![DOGE Engineer Resigned For Comments On Indians In America](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/elonmusk.jpg.webp?itok=OK6vOKoZ)
వాషింగ్టన్:ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్ నేతృత్వం వహిస్తున్న అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డీవోజీఈ) టీమ్ నుంచి ఓ ఇంజినీర్ రాజీనామా చేశాడు. 25 ఏళ్ల మార్కో ఇలెజ్ అనే ఇంజినీర్ భారతీయులపై సోషల్‌మీడియాలో గతంలో చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు తాజాగా వైరల్ అయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ విషయంలో దుమారం రేగింది. ముఖ్యంగా భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలోనే ఇలెజ్ తన పోస్టుకు రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఇలెజ్ రాజీనామాపై అమెరికా మీడియా కథనాలు ప్రచురించింది. అతడు గతంలో ‘నార్మలైజ్ ఇండియా హేట్’ అనే పోస్టుతో పాటు ఇండియా నుంచి వచ్చిన హెచ్-1బీ వీసాదారులను ఉద్దేశించి ‘గోయింగ్ బ్యాక్ డోంట్ వర్రీ’ అనే వివాదాస్పద పోస్టులు పెట్టాడు. ఈ పోస్టులపై తీవ్ర వ్యతిరేకత రావడంతో డీవోజీఈ ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌కు ఇలెజ్ రాజీనామా చేశాడు. ఈ పోస్టు ఖాలీ అయినట్లు ప్రభుత్వం ఇప్పటికే నోటిపై చేసింది. ఇలెజ్ డీవోజీఈ కంటే ముందు ఎక్స్(ట్విటర్)లోనూ ఇలాన్ మస్క్‌తో కలిసి పనిచేయడం గమనార్హం.
కాగా, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత భారతీయులతో సహా పలు దేశాలకు చెందిన అక్రమ వలసదారులను అమెరికా నుంచి సైనిక విమానాల్లో పంపివేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు సన్నిహితుడైన ఇంజినీర్ భారతీయులకు వ్యతిరేకంగా చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు వెలుగులోకి రావడం చర్చనీయాంశమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment