
వాషింగ్టన్:భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అందిస్తున్న 21 మిలియన్ డాలర్ల సాయాన్ని ఇటీవల అమెరికా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లపై ట్రంప్ మంగళవారం(ఫిబ్రవరి 18) సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా ట్రంప్ భారత్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ఇండియాకు 21 మిలియన్ డాలర్ల సాయం ఎందుకివ్వాలి. వాళ్ల దగ్గరే చాలా డబ్బులున్నాయి. అమెరికాపై వాళ్లు భారీగా పన్నులు వేస్తున్నారు. నాకు భారత దేశం అన్నా, ఆ దేశ ప్రధాని అన్నా గౌరవం ఉంది’అని ట్రంప్ అన్నారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే వాహనాలపై ఏప్రిల్ 2 నుంచి 25 శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్ తెలిపారు.
ఇటీవల ప్రధాని మోదీ అమెరికాలో పర్యటన ముగిసిన వెంటనే బిలియనీర్ ఇలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డీవోజీఈ) భారత్‌కు సాయాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. కేవలం భారత్‌కే కాకుండా బంగ్లాదేశ్,పాకిస్తాన్ తదితర దేశాలకు అందించే సాయాన్ని కూడా అమెరికా ప్రభుత్వ ఖర్చులు తగ్గించడంలో భాగంగా డీవోజీఈ ఆపివేసింది.
Comments
Please login to add a commentAdd a comment