చదివే విదేశీ విద్యార్థుల్లో స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) కోర్సులు చేసేవారికి దేశంలో ఉండడం మరింత సులభంగా మారనుంది ► పరిశ్రమల్లో తక్కువ వేతనానికి పని చేసే కార్మికులకు కూడా గ్రీన్‌కార్డులు ఇచ్చే వెసులుబాటు ఉంటుంది. -
భారతీయ టెకీలకు ట్రంప్ మరోసారి షాక్!
వాషింగ్టన్: వైట్‌హౌస్ వీడడానికి కొద్ది రోజుల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ టెక్కీలకు మళ్లీ షాక్ ఇచ్చారు. అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉద్దేశించిన గ్రీన్ కార్డు, హెచ్–1బీతో పాటుగా వివిధ కేటగిరీల్లో ఉద్యోగ ఆధారిత వీసాలపై నిషేధాన్ని మార్చి 31వరకు పొడిగించారు. అమెరికన్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి వీటిపై నిషేధాన్ని పొడిగిస్తున్నట్టుగా స్పష్టం చేశారు. కరోనాతో అతలాకుతలమవుతున్న అగ్రరాజ్యంలో గత ఏడాది జూన్‌లో ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా అన్ని రకాల వీసాలపై డిసెంబర్ 31 వరకు నిషేధం విధించిన విషయం తెలిసిందే. మరికొద్ది గంటల్లో నిషేధం గడువు ముగుస్తుందనగా గురువారం పొడిగింపు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ట్రంప్ వలస విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ హెచ్–1బీ వీసాలపై నిషేధాన్ని ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. ట్రంప్ వలసదారుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. ట్రంప్ నిర్ణయంతో భారతీయ టెకీలకు తీవ్ర ఎదురు దెబ్బ తగలనుంది. డాలర్ డ్రీమ్స్ కలల్ని నెరవేర్చుకోవడానికి అమెరికా వెళ్లాలంటే భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన వారు మరో మూడు నెలలవరకు ఎదురు చూడాల్సిందే. అమెరికా కంపెనీలకు 10 వేల కోట్ల నష్టం ! ట్రంప్ వీసా విధానంపై అమెరికాలోనూ తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ నిర్ణయాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం జరుగుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. మరోవైపు జూన్‌లో ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వులతో 500 టెక్ కంపెనీలకు 10వేల కోట్ల డాలర్లు నష్టం కలిగినట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ సారి నిషేధం పొడిగింపు వల్ల పెద్దగా నష్టం జరగదని, బైడెన్ అధ్యక్షుడిగా పదవీ ప్రమాణం చేశాక వలసదారులకు అనుకూలంగా నిర్ణయాలుంటాయని భావిస్తున్నారు. దేశంలో నిరుద్యోగం రికార్డు స్థాయిలో 6.7శాతం ఉన్నందుకే నిషేధాన్ని పొడిగించానంటూ ట్రంప్ సమర్థించుకున్నారు. -
గ్రీన్ కార్డు వెయిటింగ్ లిస్టు 195 ఏళ్లు
వాషింగ్టన్: అమెరికాలో వలసదారులకు శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి వీలు కల్పించే గ్రీన్ కార్డు కోసం భారతీయులు 195 ఏళ్లకు పైగా వేచి చూడాలని అధికార రిపబ్లికన్ సెనేటర్ మైక్ లీ చెప్పారు. ఈ సమస్యను చట్టబద్ధంగా పరిష్కరించడానికి ఇతర సెనేటర్లు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న గ్రీన్ కార్డు విధానంలో ఎన్నో లోపాలున్నాయని వలసదారుల పిల్లలకి దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. గ్రీన్ కార్డు బ్యాక్‌లాగ్‌లో చిక్కుకుపోయిన వలస ఉద్యోగుల పరిరక్షణ కోసం మరో సెనేటర్ డిక్ డర్బిన్ ప్రతిపాదించిన కొత్త చట్టంపై సెనేట్‌లో మైక్ లీ బుధవారం మాట్లాడారు. అమెరికాకు వలస వచ్చిన వారు గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేశాక వారు మరణిస్తే, వారి పిల్లలు నివాస యోగ్యతని కోల్పోతారని చెప్పారు. ‘‘భారత్ నుంచి వచ్చి గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఈబీ–3 కేటగిరీ గ్రీన్‌కార్డు కోసం 195 సంవత్సరాలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ వారి పిల్లలకు మనం ఆ హోదా కల్పించినా వారు ఎప్పటికీ అమెరికా పౌరులు కాలేరు’’అని లీ అన్నారు. -
గ్రీన్‌కార్డు కోసం 195 ఏళ్లకు పైగా..
వాషింగ్టన్ : అమెరికాలో శాశ్వత నివాసానికి అవసరమైన గ్రీన్‌కార్డు పొందేందుకు ఓ భారతీయుడు 195 ఏళ్లకు పైగా నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందని ప్రముఖ రిపబ్లికన్ సెనేటర్ వెల్లడించారు. ఈ సమస్యను అధిగమించేందుకు చట్టబద్ద పరిష్కారానికి ముందుకు రావాలని సహచర సెనేటర్లకు ఆయన విజ్క్షప్తి చేశారు. వలసదారులను అమెరికాలో శాశ్వత నివాసానికి అనుమతించేలా గ్రీన్‌కార్డు జారీ చేస్తారు. ప్రస్తుత గ్రీన్‌కార్డు విధానంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సెనేటర్ మైక్ లీ పిలుపు ఇచ్చారు. వలసదారు మరణించిన సందర్బాల్లో వారి గ్రీన్‌కార్డు దరఖాస్తును నిరాకరిస్తుండటంతో వలసదారు సంతానానికి ఈ విధానం ఉపకరించడం లేదని లీ పేర్కొన్నారు. ‘భారత్ నుంచి ఇప్పుడు ఎవరైనా బ్యాక్‌లాగ్‌లో చేరితే ఈబీ-3 గ్రీన్‌కార్డు కోసం 195 ఏళ్లకు పైగా నిరీక్షించాల్సిఉంటుందని అన్నారు. గ్రీన్‌కార్డు బ్యాక్‌లాగ్‌లో చిక్కుకున్న వలస ఉద్యోగులు, వారి పిల్లల ప్రయోజనాలను కాపాడాలిని కోరుతూ సెనేటర్ డిక్ డర్బిన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై మాట్లాడుతూ లీ ఈ వ్యాఖ్యలు చేశారు. తాత్కాలిక వర్క్ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న వలసదారులకు గ్రీన్‌కార్డులు కీలకమని చెప్పారు. గ్రీన్‌కార్డు దరఖాస్తుల పెండింగ్‌తో వారి కుటుంబాలు ఏళ్లకు ఏళ్లు నిరీక్షించడంతో వారు తమ వలస హోదాను కోల్పోతున్నారని సెనేటర్ డర్బిన్ ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి : చైనా వ్యాక్సిన్‌పై స్పందించిన ట్రంప్ -
హెచ్ -1బీ వీసాదారులకు భారీ ఊరట
వాషింగ్టన్: కరోనా సంక్షోభంతో చిక్కుల్లో పడ్డ అమెరికాలోని విదేశీయులకు భారీ ఊరట. అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సంబంధిత పత్రాలను సమర్పించాలంటూ నోటీసుల జారీ చేసిన హెచ్-1బీ వీసాదారులకు, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు యుఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ శుభవార్త అందించింది. అవసరమైన పత్రాలను సమర్పించడానికి 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఇస్తూ అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీంతో రెండు నెలలపాటు ఇమ్మిగ్రేషన్ ను ఇటీవల నిలిపివేయడంతో గ్రీన్ కార్డు కార్డు కోసం ఎదురు చూస్తున్నవారికి రెండు నెలల సమయం దొరికింది. అమెరికాలో గ్రీన్ కార్డు కోసం 2.5 లక్షల మంది ఎదురు చూస్తుండగా, వీరిలో హెచ్-1బీ వీసాదారులు దాదాపు 2 లక్షల మంది ఉన్నారు. శుక్రవారం నాటి యుఎస్సీఐఎస్ ఉత్తర్వుల ప్రకారం హెచ్-1బీ వీసాదారులు, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు అవసరమైన పత్రాలు కొనసాగింపు వీసా(ఎన్-14), తిరస్కరించే నోటీసులు, ఉపసంహరించుకునే నోటీసు, ప్రాంతీయ పెట్టుబడి కేంద్రాలను ముగించే నోటీసులు, ఫారం ఐ-290బీ నోటీస్ ఆఫ్ అప్పీల్ లేదా మోషన్ తదితర అంశాలకు సంబంధించిన వాటిని 60 రోజుల్లోగా సమర్పించాలని సూచించింది. అభ్యర్థనలు, నోటీసుల విషయంలో చర్యలు తీసుకోవడానికి ముందు 60 రోజులలోగా స్పందించాలని తెలిపింది. గడువు ముగిసిన వారిపై ఏదైనా చర్య తీసుకునే ముందు నిర్ణీత తేదీ నుండి 60 క్యాలెండర్ రోజుల వరకు అందుకున్న ఫారం ఐ-290బీ ను పరిశీలిస్తామని యుఎస్సీఐఎస్ తెలిపింది. (ట్రంప్ తాజా బెదిరింపు : ట్రేడ్ వార్ భయాలు) కోవిడ్ -19 పరిస్థితిని సమీక్షించిన తరువాత విదేశాలలో చిక్కుకున్న భారతీయులను తీసుకురావాలని నిర్ణయం తీసుకుంటామని ఏప్రిల్ 10న ప్రభుత్వం తెలిపింది. పరిస్థితిని అంచనా వేసిన తరువాత విదేశాలలో చిక్కుకున్న భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి నిర్ణయం తీసుకుంటామని భారత ప్రభుత్వం సూచించిన కొద్ది రోజుల తరువాత అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల నుంచి తమ దేశానికి వచ్చే వలసలదారులపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
వలసల నిషేధంపై స్పష్టతనిచ్చిన ట్రంప్..!
వాషింగ్టన్ : అమెరికాలోకి అన్ని రకాల వలసలపై తాత్కాలిక నిషేధం విధించనున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా పౌరుల ఉద్యోగాల రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ఆయన చెప్పారు. అయితే ఈ నిషేధం 60 రోజులపాటు అమల్లో ఉంటుందని ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఈ నిషేధం శాశ్వత నివాసం(గ్రీన్ కార్డ్) కోరుకునే వారికే వర్తింస్తుందని ట్రంప్ అన్నారు. లాక్డౌన్ ముగిసన తర్వాత.. ఉద్యోగాల్లో స్థానికులకే ప్రథమ ప్రాధాన్యత ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ట్రంప్ స్పష్టం చేశారు. కరోనాకు సంబంధించిన రోజువారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ట్రంప్ ఈ విషయాలను వెల్లడించారు. ‘ఈ నిషేధం 60 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితులను బట్టి ఈ నిషేధాన్ని పొడిగించడమా.. లేక మార్పులు చేయడమా అనేది నిర్ణయిస్తాం. అమెరికాలో శాశ్వత నివాసం(గ్రీన్ కార్డ్) కోరుకునే వారికి ఈ నిబంధన వర్తిస్తుంది. తాత్కాలిక ప్రతిపాదికన అమెరికాలోకి వచ్చేవారికి ఈ నిషేధం వర్తించదు. అమెరికా పౌరులకు ఉద్యోగాల్లో ప్రథమ ప్రాధాన్యత కల్పించాలనేది మా లక్ష్యం. వలసలను నియంత్రించడం వల్ల నిరుద్యోగ అమెరికన్లకు ఉద్యోగాలు లభిస్తాయి’ అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికన్ల ఉద్యోగ భద్రతపై కూడా ట్రంప్ ప్రస్తావించినందువల్ల నాన్–ఇమిగ్రంట్ వీసా అయిన హెచ్1బీ పైనా ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. అయితే కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందికి, ఆహార సరఫరా చేస్తున్న విదేశీయులకు ఈ నిషేధం నుంచి మినహాయింపు కల్పించవచ్చని వైట్ హౌస్ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు కరోనాను అదుపు చేయడంలో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. గత అధ్యక్ష ఎన్నికల సమయం నుంచి యూఎస్ ఇమిగ్రేషన్ వ్యవస్థను ట్రంప్ లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా పలు సందర్భాల్లో వీసా విధానాన్ని మార్చాలన్న తన ఆలోచనను ఆయన వెల్లడించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అగ్రరాజ్యం జారీ చేసే వీసాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతూ వచ్చింది. కాగా, 2016లో బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 6,17,000 వీసాలు జారీ చేసిన అమెరికా.. గతేడాదిలో 4,62,000 వీసాలు మాత్రమే జారీచేసినట్టు అధికారిక గణంకాలు చెప్తున్నాయి. చదవండి : అన్ని ఇమిగ్రేషన్ వీసాలపై తాత్కాలిక నిషేధం కిమ్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా: ట్రంప్ -
నేటి నుంచి కొత్త ‘గ్రీన్ కార్డ్ రూల్’
వాషింగ్టన్: అమెరికాలో ఫుడ్ స్టాంప్స్ తదితర ప్రభుత్వ ప్రయోజనాలు పొందే చట్టబద్ధ వలసదారులకు గ్రీన్‌కార్డ్ నిరాకరించేందుకు ఉద్దేశించిన నిబంధన సోమవారం నుంచి అమలులోకి రానుంది. ఈ నిబంధన హెచ్1 బీ వీసాపై అమెరికాలో ఉంటూ, గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వేలాదిమంది భారతీయులపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఈ నిబంధనపై ఇచ్చిన స్టే ఆర్డర్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం ఎత్తివేసింది. దీంతో ‘అమెరికా సమాజంలోకి కొత్తగా వచ్చేవారు స్వయం సవృద్ధులై ఉండాలని, పన్ను చెల్లింపుదారులైన అమెరికన్లపై వారు ఆధారపడకూడదనే సూత్రం అమల్లోకి వస్తుంది’ అని అమెరికా తెలిపింది. కాగా తాజా నిబంధన ప్రకారం.. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులు తాము ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేదని, భవిష్యత్తులోనూ వాటిని ఆశించబోమని, ఈ దేశానికి తాము భారం కాబోమని ధ్రువీకరించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు భవిష్యత్తులోనైనా ఆ ప్రయోజనాలు పొందే అవకాశముందని అధికారులు భావిస్తే.. వారికి గ్రీన్ కార్డ్‌ను నిరాకరించే అవకాశం కూడా ఉంది. ఏటా దాదాపు 5.4 లక్షల మంది గ్రీన్కార్డ్కు అప్లై చేసుకుంటారు. అయితే, వలసదారుల్లో కొందరికి మాత్రమే.. వారి ఇమిగ్రేషన్ స్టేటస్‌ను బట్టి మెడిక్ ఎయిడ్, ఫుడ్ స్టాంప్స్, హౌసింగ్ వోచర్స్.. తదితర ప్రభుత్వ ప్రయోజనాలు పొందే అర్హత ఉంటుంది. (గ్రీన్‌కార్డు కోసం 2.27 లక్షల మంది భారతీయులు వెయిటింగ్) -
ప్రభుత్వ లబ్ధి పొందితే గ్రీన్‌కార్డ్ నో
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన ఒక గ్రీన్‌కార్డ్ నిబంధనకు అమెరికా సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్న వలసదారులకు గ్రీన్ కార్డ్‌ను నిరాకరించే ఈ విధానం వల్ల భారతీయులు నష్టపోయే అవకాశముంది. మెడిక్ ఎయిడ్, ఫుడ్ స్టాంప్స్, హౌసింగ్ వోచర్స్ తదితర ప్రయోజనాలు పొందిన వారికి అమెరికాలో శాశ్వత నివాస సౌకర్యాన్ని కల్పించే గ్రీన్‌కార్డ్‌ను నిరాకరించాలని ప్రతిపాదిస్తూ ఆ నిబంధనను రూపొందించారు. ఆ నిబంధన అమలుకు ఆమోదం తెలుపుతూ సోమవారం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ధర్మాసనంలోని న్యాయమూర్తుల్లో ఐదుగురు ఈ పాలసీకి మద్దతివ్వగా, నలుగురు వ్యతిరేకించారు. ఈ కొత్త నిబంధన అమలుపై స్టే విధిస్తూ న్యూయార్క్‌లోని రెండో సర్క్యూట్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేసింది. పలు రాష్ట్రాల్లో ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. తాజా నిబంధన ప్రకారం.. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులు తాము ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేదని, భవిష్యత్తులోనూ వాటిని ఆశించబోమని, ఈ దేశానికి తాము భారం కాబోమని ధ్రువీకరించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు భవిష్యత్తులోనైనా ఆ ప్రయోజనాలు పొందే అవకాశముందని అధికారులు భావిస్తే.. వారికి గ్రీన్ కార్డ్‌ను నిరాకరించే అవకాశం కూడా ఉంది. ఏటా దాదాపు 5.4 లక్షల మంది గ్రీన్కార్డ్కు అప్లై చేసుకుంటారు. అయితే, వలసదారుల్లో కొందరికి మాత్రమే.. వారి ఇమిగ్రేషన్ స్టేటస్‌ను బట్టి మెడిక్ ఎయిడ్, ఫుడ్ స్టాంప్స్, హౌసింగ్ వోచర్స్.. తదితర ప్రభుత్వ ప్రయోజనాలు పొందే అర్హత ఉంటుంది. -
గ్రీన్‌కార్డు కోసం 2.27 లక్షల మంది భారతీయులు వెయిటింగ్
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసానికి ఉపయోగపడే గ్రీన్‌కార్డు పొందేందుకు దాదాపు 2.27 లక్షల మంది భారతీయులు ఎదురుచూస్తున్నట్లు అమెరికా అధికార గణాంకాలు చెబుతున్నాయి. కుటుంబ సభ్యులకు ఇచ్చే ఫ్యామిలీ స్పాన్సర్డ్ గ్రీన్‌కార్డుల కోసం మొత్తంగా 40 లక్షల మంది వేచి చూస్తూంటే.. 15 లక్షలతో మెక్సికో తొలిస్థానంలో, 2.27 లక్షలతో భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు అంచనా. అమెరికా చట్టాల ప్రకారం ఏటా జారీ చేయగల గ్రీన్‌కార్డులు గరిష్టంగా 2.26 లక్షలు మాత్రమే. డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ విడుదల చేసిన వివరాల ప్రకారం గ్రీన్‌కార్డుల వెయిటింగ్ లిస్ట్‌లో 1.80 లక్షలతో చైనా మూడోస్థానంలో ఉంది. అమెరికా పౌరసత్వం ఉన్న వారు తమ కుటుంబ సభ్యులకు (తోబుట్టువులు, తల్లిదండ్రులు, భార్య, కొన్ని పరిమితులకు లోబడి పిల్లలకు) పౌరసత్వం కల్పించేందుకు అవకాశముంది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ రకమైన అవకాశాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఫ్యామిలీ స్పాన్సర్డ్ గ్రీన్‌కార్డులను పూర్తిగా నిషేధించాలని చూస్తూండగా ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం ఫ్యామిలీ గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయుల్లో అత్యధికులు అమెరికన్ పౌరసత్వమున్న వారి తోబుట్టువులని గణాంకాలు చెబుతున్నాయి. వీరి సంఖ్య 1.81 లక్షలు కాగా, పెళ్లయిన సంతానం సంఖ్య 42 వేలుగా ఉంది. భార్య/భర్త, మైనర్ పిల్లలు సుమారు 2500 మంది శాశ్వత నివాసానికి ఎదురు చూస్తున్నారు. ఫ్యామిలీ స్పాన్సర్డ్ గ్రీన్కార్డులుకు అదనంగా మరో 8.27 లక్షల మంది ఇతర రకాల గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో భారతీయులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. -
ఉందిలే మంచి కాలం
అమెరికాలో శాశ్వత నివాసం కోసం కలలు కంటూ ఉద్యోగాల ఆధారిత గ్రీన్ కార్డు కోసం దశాబ్దాల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులకు ఇది శుభవార్త. గ్రీన్‌కార్డులను ఒక్కో దేశానికి గరిష్టంగా ఏడు శాతం మాత్రమే మంజూరు చేయాలన్న కోటా పరిమితిని ఎత్తివేసే బిల్లుకి అమెరికా ప్రతినిధుల సభ బుధవారం ఆమోద ముద్ర వేసింది. ‘ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ యాక్ట్ ఆఫ్ 2019 (హెచ్ఆర్ 1044)’ బిల్లుకు సభలో అనూహ్యమైన మద్దతు లభించింది. మొత్తం 435 మంది సభ్యులకుగాను 365 మంది అనుకూలంగా ఓటు వేస్తే, 65 మంది వ్యతిరేకించారు. జోలాఫ్రెన్, కెన్‌బర్గ్‌లు గత ఫిబ్రవరిలో ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు ద్వారా కుటుంబాల ప్రాతిపదికన వలస వీసా కోటాను ఏడు నుంచి 15శాతానికి పెంచడంతో వలసదారులకు భారీగా ఊరట లభిస్తోంది. సెనేట్‌లోనూ ఈ బిల్లుకి ఆమోద ముద్ర పడాల్సి ఉంది. గ్రీన్ కార్డు బిల్లు కాంగ్రెస్ ఆమోదం పొందితే భారత్ వంటి దేశాల నుంచి తక్కువ వేతనాలకే నిపుణులైన ఉద్యోగుల్ని అమెరికా కంపెనీలు నియమిస్తాయని, దీని వల్ల అమెరికాలో మధ్యతరగతికి ఎక్కువగా నష్టం జరుగుతుందని బిల్లును వ్యతిరేకిస్తున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనోళ్లకే భారీగా ప్రయోజనం గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో భారతీయులే 6 లక్షల మందికి పైగా నిరీక్షణ జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న వలస విధానమే కొనసాగితే ఇండియా వంటి అధిక జనాభా కలిగిన దేశాల వారు గ్రీన్ కార్డు కోసం 151 ఏళ్లు ఎదురు చూడాల్సి వస్తుందని క్యాటో ఇనిస్టిట్యూట్ వంటి సంస్థలు అంచనా వేశాయి. అధికంగా గ్రీన్‌కార్డు లభించిన దేశాల్లో చైనా ముందుంది. బిల్లు చట్టంగా మారితే 3 లక్షల మంది భారతీయులకు ప్రయోజనం చేకూరనుంది. దరఖాస్తు చేసుకున్న భారతీయుల్లో ఇప్పటివరకు ప్రతిఏటా 25శాతం మందికే గ్రీన్‌కార్డులు మంజూరవుతూ వచ్చాయి. ఓ భార్య కల ఫలించిన వేళ రెండేళ్ల క్రితం అమెరికాలోని కన్సాస్‌లో జాతి వివక్షకు బలైపోయిన తెలంగాణ టెక్కీ కూచిభట్ల శ్రీనివాస్ భార్య సునయన గ్రీన్‌కార్డు బిల్లుకి గట్టిగా మద్దతు కూడగట్టడంలో విజయం సాధించారు. 2017 ఫిబ్రవరిలో కన్సాస్ రెస్టారెంట్లో శ్రీనివాస్‌ను కొందరు దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. భర్త మరణించాక కూడా అమెరికాలోనే ఉండాలనుకున్న సునయన దూమల ఎన్నో కష్టనష్టాలు అనుభవించారు. తాత్కాలిక వీసా మీదే ఆమె ఇన్నాళ్లూ అమెరికాలో ఉంటూ పనిచేస్తున్నారు. ఈ వీసాల కోసం కంపెనీ యాజమాన్యాల దయాదాక్షిణ్యాల మీదే భారతీయులు ఆధారపడాల్సిన పరిస్థితి. దీంతో గ్రీన్‌కార్డు బిల్లు చట్టరూపం దాల్చడానికి సునయన తన వంతు ప్రయత్నాలు చేశారు. పలుమార్లు వాషింగ్టన్ వెళ్లి న్యాయ నిపుణులతో, ప్రవాస భారతీయ సంఘాలతో సంప్రదింపులు జరిపారు. -
డాలర్ డ్రీమ్స్‌కి పచ్చజెండా!
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసం, ఉపాధి కోసం ఉద్దేశించిన గ్రీన్ కార్డు బిల్లుపై అమెరికా కాంగ్రెస్‌లో ఓటింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ బిల్లు కాంగ్రెస్ ఆమోదం పొందితే దశాబ్దాల తరబడి గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు భారీగా ప్రయోజనాలు దక్కుతాయి. గ్రీన్ కార్డు విషయంలో అమెరికా ఒక్కో దేశానికి గరిష్టంగా ఏడు శాతానికి మించి ఇవ్వకూడదన్న కోటా నిబంధనలు భారత్ వలసదారులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. జనాభా ఎక్కవ ఉన్న దేశాలకు, తక్కువ ఉన్న దేశాలకు ఒకే నిబంధనలు అమలవుతూ ఉండడంతో భారత్, చైనా, ఫిలిప్పీన్స్‌కు చెందిన వలసదారుల దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఇక్కట్లకు తెరదించడానికి గత ఫిబ్రవరిలో ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమ్మిగ్రెంట్ యాక్ట్ (హెచ్ఆర్1044) బిల్లును భారత సంతతికి చెందిన సెనేటర్ కమలా హ్యారిస్ తన సహచరుడు మైక్‌లీతో కలిసి సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఇదే తరహా బిల్లును కాంగ్రెస్ ప్రతినిధుల సభలో జో లాఫ్రెన్, కెన్‌బర్గ్‌లు ప్రవేశపెట్టారు. ప్రతినిధుల సభలో మొత్తం 435 సభ్యులకు గాను రిపబ్లికన్, డెమొక్రాట్ పార్టీకి చెందిన 310 మందికి పైగా ప్రజాప్రతినిధుల మద్దతు ఈ బిల్లుకు ఉంది. 203 మంది డెమొక్రాట్లు, 108 మంది రిపబ్లికన్లు ఈ బిల్లుకు కో స్పాన్సరర్లుగా ఉన్నారు. 290 ఓట్లు బిల్లుకు అనుకూలంగా వస్తే దీనిపై ఎలాంటి చర్చలూ, సవరణలూ లేకుండా ఆమోదం పొందుతుంది. భారతీయులకు కలిగే ప్రయోజనాలేంటి? భారతీయుల డాలర్ డ్రీమ్స్ సాకారమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. ఏకంగా 3 లక్షల మంది భారతీయులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న వలస విధానం వల్ల ఇండియాకు చెందిన అత్యంత ప్రతిభావంతులు, ఐటీ వృత్తి నిపుణులు ఎక్కువగా నష్టపోతున్నారు. అతి పెద్ద ఐటీ కంపెనీలు కూడా తక్కువ వేతనాలకు భారతీయుల్ని నియమిస్తూ వారి శ్రమను దోపిడీ చేస్తున్నాయి. గ్రీన్‌కార్డు బిల్లు దేశాల కోటా పరిమితిని ఎత్తివేయడంతో పాటుగా కుటుంబాల ప్రాతిపదికన వలస వీసా కోటాను 15శాతానికి పెంచనుంది. అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి వీలుగా హెచ్1బీ వీసా దారులకు ఈబీ కేటగిరీ కింద ప్రతి ఏటా 1.4 లక్షల మందికి గ్రీన్ కార్డులు జారీ చేస్తున్నారు. ఏడు శాతం కోటా నిబంధనలతో ఒక్కో దేశం 9,800కు మించి ఎక్కువ కార్డులు పొందలేదు. ఫలితంగా జనాభా అత్యధికంగా ఉండే ఇండియా, చైనా వంటి దేశాల నిపుణులు గ్రీన్ కార్డు కోసం ఎ క్కువ కాలం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పుడు ఇక ఆ ఎదురుచూపులకు తెరపడినట్టే. మనోళ్లలో 90 శాతం మందికి లబ్ధి గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయుల్లో ఇప్పటివరకు ప్రతీ ఏడాది 25 శాతం మందికి మాత్రమే మంజూరవుతూ వచ్చాయి. కొత్త చట్టం రూపుదాల్చితే వచ్చే పదేళ్లలోనే 90 శాతానికిపైగా భారతీయులకు గ్రీన్ కార్డులు లభిస్తాయని యూఎస్సీఐఎస్ (యునైటెడ్ స్టేట్స్ సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్) అంచనా వేస్తోంది. విదేశాల్లో భారతీయం కెనడాలో 51% పైకి కెనడాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న భారతీయుల సంఖ్య భారీగా పెరిగినట్టు ఆ దేశ ప్రభుత్వ వలస విభాగం వెల్లడించింది. 2018 సంవత్సరానికి 39,500 మందికిపైగా భారతీయులకు ఈ ఏడాది గ్రీన్ కార్డులు మంజూరైనట్టు ఒక నివేదికలో తెలిపింది. 2017తో పోల్చి చూస్తే గ్రీన్ కార్డులు 51శాతం పెరిగినట్టు కెనడా ఇమ్మిగ్రేషన్, రిఫ్యూజీ అండ్ సిటిజన్ షిప్ నివేదిక వివరించింది. కెనడాలో జస్టిన్ ట్రాడ్యూ నేతృత్వంలో ప్రభుత్వం ఈ ఏడాది ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ సిస్టమ్ విధానం ద్వారా ఏకంగా 92 వేల మంది వలసదారులకు శాశ్వత నివాసం కోసం అనుమతులు మంజూరు చేసింది. దీని ప్రకారం 46శాతం మంది భారతీయులకు కెనడా పౌరసత్వం వస్తే, ఆ తర్వాత స్థానం నైజీరియన్లు, చైనీయులు ఉన్నారు. అమెరికాలో వలస విధానాన్ని కఠినతరం చేయడం, హెచ్1బీ వీసాలు లభించడం కష్టమైపోవడం, గ్రీన్‌కార్డు మంజూరులో జాప్యాలు, వలసదారుల జీవిత భాగస్వాములకు ఉద్యోగ అవకాశాలు కరువైపోవడంతో భారతీయుల చూపు ఈ మధ్య అమెరికా నుంచి కెనడా వైపు తిరిగింది. దానికి తగ్గట్టుగానే అక్కడి ప్రభుత్వం రికార్డు స్థాయిలో శాశ్వత నివాసం కోసం వీసాలు మంజూరు చేసింది. షార్జా గోల్డెన్ వీసా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన పారిశ్రామికవేత్త లాలో శామ్యూల్‌కు శాశ్వత నివాసాన్ని కల్పిస్తూ మొదటిసారిగా షార్జా గోల్డ్‌కార్డు వీసా మంజూరు చేసింది. కింగ్స్టన్ హోల్డింగ్స్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన లాలో శామ్యూల్ గత కొన్నేళ్లుగా యూఏఈలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తూ అరబ్ ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు పొందారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అభివృద్ధి కోసం ఈ మధ్య కాలంలో పెట్టుబడుల్ని ఆకర్షించడానికి, ఆర్థికంగా దేశాన్ని పరుగులు పెట్టించడానికి గోల్డెన్ కార్టు వీసా వివిధ దేశాల పారిశ్రామికవేత్తలకు మంజూరు చేస్తోంది. అందులో భాగంగానే లాలో శామ్యూల్‌కు వీసా లభించింది. ఈ వీసా ప్రకారం స్పాన్సరర్లు లేకుండా శామ్యూల్, ఆయన భార్యా పిల్లలు షార్జాలో శాశ్వత నివాసం ఉండవచ్చు. మధ్య ప్రాచ్య దేశాల్లో ప్లాస్టిక్, మెటల్ ప్రాసెసింగ్ యూనిట్లను నడుపుతూ శామ్యూల్ వరుసగా కొన్నేళ్ల పాటు ఫోర్బ్స్ మ్యాగజైన్లో స్థానం పొందారు. వజ్రాభరణాల సంస్థ మలబార్ గ్రూపు కో చైర్మన్,కేరళలో పుట్టిన డాక్టర్ ఇబ్రహీం హాజీకూ గోల్డెన్ వీసా లభించింది. -
చెదురుతున్న ‘డాలర్ డ్రీమ్స్’!
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికాలో భారతీయుల డాలర్ డ్రీమ్స్ చెదిరిపోతున్నాయి. అమెరికా ప్రభుత్వం రక్షణాత్మకంగా వ్యవహరిస్తుండటంతో అక్కడ పనిచేస్తున్న వేలాది మంది భారత ఐటీ నిపుణులు వీసా తిరస్కరణ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. తమ వీసా గడువును పొడిగించాల్సిందిగా దాఖలు చేస్తున్న దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తున్నారు. లేదంటే రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్(ఆర్ఎఫ్ఈ)లను సమర్పించాల్సిందిగా పదేపదే అడుగుతున్నారు. ఆర్‌ఎఫ్‌ఈలను పొందిన ఉద్యోగులకు వీసా పొడిగింపు దక్కుతుందన్న గ్యారెంటీ ఏమీలేదు. ‘నా స్నేహితురాలు ఇక్కడే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమెకు ఓ బాబు ఉన్నాడు. హెచ్1బీ వీసా పొడిగింపుతో పాటు గ్రీన్‌కార్డు కోసం ఆమె దరఖాస్తు చేసుకుంది. కానీ ఆ రెండు దరఖాస్తులూ తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఆమె కుమారుడితో కలిసి అమెరికాను వీడాల్సి వచ్చింది’అని జునేజా అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పారు. అమెరికాలో ఉండేందుకే మొగ్గు.. హెచ్1బీ వీసాల పొడిగింపు దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నప్పటికీ చాలామంది టెక్కీలు స్వదేశానికి తిరిగివచ్చేందుకు బదులుగా అమెరికాలోనే పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ భారత్‌కు తిరిగివచ్చి అదే సంస్థలో పనిచేయాలన్నా, కొత్త కంపెనీలకు మారాలన్నా ఇబ్బందికరంగా ఉంటుం దని వారు భావిస్తున్నారు. అమెరికాలో దశాబ్ద(2007–17)కాలంలో 34 లక్షల మందికి హెచ్1బీ వీసాలు జారీకాగా, వీటిలో 22 లక్షల వీసాలను భారతీయులే దక్కించుకున్నారు. కఠినంగా ఇమిగ్రేషన్ ‘ఆర్ఎఫ్ఐ (రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్) అప్రూవల్ శాతం చాలా తక్కువగా ఉంది. దీంతో నా లగేజీని ప్యాక్ చేసుకున్నా. దీని కారణంగా నా ప్రాజెక్టుపై తక్కువ సమయం, వీసా పొడిగింపుపై తిరిగేందుకు ఎక్కువ సమయం తిరగాల్సి వస్తోందని క్లయింట్‌కు చెప్పడం చాలా ఇబ్బందికరంగా మారింది. ఆర్ఎఫ్ఐ ప్రక్రియలో భాగంగా 21 చెక్లిస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. అలాగే రాబోయే రెండున్నరేళ్ల కాలానికి సంబంధించి మీ పని ప్రణాళికలను ఇవ్వాల్సి ఉంటుంది’అని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పారు. మరోవైపు ఈ పరిస్థితిపై ఇమిగ్రేషన్ కేసులను వాదించే లాక్వెస్ట్ సంస్థ యజమాని పూర్వీ స్పందిస్తూ.. ‘అమెరికన్లుకు ఉద్యోగాలు దక్కాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వీసా విధానాలను మార్చడంతో ప్రస్తుతం ఇక్కడ ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంది’ అని అన్నారు. గ్రీన్‌కార్డుకు పదేళ్లు ఆగాల్సిందే.. 2018లో 30 సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించి 13,177 మంది హెచ్1బీ వీసా పొడిగింపునకు దరఖాస్తు చేసుకోగా, 8,742 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఇలా వీసా లు తిరస్కరణకు గురైనవారిలో కాగ్నిజెంట్ సంస్థకు చెందిన 3,548 ఉద్యోగులు, ఇన్ఫోసిస్‌కు చెందిన 2,042 మంది ఉద్యోగులు, టీసీఎస్‌కు చెందిన 1,744 మంది ఉద్యోగులు ఉన్నారు. అమెరికాలో మూడేళ్ల కాలానికి జారీచేసే హెచ్1బీ వీసాను మరో మూడేళ్లకు పొడిగించుకోవచ్చని సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ చెప్పింది. హెచ్1బీ వీసా గడువు ముగిసే సమయంలో చాలామంది భారతీయులు అమెరికాలో శాశ్వత నివాసానికి గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకుంటారంది. ప్రస్తుతం గ్రీన్‌కార్డును పొందేందుకు భారతీయ ఐటీ నిపుణులకు సగటున పదేళ్లు పడుతోందని చెప్పింది. -
గ్రీన్‌కార్డ్ కోటా ఎత్తేస్తే..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్‌కార్డ్) కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారతీయులకు మంచిరోజులు రానున్నాయి. అమెరికా కాంగ్రెస్ ముందున్న ‘ఫెయిర్‌నెస్ ఫర్ హైస్కిల్డ్ ఇమిగ్రెంట్ యాక్ట్’బిల్లు చట్టరూపం దాల్చితే ఏళ్ల తరబడి గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది భారత సాంకేతిక నిపుణులు వచ్చే మూడేళ్లలోనే తమ కలలను సాకారం చేసుకుంటారు. దాదాపు 3 లక్షల మంది భారతీయ టెకీలు దశాబ్దం కాలంగా హెచ్1–బీ వీసాలపై ఆధారపడి పని చేస్తున్నారు. ఏటేటా హెచ్1–బీ కోసం దరఖాస్తుచేయడం, అది ఆమోదం పొందేదాకా ఒత్తిడికి గురవడం వంటి సమస్యలున్నాయి. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే.. ఇలాంటి సమస్యలన్నీ తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని అమెరికా మీడియా కథనాలు సూచిస్తున్నారు. రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో భారత్, చైనా తదితర దేశాలనుంచి వచ్చి అమెరికాలో వర్క్ వీసాలపై పని చేస్తున్న లక్షలాది మందికి మూడేళ్లలోనే శాశ్వత నివాసం దక్కుతుందని న్యూయార్క్ టైమ్స్ తన తాజా కథనం స్పష్టం చేసింది. ఏళ్ల తరబడి గ్రీన్‌కార్డ్ లభించని కారణంగా ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు తక్కువ వేతనాలకే పనిచేయాల్సి వస్తుందని, తాజా బిల్లును ఆమెరికా కాంగ్రెస్ ఆమోదిస్తే ఐటీ నిపుణులకు మంచి వేతనాలు లభిస్తాయని వాషింగ్టన్ పోస్టు పేర్కొంది. ఇతరత్రా సమస్యలేవీ లేకపోతే ఈ ఏడాది జూన్ నాటికి గ్రీన్‌కార్డుల జారీలో కోటా విధానం రద్దు కావచ్చని అక్కడి వార్తా సంస్థలు చెపుతున్నాయి. పదేళ్ల క్రితం నాటి దరఖాస్తులకు మోక్షం అమెరికాలో శాశ్వత నివాసానికి దేశాలవారీ కోటా అమలు చేస్తుండటంతో భారతీయులు పదేళ్ల నుంచి వేచిచూడాల్సి వస్తోంది. 2009 నాటి దరఖాస్తులను ఈ ఏడాది డిసెంబర్ నుంచి క్లియర్ చేసే పనిలో యునైటెడ్ స్టేట్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్సీఐఎస్) ఉంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. అమెరికా ప్రభుత్వం ఏటా 1.40 లక్షల మందికి గ్రీన్‌కార్డులు జారీచేస్తుంది. ఈ లెక్కన భారతదేశానికి చెందిన 9,800 మందికి మాత్రమే శాశ్వత నివాస హోదా దక్కుతోంది. భారత్, చైనా కాకుండా అమెరికాలో హెచ్1–బీ, ఇతర వృత్తి నిపుణుల వీసాపై పని చేస్తున్న ఇతరదేశాల వారికి సులువుగా గ్రీన్‌కార్డ్ వస్తోంది. 2000కు ముందు భారతీయులకు మూడునాలుగేళ్లలోనే గ్రీన్‌కార్డు దక్కేది. కానీ, అమెరికాలో విద్యాభ్యాసం చేయాలనుకున్న వారి సంఖ్య పెరగడంతో.. 2002 నుంచి గ్రీన్‌కార్డుల కోసం వేచి చూసే భారతీయుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. యుఎస్సీఐఎస్ అందించిన సమాచారం ప్రకారం గతేడాది మార్చి నాటికి 3,95,025 మంది విదేశీయులు గ్రీన్‌కార్డ్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. అందులో 3,06,601 మంది భారతీయులే కావడం గమనార్హం. 2018 డిసెంబర్ నాటికి గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న విదేశీయుల సంఖ్య మరో 59 వేలు పెరిగి 4,54,025కు చేరుకోగా.. ఇందులో 3,35,650 మంది భారతీయులే అందులోనూ మెజారిటీ ఐటీ నిపుణులే. చట్టరూపం దాల్చితే ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్ ముందున్న ఈ బిల్లులు చట్టరూపం దాల్చితే మొదటి ఏడాదిలోనే దాదాపు లక్ష మంది భారతీయ ఐటీ నిపుణులు శాశ్వత నివాస హోదా పొందుతారు. ఈ లెక్కన మరో మూడునాలుగేళ్లలో గ్రీన్‌కార్డ్ కోసం వేచి చూస్తున్న భారతీయులందరికీ.. శాశ్వత నివాస హోదా దక్కడం దాదాపు ఖాయమే. 2018 నాటికి గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారందరికీ 2022నాటికి గ్రీన్‌కార్డ్ లభిస్తుంది. అయితే, 2015 నుంచి ఏటా 2లక్షల మంది అమెరికాలో విద్యాభ్యాసం కోసం వెడుతున్న నేపథ్యంలో వారందరికీ వర్క్ వీసాలు లభిస్తే 2025 నుంచి మళ్లీ బ్యాక్లాగ్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఉద్యోగం లేదా శాశ్వత నివాస హోదా కోసం అమెరికా వెళ్లాలనుకుంటే అసాధారణమైన తెలివితేటలుండాలని వారంటున్నారు. జీఆర్ఈ 312 కంటే ఎక్కువ, టోఫెల్ స్కోర్ 100 దాటేవారికి మంచి యూనివర్సిటీల్లో సీట్లు వస్తాయని, 310 అంతకంటే తక్కువ జీఆర్ఈ, 90 కంటే తక్కువ టోఫెల్ స్కోర్‌తో వస్తున్న వారు ఇబ్బందులు పడుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే 25ఏళ్లు భారత్‌లోనూ ఐటీ ఉద్యోగాలకు ధోకా ఉండదని, ఖర్చులు తగ్గించుకోవడం కోసం అనేక ముఖ్యమైన కంపెనీలు మానవ వనరులు అత్యధికంగా ఉన్న భారత్‌లో కంపెనీలు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని ఫీచర్డ్ ఆన్ స్లేట్ (అమెరికా) ప్రెసిడెంట్ ఇగోర్ మార్కోవ్ అభిప్రాయపడ్డారు. మంచి వేతనాలొస్తాయ్! శాశ్వత నివాస హోదా దక్కితే కంపెనీలపై ఆధారపడే అగత్యం తప్పుతుందని, మంచి వేతనాలు లభిస్తాయని ఆమెరికా ఆర్థిక నిపుణులంటున్నారు. దీనివల్ల వ్యక్తిగతంగా ఆర్థిక పరిపుష్టతతోపాటు.. దేశ ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని వారంటున్నారు. ప్రస్తుతం కంపెనీలు స్పాన్సర్ చేస్తేనే గ్రీన్‌కార్డ్ దరఖాస్తును యుఎస్సీఐఎస్ ఆమోదిస్తుంది. ఉద్యోగి ఏ కారణాల వల్ల వైదొలగినా అతని గ్రీన్‌కార్డ్‌ను వెనక్కి తీసుకునే అధికారం కంపెనీలకు ఉంటుంది. దీంతో ఇబ్బంది ఎందుకన్న భావనలో ఐటీ నిపుణులు ఒకే సంస్థలో తక్కువ వేతనాలతో నెట్టుకొస్తున్నారు. ఒక్కసారి శాశ్వత నివాస హోదా వస్తే సదరు ఉద్యోగి స్వేచ్చగా ఏ కంపెనీలో అయినా ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉంటుంది. -
కార్డు ఉంటేనే డిపాజిట్!
కుత్బుల్లాపూర్: ఐచ్చికంగా ఉండాల్సిన విధి విధానాలను బలవంతంగా వినియోగదారులపై రుద్దుతున్నారు బ్యాంక్ అధికారులు. తమ టార్గెట్లు చేరుకునేందుకు ఖాతాదారులను పావులుగా వాడుకుంటున్నారు. తమ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేయాలన్నా సరే గ్రీన్ కార్డు లేదా ఏటీఎం కార్డు ఉండాల్సిందేనంటూ ఖాతాదారులకు చుక్కలు చూపిస్తున్నారు. కుత్బుల్లాపూర్ పరిధి సుచిత్ర రోడ్డులో ఉన్న ఎస్బీఐ బ్యాంక్ (కుత్బుల్లాపూర్ శాఖ)లో ఖాతాదారులు ఎదుర్కొంటున్న సమస్య ఇది. కార్డు ఉటేనే డిపాజిట్ల స్వీకరణ సాధారణంగా బ్యాంకుల్లో ‘గ్రీన్ చానల్’ పేరిట పేపర్ వినియోగం తగ్గించేందుకు డిపాజిట్ కౌంటర్ల వద్ద స్వైపింగ్ మెషిన్లు ఏర్పాటు చేసి తద్వారా డిపాజిట్లు స్వీకరిస్తున్నారు. ఒక వేళ కార్డు లేకపోతే సంబంధిత ఫామ్ మీద వివరాలు రాసి డిపాజిట్‌కు అనుమతిస్తారు. అయితే ఈ ఎస్బీఐ బ్రాంచ్‌లో మాత్రం ఇందుకు విరుద్ధంగా సాగుతోంది. ఫారం నింపి డబ్బులు ఇస్తే తీసుకోమంటూ బ్యాంక్ అధికారులు తిరస్కరిస్తున్నారు. ఏటీఎం కార్డు లేకపోతే బ్యాంక్ వారు జారీ చేస్తున్న గ్రీన్ కార్డుతో మాత్రమే డిపాజిట్లు స్వీకరిస్తామని తేల్చిచెబుతున్నారు. దీంతో నిరక్షరాశులు, నిరుపేదలైన ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ.20కు గ్రీన్ కార్డు.. ఖాతాదారు తన ఏటీఎం కార్డును మరిచిపోయి బ్యాంక్‌కు వస్తే బయట ఉన్న సీడీఎం(క్యాష్ డిపాజిట్ మెషిన్)లో వేసుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే రూ.20 చెల్లించి ఎస్బీఐ ‘గ్రీన్ రెమిట్ కార్డు’ తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. ఇక వినియోగదారులు తిరిగి వెళ్లి ఏటీఎం కార్డు తీసుకురాలేక రూ.20 చెల్లించి గ్రీన్ కార్డును తీసుకుని డిపాజిట్లు చేసుకుంటున్నారు. ఈ రెండు పద్ధతుల్లో తప్ప ఇతర పద్ధతుల్లో ఇక్కడి అధికారులు ఏ మాత్రం క్యాష్ డిపాజిట్లను స్వీకరించడం లేదు. గ్రీన్ కార్డు ఆవశ్యకతను, దాని ఉపయోగాలను సానుకూలంగా ఖాతాదారులకు వివరించాల్సిన సిబ్బంది ఇలా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని బలవంతంగా గ్రీన్‌కార్డులను అంటగడుతున్నారని పలువురు ఖాతాదారులు వాపోతున్నారు. పైగా బ్యాంక్ ఆవరణలో గ్రీన్ కార్డు లేదా ఏటీఎం కార్డు ద్వారానే డిపాజిట్ స్వీకరిస్తామని ఎక్కడా నోటీసు కూడా పెట్టకపోవడంతో చాలా మంది ఖాతాదారులు కార్డు లేకుండానే బ్యాంక్‌కు రావడం, సంబంధిత అధికారులతో వాదులాడడం, లేదా బతిమిలాడడం సర్వసాధారణమైంది. ఇక్కడ అందరూ చదువుకున్న వారే.. కార్డు తెచ్చుకోవాల్సిందే.. ఈ విషయమై సంబంధిత బ్యాంక్ ఉన్నతాధికారిని ఖాతాదారులు సంప్రదించగా జనవరి 1వ తేదీ నుంచి పేపర్ లెస్ డిపాజిట్లను తీసుకుంటున్నామని, ఇది తమ బ్యాంక్‌లో తప్పనిసరని చెప్పుకొచ్చారు. మరి కార్డులు తీసుకురాని వారి పరిస్థితి ఏమిటని అడగ్గా ‘ఇది పట్టణ ప్రాంతం.. అందరూ చదుకున్న వాళ్లే ఉంటారు. కార్డు తెచ్చుకోకపోతే మేమేమీ చేయలేమంటూ’ స్పష్టం చేశారు. మరో అధికారి స్పందిస్తూ అత్యవసర సమయంలో మాత్రమే డిపాజిట్ స్లిప్‌లను అనుమతిస్తామని కొంచెం వెసలుబాటు మాటలు చెప్పారు. -
పౌరసత్వం దిశగా హెచ్1బీ
వాషింగ్టన్: విధాన ప్రక్రియలో సరళత్వం, స్థిర నివాసానికి సంబంధించి కచ్చితమైన హామీతో పాటు పౌరసత్వానికి వీలు కల్పించేలా హెచ్1బీ వీసా విధానంలో త్వరలో సమూల సంస్కరణలు తీసుకురాబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సమర్ధత కలిగిన, అత్యంత నైపుణ్యవంతులు అమెరికాలో ఉద్యోగాలు చేయడాన్ని ప్రోత్సహించేలా కొత్త నిబంధనలు ఉంటాయన్నారు. ‘హెచ్–1బీ వీసాదారులు నిశ్చింతగా ఉండొచ్చు. పౌరసత్వం, స్థిర నివాసం సహా మీకు ప్రయోజనం కల్పించే పలు మార్పులు త్వరలోనే రాబోతున్నాయి. ప్రతిభావంతులను మేం ప్రోత్సహించాలనుకుంటున్నాం’ అని శుక్రవారం ట్వీట్ చేశారు. హెచ్1బీ వీసాపై అమెరికాలో ఉంటున్నవారిలో అధికులు భారతీయ ఐటీ నిపుణులే కావడం గమనార్హం. ట్రంప్ ప్రకటన అమెరికా గ్రీన్‌కార్డ్ కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వేలాది భారతీయులకు శుభవార్తేనని భావిస్తున్నారు. ట్రంప్ అధికారం చేపట్టాక తొలి రెండేళ్ల పాటు హెచ్–1బీ నిబంధనలను కఠినతరం చేయాలని పట్టుబట్టడం తెలిసిందే. అయితే ఇటీవలి కొద్ది కాలంగా ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని తాము ప్రోత్సహిస్తామనీ, మిగతా వలసలను బాగా తగ్గిస్తామని ట్రంప్ చెబుతున్నారు. హెచ్–1బీ వీసాకు దరఖాస్తు చేసుకున్న వాళ్లలో అత్యుత్తములనే ఎంపిక చేసేలా ప్రభుత్వం కృషి చేయాలని గత నెలలో హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగ మంత్రి కిర్‌స్టెన్ నీల్సెన్ చట్టసభ్యులకు తెలిపారు. ఉద్యోగ ఆధారిత వీసా మోసాలను గుర్తించి నిరోధించేందుకు ట్రంప్ ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసిందనీ, అమెరికన్ ఉద్యోగుల హక్కులను కాపాడాలంటే వలసయేతర వీసాల్లో సంస్కరణలు అవసరమన్నారు. భారతీయ వీసాదారుల హర్షం ట్రంప్ ప్రకటనపై పలువురు భారతీయ హెచ్–1బీ వీసాదారులు హర్షం వ్యక్తం చేశారు. ‘మాకు ఆశ కనిపిస్తోంది ప్రెసిడెంట్ సర్. కొండలా పేరుకుపోయిన గ్రీన్‌కార్డు దరఖాస్తులను మీరు త్వరగా పరిష్కరిస్తే అదే మాకు సంతోషం. అప్పుడు మీరే పది లక్షల మంది భవిష్యత్ పౌరులకు నిర్వివాదంగా నాయకులవుతారు’ అని అమెరికాలో పనిచేస్తున్న జ్యోత్స్న శర్మ అనే ఓ భారతీయ ఉద్యోగిని ట్వీట్ చేశారు. చట్టబద్ధ వలసదారులమైన తాము అమెరికా ఆర్థికవ్యవస్థ బలోపేతానికి ఎంతో సహకరిస్తున్నామని మనోజ్ అనే మరో టెకీ ట్వీట్ చేశారు. ట్రంప్ మాటలు నిజమైతే మంచిదేగానీ ఇప్పటి నుంచే ఆశలు పెట్టుకోవద్దని ఒబామా కాలంలో హెచ్–1బీ అధికారిగా పనిచేసిన ఒకరు హెచ్చరించారు. -
ట్రంప్ మార్కు మార్పు..!
దరఖాస్తులో తప్పులు దొర్లినా, జత చేయాల్సిన డాక్యుమెంట్లలో ఏవైనా మర్చిపోయినా లేదా మిస్ అయినా అమెరికా వీసా కోసం పెట్టుకున్న దరఖాస్తు, పిటిషన్ లేదా విజ్ఞప్తిని (హెచ్1బీ సహా) ఆ దేశ అధికారులు ఇప్పుడు తిరస్కరించవచ్చు. వీసా లేదా గ్రీన్‌కార్డు కోసం చేసుకున్న దరఖాస్తులు అసంపూర్తిగా ఉంటే వాటిని సరిచేసుకునేందుకు దరఖాస్తుదారులకు గతంలో ఉన్న అవకాశం ఇప్పుడుండదు. అమెరికాలో చట్టపరంగా శాశ్వత నివాసులుగా (గ్రీన్‌కార్డ్‌పై) ఉండేందుకు, తాత్కాలికంగా అక్కడ నివసిస్తూ ఉద్యోగం (నాన్ ఇమిగ్రెంట్) చేసే వారు లేదా అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వారిపైనా తాజా నిబంధన ప్రభావం పడుతుంది. ఇప్పటిదాకా ప్రతీ ఏడాది దాదాపు 70 లక్షల వరకు ఇలాంటి దరఖాస్తులను అక్కడి అధికారులు పరిష్కరిస్తున్నారు. అయితే పర్యటనలు, వ్యాపార అవసరాల నిమిత్తం స్వల్పకాలిక వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారిపై కొత్త నిబంధన వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు. గత మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధన విధానపరంగా పెద్దమార్పుగానే ఇమిగ్రేషన్ లాయర్లు, కార్యకర్తలు, ఈ ప్రభావానికి గురయ్యే వారు భావిస్తున్నారు. కొత్త నిబంధన వల్ల వీసా దరఖాస్తు ప్రక్రియకయ్యే ఖర్చు మరింత పెరుగుతుందని, దరఖాస్తు పరిశీలన మామూలు కంటే ఎక్కువ కాలం తీసుకుంటుందనే అభిప్రాయంతో ఉన్నారు. నిబంధనలో తాజా మార్పు వల్ల ఇప్పటికే అమెరికాలో ఉంటున్న వారి దరఖాస్తులు అసంపూర్తిగా ఉన్నట్టుగా తేలితే వారిని స్వదేశాలకు కూడా తిప్పి పంపించే అవకాశాలున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఒబామా విధానానికి ట్రంప్ మార్పులు.. 2013లో బరాక్ ఒబామా హయాంలో ప్రవేశపెట్టిన నిబంధన స్థానంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ కొత్త మార్పు తీసుకొచ్చింది. వీసా, గ్రీన్‌కార్డు దరఖాస్తుల్లో తప్పులు, జత చేయని పత్రాలున్న అన్ని కేసుల్లో అభ్యర్థి పనిచేసుకునేందుకు వీలుగా రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ (ఆర్ఎఫ్ఈ), నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై (ఎన్ఓఐడీ) జారీ చేసేలా యూఎస్సీఐఎస్ అధికారులకు ఒబామా ప్రభుత్వం అవకాశం కల్పించింది. కొత్త నిబంధన ద్వారా ఆ అవకాశం ఉండదు. విచారణలో ఉన్న స్వాప్నికుల (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్డీఏసీఏ) కేసులు మినహా కొత్త పాలసీ అమల్లోకి వచ్చిన తేదీ నుంచి అందే అన్ని దరఖాస్తులు, పిటిషన్లు, విజ్ఞప్తులు దీని పరిధిలోకి వస్తాయని అమెరికా పౌరసత్వ, వలససేవల విభాగం (యూఎస్సీఐఎస్) ప్రతినిధి మైఖేల్ బార్స్ తెలిపారు. -
యూఎస్ రియల్టీలో భారతీయులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూఎస్ గ్రీన్‌కార్డ్ ఎందరో భారతీయుల కల. దాన్ని నెరవేర్చుకోవటానికి కొందరు సంపన్నులు ఈబీ–5 మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ మార్గంలో కనీసం 5 లక్షల డాలర్ల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించడం ద్వారా యూఎస్‌లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. పెట్టుబడిదారు, ఆయన భార్య, పిల్లలకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది. సాధారణంగా గ్రీన్కార్డ్కు 15–20 ఏళ్లు పడుతుంది. ఈబీ–5 ద్వారా 18 నెలల్లోపే కండిషనల్ గ్రీన్‌కార్డ్ పొందవచ్చు. భారత్ నుంచి ఈబీ–5 దరఖాస్తుదారుల్లో 60% మంది రియల్టీలో పెట్టుబడికి ఆసక్తి కనబరుస్తున్నారని ‘కెన్ ఏమ్’ ఎంటర్ప్రైజెస్ ఇండియా, మిడిల్ ఈస్ట్ వైస్ ప్రెసిడెంట్ అభినవ్ లోహియా మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. న్యూయార్క్ కేంద్రంగా సేవలందిస్తున్న ‘కెన్ ఏమ్’ ఇమిగ్రేషన్ ఆధారిత పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది. వీసా నిబంధనలతో..: ట్రంప్ అధ్యక్షుడయ్యాక వీసా, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినమయ్యాయని, ఈ మధ్య వీసాల రెన్యువల్స్ తిరస్కరణ పెరిగిందని, దీంతో ఈబీ–5 వీసాలకు డిమాండ్ పెరిగిందని అభినవ్ వెల్లడించారు. ‘ఎంట్రప్రెన్యూర్స్, టెకీల నుంచి ఈ దరఖాస్తులు పెరుగుతున్నాయి. యూఎస్‌లో ఉన్నవారికి ఈబీ–5 వీసాకు దరఖాస్తు చేయటం చాలా సులువు. అయితే పెట్టుబడి మొత్తాన్ని 2018 సెప్టెంబరు నుంచి 9.25 లక్షలు లేదా 13 లక్షల డాలర్లు చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే భారత్ నుంచి దరఖాస్తులు 80–90 శాతం తగ్గే అవకాశముంది. నిజానికి 5 లక్షల డాలర్లు చాలా తక్కువ. అదే ఆస్ట్రేలియాలో అయితే కనీసం 20 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టాలి’ అని ఆయన వివరించారు. ఈ ఏడాది 700 దరఖాస్తులు.. గతేడాది భారత్ నుంచి 500 దాకా ఈబీ–5 దరఖాస్తులొచ్చాయని, ఈ ఏడాది 700 దరఖాస్తులొచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు అభినవ్ చెప్పారు. చైనా, వియత్నాం తర్వాత అత్యధిక అప్లికేషన్లు భారత్ నుంచే వస్తున్నట్లు చెప్పారాయన. ఇక కెన్ ఏమ్ 2016లో 50, 2017లో 97 దరఖాస్తులను స్వీకరించింది. ఈ ఏడాది ఇది 200 రావచ్చని భావిస్తోంది. హైదరాబాద్ నుంచి గత రెండేళ్లలో 10 అప్లికేషన్లను ప్రాసెస్ చేసింది. -
75శాతం భారతీయులే
వాషింగ్టన్: అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం నిరీక్షిస్తున్న వారిలో భారతీయులే ఎక్కువ మంది ఉన్నారు. యూఎస్‌లో శాశ్వతంగా నివసించే అవకాశం కల్పించే గ్రీన్కార్డ్కోసం ఎదురు చూస్తున్న నిపుణుల్లో నాలుగింట మూడొంతులకు పైగా భారతీయులేనని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) తాజా గణాంకాలు వెల్లడించాయి. ఈ ఏడాది మే నాటికి సుమారు 3,95,025 మంది విదేశీయులు అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో మూడొంతులకు పైగా అంటే 3,06,601మంది భారతీయులు గ్రీన్‌కార్డ్ కోసం ఎదురు చూస్తున్నారు. గ్రీన్‌కార్డ్ కోసం ఎదురు చూస్తున్న వారిలో భారత్ తర్వాతి స్థానంలో చైనా (67,031) ఉంది. మిగతా దేశాల్లో దీనికోసం ఎదురు చూస్తున్న వారు పదివేల మంది కంటే తక్కువగానే ఉన్నారు. చైనా తర్వాతి స్థానంలో ఎల్ సాల్వడార్ (7,252), గ్వాటెమాలా (6,027), హోండురస్ (5,402), ఫిలిప్పైన్స్ (1,491) దేశాలు ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో ఏ దేశానికీ ఏడు శాతానికి మించి గ్రీన్ కార్డులు జారీ చేయరాదు. దీనివల్ల భారతీయులు ఇబ్బందిపడుతున్నారు. -
డాలర్ డ్రీమ్స్‌పై మరో పిడుగు
(కంచర్ల యాదగిరిరెడ్డి, కాలిఫోర్నియా నుంచి) ఎందాక ఈ నడక ఈ అడుగు సాగినందాక ఎన్నాళ్లు సాగుతుందీ అడుగు? ఎదురుగా లోయలో నిలిచే దాక ఏమంటుంది ఆ లోయ? ఈడ్చుకుంటుంది అగాధం దాక. ఏమౌతుంది ఆ పైన? ఇది ప్రశ్నగా మిగిలిన ప్రశ్న అమెరికాలో ఆరున్నర సంవత్సరాలుగా ఫేస్బుక్లో ఐటీ నిపుణుడిగా ఉద్యోగం చేస్తున్న కస్తూరి రంగనాథ్ భావోద్వేగం ఇది! తమ జీవితాలు ఇప్పుడు డాక్టర్ సినారె ‘విశ్వంభర’ను గుర్తుకు తెస్తున్నాయంటూ ఆవేదన చెందారు. ఇది ఒక్క రంగనాథ్ బాధే కాదు.. అమెరికా వచ్చి ఏళ్లుగా కొలువులు చేసుకుంటున్న వేలాది మంది భారతీయుల వ్యథ! వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇలాంటి వారందరికీ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు ఆయన కన్ను ఈఏడీ (ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్)పై పడింది. అమెరికా పౌరసత్వం, ఇమిగ్రేషన్ సేవల విభాగం(యూఎస్సీఐఎస్) జారీ చేసే ఈ ఈఏడీతో ఇక్కడ తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకునేందుకు వెసులుబాటు కలుగుతుంది. హెచ్1 బీ వీసా కలిగి ఉండి, గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసి దాని ఆమోదం కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల భార్యలు/భర్తలు ఈఏడీ కింద తాత్కాలిక ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ ఈఏడీ విధానాన్ని రద్దు చేస్తామని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించడంతో ఇలాంటి వారందరిలో కలవరం మొదలైంది. అమెరికా సిలికాన్ వ్యాలీలోని శాన్ జోస్ ఫేస్బుక్ కార్యాలయాన్ని సందర్శించిన ‘సాక్షి’ప్రతినిధితో రంగనాథ్ తన గోడు వెళ్లబోసుకున్నారు. ‘‘నేను, నా భార్య ఏడాదికి 50 వేల డాలర్లు (రూ.33.50 లక్షలు) అమెరికా ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లిస్తాం. ఇప్పుడు ఈఏడీ విధానం కింద నా భార్య ఉద్యోగం చేయడానికి వీల్లేదంటూ ట్రంప్ సర్కార్ చట్టం తేబోతోంది. అదే జరిగితే నేను పక్కన ఉన్న కెనడాకు వెళ్లి ఉద్యోగం చేసుకుంటా’’అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే టాప్ టెన్ విశ్వవిద్యాలయాలలో ఒకటైన బర్కిలీలోని యూనివర్సిటీ అఫ్ కాలిఫోర్నియాలో పీజీ పూర్తి చేసి క్యాంపస్ నియామకాలలో ఆపిల్ కంపెనీలో చేరిన అశ్విన్ రాచమల్లు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ‘‘ఇక్కడ పని చేస్తున్నందుకు లక్షల్లో పన్నులు చెల్లిస్తున్నాం. అయినా మేమేదో దొంగతనం చేస్తున్నామన్న భావనలో ప్రభుత్వం ఉంది. ఈఏడీపై మరో కంపెనీలో నా భార్య ఉద్యోగం చేస్తుంది. ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన ఆమె ఇప్పుడు ఉద్యోగం చేయటానికి వీల్లేదని నిర్ణయం చేస్తే మరుక్షణం ఈ దేశాన్ని వదిలేస్తా. ఈఏడీ మాకు ఎంత ముఖ్యమో ఇక్కడి ఐటీ కంపెనీలకు అంతే ముఖ్యం’’అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే సిలికాన్ వ్యాలీలో పని చేస్తున్న భారతీయ ఐటీ నిపుణుల్లో దాదాపు 5 నుంచి 6 శాతం మంది యూరప్ దేశాలకు తరలిపోయారు. దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. 1.ప్రముఖ కంపెనీలు ముందు జాగ్రత్తగా తమ ఆఫీసులు కొన్నింటిని ఇక్కడ్నుంచి తరలించడం, 2. ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) రద్దు ప్రతిపాదన. తగ్గుతున్న నిపుణుల రాక ట్రంప్ వలస విధానాల కారణంగా భారత్, చైనా నుంచి వచ్చే నిపుణుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా భారత్ నుంచి వచ్చే ఐఐటీ గ్రాడ్యుయేట్ల సంఖ్య మరీ తగ్గింది. 2012–13లో ఫేస్బుక్ 275 మందిని, 2013–14లో 325, 2014–15లో 436 మందిని రూ.కోటి అంతకంటే ఎక్కువ మొత్తంలో ఆఫర్లు ఇచ్చి నియమించుకుంది. ఆపిల్ కూడా అదే స్థాయిలో ఐఐటీయన్లను ఆకర్షించింది. అయితే గడచిన రెండున్నర సంవత్సరాలలో ఐఐటీయన్లు అమెరికా రావడమే మానేశారు. ఉన్నత విద్య కోసం వచ్చేవారి సంఖ్య కూడా బాగా తగ్గింది. ‘‘ఐఐటీయన్లు భారత్ లోనే స్టార్టప్ కంపెనీలు స్థాపించడం, ఇతరత్రా కార్పొరేట్ రంగాలలో మంచి ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. మా కంపెనీలో పని చేస్తున్న కొందరు ఉద్యోగాలకు రాజీనామా చేసి భారత్ తిరిగి వెళ్లారు’’అని ఆపిల్ (ఆర్అండ్డీ) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ విలియమ్స్ చెప్పారు. ఇక్కడి ఐటీ కంపెనీల్లో సీనియర్ స్థాయుల్లో చైనా, భారతీయులే ఉంటారు. గడచిన మూడేళ్లుగా చైనా నుంచి వచ్చే ఐటీ నిపుణుల సంఖ్య 70 శాతానికి తగ్గింది. చైనాలో ప్రసిద్ధిగాంచిన పేకింగ్ విశ్వవిద్యాలయం, చైనా యూనివర్సిటీ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, హర్బిన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ నిపుణులు అమెరికా రావడం తగ్గిపోయింది. వాళ్లంతా ఇప్పుడు ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలకు వెడుతున్నారని శాన్ జోస్ కేంద్రంగా పని చేస్తున్న సైబర్ జెన్ టెక్నాలజీస్ కన్సల్టెన్సీ డైరెక్టర్ జేమ్స్ పేర్కొన్నారు. ఎక్కడ చూసినా ఉద్యోగ ఖాళీలే ఒక ఐటీ ఉద్యోగాలే కాదు అమెరికాలోని ఆపిల్, ఫేసుబుక్, పేపాల్ సహా అనేక కంపెనీల హెడ్ క్వార్టర్స్ కేంద్రమైన శాన్ జోస్ నగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. అయితే సరిపడ ఉద్యోగులు దొరకడం లేదు. ‘‘మేం గంటకు 15 డాలర్లు ఇస్తాం. ఒక్క కాలిఫోర్నియాలో మాకు 5 వేల మంది ఉద్యోగులు కావాలి. కానీ దొరకడం లేదు. ఈఏడీ ఉన్న కొందరితో పని చేయించుకుంటున్నాం. ఇప్పుడు దానిని రద్దు చేస్తే మాకు ఇబ్బందులు తప్పవు’’అని వాల్ మార్ట్ కాలిఫోర్నియా హెచ్ఆర్ ఆపరేషన్స్ డైరెక్టర్ డేవిడ్ రిచర్డ్ సన్ చెప్పారు. శాన్ జోశ్ సిటీలో ‘సాక్షి’ప్రతినిధికి చిన్న పెద్ద వాణిజ్య కూడళ్ల వద్ద ‘ఉద్యోగులు కావాలి’అన్న బోర్డులే కనిపించాయి. 75 శాతం మంది ఐటీ నిపుణులే ఈఏడీ ద్వారా ఉద్యోగం చేసుకుంటున్న వారిలో 75 శాతం మంది ఐటీ నిపుణులే. వీరిలోనూ 65 శాతం మంది సిలికాన్ వ్యాలీ ఐటీ కంపెనీల్లో పని చేస్తున్నారు. అందువల్లే ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ వంటి అగ్రశ్రేణి సంస్థలు ఈఏడీ రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో ఉపయోగపడుతున్న ఈ విధానాన్ని రద్దు చేస్తే మొదటికే మోసం వస్తుందని ఇప్పటికే ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. అయినా ట్రంప్ ప్రభుత్వం దీన్ని రద్దు చేసేందుకు ఏ మాత్రం సంకోచించడం లేదు. ‘‘కాలిఫోర్నియా నిబంధనల ప్రకారం మాకు వచ్చే వేతనంలో 34 శాతం పన్నులకే పోతోంది. మరి ఇలాంటప్పుడు భార్య, భర్త పని చేయకుండా ఎలా నెట్టుకురాగలం? ఒకవేళ ఈఏడీ రద్దు చేస్తే మేమెందుకు ఉండాలి? మా కష్టంలో సగం పన్నులకే ఎందుకు చెల్లించాలి’’అని గూగుల్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బ్రహ్మరెడ్డి ప్రశ్నించారు. ఫేస్బుక్, ఆపిల్ కంపెనీల్లోనే దాదాపు 24 వేల మంది ఈఏడీతో పని చేస్తున్నారు. ‘‘నా భర్త ఐఐటీ గ్రాడ్యుయేట్. ఆయనకు ఫేస్బుక్లో ఉద్యోగం వస్తే ఆయనతో పాటు వచ్చి ఈఏడీపై ఇన్ఫోసిస్‌లో నేను పని చేస్తున్నా. ఇప్పుడు దీన్ని రద్దు చేస్తే నేను ఖాళీగా ఇంట్లో ఉండాలా. ఒకవేళ అదే జరిగితే నేను నా భర్త స్వదేశానికి తిరిగిపోతాం’’అని పిన్నపరెడ్డి ప్రసూన అన్నారు. ‘‘ఇప్పటికే ఇక్కడ ఐటీ కంపెనీల్లో వేలాది ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అర్హులైన వారు దొరకడం లేదు. ఫలితంగా అనేక ప్రాజెక్టులు కోల్పోవాల్సి వస్తుంది’’అని టీసీఎస్ ఉత్తర అమెరికా మానవ వనరుల విభాగం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ మురళీ శర్మ ఇటీవల అమెరికా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడి విశ్వవిద్యాలయాలలో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అమెరికన్లకు భారతీయ ఐటీ కంపెనీలు ప్రత్యేకంగా 2 సంవత్సరాల నుంచి క్యాంపస్ నియామకాలు చేపడుతున్నాయి. ఇలా ఉద్యోగాలలో చేరిన వారిలో 50 శాతంకు పైగా శిక్షణ కాలంలోనే మానేస్తున్నారని ఇన్ఫోసిస్ ఉత్తర అమెరికా మానవ వనరుల విభాగం సీనియర్ ఎగ్జిక్యూటివ్ సురేష్ పెద్దిబొట్ల తెలిపారు. -
గ్రీన్‌కార్డు కోసం పెళ్లి చేసుకొని..
వేలూరు (తమిళనాడు): స్విట్జర్లాండ్ దేశంలో గ్రీన్‌కార్డు పొందేందుకు వివాహం చేసుకొని మోసం చేసిన భర్తపై చర్యలు తీసుకోవాలని భార్య ఆదివారం ఉదయం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. బెంగుళూరుకు చెందిన అనుపమ(29) తల్లితో కలిసి వేలూరు ఎస్పీ కార్యాలయానికి చేరుకొని తన వేదనను వెల్లడించింది. వేలూరు మాసిలామణి వీధికి చెందిన డెన్నీసన్ కుమారుడు సందీప్‌తో తనకు 2012లో వేలూరులోని చర్చిలో వివాహం జరిగిందని తెలిపింది. వివాహం జరిగిన తరువాత ఐదు రోజులు మాత్రమే తనతో గడిపాడని అనంతరం సందీప్ స్విట్జర్లాండ్ వెళ్లిపోయాడని వెల్లడించింది. ఆరు నెలల్లో వీసా తీసుకొని తనను తీసుకెళతానని చెప్పినట్టు పేర్కొంది. అప్పటి నుంచి తనతో ఒక్కసారి కూడా మాట్లాడలేదని, సందీప్ తల్లిదండ్రుల వద్ద ప్రశ్నించగా ఎటువంటి సమాధానం చెప్పడం లేదన్నారు. స్విట్జర్లాండ్ గ్రీన్‌కార్డు కోసమే తనను పెళ్లిచేసుకున్నాడని బంధువుల ద్వారా తెలిసిందని, మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకుని అక్కడికి వెళ్లిపోయాడని వాపోయింది. అయితే 2016లో సందీప్ వేలూరుకు వచ్చిన సమయంలో పోలీసులు విచారణ జరపగా తాను రెండు నెలల సెలవులో వచ్చానని, మరో రెండు నెలల్లో తనను తీసుకెళతానని చెప్పి రాత పూర్వకంగా రాసి ఇచ్చి వెళ్లాడని, తరువాత ఎలాంటి ఫోన్ కూడా చేయలేదని వాపోయింది. తన భర్తపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. -
గ్రీన్‌కార్డుల్లో జాప్యానికి ముగింపు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిస్తోన్న వలస విధానం అమల్లోకి వస్తే.. నిపుణులైన ఉద్యోగులకు గ్రీన్‌కార్డుల జారీలో జాప్యానికి తెరపడనుందని వైట్‌హౌస్ పేర్కొంది. ఒక్కో దేశానికి కోటా ప్రకారం గ్రీన్‌కార్డుల కేటాయింపుల్ని రద్దు చేయాలని భారతీయ హెచ్–1బీ వీసాదారులు డిమాండ్ చేస్తోన్న నేపథ్యంలో ఈ ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. గత వారం రోజులుగా భారత్‌కు చెందిన నిపుణులైన ఉద్యోగులు అమెరికాలోని పలు ప్రాంతాల నుంచి వాషింగ్టన్ చేరుకుని.. ప్రస్తుత వలస విధానంలో మార్పు తీసుకురావాలని కోరుతూ ట్రంప్ యంత్రాంగం, అమెరికన్ కాంగ్రెస్ సభ్యులపై ఒత్తిడి కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా అనుసరిస్తోన్న వలస విధానం వల్ల హెచ్–1బీ వీసాపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయ– అమెరికన్లు ఎక్కువగా నష్టపోతున్నారు. గ్రీన్‌కార్డు కోసం వారు గరిష్టంగా 70 ఏళ్లు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ‘ప్రతిభ ఆధారిత వలస విధానానికే ట్రంప్ మొగ్గు చూపుతున్నారు. దీంతో అత్యుత్తమ నిపుణులైన ఉద్యోగుల్ని ఆకర్షించవచ్చు. అందుకనుగుణంగా వీసా లాటరీ విధానానికి స్వస్తి చెప్పేలా ట్రంప్ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది’ అని వైట్‌హౌస్ డిప్యూటీ మీడియా కార్యదర్శి రాజ్ షా చెప్పారు. ‘వీసా లాటరీ విధానానికి ముగింపు పలికే సమయం దగ్గరపడింది. మెరుగైన వలస విధానాన్ని రూపొందించడంతో పాటు అమెరికన్ల భద్రతకు కాంగ్రెస్ కృషిచేయాల్సిన అవసరముంది’ అని ట్వీటర్లో ట్రంప్ అన్నారు. -
2500 డాలర్లకు గ్రీన్‌కార్డ్!
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ల దశాబ్దాల గ్రీన్‌కార్డ్ ఎదురుచూపులకు అంతం పలికే దిశగా ఒక వినూత్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు అదనంగా ఏకమొత్తంలో 2500 డాలర్లను చెల్లిస్తే సత్వరమే గ్రీన్‌కార్డును అందించాలన్నదే ఆ ప్రతిపాదన. ప్రస్తుతం గ్రీన్‌కార్డుల జారీకి దేశాలవారీగా కోటా పరిమితి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే.. అమెరికాలో ఉంటున్న వేలాది భారతీయుల శాశ్వత నివాస స్వప్నం నెరవేరుతుంది. 2500 డాలర్ల అదనపు చెల్లింపు ప్రతిపాదనను అమెరికాకు చెందిన ‘ఇమిగ్రేషన్ వాయిస్’ అనే స్వచ్ఛంద సంస్థ తెరపైకి తెచ్చింది. భారత్ సహా పలు దేశాల ఇమిగ్రేషన్ సమస్యల పరిష్కారానికి ఈ సంస్థ కృషి చేస్తోంది. ఈ అదనపు వసూలు వల్ల దాదాపు 4 బిలియన్ డాలర్లు(400 కోట్ల డాలర్లు) ఆర్థిక వ్యవస్థలోకి చేరుతాయని, ఆ మొత్తాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లక్ష్యమైన మెక్సికో గోడ నిర్మాణానికి, అలాగే, దేశ అంతర్గత భద్రతను పటిష్టపరిచేందుకు వినియోగించవచ్చని ఆ సంస్థ సూచిస్తోంది. వాషింగ్టన్కు చెందిన ఈ స్వచ్ఛంద సంస్థ పలువురు అమెరికన్ చట్టసభ్యులతో ఈ అంశంపై సంప్రదింపులు కొనసాగిస్తోంది. త్వరలో అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టనున్న డ్రీమర్ల (డిఫర్డ్ యాక్షన్ అగైనెస్ట్ చైల్డ్‌వుడ్ అరైవల్స్) ప్యాకేజీలో ఈ ప్రతిపాదనను చేర్చాలని కాంగ్రెస్ సభ్యులపై ఒత్తిడి తీసుకొస్తోంది. హెచ్–1బీ వీసాలపై అమెరికా వచ్చిన దాదాపు 10–15 లక్షల మంది భారతీయులు గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్నారు. కోటా పరిమితి కారణంగా గ్రీన్‌కార్డ్ పొందేందుకు నిపుణులైన భారతీయ వలసదారులు 25 ఏళ్ల నుంచి 92 ఏళ్ల వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని జీసీ రిఫార్మ్స్ అనే సంస్థ చెబుతోంది. ప్రస్తుతం వీసా చట్టంలో సంస్కరణలకు ఉద్దేశించిన ‘హెచ్ఆర్ 392’(ద ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ యాక్ట్) బిల్లు ఆమోదానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ఆ బిల్లుకు 300 మంది కాంగ్రెస్ సభ్యుల మద్దతు ఉన్నా ఇప్పట్లో ఆమోదం పొందేలా కన్పించడం లేదు. అందువల్ల తాజా ప్రతిపాదనను త్వరలో అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టబోయే డ్రీమర్ల(డీఏసీఏ) ప్యాకేజీలో అనుబంధంగా చేర్చాలని ఇమిగ్రేషన్ వాయిస్ డిమాండ్ చేస్తోంది. దీంతో అందరికీ ప్రయోజనం ఉంటుందని ఆ సంస్థ ప్రతినిధి లియోన్ ప్రెస్కో తెలిపారు. ‘మెక్సికో గోడ నిర్మాణానికి అమెరికా డబ్బును వాడకూడదని ట్రంప్ భావిస్తున్నారు. మరోవైపు మెక్సికో కూడా డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో గ్రీన్‌కార్డులకు అదనంగా 2,500 డాలర్లను వసూలు చేసే అవకాశాన్ని వినియోగించుకోవాలి’ అని ఆయన వాదిస్తున్నారు. ఈ ప్రతిపాదన కాంగ్రెస్‌కు నచ్చినా.. డీఏసీఏ బిల్లులో దీనిని చేర్చే విషయం అనుమానాస్పదమేనని ఆయన అన్నారు. తమ ప్రతిపాదనపై అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు కెవిన్ యోదెర్, తులసీ గబ్బర్డ్లు వైట్‌హౌస్‌తో పాటు కాంగ్రెస్ నాయకత్వానికి లేఖలు రాశారని, డీఏసీఏ బిల్లులో చేర్చాలని వారు కోరారని ఆయన వెల్లడించారు. ‘గ్రీన్‌కార్డు కోసం దశా బ్దాలు ఎదురుచూసే అవసరం లేకుండా ఐదారేళ్లలో వచ్చేలా చూస్తే ఇక్కడి భారతీయులు సహా.. చాలామంది దరఖాస్తుదారులు 2,500 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ఒకేసారి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు. మెక్సికో గోడ కోసం దాదాపు 25 బిలియన్ డాలర్లు అవసరం. తాజా గ్రీన్‌కార్డు ప్రతిపాదనతో గోడ కోసం 4 బిలియన్ డాలర్లు సేకరించవచ్చు’ అని ప్రెస్కో వెల్లడించారు. స్వచ్ఛందమే.. ఈ ప్రతిపాదన ప్రకారం నలుగురు సభ్యులున్న ఒక కుటుంబం గ్రీన్‌కార్డు పొందాలంటే ఒకేసారి అదనంగా 10 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని ‘ఇమిగ్రేషన్ వాయి స్’ సహ వ్యవస్థాపకుడు అమన్ కపూర్ తెలిపారు. ఈ ఫీజును గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులు మాత్రమే చెల్లిస్తారని, స్వచ్ఛందంగానే వసూలు చేస్తారన్నారు. ఫీజు చెల్లించడం ఇష్టం లేకపోతే గ్రీన్‌కార్డు కోసం వరుసలో వేచి ఉండక తప్పదని అన్నారు. పదేళ్ల వ్యవధిలో గ్రీన్‌కార్డుకు 2,500 డాలర్ల చొప్పున 4 బిలియన్ డాలర్లు వసూలు కావచ్చని అంచనా వేస్తున్నారు. -
గ్రీన్‌కార్డు కోటా పెంపు
వాషింగ్టన్: అమెరికాలో గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న ఆశావహులకు శుభవార్త. అక్కడ ఉద్యోగంతో పాటు శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునేందుకు దోహదపడే గ్రీన్‌కార్డు కోటాను గణనీయంగా పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ప్రతిభ ఆధారిత వలస విధానాలను ప్రోత్సహించే ఈ బిల్లుకు ట్రంప్ ప్రభుత్వ మద్దతు కూడా ఉంది. ఇది చట్టంగా మారితే భారత్, చైనా లాంటి దేశాల సాఫ్ట్వేర్ నిపుణులకు అధిక ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. ‘సెక్యూరింగ్ అమెరికాస్ ఫ్యూచర్ యాక్ట్’ పేరిట రూపొందించిన ఈ బిల్లులో ఏటా ఇస్తున్న గ్రీన్‌కార్డుల కోటాను 45 శాతం.. అంటే ప్రస్తుతమున్న 1.20 లక్షల నుంచి 1.75 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. అనధికారిక అంచనాల ప్రకారం..ప్రస్తుతం అమెరికాలో సుమారు 5 లక్షల మంది భారతీయులు గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తూ ఏటా హెచ్–1బీ వీసాలను పొడిగించుకుంటున్నారు. కొందరైతే దశాబ్దాలుగా గ్రీన్‌కార్డు కోసం నిరీక్షిస్తున్నారు. హెచ్–1బీ వీసాపై అమెరికాకు వచ్చి, శాశ్వత నివాసం కోసం గ్రీన్‌కార్డు కోరుకునే అర్హులైన ఐటీ నిపుణులకు ఈ బిల్లు వరం కానుంది. ఏటా జారీచేసే ఈ కార్డుల సంఖ్య పెరిగితే వారు అందుకోసం ఎదురుచూసే సమయం తగ్గిపోతుంది. తల్లిదండ్రులకు తాత్కాలిక వీసానే... గొలుసుకట్టు వలస విధానాన్ని(చైన్ ఇమిగ్రేషన్) ఎత్తివేయాలని అందులో ప్రతిపాదించడం వల్ల జీవిత భాగస్వామి, మైనర్ పిల్లలు మినహా మిగతా కుటుంబ సభ్యులను అమెరికాకు తీసుకెళ్లడం కుదరదు. అయితే గ్రీన్‌కార్డు కలిగి ఉన్న పౌరులను కలుసుకునేలా వారి తల్లిదండ్రులకు పునరుద్ధరించడానికి వీలుపడే తాత్కాలిక వీసా కార్యక్రమాన్ని అమలుచేయనున్నారు. వ్యవసాయ కార్మికులు తాత్కాలికంగా అక్కడికి వెళ్లి పనిచేయడానికి వీలు కల్పించే కార్యక్రమాన్ని కూడా బిల్లులో ప్రతిపాదించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కోసం విదేశీ కార్మికుల సేవలు వాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘వైట్‌హౌస్’కు అనుగుణంగానే.. ప్రతిభ ఆధారిత వలస విధానాల వల్ల మెరికల్లాంటి నిపుణులే దేశానికి వస్తారని, అక్రమంగా ప్రవేశించే వారికి అడ్డుకట్ట పడుతుందని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన వారిలో ఒకరైన హౌజ్ హోంల్యాండ్ సెక్యూరిటీ కమిటీ చైర్మన్ మైకేల్ మెక్‌కౌల్ స్పందిస్తూ దేశ సరిహద్దులను రక్షించేలా బిల్లు ఉందని అన్నారు. దేశ భద్రతకు సైన్యం చేస్తున్న కృషి, అంతర్గత చట్టాల అమలుకు మద్దతుగా నిలుస్తూ, వలస విధానాలను ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరించేలా నిబంధనలు చేర్చామని తెలిపారు. భారతీయుల స్టోర్లపై దాడులు అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భాగంగా అమెరికా అధికారులు భారతీయులకు చెందిన సుమారు 100 7–ఎలెవన్ రిటైల్ దుకాణాలపై దాడులు నిర్వహించి 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా వలసొచ్చిన వారిని ఉద్యోగాల్లో నియమించుకోవద్దని నిర్వాహకులను హెచ్చరించారు. 18 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో ఈ దాడులు నిర్వహించారు. అరెస్టయిన వారు ఏ దేశస్తులో వెల్లడికాలేదు. అమెరికాలో ఇండో–అమెరికన్లే 7–ఎలెవన్ పేరిట ఎక్కువగా రిటైల్ దుకాణాలను నిర్వహిస్తున్నారు. -
హెచ్1బీ వీసా:ఆ పదాలు మారుద్దామా?
హెచ్1బీ వీసాదారులకు పొడిగింపును రెండుసార్లకే పరిమితం చేసేందుకు అవసరమైన చట్ట సవరణకు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ (డీహెచ్ఎస్)అధికారులు సిద్ధమౌతున్నారు. అమెరికాలో శాశ్వత నివాసానికి అనుమతించే గ్రీన్ కార్డ్ వచ్చే లోగా తమకున్న హెచ్1బీ వీసాలను ఎన్నిసార్లయినా పొడిగించుకోవడానికి విదేశీ ఉద్యోగులకు వెసులుబాటు ఉంది. ఎక్కువ నైపుణ్యం ఉన్న ఇతర దేశాల సిబ్బందిని హెచ్1బీ వీసా ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన అమెరికా రప్పించడానికి 2000 సంవత్సరంలో అమెరికా కాంగ్రెస్ (ఉభయసభలు- సెనెట్, ప్రతినిధుల సభ) అమెరికా కాంపిటీటివ్నెస్ ఇన్ ట్వెంటీఫస్ట్ సెంచరీ చట్టం చేసింది. 17 సంవత్సరాలుగా ఈ చట్టం అమల్లో ఉంది. గ్రీన్ కార్డ్ కోసం చేసిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా హెచ్1బీ వీసాలను ‘ఎన్నిసార్లయినా పొడిగించే ’ అవకాశం ప్రస్తుత చట్టంలో ఉంది. ‘పొడిగించే అవకాశం ఉంది’ అనే పదాలకు కొత్త భాష్యం చెప్పడానికి ఎంత వరకు వీలుంది? అనే అంశాన్ని డీహెచ్ఎస్ శాఖాధిపతులు క్షుణ్నంగా అధ్యయనం చేస్తున్నారు. ప్రతి మూడేళ్లకు హెచ్1బీ వీసాల పొడిగింపును ‘ఎన్నిసార్లయినా’కు బదులుగా రెండుసార్లకే పరిమితం చేసి లక్షలాది మంది ఈ వీసాదారులు తమంట తామే అమెరికా విడిచి పోయేలా చేయాలన్నది అంతర్గతంగా ఈ విభాగంలో చర్చ జరుగుతోంది. చట్ట సవరణ సాధ్యమా? ఈ మార్పులు ఎలా చేస్తారో వెల్లడించడానికి డీహెచ్ఎస్ కింద పనిచేసే అమెరికా పౌరసత్వ, వలససేవల విభాగం సిద్ధపడడం లేదు. అమెరికా కాంపిటీటివ్నెస్ ఇన్ ట్వంటీఫస్ట్ సెంచరీ చట్టంలో సవరణ లేదా రెండు మాటలకు వేరే అర్థం చెప్పడం ద్వారా లక్ష్యం సాధించలేమని అమెరికా కార్మికుల తరఫున పోరాడుతున్న లాయర్లు అభిప్రాయపడుతున్నారు. ‘‘తక్కువ నైపుణ్యమున్న హెచ్1బీ వీసాదారుల కారణంగా స్థానిక అమెరికన్ కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. చట్టంలోని రెండు పదాలు తొలగించినా ఆశించిన ఫలితం సాధించలేరు. ఈ చట్టాన్ని రద్దుచేయడం ఒక్కటే మార్గం’’ అని అమెరికా కార్మికుల తరఫున వాదించే లాయర్ జాన్ మియానో చెప్పారు. కాంగ్రెస్ ఆమోదముద్ర లేకుండా హెచ్1బీ వీసా ప్రోగ్రాంలో మార్పులు తలపెడితే భారీ సంఖ్యలో కోర్టుకెక్కుతారని కూడా వారు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ప్రస్తుతం పది లక్షల మంది వరకూ హెచ్1బీ వీసాదారులుండగా, వారిలో అత్యధికులు భారతీయులే. కాంగ్రెస్ చట్టంలో మార్పులు కాంగ్రెసే చేయాలి! అమెరికా కాంగ్రెస్ చేసిన చట్టంలో మార్పులను అధ్యక్షుడు తన కార్యనిర్వాహక చర్య లేదా ఉత్తర్వు ద్వారా సాధించలేరని అమెరికా చట్టాలను అధ్యయనం చేసిన నిపుణులు చెబుతున్నారు. ‘‘హెచ్1బీ వీసాల గడువు పొడిగింపును ‘మంజూరు చేయవచ్చు’ అని పైన చెప్పిన చట్టంలోని 104(సీ) సెక్షన్‌లోని పదాలకు కార్యనిర్వాహక వ్యవస్థ కొత్త భాష్యం చెప్పడం ద్వారా వీసా ప్రోగ్రాంలో మార్పుతేవడం కుదిరేపని కాదు. ఒకవేళ అలా చేస్తే అమెరికా కోర్టులు ఆ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేస్తాయి. అంతిమంగా ప్రభుత్వానికి ఓటమి తప్పదు’’ అని చుఘ్ ఎలెల్పీ అనే న్యాయవాద సంస్థ అధిపతి నవనీత్ ఎస్ చుఘ్ చెప్పారు. మరో పక్క అమెరికా వ్యాపారవర్గాలకు ప్రాతినిధ్యం వహించే అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్(ఏసీసీ) కూడా ట్రంప్ సర్కారు తీసుకోనున్న చర్యలు దేశానికి మంచిది కాదని తేల్చిచెప్పింది. ‘‘ సొంతిల్లు, అమెరికా పౌరసత్వమున్న పిల్లలతో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న వృత్తినిపుణులను వెనక్కి పంపడం సబబుకాదు. ఈ విధానం అమెరికా వ్యాపారాలు, ఆర్థికవ్యవస్థకు హాని చేస్తుంది’’ అని ఏసీసీ ప్రతినిధి హెచ్చరించారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
వీళ్లనూ తిప్పి పంపేవారా?
‘అమెరికా ఉత్పత్తులనే కొనండి, ఆమెరికా జాతీయులకే ఉద్యోగాలివ్వండి’ అనే తన ఎన్నికల నినాదాన్ని ఆచరణలోకి తీసుకువచ్చే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్–1బీ వీసాల జారీ విధానంలో కీలకమార్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్న ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ఇకపై హెచ్–1బీ వీసా పొందడం కఠినం కానుంది. తాజాగా ట్రంప్ తీసుకొచ్చిన ప్రతిపాదన ప్రకారం శాశ్వత నివాసానికి అర్హత కల్పించే ‘గ్రీన్‌కార్డు’ దరఖాస్తు పరిశీలనలో ఉండగానే హెచ్–1బీ వీసా గడువు ముగిసిన ఉద్యోగులు స్వదేశానికి తిరుగుముఖం పట్టాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం అమలైతే అయిదు నుంచి ఏడున్నర లక్షల మంది భారత ఉద్యోగులపై పెనుప్రభావం పడుతుంది. అయితే.. ప్రస్తుతం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అనేక అమెరికన్ కంపెనీలకు సీఈఓలుగా, అధిపతులుగా ఉన్న భారతీయులు గతంలో హెచ్ –1బీ వీసాలపై అక్కడకు వెళ్లిన వారే. ఒకవేళ ఇప్పుడు ›ట్రంప్ యంత్రాంగం తీసుకొచ్చిన తాజా ప్రతిపాదన గతంలోనే అమలై ఉంటే వీరంతా ప్రసిద్ధ కంపెనీల్లో ఉన్నతస్థానాల్లో ఉండేవారా అన్న వాదన ముందుకొస్తోంది. గతంలో సరళమైన వీసా విధానం కారణంగానే పలువురు భారతీయులు ప్రస్తుతం ఆయా కంపెనీల్లో కార్పొరేట్ లీడర్లుగా ఉన్నారు. వీరంతా అమెరికా ఆర్థికాభివృద్ధికి విశేషంగా తోడ్పడి, ఆ దేశానికే అధిక లాభం చేకూర్చారు. వలసదారుల దేశంగా పిలిచే అమెరికాలో 20వ దశాబ్దం నుంచి వీసాలు, స్థిరనివాసం విషయంలో కఠిన నిబంధనలను సడలించారు. ఈ చర్యల ఫలితంగా అత్యుత్తమ ప్రతిభావంతులను అమెరికాకు ఆకర్షించగలిగారు. భారత్ నుంచి అమెరికా వెళ్లి వివిధ రంగాల్లో స్థిరపడిన కొందరు ప్రముఖులు సత్యా నాదెళ్ల, హైదరాబాద్‌లో జననం. హోదా : సీఈఓ, మైక్రోసాఫ్ట్ చదువు : మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–బీఈ, అమెరికాలోని విస్కాన్సిన్–మిల్ఔ – ఎమ్మెస్, షికాగో యూనివర్శిటీలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ – ఎంబీఏ సుందర్ పిచాయ్, తమిళనాడులో పుట్టారు. హోదా : సీఈఓ, గూగుల్ : చదువు : ఐఐటీ ఖరగ్‌పూర్–బీటెక్, స్టాన్‌ఫర్డ్–ఎమ్మెస్, వార్టాన్–ఎంబీఏ ఇంద్రానూయి, చెన్నైలో జన్మించారు హోదా : సీఈఓ, పెప్సీకో : అనుభవం : 1994లో ఆ సంస్థలో చేరిక. కొన్నేళ్లుగా సీఈఓగా బాధ్యతలు.. 2017లో వ్యాపార,వాణిజ్యాల్లో అత్యంత శక్తిమంతమైన మహిళల ఫోర్బ్స్ జాబితాలో ద్వితీయస్థానం శంతను నారాయణ్, హైదరాబాద్‌లో పుట్టారు హోదా : సీఈఓ, అడోబ్ చదువు : ఉస్మానియా విశ్వవిద్యాలయం–బీఎస్సీ, బెర్క్లే కాలిఫోర్నియా వర్శిటీ–ఎంబీఏ, బౌలింగ్ గ్రీన్ స్టేట్ వర్శిటీ–ఎమ్మెస్ అజయ్‌పాల్‌సింగ్ బాంగా హోదా : ప్రెసిడెంట్, సీఈఓ, మాస్టర్‌కార్డ్ చదువు : అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీఏ జార్జి కురియన్, కేరళలో జన్మించారు హోదా : ప్రెసిడెంట్ అండ్ సీఈఓ, నెట్‌యాప్ చదువు : ఐఐటీ మద్రాస్‌లో కొంతకాలం ఇంజనీరింగ్ అమెరికాలోని ప్రిన్స్టన్ (న్యూజెర్సీలోని) యూనివర్శిటీలో డిగ్రీ,. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ–ఎంబీఏ దినేష్ పాలివాల్, ఉత్తరప్రదేశ్‌లో జననం హోదా : ప్రెసిడెంట్ అండ్ సీఈఓ, హర్మన్ ఇంటర్మేషనల్ చదువు : ఐఐటీ రూర్కీ–బీటెక్, వయామి వర్సిటీ–ఎమ్మెస్, ఎంబీఏ సంజయ్ ఝా హోదా : సీఈఓ, గ్లోబల్ ఫౌండ్రీస్ అనుభవం : 2014లో ఈ బాధ్యతలు చేపట్టడానికి పూర్వం మోటరోలా మొబిలిటి సీఈఓగా, క్వాల్కామ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. 2008లో ఆయన మోటరోలా కో(సహ) సీఈఓగా చేరారు. అజిత్ జైన్, ఒడిశాలో పుట్టారు చదువు : ఐఐటీ, హార్వర్డ్ల నుంచి ఉన్నతవిద్యాభ్యాసం అనుభవం :బెర్క్‌షైర్ హాథ్‌వేలో వారెన్ బఫెట్ వారసుడిగా నియమితులయ్యే వారిలో ముందు వరుసలో ఉన్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
హెచ్–1బీపై మరో బాంబ్!
వాషింగ్టన్: అమెరికాలో విదేశీయులు ఉద్యోగాలు చేయడానికి ఉపకరించే హెచ్–1బీ వీసా విధానంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తీసుకొస్తున్న ఓ ప్రతిపాదన మరింత ఆందోళన కలిగిస్తోంది. ‘అమెరికా వస్తువులనే కొనండి. అమెరికా జాతీయులనే ఉద్యోగాల్లో నియమించుకోండి’ అన్న ట్రంప్ నినాదానికి అనుగుణంగా ఆ దేశ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం హెచ్–1బీ వీసాల విధానంలో ఈ కొత్త సవరణను ప్రతిపాదిస్తోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం హెచ్–1బీ వీసా ఉన్న వారు గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న సందర్భాల్లో...ఒకవేళ గ్రీన్ కార్డు అప్లికేషన్ పరిశీలనలో ఉండగానే హెచ్–1బీ వీసా గడువు ముగిసిపోతే అప్పుడు గ్రీన్‌కార్డుపై నిర్ణయం వెలువడే వరకు వీసా గడువును పొడిగిస్తారు. ఇకపై ఈ విధానాన్ని కొనసాగించకూడదనీ, హెచ్–1బీ వీసా కలిగిన వారు గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ...గ్రీన్‌కార్డు మంజూరవడానికి ముందే వీసా గడువు పూర్తయితే అలాంటి వారిని స్వదేశాలకు పంపించేయాలని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించింది. భారత ఐటీ కంపెనీలు ఏటా అధిక సంఖ్యలో హెచ్–1బీ వీసాలను సంపాదించి అమెరికాలో తమ కార్యకలాపాల కోసం ఇక్కడి నుంచే ఉద్యోగులను తరలిస్తుండటం తెలిసిందే. తాజా నిర్ణయం అమల్లోకి వస్తే అమెరికాలో పనిచేస్తున్న 5 లక్షల నుంచి ఏడున్నర లక్షల మంది భారతీయులపై ప్రభావం పడే అవకాశం ఉంది. వారంతా గ్రీన్‌కార్డుకు దర ఖాస్తు చేసుకున్నా, వీసా గడువు ముగిసేలోపు అది మంజూరవ్వకపోతే మన దేశానికి తిరిగి రావాల్సి ఉంటుంది. ఇప్పటికే హెచ్–1బీ వీసాల జారీ, కొనసాగింపు నిబంధనలను ట్రంప్ యంత్రాంగం ఒక్కొక్కటిగా కఠినం చేస్తుండటం తెలిసిందే. ఎందుకీ ప్రతిపాదన? ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే గ్రీన్‌కార్డుకు దరఖాస్తు పెండింగ్‌లో ఉండగానే వీసా గడువు ముగిసిన విదేశీ ఉద్యోగులు అమెరికా విడిచి స్వదేశాలకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. అలాంటి వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. వారందరి ఉద్యోగాలూ ఖాళీ అవుతాయి కాబట్టి ఆ కొలువులు అమెరికా జాతీయులకే దక్కుతాయనేది ట్రంప్ ఆలోచనగా తెలుస్తోంది. విదేశీయులు ‘కొల్లగొడుతున్న’ ఉద్యోగాలను మళ్లీ అమెరికన్లకే ఇప్పిస్తానంటూ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన ట్రంప్...ఆ మాటను నిలబెట్టుకునేందుకే మొదటి నుంచి హెచ్–1బీ వీసాలపై కఠిన వైఖరిని అవలంబిస్తున్నారని పలువురు విశ్లేషిస్తున్నారు. -
ఆంటీని కాపాడబోయి..
సాక్షి, ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. మృతుల్లో అమెరికా గ్రీన్‌కార్డు కలిగిన యువకుడు కూడా ఉన్నాడు. కమలా మిల్స్ కాంపౌండ్‌లో గురువారం అర్ధరాత్రి సంభవించిన అగ్నిప్రమాదంలో ధైర్య లలానీ(26), అతడి సోదరుడు విశ్వ(23), వీరి పిన్ని ప్రమీల కెనియా(70) మృతి చెందారు. అమెరికాలో ఉంటున్న ధైర్య.. సెలవులు గడిపేందుకు ఇటీవల ముంబైకి వచ్చాడు. గురువారం రాత్రి తన సోదరుడు, బంధువులతో కలిసి కమలా మిల్స్ కాంపౌండ్‌లోని ‘వన్ ఎబౌ’ హోటల్‌కు వెళ్లాడు. ఊహించని విధంగా మంటలు వ్యాపించడంతో వీరంతా చెల్లాచెదురయ్యారు. బంధువులంతా సురక్షితంగా బయటపడ్డారు. అయితే ప్రమీల చిక్కుకుపోవడంతో ఆమెను కాపాడబోయి ముగ్గురు మృత్యువాత పడ్డారు. ‘మంటలు వ్యాపించాయని తెలియగానే మేమంతా పరుగెత్తుకుంటూ మెయిన్ గేటు వద్దకు చేరుకున్నాం. కింది ఫ్లోర్‌కు వచ్చాక ప్రమీల మాతో పాటు రాలేదని గుర్తించాం. ఆమెను రక్షించేందుకు ధైర్య, విశ్వ మళ్లీ పైకి వెళ్లార’ని వారి ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు తెలిపారు. వెంటిలేషన్ అవుట్లెట్ లేకపోవడంలో ఊపిరాడక ఎక్కువ మంది చనిపోయారని పోలీసులు చెప్పారు. కనీసం 35 మందిని కాపాడామని, 21 మంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామన్నారు. రెస్టారెంట్ నిర్వాహకులపై ఐపీసీ 304, 337, 338 కింద ఎన్ఎం జోషి మార్గ్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. -
కాంగ్రెస్‌కు ‘గ్రీన్‌కార్డు’ ప్రతిపాదనలు
వాషింగ్టన్: గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు వరంలా భావిస్తున్న ప్రతిభ ఆధారిత వలస విధానం ప్రతిపాదనల్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ కాంగ్రెస్‌కు పంపారు. అత్యుత్తమ నైపుణ్యం కలిగిన భారతీయ ఉద్యోగులు గ్రీన్‌కార్డులు త్వరగా పొందేందుకు తాజా వలస విధానం ఉపయోగకరమని అంచనావేస్తున్నారు. అయితే భారతీయ ఐటీ నిపుణులు ఎంతో ముఖ్యంగా భావించే హెచ్–1బీ వీసాల ప్రస్తావన ప్రతిపాదనల్లో లేకపోవడం గమనార్హం. అలాగే వలసదారుల జీవిత భాగస్వామి, పిల్లలకు మాత్రమే గ్రీన్‌కార్డు అవకాశం కల్పిస్తూ తల్లిదండ్రులు, సోదరులు, సోదరిలకు అమెరికాలో నివసించే అవకాశాన్ని నిరాకరించారు. అమెరికాకు తమ కుటుంబసభ్యుల్ని తీసుకురావాలని ఆశపడుతున్న వేలాది మంది భారతీయ– అమెరికన్లకు మాత్రం ఈ నిర్ణయం శరాఘాతమని భావిస్తున్నారు. 70 సూత్రాల ప్రతిభ ఆధారిత వలస విధాన ప్రతిపాదనను ట్రంప్ ఆదివారం అమెరికన్ కాంగ్రెస్‌కు పంపుతూ పలు సూచనలు చేశారు. తాజా వలస విధానం అమెరికా దేశ ప్రయోజనాలకు అనుగుణంగా రూపొందించినట్లు పేర్కొన్నారు. ‘ప్రస్తుత వలస విధానం దేశ ప్రయోజనాలకు అనుగుణంగా లేదు. నైపుణ్యం ఆధారంగా కాకుండా వలసదారుల కుటుంబసభ్యులు అమెరికాకు వచ్చేందుకు అనుకూలంగా ఉంది. దశాబ్దాలుగా తక్కువ నైపుణ్యమున్న వలసదారులకు అవకాశం ఇవ్వడం వల్ల అమెరికాలో వేతనాలు తగ్గాయి. నిరుద్యోగం పెరిగింది. అలాగే అమెరికా వనరులకు నష్టం జరిగింది’ అని ట్రంప్ పేర్కొన్నారు. పాయింట్లు ఆధారంగా గ్రీన్‌కార్డులు మంజూరు చేయాలని, ప్రస్తుతమున్న లాటరీ పద్ధతిని రద్దు చేయాలని ఆయన కోరారు. ప్రతిభ ఆధారిత వలస విధానం అమెరికా ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులకు రక్షణ కల్పిస్తుందని, గొలుసుకట్టు వలస విధానానికి ముగింపు పలకడంతో పాటు, కొత్తవారికి అవకాశం కల్పించవచ్చని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనల్లో కేవలం శాశ్వత వలసదారులు, అక్రమ వలసదారుల గురించే ట్రంప్ ప్రస్తావించారు. వృత్తి నిపుణులకు, అమెరికా విశ్వ విద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించే వారికి ఇచ్చే తాత్కాలిక హెచ్1–బీ వీసాల అంశాన్ని ప్రస్తావించలేదు. వారితో అమెరికన్లకు నష్టం: ట్రంప్ అలాగే అమెరికాలో నివసిస్తున్న 8 లక్షల మంది డ్రీమర్ల అంశంపై కూడా కాంగ్రెస్‌కు సూచనలు చేశారు. డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌వుడ్ అరైవల్స్ (డీఏసీఏ) అంశం పరిష్కారానికి రూపొందించే ఏ చట్టంలోనైనా సంస్కరణల్ని తప్పకుండా చేర్చాలని ట్రంప్ కోరారు. సంస్కరణలు అమలు చేయకపోతే అక్రమ వలసలతో అమెరికన్ ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులకు నష్టం చేకూరుతుందన్నారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పడు తల్లిదండ్రులతో పాటు అమెరికా వచ్చి అక్కడే ఉద్యోగాలు చేస్తున్న యువత(డ్రీమర్స్)ను అక్రమ వలసదారులుగా గుర్తిస్తూ.. గత నెల్లో వారి వర్క్ పర్మిట్లను ట్రంప్ రద్దుచేశారు. గ్రీన్‌కార్డు వస్తే చాలు.. అమెరికాకు హెచ్–1బీ వీసా లేదా మరో ఉద్యోగ వీసాపై వెళ్లినవారు... ఆ దేశంలో స్థిరపడాలనుకుంటే మొదట శాశ్వత నివాసితుడి హోదా (గ్రీన్‌కార్డు) పొందాలి. గ్రీన్‌కార్డు వస్తే.. ఇక వీసాతో పని ఉండదు. గ్రీన్‌కార్డు వచ్చిన ఐదేళ్లకు అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రీన్‌కార్డు/పౌర సత్వం ఉన్నవాళ్లు తమ కుటుంబసభ్యులకు గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏటా 4,80,000 మందికి డిపెండెంట్ విభాగంలో గ్రీన్‌కార్డులిస్తారు. అలాగే శాశ్వత ఉద్యోగుల కోటాలో ఏటా 1,40,000 గ్రీన్‌కార్డులు మంజూరు చేస్తారు. కాగా, ట్రంప్ జాబితాలో అమెరికా–మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణానికి నిధుల అంశం కూడా ఉంది. 30 పాయింట్లు సాధిస్తేనే.. గ్రీన్‌కార్డు కేటాయింపునకు చదువు, వయ సు, ఆంగ్ల ప్రావీణ్యం, జీతాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని ప్రతిపాదించారు. వీటి ఆధారంగా పాయింట్లను కేటాయిస్తారు. గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 30 పాయింట్లను అర్హతగా నిర్ణయించారు. పాయింట్లు అధికంగా ఉన్నవారికే గ్రీన్‌కార్డులిస్తారు. ట్రంప్ ప్రతిపాదనలు ఆమోదం పొందితే.. గ్రీన్‌కార్డుల్ని సీనియారిటీ ఆధారంగా కాకుండా ప్రతిభ ఆధారంగా ఇస్తారు. గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ఈ ప్రతిపాదనలు వరం కానున్నాయి. అమెరికాలో భారత టెకీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అందువల్ల ప్రస్తుతం గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారు 12 ఏళ్లకుపైగా వేచి ఉండాల్సి వస్తోంది. ఏడాదికి ఒక దేశానికి (ఆ దేశ పౌరులకు) జారీచేసే గ్రీన్‌కార్డులపై పరిమితి ఉన్నందున భారతీయుల దరఖాస్తులు భారీగా పోగు పడుతున్నాయి. కొత్త విధానంతో భారతీయులకు వీలైనంత త్వరగా గ్రీన్‌కార్డులు వస్తాయని భావిస్తున్నారు. కాంగ్రెస్ ఆమోదం పొందాక తదుపరి ఆర్థిక సంవ త్సరం నుంచి అమల్లోకి వస్తుంది. -
భార్య కోసం గ్రీన్‌కార్డ్ వద్దనుకున్నా!
ఒర్లాండో: భార్యతో కలసి జీవించేందుకు ఒక సందర్భంలో అమెరికా గ్రీన్‌కార్డ్‌నే వదులుకున్నానని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తన పుస్తకం ‘హిట్ రిఫ్రెష్’లో వెల్లడించారు. ఆమె కోసం అమెరికాలో ఉద్యోగం వదిలేసి భారత్‌కు తిరిగి వచ్చేయాలని కూడా ఒకప్పుడు తీవ్రంగా ఆలోచించానని పుస్తకంలో రాశారు. ‘హిట్ రిఫ్రెష్’ను సత్య అమెరికాలో జరుగుతున్న మైక్రోసాఫ్ట్ ఇగ్నైట్–2017 సదస్సులో సోమవారం ఆవిష్కరించారు. నిబంధనల ప్రకారం గ్రీన్‌కార్డ్ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్న వారికి అమెరికా వీసా అంత త్వరగా లభించదు. తన భార్య అను తనతోపాటు వచ్చి అమెరికాలో ఉండేందుకు గ్రీన్‌కార్డ్ అడ్డు వస్తున్నందున, ఆయన గ్రీన్‌కార్డ్‌ను వదిలేసి హెచ్–1బీ వీసా తీసుకున్నారట. హెచ్–1బీ వీసా కలిగిన వారు తమ జీవిత భాగస్వామిని అమెరికా తీసుకెళ్లే సౌలభ్యం ఉంటుంది. తన భార్య కంటే తనకు మరేదీ ఎక్కువ కాదనీ, అందుకే గ్రీన్‌కార్డును వదులుకున్నానని సత్య వివరించారు. ‘అనుతో కలసి ఉండటమే నా ప్రాధాన్యత. 1994లో ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి వెళ్లాను. గ్రీన్‌కార్డును వెనక్కు ఇచ్చేసి హెచ్–1బీ వీసాకు దరఖాస్తు చేయాలని అక్కడి క్లర్కుకు చెప్పాను. అతడు నా వైపు అమితాశ్చర్యంగా చూసి...ఎందుకు అని అడిగాడు. గ్రీన్ కార్డు ఉన్నవారు భార్య/భర్తను అమెరికాకు తీసుకెళ్లలేరనే వలస నిబంధన నాకు అడ్డొస్తోందని చెప్పాను. అనంతరం అతను ఇచ్చిన హెచ్–1బీ వీసాకు దరఖాస్తు చేయగా, నాకు మంజూరైంది. అనుని తీసుకుని సియాటెల్ వచ్చి, కొత్త జీవితం ప్రారంభిచాను’ అని సత్య నాదెళ్ల తన పుస్తకంలో వివరించారు. గ్రీన్‌కార్డ్‌ను వదిలేసినందుకు మైక్రోసాఫ్ట్ కంపెనీలో తనకు ఒకరకమైన గుర్తింపు లభించిందని సత్య పుస్తకంలో తెలిపారు. ఇంటర్ చదువుతున్న రోజుల్లో తన జీవిత లక్ష్యాలేంటో కూడా సత్య తన పుస్తకంలో రాశారు. హైదరాబాద్ క్రికెట్ జట్టుకు ఆడాలనీ, బ్యాంకు ఉద్యోగం చేయాలని ఆయన కలలుగనేవారట. ఇంజనీర్ అయ్యి, అమెరికా రావాలని ఎప్పుడూ అనుకోలేదని పుస్తకంలో చెప్పుకొచ్చార ఆధార్ అద్భుత ప్లాట్‌ఫాం... ప్లాట్‌ఫాం సాంకేతికతల్లో విండోస్, ఆండ్రాయిడ్, ఫేస్‌బుక్‌తో ఆధార్ వ్యవస్థ పోటీపడుతోందంటూ సత్య నాదెళ్ల ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ సాంకేతికత, డిజిటల్ యుగం వైపుకు అడుగులేస్తుండటం శుభపరిణామమని ‘హిట్ రిఫ్రెష్’లో రాశారు. డిజిటల్ చెల్లింపులను పెంచడానికి తెచ్చిన ‘ఇండియాస్టాక్’ను మెచ్చుకున్నారు. ఒకప్పుడు మౌలిక వసతుల లేమితో సతమతమైన భారత్, ప్రస్తుతం డిజిటల్ సాంకేతికత రంగంలో ముందంజలో ఉందని కొనియాడారు. హెచ్‌పీఎస్ గొప్పతనమిదే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్‌పీఎస్)లో చదువుకున్న తాను తండ్రి సలహాపై భాగ్యనగరం నుంచి బయటకొచ్చానని సత్య పుస్తకంలో పేర్కొన్నారు. హెచ్‌పీఎస్ గొప్ప తనం గురించి దాని పూర్వ విద్యార్థుల సామర్థ్యాలే చెబుతాయన్న సత్య... ప్రస్తుత అడోబ్ సీఈవో శంతను నారాయణ్, మాస్టర్ కార్డ్ సీఈవో అజయ్ సింగ్ బంగ, కేవియం నెట్వర్క్స్ అధినేత సయద్ బీ అలీ, టొరంటోలోని ఫెయిర్‌ఫ్యాక్స్ ఫైనాన్సియల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు ప్రేమ్ వత్స, ఇంకా అనేకమంది చట్టసభల సభ్యులు, సినిమా నటులు, క్రీడాకారులు, విద్యావేత్తలు, రచయితలు తమ పాఠశాలలో చదువుకున్నవారేనని పుస్తకంలో పేర్కొన్నారు. -
అనూ కోసం అలా చేశా..
ఒర్లాండో : అమెరికా గ్రీన్ కార్డ్ కోసం అర్రులు చాచే టెక్నోక్రాట్లు చుట్టూ ఉంటే తాను అమితంగా ప్రేమించే భార్య కోసం గ్రీన్ కార్డును వదులుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్ల. తాను రాసిన ‘హిట్ రిఫ్రెష్’ పుస్తకంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. 1993లో సత్యా నాదెళ్ల అనూను వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం భార్యను తనతో పాటు అమెరికా తీసుకువెళ్లాలనుకున్నారు. అయితే అప్పుడున్న అమెరికన్ ఇమిగ్రేషన్ నిబంధనల ప్రకారం గ్రీన్‌కార్డ్ కలిగిన వారిని వివాహం చేసుకుంటే వారి భాగస్వామికి వీసా తిరస్కరిస్తారు. దీంతో సత్యాతో కలిసి ఆమె సీటెల్ రాలేకపోయారు. ఈ నిబంధన ఆయనలో సంఘర్షణ రేపడంతో వెనువెంటనే గ్రీన్ కార్డ్ వదులుకోవాలని నిర్ణయించారు. హెచ్1బీ వీసా కలిగి అమెరికాలో పనిచేస్తుంటే వారి భాగస్వాములు(భార్య లేదా భర్త) అమెరికా వచ్చేందుకు వెసులుబాటు ఉంది. ‘అప్పట్లో అనూయే నాకు ప్రాధాన్యం...అందుకే గ్రీన్ కార్డు వదిలి హెచ్1బి వీసాకు మొగ్గుచూపా’ నని తన అనుభవాలను పుస్తకంలో పొందుపరిచారు.తన నిర్ణయంపై అందరూ విస్తుపోయారని చెప్పారు. 1994లో ఢిల్లీలోని యూఎస్ ఎంబసీకి వెళ్లి గ్రీన్ కార్డును తిరిగి ఇచ్చేసి, హెచ్1బి వీసాకు దరఖాస్తు చేయాలనుకుంటున్నట్టు చెప్పగానే అక్కడున్న క్లర్క్ ఆశ్చర్యపోయాడని గుర్తుచేసుకున్నారు. ఎందుకలా అనుకుంటున్నారని అతను అడగ్గా ఇమిగ్రేషన్ ఇబ్బందులను వివరించానని..దాంతో హెచ్1బీ ఫామ్‌ను తనకందించారని పుస్తకంలో పేర్కొన్నారు. హెచ్1బీ వీసా లభించడంతో తన భార్య తనతో కలిసి సీటెల్‌కు వచ్చిందని అక్కడ తాను జీవితాన్ని ప్రారంభించి..తామిద్దరం తమ జీవితం నిర్మించుకున్నామని వివరించారు. అప్పటి నుంచి నిత్యం తనను ఇమిగ్రేషన్ సలహాల కోసం ఎవరో ఒకరు సంప్రదిస్తూ ఉండేవారని చెప్పారు. -
వలసదారులపై మరో పిడుగు
► అమెరికాలో తొలి ఐదేళ్లు సంక్షేమానికి ట్రంప్ చెక్ ► ట్రంప్‌కు భారత రాఖీలు వాషింగ్టన్: వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. అమెరికాకు వచ్చే వలసదారులు తొలి ఐదేళ్లు సంక్షేమ పథకాల లబ్ధి పొందలేరని పేర్కొంటూ షాకిచ్చారు. గ్రీన్‌కార్డుల(శాశ్వత నివాస హోదా) జారీని తగ్గించే లక్ష్యంతో ప్రతిభ ఆధారిత వలస విధానానికి(రైజ్ చట్టం) మద్దతు తెలిపిన రెండ్రోజులకే తాజా నిర్ణయాన్ని ట్రంప్ ప్రకటించారు. అమెరికా ప్రజల్ని ఉద్దేశించి వారాంతపు వెబ్, రేడియో ప్రసంగం చేస్తూ.. ‘మీరు మా దేశంలోకి వచ్చిన ఐదేళ్ల అనంతరం గానీ సంక్షేమ పథకాల్ని అందుకోలేరు. గతంలో లాగా అమెరికాలో ప్రవేశించగానే ప్రయోజనాల్ని పొందడం ఇక నుంచి కుదరదు’ అని పేర్కొన్నారు. అమెరికా కోసం ధైర్యంగా, సాహసోపేతమైన చర్యల్ని తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన చెప్పారు. అమెరికా సరైన మార్గంలో ప్రయాణిస్తోందని, ఈ ఏడాది మే నాటికి దేశంలో నిరుద్యోగ శాతం 16 ఏళ్ల కనిష్టానికి చేరిందని ప్రసంగంలో ట్రంప్ పేర్కొన్నారు. ప్రతిభ ఆధారంగా గ్రీన్‌కార్డుల జారీతో సంక్షేమ ప్రయోజనాల దుర్వినియోగం, అడ్డూఅదుపూ లేని వలసల్ని అడ్డుకోవడంతో పాటు, అమెరికన్ ఉద్యోగులకు మేలు జరుగుతుందని ట్రంప్ పేర్కొన్నారు. వైట్‌హౌస్‌కు 1001 రాఖీలు రాఖీ పౌర్ణమి సందర్భంగా హరియాణాలోని ట్రంప్ గ్రామం (అసలు పేరు మరోరా) నుంచి 1001 రాఖీలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వెళ్లడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 1800 జనాభా ఉన్న ఈ గ్రామాన్ని సులభ్ ఇంటర్నేషనల్ దత్తత తీసుకుంది. గ్రామంలోని మహిళలు ట్రంప్ ముఖంతో రాఖీలు తయారుచేసి.. రక్షా బంధన్ నాటికి(ఆగస్టు 7) ట్రంప్‌కు చేరేలా అమెరికాకు పంపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోసం కూడా 501 రాఖీలను తయారుచేశారు. తమ గ్రామంలో పర్యటించాలంటూ ఇద్దరు నేతలకు ఆహ్వాన పత్రాలు కూడా పంపారు. ట్రంప్, మోదీలను పెద్దన్నలుగా భావిస్తున్నామని.. వారిద్దరూ తమ గ్రామానికి రావాలని కోరుకుంటున్నట్లు వారు చెప్పారు. రాఖీ పండుగ రోజున ప్రధాని మోదీని కలవాలనేది తమ కోరికని ఆ గ్రామానికి చెందిన వితంతువులు పేర్కొన్నారు. మరోరా గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు సులభ్ ఇంటర్నేషనల్ చేపట్టింది. -
గ్రీన్‌కార్డుకు ప్రతిభే గీటురాయి
-
గ్రీన్‌కార్డుకు ప్రతిభే గీటురాయి
♦ దరఖాస్తు చేయాలంటే కనీస అర్హత 30 పాయింట్లు ♦ అమెరికాలో ఉన్నత విద్యకు, అధిక వేతనానికి ప్రాధాన్యం ప్రతిపాదిత రైజ్ బిల్లు అమెరికా ఉభయసభల్లో గట్టెక్కితే... గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు, డాలర్స్ డ్రీమ్స్‌తో ఇప్పటికే అమెరికా గడ్డపై ఉన్న తెలుగు టెకీలకు వరం కానుంది. గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు 12 ఏళ్లకుపైగా వేచి ఉండాల్సి వస్తోంది. కొత్త విధానంతో భారతీయులకు వీలైనంత త్వరగా గ్రీన్‌కార్డులు జారీ అవుతాయని భావిస్తున్నారు. ఏం జరిగింది: సీనియారిటీ ఆధారంగా కాకుండా.. ప్రతిభ ఆధారంగా గ్రీన్‌కార్డు మం జూరు చేసే బిల్లును సెనెటర్లు టామ్ కాటన్, డేవిడ్ పెర్డ్యూ రూపొందించారు. దీనికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మద్దతు పలికారు. ఈ బిల్లు ప్రతినిధుల సభ, సెనేట్ల ఆమోదం పొందితే ట్రంప్ సంతకంతో చట్టంగా మారుతుంది. ఆ తర్వాత... తదుపరి ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది. ప్రతిభ ఆధారితంగా అంటే... చదువు, వయసు, ఆంగ్ల ప్రావీణ్యం, జీతం ఆధారంగా పాయింట్లను కేటాయిస్తారు. గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 30 పాయింట్లను అర్హతగా నిర్ణయించారు. పాయింట్లు అధికంగా ఉన్నవారికే గ్రీన్‌కార్డులు కేటాయిస్తారు. బిల్లు ఉద్దేశమేంటి: తక్కువ నైపుణ్యాలు, తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వారికి గ్రీన్‌కార్డులు లభిస్తే... అమెరికన్ల ఉద్యోగావకాశాలను కొల్లగొడతారు. కాబట్టి దీన్ని నిరోధించాలి. అత్యంత ప్రతిభా వంతులు మాత్రమే అమెరికాకు వలస వస్తే... అది ఆ దేశానికి మేలు. మేధోపరంగా, ఆర్థికంగా అమెరికాకు లాభిస్తుంది. ప్రతి ఏటా 10 లక్షల గ్రీన్‌కార్డుల్ని అమెరికా మంజూరు చేస్తోంది. ఈ సంఖ్యను 2027 కల్లా 5 లక్షలకు కుదించాలి. డిపెండెంట్ గ్రీన్‌కార్డుల వల్ల వలసలు పెరుగుతున్నాయని అమెరికా భావిస్తోంది. అందుకే తల్లిదండ్రులు, తోబుట్టువులు, మేజర్ పిల్లలూ డిపెండెంట్ గ్రీన్‌కార్డులకు అనర్హులుగా చేర్చారు. ఆరోగ్య సమస్యలుంటే తల్లిదండ్రులకు తాత్కాలిక వీసాలు మంజూరు చేస్తారు. గ్రీన్‌కార్డు వస్తే చాలు: అమెరికాకు హెచ్–1బీ వీసా లేదా మరో ఉద్యోగవీసాపై వెళ్లినవారు... ఆ దేశంలో స్థిరపడాలనుకుంటే మొదట శాశ్వత నివాసితుడి హోదా (గ్రీన్‌కార్డు) పొందాలి. గ్రీన్‌కార్డు వస్తే... ఇక వీసాతో పని ఉండదు. వీసా రెన్యువల్‌తో పనిలేకుండా శాశ్వత నివాసితుడి హోదాలో ఉద్యోగం చేసుకోవచ్చు. గ్రీన్‌కార్డు వచ్చిన ఐదేళ్లకు అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రీన్‌కార్డు లేదా పౌరసత్వం ఉన్నవాళ్లు తమ కుటుంబసభ్యులకు గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏటా 4,80,000 మందికి డిపెండెంట్ విభాగంలో గ్రీన్‌కార్డులు ఇస్తారు. అలాగే శాశ్వత ఉద్యోగుల కోటాలో ఏటా 1,40,000 గ్రీన్‌కార్డులు మంజూరు చేస్తారు. వీటికి మనం పనిచేస్తున్న సంస్థ ధ్రువీకరణతో దరఖాస్తు చేయాలి. డిపెండెంట్ గ్రీన్‌కార్డుల్లో ఏ ఒక్క దేశానికైనా మొత్తం కార్డుల సంఖ్యలో ఏడు శాతానికి మించి ఇవ్వడానికి లేదు. అలాగే ఉద్యోగుల కోటా గ్రీన్‌కార్డుల్లో ఏ ఒక్క దేశానికైనా మొత్తం కార్డుల్లో రెండు శాతానికి మించి ఇవ్వకూడదనే నిబంధన ఉంది. అమెరికాలో భారత టెకీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఏడాదికి ఒక దేశానికి (ఆ దేశ పౌరులకు) జారీచేసే గ్రీన్‌కార్డులపై పరిమితి ఉన్నందున భారతీయుల దరఖాస్తులు భారీగా పోగుపడుతున్నాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మన టెకీలకు మస్తు చాన్స్
అమెరికా గ్రీన్‌కార్డుకు ఇక ప్రతిభే గీటురాయి ► కొత్త వలస విధానంతో తెచ్చిన ‘రైజ్’ బిల్లుకు ట్రంప్ ఆమోదం ► భారతీయులకు వరంగా బిల్లులోని అంశాలు ► లాటరీ విధానానికి స్వస్తి.. పాయింట్ల ఆధారంగా కార్డులు ► ఆంగ్లంపై పట్టు, ఉన్నత విద్య, అధిక వేతనం, ► వయసు ప్రాతిపదికన పాయింట్లు.. ► మనోళ్లు సులభంగా 30 పాయింట్లు సాధించే అవకాశం ► కీలక సంస్కరణ: ట్రంప్.. వలస వ్యతిరేక చట్టం: డెమోక్రాట్లు వాషింగ్టన్ అమెరికాలో శాశ్వత నివాస హోదా(గ్రీన్‌కార్డు) కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న భారతీయులకు శుభవార్త! ఇన్నాళ్లూ గ్రీన్‌కార్డుల జారీకి అనుసరించిన లాటరీ విధానానికి ట్రంప్ సర్కారు స్వస్తి పలకనుంది. ఆంగ్ల భాషా నైపుణ్యం, ఉన్నత విద్య, అధిక వేతనం, వయసు ప్రాతిపదికగా ఇకపై కార్డులు జారీ చేయనున్నారు. ఇవన్నీ భారతీయులకు వరంగా మారనున్నాయి. గ్రీన్‌కార్డుల సంఖ్యను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో ‘రైజ్’(రిఫార్మింగ్ అమెరికన్ ఇమిగ్రేషన్ ఫర్ స్ట్రాంగ్ ఎంప్లాయ్మెంట్) బిల్లును రూపొందించారు. ప్రతిభ ప్రాతిపదికన గ్రీన్‌కార్డులు జారీ చేయాలంటూ సెనెటర్లు టామ్ కాటన్, డేవిడ్ పెర్డ్యూ రూపొందించిన ఈ బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఆమోదం తెలిపారు. వాస్తవానికి వలసల్ని తగ్గించడమే బిల్లు ఉద్దేశమైనా భారత్ వంటి దేశాల నుంచి వచ్చే ఉన్నత విద్యావంతులు, ఐటీ ఉద్యోగులకు ఈ బిల్లు మేలు చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. బిల్లులోని ప్రతిపాదించిన అంశాల ప్రకారం చూస్తే మనవాళ్లే ముందుంటారని, దీంతో సులువుగా గ్రీన్‌కార్డులు దక్కుతాయని విశ్లేషిస్తున్నారు. ప్రతిపాదిత బిల్లు ఉభయసభల్లో గట్టెక్కి చట్టం అమల్లోకి వస్తే లాటరీకి స్వస్తి పలికి ప్రతిభ ఆధారంగా గ్రీన్‌కార్డులు జారీ చేస్తారు. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ, 26–30 ఏళ్ల మధ్య వయసు, ఆంగ్లంలో మంచి ప్రావీణ్యం, మంచి వేతనం ఉంటే గ్రీన్‌కార్డులు పొందడం తేలిక కానుంది. ప్రస్తుతం అమెరికా ఏడాదికి 10 లక్షల గ్రీన్‌కార్డులు జారీ చేస్తుండగా.. పదేళ్లలో సగానికి తగ్గించేలా ఈ బిల్లును రూపొందించారు. అమెరికన్ల వేతనాలు పెరుగుతాయి: ట్రంప్ ‘రైజ్ చట్టం వల్ల అమెరికాలో పేదరికం తగ్గడమేగాక, జీతాలు పెరుగుతాయి. బిలియన్ డాలర్ల పన్నులు ఆదా అవుతాయి’ అని ట్రంప్ పేర్కొన్నారు. బిల్లుకు మద్దతుగా వైట్‌హౌస్‌లో ఆయన మాట్లాడుతూ.. గత 50 ఏళ్ల అమెరికా వలస విధాన ప్రక్రియలో ఇది కీలకమైన సంస్కరణగా నిలిచిపోతుందన్నారు. ‘‘గ్రీన్‌కార్డుల జారీలో తక్కువ నైపుణ్యమున్న వారికి అవకాశం కల్పిస్తున్న ప్రస్తుత విధానానికి రైజ్ చట్టం మంచి ప్రత్యామ్నాయం. అమెరికన్ ఉద్యోగులు చెదిరిపోకుండా ఈ బిల్లు రక్షణ కల్పిస్తుంది. నైపుణ్యం లేని వలస ఉద్యోగులు తగ్గడం ద్వారా అమెరికన్ల వేతనాలు పెరుగుతాయి. ప్రస్తుత వలస విధానం అమెరికన్ ప్రజలు, ఉద్యోగులకు అనుకూలంగా లేదు. కొత్త చట్టంతో 21వ శతాబ్దంలో అమెరికా పోటీతత్వాన్ని, అమెరికాతో దేశ పౌరులకు ఉన్న దృఢమైన బంధాన్ని పునరుద్ధరిస్తుంది. ప్రతీ ఏడాది 10 లక్షల మందికి గ్రీన్‌కార్డుల్ని జారీచేస్తున్నాం. అమెరికాలోని మోంటానా రాష్ట్ర జనాభాతో అది సమానం. అయితే దురదృష్టవశాత్తూ ఇప్పటిదాకా ఆంగ్లంపై పట్టు, ఉద్యోగ నైపుణ్యం, మంచి వేతనం ప్రాతిపదికగా గ్రీన్‌కార్డుల కేటాయింపు జరగడం లేదు. ఇకపై అలా ఉండదు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. నైపుణ్యం ఉన్నవారికి ప్రయోజనకరం: వైట్‌హౌస్ నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగులకు ఈ చట్టంతో మేలు కలుగుతుందని ట్రంప్ సీనియర్ సలహాదారు జాసన్ మిల్లర్ పేర్కొన్నారు. వైట్‌హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ విధానం ఇప్పటికే కెనడా, ఆస్ట్రేలియాల్లో అమలవుతోందని, పాయింట్ల ఆధారంగా కొత్త విధానం అమలు చేయడం చరిత్రాత్మకమని మిల్లర్ అభిప్రాయపడ్డారు. పాయింట్ల ఆధారంగా గ్రీన్‌కార్డుల జారీ విధానాన్ని ఈ ఏడాది ఆరంభంలో స్టేట్ ఆఫ్ యూనియన్ ప్రసంగంలో ట్రంప్ ప్రస్తావించారని చెప్పారు. జీవిత భాగస్వాములు, మైనర్లకు గ్రీన్‌కార్డుల జారీ తగ్గించాలని కూడా ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. అమెరికన్ ఉద్యోగులను పరిరక్షించేలా ప్రతిభ ఆధారిత వలస చట్టాన్ని అమలు చేస్తామన్న ప్రధాన ఎన్నికల వాగ్దానాన్ని ఈ చట్టంతో ట్రంప్ నెరవేర్చారని మిల్లర్ చెప్పారు. వలసదారులే దేశానికి కొత్త శక్తి: డెమోక్రాట్లు రైజ్ చట్టం వలస ప్రజలకు వ్యతిరేకమని డెమోక్రటిక్ సభ్యులు పేర్కొన్నారు. వలసదారులు ఎప్పటికప్పుడు దేశానికి కొత్త శక్తిని అందిస్తున్నారని.. అమెరికాకు వచ్చే ప్రతి కొత్త తరం ఈ దేశాన్ని మరింత ఉన్నతంగా మారుస్తుందని డెమోక్రటిక్ నేత నాన్సీ పెలోసీ అన్నారు. మొదట్నుంచీ ట్రంప్ వలస వ్యతిరేక అజెండాను అమలు చేస్తున్నారని.. వలస ప్రజల్లో భయాన్ని నింపడం వల్ల దేశం బలహీన పడుతుందని హెచ్చరించారు. భారతీయ టెకీలకు లాభమే! రైజ్ బిల్లు చట్టరూపం దాలిస్తే భారతీయులకు లాభమే. ప్రస్తుతం 3 నుంచి 3.5 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హెచ్–1బీ వీసాపై అమెరికాలో ఉన్నారు. 2016లో మొత్తం 1,26,692 మంది భారతీయులు హెచ్–1బీ పొందడమో, పొడిగించుకోవడమో చేశారని అమెరికా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది అమెరికా జారీ చేసిన హెచ్–1బీ వీసాల్లో భారతీయులకే ఏకంగా 72 శాతం దక్కాయి. వీరిలో అత్యధికులు అమెరికాలో స్థిరపడాలనే కోరుకుంటారు. గ్రీన్‌కార్డులకు దరఖాస్తు చేస్తే రైజ్ విధానంలో భారతీయులకు పాయింట్లు అధికంగా వచ్చే అవకాశాలుంటాయి. ► భారతీయుల్లో అత్యధికులు అమెరికా వర్సిటీల్లో మాస్టర్స్ (పీజీ) పూర్తిచేసిన వారే ఉంటారు. విద్యార్హతపరంగా వీరికి 8 పాయింట్లు లభిస్తాయి. ► గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకునే నాటికి మనోళ్ల వయసు 25 ఉంటుంది. 26 నుంచి 30 ఏళ్ల కేటగిరీలో ఉంటారు కాబట్టి.. 10 పాయింట్లు లభిస్తాయి. ► ఆదాయపరంగానూ, ఆంగ్ల భాషలో ప్రావీణ్యంలో కూడా మనోళ్లకు మంచి మార్కులే పడతాయి. కాబట్టి గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి 30 పాయింట్ల అర్హతను భారతీయుల్లో అత్యధికులు సులభంగా సాధిస్తారు. ► గ్రీన్‌కార్డుల్లో ప్రతి దేశానికి ఒక ఏడాదికి ఇంత శాతం మించకూడదనే నిబంధన కారణంగా ప్రస్తుతం గరిష్టంగా 2 శాతం లెక్కన 9,600 డిపెండెంట్ గ్రీన్‌కార్డులు, గరిష్టంగా 7 శాతం లెక్కన 9,800 ఉద్యోగస్తుల గ్రీన్‌కార్డులు ఏటా భారత్‌కు లభిస్తున్నాయి. ఈ కోటాపై పరిమితుల్లో మార్పులు, చేర్పులు చేస్తారా? అన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ పరిమితి ఎత్తివేస్తే మాత్రం గ్రీన్‌కార్డుల్లో భారతీయులు భారీగా లబ్ధి పొందుతారు. ► హెచ్–1బీ వీసాల జోలికి ప్రస్తుతం వెళ్లలేదు. అయితే వీటి దుర్వినియోగం జరుగుతోందని ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ, ఎన్నికయ్యాక పలుమార్లు చెప్పారు. ఈ వీసాలకు కనిష్ట వేతనాన్ని 1,30,000 డాలర్లకు పెంచుతూ బిల్లు కూడా పెట్టారు. ► భవిష్యత్తులో హెచ్–1బీ వీసాలకు కూడా ప్రతిభ ఆధారిత విధానాన్ని తెస్తే.. ఉన్నత విద్యార్హతలు, ఆంగ్లంపై పట్టు, మంచి వేతనాలు ఉంటాయి కాబట్టి భారతీయ టెకీలకు నష్టమేమీ ఉండదు. ప్రస్తుతం అమెరికా ఏటా ఇచ్చే 65,000 హెచ్–1బీ వీసాల కోసం కంపెనీలు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు దాఖలు చేస్తున్నాయి. తద్వారా లాటరీలో వాటికి వీసాలు వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఈ విధానం దుర్వినియోగం అవుతోందని, బడా కంపెనీలు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసి ఇతరుల అవకాశాలను దెబ్బతీస్తున్నాయని ట్రంప్ వాదన. అందువల్ల హెచ్–1బీ వీసాల మంజూరు విధానంలోనూ మార్పులు రావొచ్చు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
గ్రీన్ కార్డులకు 12 ఏళ్ల వెయిటింగ్
వాషింగ్టన్:అమెరికాలో నైపుణ్య ఉద్యోగులుగా శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డుకు దర ఖాస్తు చేసుకునే భారతీయుల ముందు 12 ఏళ్ల సుదీర్ఘ వెయిటింగ్ జాబితా ఉంది. అయితే ఏటా ఈ కార్డులు పొందుతున్న వారిలో భారతీయులే ఎక్కువ ఉన్నారు. 2015లో అమెరికాలో 36,318 మంది భారతీయులు తమ హోదాను శాశ్వత నివాసం హోదాకు సర్దుబాటు చేసుకున్నారు. కొత్తగా ప్రవేశించిన మరో 27,978 మంది గ్రీన్‌కార్డు రూపంలో చట్టబద్ధ శాశ్వత నివాసాన్ని పొందారు. ఈమేరకు ప్యూ రీసెర్చ్ సంస్థ తన నివేదికలో తెలిపింది. ఒక ఉద్యోగ సంబంధ విభాగంలో భారతీయుల ముందు ప్రస్తుతం 12 ఏళ్ల జాబితా ఉందని, ప్రభు త్వం 2005 మేలో వచ్చిన దరఖాస్తులను ఇంకా పరిశీలిస్తోందని పేర్కొంది. ‘2010–14 మధ్య ఉద్యోగ సంబంధ గ్రీన్ కార్డుల్లో 36 శాతం (2,22,000) హెచ్1బీ వీసాదారులకు అందాయి. అమెరికాకు కొత్తగా వచ్చిన వారితోపోలిస్తే అప్పటికే అక్కడ నివసిస్తూ, నివాస హోదాను సర్దుబాటు చేసుకున్న వలస దారులకే గ్రీన్‌కార్డులు ఎక్కువగా అందు తున్నాయి. 2015లో 5,42,315 మంది తమ నివాస హోదాను శాశ్వత నివాస హోదాకు మార్చుకున్నారు. అదే ఏడాది కొత్తగా వచ్చిన 5,08,716 మందికి గ్రీన్‌కార్డు రూపంలో శాశ్వత నివాస హోదా దక్కింది’ అని ప్యూ నివేదిక వెల్లడించింది. గ్రీన్‌కార్డు దారులు ఐదేళ్లు అమెరికాలో ఉంటే ఆ దేశ పౌర సత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు. -
గ్రీన్ కార్డు కోసం వేచిచూడాల్సిందే
అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులు గ్రీన్ కార్డు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. గ్రీన్ కార్డును దరఖాస్తు చేసుకున్న భారతీయులు దాదాపు 12 ఏళ్ల పాటు ఎదురుచూడాల్సి వస్తుందని తాజా రిపోర్టులు పేర్కొన్నాయి. కాగ, ప్రతేడాది గ్రీన్‌కార్డులను పొందుతున్న టాప్ దేశాల్లో భారత్‌లో ఒకటిగా ఉంది. 2015లో 36,318 మంది భారతీయులు తమ స్టేటస్‌ను శాశ్వత పౌరసత్వంగా మార్చుకోగా, 27,289 మంది భారతీయులు గ్రీన్ కార్డు రూపంలో చట్టబద్దత శాశ్వత పౌరసత్వం పొందినట్టు ప్యూ రీసెర్చ్ తెలిపింది. '' ఎంప్లాయిమెంట్‌కు సంబంధించిన కేటగిరిలో శాశ్వత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులు, వారు నిపుణవంతులైన ఉద్యోగులైనప్పటికీ ప్రస్తుతం 12 ఏళ్లు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. 2005 మేలో దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్ల ప్రక్రియను ప్రభుత్వం ఇప్పుడు చేపడుతోంది'' అని రిపోర్టు తెలిపింది. ప్యూ డేటా ప్రకారం 2010 నుంచి 2014 వరకు ఎంప్లాయిమెంట్‌కు చెందిన గ్రీన్‌కార్డులు 36 శాతం అంటే 2,22,000పైగా హెచ్-1బీ వీసా హోల్డర్స్‌కే అందించినట్టు తెలిసింది. అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండటానికి, పనిచేయడానికి గ్రీన్ కార్డు ఎంతో అవసరం. గ్రీన్ కార్డు హోల్డర్లు ఐదేళ్ల నివాసం తర్వాత అమెరికా సిటిజన్‌షిప్ కూడా అప్లయ్ చేసుకోవచ్చు. -
గ్రీన్‌కార్డ్ కోసం తిప్పలు
ఇండియా నుంచి అమెరికా వెళ్లిన వారు గ్రీన్‌కార్డ్ కోసం ఎన్ని తిప్పలు పడతారనే కథతో తెరకెక్కిన చిత్రం ‘గ్రీన్‌కార్డ్’. శతృఘ్న రాయపాటి, స్టెఫానీ, జోసెలిన్, చలపతిరావు ముఖ్య తారలు. రమ్స్ దర్శకత్వంలో మాస్టర్ దేవాన్ సమర్పణలో శ్రీనివాస్ గుప్తా, మోహన్.ఆర్, నరసింహ, నాగ శ్రీనివాసరెడ్డి నిర్మించారు. కు, హెన్నీ ప్రిన్స్, ప్రణయ్‌కుమార్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘వీసా తీసుకుని అమెరికా వెళ్లిన ఓ కుర్రాడి కథే గ్రీన్‌కార్డ్. పిల్లలను అమెరికా పంపాలనుకునే తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా. 90 శాతం అమెరికాలో తీశాం’’ అన్నారు రమ్స్. -
పది డాలర్ల కోసం!
‘వియ్ లవ్ అమెరికా.. వియ్ హేట్ గన్స్’ అనే కథతో తెరకెక్కిన చిత్రం ‘గ్రీన్‌కార్డ్’. శతృఘ్న రాయపాటి, స్టెఫానీ, జోసెలిన్, చలపతిరావు ముఖ్య పాత్రల్లో రమ్స్ దర్శకత్వం లో శ్రీనివాస్ గుప్తా, మోహన్. ఆర్, నరసింహ, నాగ శ్రీనివాసరెడ్డి నిర్మిం చిన ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ‘‘అమెరికాలో ఎవరు ఎవర్ని కాల్చినా అడిగేవాడుండడు. అమెరికాను ఇష్టపడదాం.. కానీ గన్స్ కల్చర్‌కు దూరంగా ఉండాలని చెప్పే చిత్రమిది’’ అన్నారు చలపతి రావు . ‘‘2004లో 10 డాలర్ల బీర్ కోసం నా మీద ఓ అమెరికన్ గన్ గురిపెట్టాడు. నాతో పాటు మరికొందరికి ఎదురైన ఇలాంటి అనుభవాల ఆధారంగా ‘గ్రీన్‌కార్డ్’ తెరకెక్కించాం. త్వరలో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని రమ్స్ చెప్పారు. -
గ్రీన్ కార్డ్ పాట్లు
ఇండియా నుంచి అమెరికా వెళ్లిన వారు గ్రీన్ కార్డ్ కోసం ఎన్ని తిప్పలు పడుతు న్నారు? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘గ్రీన్ కార్డ్’. శతృఘ్న రాయపాటి, స్టెఫానీ, జోసెలిన్, చలపతిరావు ముఖ్య పాత్రల్లో రమ్స్ దర్శకత్వంలో శ్రీనివాస్ గుప్తా, మోహన్.ఆర్, నరసింహ, నాగ శ్రీనివాస రెడ్డి నిర్మించారు. ‘‘వీసా తీసుకుని అమెరికా చేరుకున్న ఓ కుర్రాడి కథే ‘గ్రీన్ కార్డ్’. 15 ఏళ్లుగా అమెరికాలో గమనించిన పరిస్థితులు, అక్కడ మన పిల్లలు ఎలా ఉంటున్నారనేది చిత్రంలో చూపించాం. త్వరలో పాటలు, సినిమా రిలీజ్ చేస్తాం’’ అని రమ్స్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కు, హెన్నీ ప్రిన్స్, ప్రణయ్ కుమార్, కెమెరా: నవీన్, నాగ శ్రీనివాస్ రెడ్డి. -
'హెచ్-1బీ, గ్రీన్ కార్డులను పూర్తిగా మార్చేస్తాం'
వాహింగ్టన్ : హెచ్-1బీ వర్క్ వీసాదారులకు, ఉద్యోగ ఆధారితంగా జారీఅయ్యే గ్రీన్ కార్డు హోల్డర్స్ కు ట్రంప్ ప్రభుత్వం మరో షాకిచ్చేందుకు సిద్ధమవుతోంది. భారత అమెరికన్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే హెచ్-1బీ వర్క్ వీసా, గ్రీన్ కార్డు కేటగిరీలలో సమూల మార్పులు తీసుకొస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అతి సన్నిహిమైన ఓ టాప్ అమెరికన్ సెనేటర్ చెప్పారు. బుధవారం ట్రంప్ ను కలిసిన ఆర్కాన్సాస్ టామ్ కాటన్ అనే సెనేటర్, ప్రస్తుతమున్న హెచ్-1బీ వర్క్ వీసా, గ్రీన్ కార్డు ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను, ఉత్తమమైన వ్యక్తులను తీసుకోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో ఉన్నతమైన నిపుణులను అమెరికాలోకి తీసుకోవాలని అధ్యక్షుడు భావిస్తున్నారని ఆయన చెప్పారు. హెచ్-1బీ, గ్రీన్ కార్డులపై కంప్యూటర్ సైంటిస్టులు, పీహెచ్‌డీలు చేసిన వారిని కంపెనీలు తీసుకోవడం లేదని, ఎక్కువగా మిడ్ లెవల్ వర్కర్లనే కంపెనీలు రీప్లేస్ చేస్తున్నట్టు తెలిపారు. దీనివల్లే సమస్యలు తలెత్తుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ కారణంతోనే హెచ్-1బీ, గ్రీన్ కార్డు ప్రక్రియలను పూర్తిగా సవరించాలని తాము భావిస్తున్నట్టు కాటన్ తెలిపారు. అమెరికన్ చేయలేని జాబ్ ఏదీ లేదని, సరియైన వేతనం చెల్లిస్తే, అమెరికన్లు ఏ ఉద్యోగమైనా చేస్తారని పేర్కొన్నారు. ఎక్కువ వేతనాలతో అమెరికన్లు మళ్లీ పనుల్లోకి తీసుకొచ్చేందుకే తాము ఎక్కువగా ఫోకస్ చేశామని చెప్పారు. -
గ్రీన్ కార్డు ఉన్నవారికి మినహాయింపు!
-
గ్రీన్ కార్డు ఉన్నవారికి మినహాయింపు!
వాషింగ్టన్: సవరించిన వలస నిషేధ ఉత్తర్వుల్లోనూ ట్రంప్ ఆ ఏడు ముస్లిం దేశాలనే లక్ష్యంగా చేసుకున్నారని తెలుస్తోంది. కాకుంటే గ్రీన్ కార్డులు ఉన్నవారికి మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. ఏడు ముస్లిం దేశాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు వలస నిషేధ ఉత్తర్వులు జారీ చేయడంతో నిరసనలు పెల్లుబికాయి. దీంతో కొంత వెనక్కి తగ్గిన అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ వలసపై కొత్త కార్యనిర్వాహక ఆదేశాలను జారీ చేస్తానని చెప్పారు. కానీ ట్రంప్ తీసుకురాబోతున్న పునఃసమీక్షించిన వలస నిషేధ ఉత్తర్వుల్లోనూ మళ్లీ ఆ ఏడు దేశాలనే లక్ష్యంగా చేసుకున్నారని తెలుస్తోంది. అయితే గ్రీన్ కార్డు కలిగి ఉన్నవారిని ఆ నిషేధం నుంచి మినహాయించారని తెలుస్తోంది. ఇప్పటికే వీసా కలిగి ఉన్న వారిని అమెరికాలోకి అనుమతిస్తారని అధికారులు పేర్కొంటున్నారు. ఉత్తర్వు ప్రస్తుతం ముసాయిదా రూపంలో అధికారులందరికీ అందిందని, తుది ము సాయిదా త్వరలోనే విడుదల చేస్తామని వైట్ హౌస్ అధికార ప్రతినిధి సారా హకబీ శాండర్స్ చెప్పారు. దీనిపై హోమ్ లాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వెంటనే స్పందిం చలేదు. సమీక్షించిన ముసా యిదా మళ్లీ ఆ ఏడు దేశాలనే టార్గెట్ చేస్తుందని, కానీ ఈ నిషేధం నుంచి గ్రీన్ కార్డులున్నవారిని మినహాయిస్తున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టు చేసింది. ముస్లింలకు మద్దతుగా ర్యాలీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానాలకు వ్యతిరేకంగా, ముస్లింలకు మద్దతుగా టైమ్స్ స్క్వేర్ వద్ద వేలాదిమంది ‘నేనూ ముస్లింనే’ నినాదంతో ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా విభిన్న మతాలకు చెందిన వారంతా ‘నేనూ ముస్లింనే’అంటూ మద్దతు ప్రకటించారు. ట్రంప్‌ను వ్యతిరేకించండి, ముస్లింపై నిషేధం వద్దు అన్న బ్యానర్లు ప్రదర్శిస్తూ సాగిన ఈ ర్యాలీ రచయిత రసెల్ సిమన్స్ , నటి సుసాన్ శారండన్ ఆధ్వర్యంలో సాగింది. -
పెట్టుబడి పెట్టండి.. గ్రీన్ కార్డు పట్టండి!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అక్కడ నివసిస్తున్న విదేశీయుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. అమెరికా కలలు కల్లలు కాకుండా ఉండటానికి ఉన్న ఒకే ఒక ఆశాకిరణాన్ని అందుకునేందుకు త్వరపడుతున్నారు. అదే ఈబీ-5 ప్రోగ్రాం. ఈ ఏడాది ఏప్రిల్‌తో ఈబీ-5 వీసా ప్రోగ్రాం ముగిసిపోతోంది. ఈ ప్రోగ్రాం ద్వారా అమెరికాలో పెట్టుబడులు పెడితే చాలు సదరు వ్యక్తి, అతని కుటుంబంతో సహా జీవితకాలం అమెరికాలోనే ఉండొచ్చు. ఈబీ-5 ప్రోగ్రాంలో పెట్టుబడి పెట్టడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒక మిలియన్ డాలర్లతో స్టార్టప్ ఒక మిలియన్ డాలర్ల మూలధనంతో అమెరికాలో స్టార్టప్‌ను మొదలుపెట్టాలి. దాంట్లో పది మంది అమెరికన్లకు ఫుల్ టైమ్ ఉద్యోగాలు ఇవ్వాలి. పెట్టుబడి ప్రభుత్వం అప్రూవ్ చేసిన ఈబీ-5 బిజినెస్‌లో రూ.3.4 కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఆ పెట్టుబడి ద్వారా రూరల్‌లో నివసిస్తున్న పది మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పిస్తారు. పెట్టుబడిదారుడు కావాలనుకుంటే ఐదేళ్ల తర్వాత తన డబ్బును ఉపసంహరించుకోవచ్చు. దీంతో ఈ ప్రోగ్రామ్‌లో చేరేందుకు భారతీయులు క్యూ కడుతున్నారు. గత కొద్ది వారాలుగా సరాసరిన వారానికి ముగ్గురు భారతీయులు ఈ ప్రోగ్రాంలో పెట్టుబడులకు సంతకాలు పెట్టేస్తున్నారు. ట్రంప్ ట్రావెల్ బ్యాన్ నిర్ణయం తర్వాత హెచ్1బీ వీసాలపై కూడా ఆంక్షలు తప్పవనే వార్తలు వస్తున్నాయి. దాంతో ఈబీ-5 ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకునే విదేశీయుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఇప్పటివరకూ 210 ఈబీ-5 దరఖాస్తులు రాగా.. వాటిలో 42 భారతీయులవే ఉన్నాయి. బెయిన్, రిలయన్స్, ఆదిత్య బిర్లా, మెక్కిన్సే లాంటి కంపెనీల్లో పెద్ద స్ధాయిలో పనిచేస్తున్న ఉద్యోగులు, వ్యాపారకుటుంబాలు ఈ దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిసింది. -
భారతీయుల ‘గ్రీన్‌కార్డు’ ఆశలపై నీళ్లు?
-
భారతీయుల ‘గ్రీన్‌కార్డు’ ఆశలపై నీళ్లు?
అమెరికన్ కాంగ్రెస్‌లో బిల్లు • ఇప్పటికే అమెరికా హెచ్1బీ వీసాలను తగ్గించేలా కార్యనిర్వాహక ఆదేశాలు సిద్ధమవుతుంటే.. ఇప్పుడు భారత అమెరికన్లకు తీవ్ర ప్రభావం చూపేలా గ్రీన్‌కార్డుల సంఖ్యను సగానికి తగ్గించే బిల్లును ట్రంప్ ప్రభుత్వం కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టింది. వాషింగ్టన్: స్థానికులకే ఉద్యోగావకాశాలను పెంచే దిశగా కఠినమైన నిర్ణయాలతో ముందుకెళ్తున్న అమెరికా మరో పిడుగులాంటి ప్రతిపాదనను కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టింది. ఇప్పటికే హెచ్1బీ వీసాలను తగ్గించేలా కార్యనిర్వాహక ఆదేశాలు సిద్ధమవుతుంటే.. ఇప్పుడు భారత అమెరికన్లకు తీవ్ర ప్రభావం చూపేలా గ్రీన్‌కార్డు (అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పర్చుకునే)ల సంఖ్యను సగానికి తగ్గించే బిల్లును కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టింది. అమెరికాలోకి వస్తున్న వలసలను పదేళ్లలో సగానికి తగ్గించే ఉద్దేశంతో రూపొందించిన రైజ్ (ద రిఫార్మింగ్ అమెరికన్ ఇమిగ్రేషన్ ఫర్ స్ట్రాంగ్ ఎంప్లాయ్మెంట్) బిల్లును డెమొక్రటిక్ ఎంపీ టామ్ కాటన్, రిపబ్లికన్ ఎంపీ డేవిడ్ పర్డ్యూలు అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. దీని కారణంగా గ్రీన్ కార్డులు పొందాలనుకుంటున్న వారి ఆశలు గల్లంతయ్యే అవకాశాలున్నాయి. ఈ బిల్లు ద్వారా అమెరికా వలసల వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చి.. నైపుణ్య వీసా (స్కిల్ బేస్డ్ వీసా) లేని విదేశీయులను దేశంలోకి రాకుండా నియంత్రించవచ్చు. ప్రస్తుతం ఏడాదికి పదిలక్షల మందికి గ్రీన్ కార్డులు ఇస్తుండగా.. దాన్ని ఐదు లక్షలకు తగ్గించే ఉద్దేశంతోనే ఈ బిల్లును రూపొందించినట్లు దీన్ని ప్రవేశపెట్టిన డెమొక్రటిక్ పార్టీ సభ్యులు టామ్ కాటన్, డేవిడ్ పర్డ్యూ వెల్లడించారు. ‘వలసల విధానం అమెరికన్ ఉద్యోగుల కోసం పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది’ అని కాటన్ తెలిపారు. ఈ చట్టం అమల్లోకి వస్తే.. చాలాకాలంగా గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారత అమెరికన్ల ఆశలు నీరుగారినట్లే. ప్రస్తుతం అమెరికాలోని భారతీయులు గ్రీన్‌కార్డు పొందేందుకు కనీసం పదేళ్లు (గరిష్టంగా 35 ఏళ్లు) వేచి చూడాల్సిందే. ప్రతిపాదన అమల్లోకి వస్తే ఈ కాలవ్యవధి మరింత పెరిగే అవకాశాలున్నాయి. హెచ్1బీ వీసాలతో ఈ బిల్లుకు సంబంధం లేదు. లాటరీల ద్వారా వీసాలిచ్చే విధానానికి స్వస్తి చెప్పాలని కూడా ఈ బిల్లులో పేర్కొన్నారు. -
ఒకసారి అమెరికాను వీడితే..
మళ్లీ వెళ్లడం కుదరదు! ► తాత్కాలిక వీసాతో పాటు, గ్రీన్ కార్డుదారుల్ని అడ్డుకునే అధికారం ► ఆందోళనలో ఏడు దేశాలకు చెందిన ఐదు లక్షల మంది ► ట్రంప్ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శల వెల్లువ ► నా నిర్ణయం బాగా అమలవుతోంది: ట్రంప్ వాషింగ్టన్ /న్యూయార్క్: ఏడు ముస్లిం దేశాల నుంచి పౌరులు రాకుండా అడ్డుకునేలా దేశాధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం చట్టబద్ధంగా అమెరికాలో నివసిస్తున్న ఆయా దేశాల వారి గుండెల్లో గుబులు రేపుతోంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికా పౌరసత్వం కలిగి ఉంటే తప్ప... తాత్కాలిక విద్యార్థి, ఉద్యోగ వీసాలు ఉన్నవారితో సహా గ్రీన్ కార్డుదారులు ఒకసారి అమెరికా వదిలివెళ్తే ఇకనుంచి తిరిగి వెళ్లడం కుదరదు. సెలవు, ఉద్యోగ కారణాలతో అమెరికా వదిలి వెళ్లినవారినీ అమెరికాలోకి అనుమతించరని హోం ల్యాండ్ భద్రతా విభాగం అధికారులు చెబుతున్నారు. ముస్లిం ఆధిక్య దేశాలైన ఇరాన్ , ఇరాక్, లిబియా, సోమాలియా, సూడాన్ , సిరియా, యెమెన్ దేశాల నుంచి అమెరికాలోకి వలసలు రాకుండా 90 రోజులు నిషేధం విధిస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. ఈ నిర్ణయంతో ఏడు దేశాలకు చెందిన విద్యార్థి, ఉద్యోగ వీసాలపై అమెరికాలో నివసిస్తున్న వారే కాకుండా 5 లక్షల మంది గ్రీన్ కార్డుదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒకసారి దేశం వదిలివెళ్తే అమెరికాలో ప్రవేశించకుండా అడ్డుకునేలా ట్రంప్ ఉత్తర్వులున్నాయని, దౌత్య వీసాలు ఉన్నవారికి మినహాయింపు ఉంటుందని హోం ల్యాండ్ విభాగం చెబుతోంది. ‘ఈ నిర్ణయం ప్రకారం తాత్కాలికంగా విదేశీ పర్యటనకు వెళ్లిన వారు అమెరికాకు తిరిగి రావడం కష్టం... విద్యార్థి శీతాకాల సెలవుపై స్వదేశానికి వెళ్తే అమెరికా రావడం కుదరదు’ అని న్యాయ నిపుణుడు లెగోంస్కీ పేర్కొన్నారు. గత మూడేళ్లలో ఈ ఏడు దేశాలకు చెందిన 25 వేల మందికి విద్యార్థి లేదా ఉద్యోగ వీసాలు జారీ చేశారని, గత పదేళ్లలో 5 లక్షల మందికి గ్రీన్ కార్డులు జారీ అయ్యాయని హోం ల్యాండ్ భద్రతా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గ్రీన్ కార్డుదారుల్లో ఇరాన్, ఇరాక్‌లకు చెందిన వారే 2.5 లక్షల మంది వరకూ ఉన్నారు. వివాహ వీసాలు రద్దు.. కొత్త జంటలకు తీవ్ర నిరాశ ట్రంప్ నిర్ణయంతో పలు కుటుంబాలు విడిపోవడమే కాకుండా, కొడుకు పెళ్లికి తల్లిదండ్రులు వెళ్లలేని పరిస్థితి. కొత్తగా పెళ్లైన దంపతులకు వివాహ వీసా రద్దు కావడంతో వారు విడిగా ఉండాల్సిందే... ఇరాన్ నుంచి అమెరికా వెళ్తోన్న పలువురిని విమనాశ్రయాల్లోనే అడ్డుకున్నారు. ఒక ఇరానియన్ కుటుంబాన్ని కైరోలో న్యూయార్క్ విమానం ఎక్కకుండా ఆపా రు. ‘ఇల్లు, కారు, ఫర్నీచర్ అమ్మేశాను. నేను, నా భార్య ఉద్యోగాలకు రాజీనామా చేశాం. పిల్లల్ని స్కూలు నుంచి తీసుకొచ్చేశాం. ట్రంప్ నా జీవితాన్ని నాశనం చేశాడు’ అని ఫుయాద్ షరెఫ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇరాక్‌లోను ట్రంప్ నిర్ణయంపై నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఏడు దేశాలకు చెందిన ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారికి కూడా అమెరికాలో ప్రవేశం ఉండకపోవచ్చని బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీ పేర్కొంది. ప్రపంచ దేశాధినేతల ఖండన.. ట్రంప్ నిర్ణయాన్ని ప్రపంచ దేశాధినేతలు తప్పుపట్టారు. ఉగ్రవాదంపై పోరు అత్యంత అవశ్యకమైనా సరే... ఒక జాతికి, విశ్వాసానికి చెందిన ప్రజల్ని సందేహించడం సరికాదని జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ తప్పుపట్టారు. ద్వంద్వ పౌరసత్వం ఉన్న జర్మనీ ప్రజలపై ట్రంప్ నిర్ణయ ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నామన్నారు. ట్రంప్ నిర్ణయాన్ని అంగీకరించమని బ్రిటన్ ప్రధాని థెరెసా మే అన్నారు. . అద్భుతం.. అమోఘం: ట్రంప్ ఏడు ముస్లిం దేశాల నుంచి పౌరులపై తాత్కాలిక నిషేధం చాలా బాగా పనిచేస్తుందని, అదలాగే కొనసాగుతుందని ట్రంప్ చెప్పారు. ‘ఎయిర్‌పోర్టులు, మిగతా చోట్ల చూస్తే... ఇది చాలా బాగా పనిచేస్తోంది. మనం చాలా కఠినమైన నిషేధాన్ని అమలు చేస్తున్నాం. క్షుణ్ణంగా తనిఖీ నిర్వహిస్తున్నాం... ఎన్నో ఏళ్ల నుంచి ఇలా చేసి ఉండాల్సింది’ అని చెప్పారు. ఈ నిర్ణయం ముస్లింలపై నిషేధం కాదన్నారు. ఐసిస్‌ను ఓడించేందుకు అవసరమైన సమగ్ర వ్యూహాన్ని 30 రోజుల్లోపు రచించాలని ట్రంప్ ఆ దేశ సైనిక విభాగాన్ని ఆదేశించారు. దీటుగా స్పందించిన ఇరాన్ ట్రంప్ నిర్ణయానికి దీటుగా ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోకి అమెరికన్ల రాకపై కఠిన ఆంక్షలు విధించింది. మా దేశానికి రండి: కెనడా ప్రధాని అట్టావా: ఉగ్రవాదం, యుద్ధం వల్ల స్వదేశాన్ని విడిచిపెడుతున్న శరణార్థులకు కెనడా ప్రధాని ట్రూడ్యూ స్వాగతం పలుకుతూ ట్వీట్ చేశారు. ‘వారి విశ్వాసాలతో నిమిత్తం లేకుండా కెనడాకు ఆహ్వానిస్తున్నాం. భిన్నత్వమే మన బలం’ అని పేర్కొన్నారు. విమానాశ్రయాల వద్ద నిరసనల హోరు ట్రంప్ నిర్ణయంపై ఆదివారం నిరసనలు వెల్లువెత్తాయి. అమెరికాలోని ప్రధాన విమానాశ్రయాల వద్ద వేలాది మంది ఆందోళనకు దిగారు. గ్రీన్ కార్డ్స్ ఉన్నవారినీఅరెస్ట్ చేసి వెనక్కి పంపించేస్తారని, అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తారని వార్తలు రావడంతో విమానాశ్రయాలకు చేరుకుని నిరసన తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్దకు వేలాది మంది చేరుకుని, ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బోస్టన్ , లాస్ ఏంజెలిస్, హ్యూస్టన్ తదితర విమానాశ్రయాల్లోనూ నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిర్ణయంతో యూఎస్ వీసా, గ్రీన్ కార్డులు ఉన్నవారు, వ్యక్తిగత పనిమీద విదేశాలకు వెళ్లిన వారూ ఇబ్బందులు పడ్డారు. వీసాలుంటే అడ్డుకోవద్దు: అమెరికా జడ్జి తీర్పు వరుస నిర్ణయాలతో అలజడి రేపుతున్న ట్రంప్‌కు అమెరికా జడ్జి ఒకరు గట్టి షాకిచ్చారు. విమానాశ్రయాలు, ఇతర ప్రాంతాల్లో అధికారులు అదుపులోకి తీసుకున్న శరణార్థులు, వీసా ఉన్నవారిని వెనక్కి పంపవద్దంటూ న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ జిల్లా జడ్డి యాన్ డానలీ అత్యవసర ఆదేశాలు జారీచేశారు. న్యూయార్క్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న ఇద్దరు ఇరాక్ పౌరుల తరఫున ‘అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ (ఏసీఎల్యూ)’ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ ఆదేశాలిచ్చారు. ‘అమెరికా పౌరసత్వ, వలసదారుల విభాగం ఆమోదించిన శరణార్థుల దరఖాస్తుల్ని ప్రభుత్వం తిరస్కరించకూడదు.. చెల్లుబాటయ్యే వీసాలతో ఇరాక్, సిరియా, ఇరాన్ , సూడాన్ , లిబియా, సోమాలియా, యెమెన్ దేశాల నుంచి వచ్చేవారు అమెరికాలో ప్రవేశించేందుకు చట్టప్రకారం అర్హులు’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. పాకిస్తాన్‌పైనా నిషేధం...? అమెరికాలోకి వలసల నిషేధ దేశాల జాబితాలో పాకిస్తాన్ ను కూడా చేర్చే అవకాశాలున్నాయంటూ వైట్‌హౌస్ ఉన్నతాధికారి అదివారం సూచనప్రాయంగా వెల్లడించారు. జాబితాలో కేవలం ఏడు ముస్లిం ఆధిక్య దేశాల్ని చేర్చడం వెనుక కారణాలు వెల్లడిస్తూ..‘ఆ ఏడింటిని ప్రమాదకర ఉగ్రవాదం సాగుతున్న దేశాలుగా అమెరికా కాంగ్రెస్‌తో పాటు ఒబామా యంత్రాంగం గుర్తించాయని’ వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాప్ రెయిన్స్ ప్రీబస్ చెప్పారు. ఇప్పుడు అదే తరహా పరిస్థితులున్న పాకిస్తాన్ వంటి దేశాల గురించి మీరు ప్రస్తావించవచ్చని, బహుశా తర్వాత వాటిపైనే ట్రంప్ సర్కారు నిషేధం విధింవచ్చని ప్రీబస్ పేర్కొన్నారు. ప్రస్తుతం తక్షణ చర్యలుగా... ఆ దేశాల నుంచి వచ్చి, వెళ్లేవారి వివరాలు క్షుణ్నంగా తనిఖీ చేస్తామని ప్రీబస్ వెల్లడించారు. వలసల నిషేధ జాబితాలో పాకిస్తాన్ ను చేర్చడంపై ట్రంప్ యంత్రాంగం బహిరంగంగా మాట్లాడడం ఇదే మొదటిసారి. -
భారత విద్యార్థులకు గ్రీన్‌కార్డ్ బెనిఫిట్ ఎక్కువ
వాషింగ్టన్: స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్) క్యాటగిరీ కింద అమెరికాలో ఎంఎస్, పీహెచ్డీ కోర్సులను పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు గ్రీన్‌కార్డు లేదా శాశ్వత నివాస హోదాను కల్పిస్తామంటూ అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల అభ్యర్థిగా పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్ ఇచ్చిన హామీ నెరవేరిన పక్షంలో భారత విద్యార్థులకు అదృష్టం తన్నుకొని వచ్చినట్లే. ఎందుకంటే ప్రస్తుతం అమెరికాలో ఎంఎస్ లేదా పీహెచ్డీ చేస్తున్న భారతీయ విద్యార్థులు 1,32,888 మంది ఉన్నారు. వారిలో 80 శాతం మంది స్టెమ్ కేటగిరీలకు చెందిన వాళ్లే. ఆటోమేటిక్ గ్రీన్‌కార్డు విధానం అమల్లోకి వచ్చినట్లయితే వారంతా ప్రయోజనం పొందుతారు. అమెరికాలో పీజీ చేస్తున్న విదేశీ విద్యార్థుల్లో చైనా విద్యార్థులు సంఖ్యాపరంగా ప్రథమ స్థానంలో ఉండగా, భారత విద్యార్థులు ద్వితీయ స్థానంలో ఉన్నారు. 3,04,040 మంది చైనా విద్యార్థులు, అంటే మొత్తం విదేశీ విద్యార్థుల్లో 30 శాతం వారే అన్నమాట. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇక్కడ ఉన్నత విద్యను అభ్యసించిన విదేశీ విద్యార్థులకు గ్రీన్‌కార్డు కల్పించే అంశం చర్చకు వస్తుంది. ఈసారి కూడా అలాగే వచ్చింది. తాను అధికారంలోకి వస్తే విదేశీ విద్యార్థులకు ఆటోమేటిక్ గ్రీన్‌కార్డు విధానాన్ని అమలు చేస్తానని రిపబ్లికన్ల తరఫున దేశాధ్యక్ష పదవికి పోటీ పడి తర్వాత పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిన మిట్ రోమ్నీ 2012 నుంచే హామీ ఇస్తూ వచ్చారు. అదే పార్టీ తరఫున బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఎందుకంటే ఆయన వలసలకు వ్యతిరేకం. ఆయనతో ఎన్నికల బరిలో డెమోక్రట్ల తరఫున పోటీపడుతున్న హిల్లరీ క్లింటన్ విదేశీ విద్యార్థులకు ఆటోమేటిక్ గ్రీన్‌కార్డు సౌకర్యాన్ని కల్పించే అంశంపై గతవారమే మొదటిసారిగా హామీ ఇచ్చారు. ఇప్పుడు దానికి సంబంధించి విధాన పత్రాన్ని విడుదల చేశారు. ఒకప్పుడు ఎఫ్-1 వీసాపై అమెరికాకు వచ్చిన విదేశీ విద్యార్థులకు ‘ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రేనింగ్’ పేరిట చదువు పూర్తయ్యాక పరిమతంగా కొన్ని నెలలపాటే అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు వీలు ఉండేది. 2008లో బుష్ ప్రభుత్వం ఈ కాలాన్ని 29 నెలలకు పెంచింది. 2015లో బరాక్ ఒబామా ప్రభుత్వం 36 నెలలకు పెంచింది. అంటే మూడేళ్లకు మించి అమెరికాలో ఉద్యోగం చేయడానికి వీల్లేదన్నమాట. ఆ తర్వాత కూడా వారు ఉద్యోగంలో కొనసాగాలంటే ఈలోగా హెచ్-1బీ వీసా సంపాదించాలి. అది రాకపోయినట్లయితే భారత్‌కు తిరిగి వెళ్లాల్సిందే. ఇప్పటీకీ ఇదే విధానం కొనసాగుతోంది. ఏడాదికి హెచ్-1బీ వీసాలను 65 వేలకు మించి అమెరికా మంజూరు చేయడం లేదు. యూనివర్శిటీల కేటగిరీల కింద అదనంగా మరో 20వేల వీసాలను మంజూరు చేస్తున్నారు. ఈ వీసాలకు ప్రతి ఏడాది పోటీ తీవ్రమవుతున్నప్పటికీ పరిమితి పెంచడం లేదు. యూనివర్శిటీ కేటగిరీ కింద ఎక్కువ హెచ్-1బీ వీసాలను ఐటీ కంపెనీలే తన్నుకుపోతుండడంతో ఇతర రంగాలకు చెందిన కంపెనీలు నిరుత్సాహపడుతున్నాయి. ఇప్పుడు ఎంఎస్, పీహెచ్డీ విద్యార్థులకు ఆటోమేటిక్ గ్రీన్‌కార్డు విధానాన్ని అమలు చేసినట్లయితే ఇలాంటి కంపెనీలు కూడా లబ్ధి పొందుతాయని హిల్లరీ క్లింటన్ భావిస్తున్నారు. అంతేకాకుండా నైపుణ్యం గల ఉద్యోగుల అందుబాటులో ఉంటారన్న ఉద్దేశంతో తమ దేశంలో కొత్త కంపెనీలను ప్రారంభించేందుకు పెట్టుబడుదారులు పోటీ పడతారని ఆమె భావిస్తున్నారు. దేశంలో కంపెనీలు పెరగడం వల్ల విదేశీ విద్యార్థులతోపాటు స్థానిక అమెరికన్లకు కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నది ఆమె వాదన. ఆమె వాదనతో ఆమెతో పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ విభేదిస్తున్నారు. -
ఇక గ్రీన్‌కార్డ్ సులభం
‘సేమ్ ఆర్ సిమిలర్ జాబ్’ నిర్వచనం మార్పు గ్రీన్‌కార్డ్ పొందడానికి ఇబ్బంది పడుతున్న చాలా మంది భారతీయ ఐటీ ఉద్యోగులకు ఒబామా తాజా నిర్ణయం ఊరటనిస్తుంది. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం.. గ్రీన్‌కార్డ్(లీగల్పర్మనెంట్ స్టేటస్) అప్లికేషన్ ఆమోదం పొందిన తరువాత కూడా సంబంధిత వీసా అందుబాటులోకి రావడం కోసం ఉద్యోగులు చాలా సంవత్సరాలు ఎదురుచూడాల్సి వచ్చేది. తాజా నిర్ణయం ద్వారా గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్న హైస్కిల్డ్ ఉద్యోగులు, వారి భార్యలకు తాత్కాలిక ఉద్యోగావకాశం కూడా లభిస్తుంది. అందుకు తాజా నిబంధనలను అమెరికా రూపొందించనుంది. ‘అదేరకమైన, లేదా సారూప్యత కలిగిన ఉద్యోగం(సేమ్ ఆర్ సిమిలర్ జాబ్)’ అనే పద నిర్వచనాన్ని కూడా సరళీకరించాలని నిర్ణయించారు. దానివల్ల స్కిల్డ్ ఉద్యోగులు ఉద్యోగాలు మారడం సులువవుతుంది. అలాగే, ఉద్యోగాలు మారినప్పు డు గ్రీన్‌కార్డ్ దరఖాస్తును మార్చడం కూడా ఇకపై మరింత సులువు కానుంది. హెచ్ 4 వీసాపై అమెరికాలో ఉంటున్న జీవిత భాగస్వాములు ఇక వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. హెచ్ 1 బీ కోటా నిబంధనల కారణంగా ఇబ్బందులు పడుతున్న వేలాది భారతీయ కుటుంబాలు ఇకపై నిశ్చింతగా ఉండొచ్చు. అమెరికాలో దాదాపు 45 లక్షల మందిభారతీయులు అక్రమంగా ఉంటున్నట్లు అనధికారిక అంచనా. ఒబామా వలస సంస్కరణలను సౌత్ ఏషియన్ అమెరికన్స్ లీడింగ్ టుగెదర్(సాల్ట్) స్వాగతించింది. 9 ఏళ్ల తమ ప్రయత్నం ఫలించిందని ‘ఇమ్మిగ్రేషన్ వాయిస్’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రకటించింది. -
ఇండియన్ 'యాపిల్' !
అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సంస్థ విజయంలో భారతీయులదే ప్రధాన పాత్ర. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. యాపిల్ తయారు చేస్తున్న అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాల రూపకల్పనలో భారత ఇంజనీఇర్లే కీలక పోషిస్తున్నారు. అంతేకాదు ఈ సంస్థలో పనిచేస్తున్న నిపుణుల్లో మూడొంతులు మంది భారతీయులే కావడం విశేషం. 171 బిలియన్ డాలర్ల విలువ కలిగిన యాపిల్ వ్యాపారం వేగంగా విస్తరించడానికి భారత ఐటీ వ్యాపారులు తమ వంతు కృషి చేస్తున్నారు. యూపిల్ కంపెనీ భారత ఇంజినీర్లపై బాగా ఆధారపడుతుందని అమెరికాకు చెందిన హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ తెలిపింది. యూపిల్ నుంచి హెచ్-1బీ వీసా దరఖాస్తులు పెరగడమే ఇందుకు నిదర్శమని పేర్కొంది. 2001-2010 మధ్యలో ఈ కంపెనీ 1,750 హెచ్-1బీ వీసాల దరఖాస్తులు చేసింది. 2011-13 కాలంలో ఈ సంఖ్య వేగంగా పెరిగి 2,800కు చేరింది. వీటిలో ఎక్కువ వీసాలు భారతీయుల కోసమేనని వెల్లడించింది. ఈ సమాచారాన్ని బట్టి చూస్తే ఐఫోన్, ఐపాడ్ రూపకర్తలు భారత ఇంజినీర్లపై ఎక్కువగా ఆధారపడుతున్నారని అర్థమవుతోందని విశ్లేషించింది. యూపిల్ లో పనిచేస్తున్న ఇంజినీర్లలో మూడొంతుల మంది భారతీయులేనని హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ ప్రధాన విశ్లేషకుడు పరీఖ్ జైన్ తెలిపారు. ప్రతి ముగ్గురు ఉద్యోగుల్లో ఒకరు భారతీయ ఇంజినీరే అని చెప్పారు. వీరంతా హెచ్1బీ వీసా లేదా గ్రీన్ కార్డు కలిగినవారని వెల్లడించారు. 47 వేల మంది అమెరికాలో నేరుగా పనిచేస్తున్నారని 2012లో యూపిల్ వెల్లడించింది. వీరిలో 7,700 మంది కస్టమర్ సపోర్ట్ ఆపరేటర్లు, 27,350 మంది రిటైల్ స్టోర్స్ లో పనిచేస్తున్నారు. మిగతా 12 వేల మంది ఇంజినీర్లు, డిజైనర్లు, మార్కెటర్లు, ఇతర వైట్ కాలర్ ఉద్యోగాల్లో ఉన్నారు. భారత్ లో తమ మార్కెట్ ను మరింత పెంచుకునేందుకు అవుట్ సోర్సింగ్ వ్యూహాన్ని యాపిల్ అమలు చేస్తోంది. భారత్ కు చెందిన మూడు అగ్రశేణి సంస్థలతో సహా నాలుగు ఐటీ కంపెనీలకు తమ పనులు అప్పగించింది. భారతీయ ఉద్యోగులపైనే కాదు ఇండియన్ కంపెనీల మీద ఆధారపడుతున్న అమెరికా టెక్నాలజీ దిగ్గజాన్ని 'ఇండియన్ యాపిల్' అని సంబోధించినా అతిశయోక్తి కాబోదేమో!