నేటి నుంచి కొత్త ‘గ్రీన్‌ కార్డ్‌ రూల్‌’ | Green card: New public charge rule starts | Sakshi
Sakshi News home page

నేటి నుంచి కొత్త ‘గ్రీన్‌ కార్డ్‌ రూల్‌’

Published Mon, Feb 24 2020 8:13 AM | Last Updated on Mon, Feb 24 2020 12:03 PM

Green card: New public charge rule starts - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో ఫుడ్‌ స్టాంప్స్‌ తదితర ప్రభుత్వ ప్రయోజనాలు పొందే చట్టబద్ధ వలసదారులకు గ్రీన్‌కార్డ్‌ నిరాకరించేందుకు ఉద్దేశించిన నిబంధన సోమవారం నుంచి అమలులోకి రానుంది. ఈ నిబంధన హెచ్‌1 బీ వీసాపై అమెరికాలో ఉంటూ, గ్రీన్‌ కార్డు కోసం ఎదురుచూస్తున్న వేలాదిమంది భారతీయులపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఈ నిబంధనపై ఇచ్చిన స్టే ఆర్డర్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం ఎత్తివేసింది. దీంతో ‘అమెరికా సమాజంలోకి కొత్తగా వచ్చేవారు స్వయం సవృద్ధులై ఉండాలని, పన్ను చెల్లింపుదారులైన అమెరికన్లపై వారు ఆధారపడకూడదనే సూత్రం అమల్లోకి వస్తుంది’ అని అమెరికా తెలిపింది.

కాగా తాజా నిబంధన ప్రకారం.. గ్రీన్‌ కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులు తాము ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేదని, భవిష్యత్తులోనూ వాటిని ఆశించబోమని, ఈ దేశానికి తాము భారం కాబోమని ధ్రువీకరించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు భవిష్యత్తులోనైనా ఆ ప్రయోజనాలు పొందే అవకాశముందని అధికారులు భావిస్తే.. వారికి గ్రీన్‌ కార్డ్‌ను నిరాకరించే అవకాశం కూడా ఉంది. ఏటా దాదాపు 5.4 లక్షల మంది గ్రీన్‌కార్డ్‌కు అప్లై చేసుకుంటారు. అయితే, వలసదారుల్లో కొందరికి మాత్రమే.. వారి ఇమిగ్రేషన్‌ స్టేటస్‌ను బట్టి మెడిక్‌ ఎయిడ్, ఫుడ్‌ స్టాంప్స్, హౌసింగ్‌ వోచర్స్‌.. తదితర  ప్రభుత్వ ప్రయోజనాలు పొందే అర్హత ఉంటుంది. (గ్రీన్కార్డు కోసం 2.27 లక్షల మంది భారతీయులు వెయిటింగ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement