
వాషింగ్టన్:అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డీవోజీఈ)కి సంబంధించి ఆ సంస్థ హెడ్, ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖల్యు చేశారు. డీవోజీఈ హెడ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తాను ఆ సంస్థ ఆఫీసులోనే పడుకుంటున్నానని మస్క్ తన సన్నిహితులతో అన్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి.
ఫెడరల్ ప్రభుత్వ బ్యూరోక్రసీ వ్యవస్థపై పట్టు సాధించేందుకు తన ఆఫీసునే బెడ్‌రూమ్‌గా మార్చుకున్నానని మస్క్ చెప్పారు.డీవోజీఈ ఆఫీసు వైట్‌హైజ్ పక్కనే ఉన్న ఇసెన్‌హొవర్ భవనంలో ఉంది. ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టక ముందే ట్రంప్‌ను డీవోజీఈ చీఫ్‌గా నియమించిన విషయం తెలిసిందే.
అయితే మస్క్‌కు గొప్ప హార్డ్ వర్కర్‌గా పేరుంది. ఆయన గతంలో బిజీ సమయాల్లో తన టెస్లా కంపెనీకి చెందిన ఫ్యాక్టరీ నేలపైనే నిద్రపోయినట్లు వార్తలొచ్చాయి. టెస్లా ఫ్యాక్టరీయే తన మొదటి ఇల్లు అని 2022లో మస్క్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. తాజాగా డీవోజీఈ ఆఫీసు విషయంలోనూ మస్క్ ఇదే తరహా విషయాన్ని వెల్లడించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment