గ్రీన్ కార్డులకు 12 ఏళ్ల వెయిటింగ్
వాషింగ్టన్:అమెరికాలో నైపుణ్య ఉద్యోగులుగా శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డుకు దర ఖాస్తు చేసుకునే భారతీయుల ముందు 12 ఏళ్ల సుదీర్ఘ వెయిటింగ్ జాబితా ఉంది. అయితే ఏటా ఈ కార్డులు పొందుతున్న వారిలో భారతీయులే ఎక్కువ ఉన్నారు. 2015లో అమెరికాలో 36,318 మంది భారతీయులు తమ హోదాను శాశ్వత నివాసం హోదాకు సర్దుబాటు చేసుకున్నారు. కొత్తగా ప్రవేశించిన మరో 27,978 మంది గ్రీన్‌కార్డు రూపంలో చట్టబద్ధ శాశ్వత నివాసాన్ని పొందారు. ఈమేరకు ప్యూ రీసెర్చ్ సంస్థ తన నివేదికలో తెలిపింది. ఒక ఉద్యోగ సంబంధ విభాగంలో భారతీయుల ముందు ప్రస్తుతం 12 ఏళ్ల జాబితా ఉందని, ప్రభు త్వం 2005 మేలో వచ్చిన దరఖాస్తులను ఇంకా పరిశీలిస్తోందని పేర్కొంది.
‘2010–14 మధ్య ఉద్యోగ సంబంధ గ్రీన్ కార్డుల్లో 36 శాతం (2,22,000) హెచ్1బీ వీసాదారులకు అందాయి. అమెరికాకు కొత్తగా వచ్చిన వారితోపోలిస్తే అప్పటికే అక్కడ నివసిస్తూ, నివాస హోదాను సర్దుబాటు చేసుకున్న వలస దారులకే గ్రీన్‌కార్డులు ఎక్కువగా అందు తున్నాయి. 2015లో 5,42,315 మంది తమ నివాస హోదాను శాశ్వత నివాస హోదాకు మార్చుకున్నారు. అదే ఏడాది కొత్తగా వచ్చిన 5,08,716 మందికి గ్రీన్‌కార్డు రూపంలో శాశ్వత నివాస హోదా దక్కింది’ అని ప్యూ నివేదిక వెల్లడించింది. గ్రీన్‌కార్డు దారులు ఐదేళ్లు అమెరికాలో ఉంటే ఆ దేశ పౌర సత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు.