Supreme Court of the United States
-
USA Presidential Elections 2024: తేల్చేది అబార్షనే!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అబార్షన్ హక్కులు కీలకంగా మారాయి. అధ్యక్షుడు ఎవరనేది అవే నిర్ణయించినా ఆశ్చర్యం లేదని పరిశీలకులూ అభిప్రాయపడుతున్నారు. అబార్షన్ హక్కులను 2022లో అమెరికా సుప్రీంకోర్టు కొట్టేయడం తెలిసిందే. వాటిపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. ఆ తర్వాత జరుగుతున్న తొలి అధ్యక్ష ఎన్నికలివి. ఈ నేపథ్యంలో 10 కీలక రాష్ట్రాల్లోని ఓటర్లు అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్‌తో పాటు అబార్షన్ హక్కులపైనా తమ అభిప్రాయాన్ని తెలపనున్నారు. అధ్యక్ష అభ్యర్థులతో పాటు అబార్షన్ హక్కుల సవరణ (4) అంశాన్ని కూడా ఆ రాష్ట్రాలు బ్యాలెట్లో పొందుపరిచాయి.గర్భస్రావాన్ని నిషేధిస్తూ అమెరికాలో కనెక్టికట్ రాష్ట్రం 1821లో తొలిసారిగా చట్టం చేసింది. దాంతో అప్పటిదాకా సాధారణ చికిత్సగా ఉన్న గర్భస్రావం నేరంగా మారిపోయింది. 1880వ దశకం చివర్లలో పలు ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి చట్టాలే చేశాయి. జేన్ రో అనే మహిళ దీన్ని వ్యతిరేస్తూ 1971లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గర్భస్రావం అందుబాటులో ఉండేలా చూడాలని, పునరుత్పత్తి సంబంధిత విషయాల్లో నిర్ణయాధికారం మహిళలకే ఉండాలని వాదించారు. దాంతో గర్భస్రావాన్ని చట్టబద్ధం చేస్తూ రెండేళ్ల తర్వాత కోర్టు తీర్పునిచ్చింది. ‘రోవర్సెస్ వేడ్’ కేసుగా ఇది చరిత్రకెక్కింది. తర్వాత చాలా రాష్ట్రాలు మహిళలకు అబార్షన్ సదుపాయాన్ని కల్పించినా కొన్ని మాత్రం నిషేధం కొనసాగించాయి. పోప్ వ్యాఖ్యలతో.. అబార్షన్ హక్కులను 1951లో పోప్ గట్టిగా విమర్శించారు. ‘‘గర్భంలోని బిడ్డకు కూడా జీవించే హక్కుంది. ఆ బిడ్డనిచ్చింది దేవుడు. అంతే తప్ప తల్లిదండ్రులు, ఈ సమాజమో లేదా మనిషో సృష్టించిన ప్రభుత్వాలు కాదు’’ అంటూ సందేశమిచ్చారు. ఆ తర్వాత గర్భస్రావంపై ఆంక్షలను సుప్రీంకోర్టే తొలగించడం మత సమూహాలకు సమస్యగా మారింది. దాన్ని అడ్డుకోడానికి రిపబ్లికన్ పార్టీని మాధ్యమంగా అవి ఎంచుకున్నాయి. ఫలితంగా 1970వ దశకంలో అంతంతమాత్రంగా ఉన్న పార్టీ ఈ మత సమూహాలతో కలిసి ప్రభావశీలంగా మారింది. 1968–88 మధ్య ఆరు అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా ఐదింటిలో విజయం సాధించింది. జడ్జీల ద్వారా ఎత్తులు 1983లో పార్లమెంటులో గర్భస్రావ చట్ట సవరణకు ప్రతిపాదనలు ప్రవేశపెట్టినా ఆమోదం పొందలేదు. గర్భస్రావాన్ని నిషేధించడం పార్లమెంటు ద్వారా సాధ్యం కాదని, కోర్టు ద్వారానే ముందుకెళ్లాలని భావించారు. కానీ దానికోసం సంప్రదాయవాద జడ్జిలు అవసరమయ్యారు. అమెరికాలో జడ్జీలను అధ్యక్షుడే నియమిస్తారు. సుప్రీంకోర్టు జడ్జీల నియామకంపై పార్టీలు దశాబ్దాలుగా రెండుగా చీలుతున్నాయి. అధికారం రిపబ్లికన్ల చేతుల్లో ఉంటే గర్భస్రావాన్ని వ్యతిరేకించే జడ్జీలు, డెమొక్రాట్ల చేతిలో ఉంటే సమర్థించే వాళ్లు వచ్చేవారు. ట్రంప్ హయాంలో గర్భస్రావ వ్యతిరేక ధోరణి ఉన్న జడ్జీల నియామకం ఎక్కువగా జరిగింది. దాంతో అబార్షన్‌ను చట్టబద్ధం చేసిన 50 ఏళ్ల నాటి తీర్పును సుప్రీంకోర్టు 2022లో కొట్టివేసింది. అమెరికాలో అబార్షన్ హక్కులను ఈ తీర్పు పూర్తిగా మార్చేసింది. రాష్ట్రాలు తమ పరిధిలో అబార్షన్ అనుమతులను మార్చుకోవచ్చని పేర్కొంది. దీని ఆధారంగానే టెక్సాస్ రిపబ్లికన్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఒక కొత్త గర్భస్రావం చట్టాన్ని అమలు చేశారు. ఈ బాటలో మరిన్ని రాష్ట్రాలు నడిచాయి.మెజారిటీ అమెరికన్ల వ్యతిరేకత 2022 నాటి సుప్రీంకోర్టు తీర్పుతో మెజారిటీ అమెరికన్లు విభేదించారు. ఇది ఆ ఏడాది జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల విజయానికి కారణమైంది. ఇప్పుడు మాత్రం పునరుత్పత్తి హక్కుల కంటే ఆర్థిక వ్యవస్థ గురించి ఓటర్లలో ఎక్కువ ఆందోళన ఉందని సర్వే లు చెబుతున్నాయి. కానీ డెమొక్రాట్ల అభ్యర్థి, కమలా హారిస్ మాత్రం తన ప్రచా రంలో అబార్షన్ హక్కులనే ప్రస్తావిస్తున్నారు. అబార్షన్ల అనుకూల తీర్పును రద్దు చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో తన పాత్రను ట్రంప్ ప్రచారం మొదట్లో పదేపదే పేర్కొంటున్నారు. ఇటీవల మాత్రం అబార్షన్ హక్కులపై నిర్ణయాధికారం రాష్ట్రాలదేనంటున్నారు.డెమొక్రాట్లకే సానుకూలం ఫ్లోరిడా, అరిజోనా, నెవడా, కొలరాడో, మోంటానా, సౌత్ డకోటా, మిస్సోరి, న్యూయార్క్, మేరీలాండ్, నెబ్రాస్కాల్లో అధ్యక్ష ఎన్నికలతో పాటు అబార్షన్ హక్కులపై కూడా ఒకేసారి ఓటింగ్ జరుగుతోంది. అబార్షన్ హక్కులుండాలా, పూర్తిగా రద్దు చేయాలా అనే విషయమై ఓటర్లు నిర్ణయం వెలువరించనున్నారు. ఈ విషయాలను అధ్యక్ష బ్యాలెట్‌తో పాటుగా జోడించడం అరిజోనా, నెవడా వంటి రాష్ట్రాల్లో డెమొక్రాట్లకు కలిసి రానుందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఓటేసిన ఫ్లోరిడా కూడా ఈసారి డెమొక్రాట్లకు మద్దతుగా నిలుస్తుందని అంచనా. ఫ్లోరిడా ఓటర్లలో 46 శాతం మంది చట్ట సవరణకు అనుకూలంగా, 38 శాతం వ్యతిరేకంగా, 16 మంది తటస్థంగా ఉన్నారని అక్టోబర్‌లో న్యూయార్క్ టైమ్స్/సియానా కాలేజ్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. కాకపోతే వచ్చే మంగళవారం జరగనున్న అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌లో అబార్షన్ అంశం ఏ మేరకు ప్రభావం చూపిస్తుందనే దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. ఎందుకంటే ఎకానమీనే ఈ ఎన్నికల్లో అతి పెద్ద సమస్యగా ఏకంగా 28 శాతం మంది ఓటర్లు చూస్తున్నట్టు సియానా కాలేజ్ పోల్ సర్వే పేర్కొంది. అబార్షన్ హక్కులను పెద్ద సమస్యగా భావిస్తున్నది 14 శాతమే. ఇక ట్రంప్ అత్యంత ప్రాధాన్యమిస్తున్న అక్రమ వలసల అంశానికి 12 శాతం మంది మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Trump: యూఎస్ సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో దిగిన డొనాల్డ్ ట్రంప్‌నకు ఊరట లభించింది. అధ్యక్షులకు న్యాయ విచారణ నుంచి కొంతమేరకు రక్షణ ఉంటుందని తొలిసారిగా అమెరికా సుప్రీంకోర్టు సోమవారం తీర్పునిచ్చింది. ‘రాజ్యాంగబద్ధమైన అధికార పరిధిలో తీసుకునే నిర్ణయాలకు మాజీ అధ్యక్షులకు క్రిమినల్ విచారణ నుంచి సంపూర్ణ రక్షణ ఉంటుంది. ఇది అధికారిక నిర్ణయాలకు మాత్రమే వరిస్తుంది. అనధికారిక చర్యలకు ఎలాంటి రక్షణ పొందలేరు’ అని చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ మెజారిటీ తీర్పు(6–3)లో పేర్కొన్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఓటమిని అంగీకరించకుండా ఫలితాలను తారుమారు చేయడానికి కుట్ర పన్నారనే అభియోగాలపై డొనాల్డ్ ట్రంప్ క్రిమినల్ కేసును ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు సోమవారం ఈ కేసును తిరిగి ట్రయల్ కోర్టుకు అప్పగించింది. ఫలితంగా అధ్యక్ష ఎన్నిక జరిగే నవంబర్ 5 లోగా ట్రంప్ విచారణను ఎదుర్కొనే అవకాశాలు లేనట్టే. ‘మాజీ అధ్యక్షులకు క్రిమినల్ విచారణ నుంచి మినహాయింపు అధ్యక్ష వ్యవస్థనే పునర్వవస్థీకరిస్తుంది. చట్టానికి ఎవరూ అతీతులు కాదనే రాజ్యాంగ సూత్రాలను, భూమికను, ప్రభుత్వ వ్యవస్థను అవహేళన చేయడమే’ అని జస్టిస్ సోనియా సొటోమేయర్ అన్నారు. సుప్రీం తీర్పుపై ట్రంప్ హర్షం వ్యక్తం చేయగా.. అధ్యక్షుడు బైడెన్ ఈ తీర్పుపై స్పందిస్తారని వైట్ హౌజ్ వర్గాలు వెల్లడించాయి. అట్లాంటా బిగ్ డిబేట్ తర్వాత మళ్లీ బైడెన్ మీడియా ముందుకు రావడం ఇదే ప్రథమం. -
సుప్రీంలో ట్రంప్‌కు భారీ విజయం
వాషింగ్టన్: మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట. కొలరాడో ప్రైమరీ బ్యాలెట్ పత్రాల నుంచి ఆయన పేరు తొలగించాలన్న రాష్ట్ర సుప్రీంకోర్టు తీర్పును అమెరికా సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఆయన పేరుండాల్సిందేనంటూ సంచలన తీర్పు వెలువరిచింది. దాంతో కొలరాడోతో పాటు ఇలినాయీ, మెయిన్ వంటి రాష్ట్రాల్లో బ్యాలెట్ పేపర్‌పై పేరు తొలగింపు ముప్పు ఎదుర్కొంటున్న ట్రంప్‌కు భారీ ఊరట లభించింది. ఆయా రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యరి్ధత్వం కోసం ప్రైమరీల్లో ట్రంప్ పోటీకి మార్గం సుగమమైంది. పార్లమెంట్‌పైకి మద్దతుదారులను ఉసిగొల్పారన్న ఆరోపణలపై రాజ్యాంగంలోని 14వ సవరణ మూడో సెక్షన్‌ను ఉపయోగించి ట్రంప్‌ను ప్రైమరీ నుంచి కొలరాడో సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. అధ్యక్ష అభ్యరి్థపై కోర్టు ఈ సెక్షన్‌ను వాడటం అమెరికా చరిత్రలో అదే తొలిసారి. 14వ సవరణను వాడే అధికారం పార్లమెంట్‌కే తప్ప రాష్ట్రాలకు లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఇది అమెరికా సాధించిన ఘన విజయంమని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
ప్రపంచంలో తొలిసారి ఇలాంటి మరణశిక్ష
అతనో కాంట్రాక్ట్ కిల్లర్. ఓ వ్యక్తి ఇచ్చిన సుపారీతో.. అతని భార్యను హత్య చేశాడు. ఆపై సుపారీ ఇచ్చిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యవర్తి జీవితఖైదుతో జైల్లోనే చచ్చాడు. హత్యలో సహకరించిన వ్యక్తికి మరణశిక్ష అమలయ్యింది. కానీ, ఇతగాడికి మరణశిక్ష పడి దశాబ్దాలు గడుస్తున్నా.. అది అమలు కావడంలో జాప్యం అవుతూ వస్తోంది. చివరికి.. పోయినేడు ఏడాది శిక్షను అమలు చేయాలని చూస్తే అది విఫలం అయ్యింది.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చదివేయండి.. ప్రపంచంలోనే తొలిసారి నైట్రోజన్ గ్యాస్‌నుNitrogen Hypoxia Execution ఉపయోగించి ఓ వ్యక్తికి మరణశిక్ష అమలు చేయబోతున్నారు. అమెరికా సంయుక్తం రాష్ట్రం అలబామాలో ఈ శిక్ష గురువారం అమలు కాబోతోంది. ఘోరంగా.. ఊహకందని రీతిలో అమలు కాబోయే ఈ మరణశిక్ష తప్పించుకునేందుకు చివరిదాకా యత్నం చేసిన కెన్నెత్ యూజీన్ స్మిత్(58) చివరికి నిరాశే ఎదురైంది. బుధవారం యూఎస్ సుప్రీం కోర్టు సైతం శిక్ష అమలు నిలుపుదలకు నిరాకరించింది. అలబామా కోర్టులు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీంతో.. ఈ శతాబ్దంలో ఒక వ్యక్తిని ఈ తరహాలో శిక్షించి చంపడం ఇదే తొలిసారి కానుంది. కేసు ఏంటంటే.. 1988లో కోల్బర్ట్ కౌంటీలో చార్లెస్ సెన్నెట్ అనే మతాధిపతి తన భార్య ఎలిజబెత్ సెన్నెట్‌ను చంపడానికి బిల్లీ గ్రే విలియమ్స్ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చాడు. వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించిన ఆయన ఆ విషయం భార్యకు తెలియడం.. ఆమె నిలదీయడంతో తట్టుకోలేకపోయాడు. అలాగే.. భార్య పేరిట ఉన్న ఇన్సూరెన్స్ సొమ్ము కోసమే ఆయన ఆమెను అడ్డు తొలగించుకునే పని చేశాడు. కెన్నెత్ స్మిత్, జాన్ పార్కర్ అనే ఇద్దరు అనే ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్లకు 1000 డాలర్ల చొప్పున ఇస్తూ.. ఆ పని అప్పగించాడు బెల్లీ. ఇంట్లోనే మార్చి 18వ తేదీన ఆమెను దారుణంగా హతమార్చారు ఆ ఇద్దరు. ఇది దొపిడీ దొంగల పనేనని నమ్మించే యత్నం చేశారు. వారం తర్వాత.. దర్యాప్తులో అసలు విషయం బయటపడుతుందన్న భయంతో ఛార్లెస్ ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు తన కుటుంబ సభ్యుల ముందు ఆయన నిజం ఒప్పుకున్నారు. ఇక ఈ కేసులో బిల్లీ గ్రే విలియమ్స్‌కు కఠిన యావజ్జీవ శిక్షపడగా.. 2020లో జైల్లోనే అనారోగ్యంతో మరణించాడు. స్మిత్, పార్కర్ ఇద్దరికీ మరణశిక్ష విధించింది కోర్టు. 2010 జూన్‌లో పార్కర్‌కు లెథల్(ప్రాణాంతక) ఇంజెక్షన్ ఇచ్చి మరణశిక్ష అమలు చేశారు. కానీ, స్మిత్ విషయంలోనే ఆ శిక్ష జాప్యం అవుతూ వస్తోంది. కిందటి ఏడాది.. నవంబర్ 17వ తేదీన స్మిత్‌కు లెథల్ ఇంజెక్షన్ ఇచ్చి మరణశిక్ష అమలు చేయాలని ప్రయత్నించారు. అయితే.. ఇంజెక్షన్లు ఎక్కించేందుకు నరాలు దొరక్కపోవడంతో ఆ శిక్ష నిలిపేశారు అధికారులు. ఈలోపు అలబామా సుప్రీంకోర్టు ఇచ్చిన డెత్ వారెంట్ గడువు ముగిసిపోయింది. దీంతో.. అతని మరణశిక్ష అమలుపై సమీక్ష జరపాలని అలబామా గవర్నర్ కెయ్ ఇవెయ్ ఆదేశించారు. చివరకు.. నైట్రోజన్ హైపోక్సియా పద్ధతితో శిక్ష అమలు చేయాలని అధికారులు నిర్ణయించగా.. అసలు వ్యవహారం మొదలైంది. ఐరాసతో సహా అభ్యంతరాలు.. అయితే.. ఈ తరహా మరణశిక్ష అమలుపై ప్రపంచవ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. తొలి ప్రయత్నం విఫలమయ్యాక.. స్మిత్ శారీరక మానసిక స్థితి స్థితి ఘోరంగా దెబ్బతిందని అతని తరఫు న్యాయవాదులు వాదిస్తూ వచ్చారు. స్మిత్ కుటుంబ సభ్యులు కూడా ఈ తరహా శిక్షను అమలుచేయడానికి వీల్లేదని.. ఆయన అనుభవించిన శిక్షా కాలం పరిగణనలోకి తీసుకుని విడుదల చేయాలని క్షమాభిక్ష కోరారు. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సంఘాలు సైతం ఇది అత్యంత మానవీయమైన చర్యగా పేర్కొంటూ వస్తున్నాయి. మరోవైపు ఐక్యరాజ్య సమితి మాన హక్కుల సంఘ కార్యాలయం సైతం ఈ శిక్షను నిలిపివేయాలంటూ అలబామాను కోరుతూ వస్తోంది. అయితే ఎలిజబెత్ కుటుంబ సభ్యులు మాత్రం శిక్ష అమలు చేయాల్సిందేనని కోరుతూ వస్తున్నారు. ఈలోపు అమెరికా రాజ్యాంగంలోని ఎనిమిదో సవరణ ప్రకారం(నేర, అసాధారణ శిక్షల నుంచి రక్షణ) శిక్షను నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించారు స్మిత్ తరఫు లాయర్లు. ఈలోపు బుధవారం.. యూఎస్ సుప్రీం కోర్టు ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. తొమ్మిది మంది న్యాయమూర్తుల్లో ముగ్గురు మాత్రమే స్మిత్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోగా.. మిగతా మెజార్టీ న్యాయమూర్తులు పిటిషన్‌ను తిరస్కరించారు. ఎలా ఉంటుందంటే.. నైట్రోజన్ హైపోక్సియా అంటే.. నైట్రోజన్ సిలిండర్‌కు బిగించిన పైప్‌ను మాస్క్ ద్వారా నిందితుడి ముక్కుకు బిగిస్తారు. గ్యాస్‌ను విడుదల చేయగానే.. ఆక్సిజన్ అందక నైట్రోజన్ మోతాదుతో ఆ వ్యక్తి గిలగిల కొట్టుకుంటూ మరణిస్తారు. ఐసీయూలో ఆక్సిజన్ సిలిండర్ ద్వారా ఒక వ్యక్తి ప్రాణాల్ని ఎలా రక్షిస్తారో.. అదే విధంగా నైట్రోజన్‌తో ఆ ప్రాణాల్ని హరిస్తారన్నమాట. అదీ చట్టబద్ధంగా!. బుధవారం అర్ధరాత్రి దాటాక(గురువారం 12గం. నుంచి.. ఆ మరుసటి రోజు ఉదయం 6గం. లోపు ఈ శిక్షను అమలు చేస్తారు). ఇప్పటిదాకా అమెరికాలో ప్రాణాంతక ఇంజెక్షన్ల ద్వారానే మరణశిక్షలు అమలు చేస్తూ వచ్చారు. అయితే.. ఆ ఇంజెక్షన్లలో ఉపయోగించే మందు దొరకడం కష్టతరం అవుతుండడంతో(ఐరోపా దేశాలు వాటిని నిషేధించాయి).. ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అలబామాతో పాటు మిసిసిప్పీ, ఓక్లహోమా నైట్రోజన్ గ్యాస్‌తో చంపడం లాంటి శిక్షలను పరిశీలనలోకి తెచ్చుకున్నాయి. :::సాక్షి వెబ్‌డెస్క్ -
చనిపోయిన భర్త నుంచే పిల్లలు పొందాలని.. ఆమె ఏకంగా..!
ఇటీవల కాలంలో చనిపోయిన భర్త నుంచే పిల్లలను కన్న ఓ మహిళ గురించి విన్నాం. ఆకేసులో ఆ దంపతులు పిల్లలు పుట్టకపోవడంతో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎఫ్) ఆస్పత్రిని ఆశ్రయించారు. ఆ పద్ధతిలో పిల్లను కనాలనుకునేలోపు కరోనా మహమ్మారి రావడం భర్త చనిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. ఒంటిరిగా అయిపోయిన ఆ భార్య తన భర్త ఉన్నప్పుడు పిల్లలను కనాలనుకున్న ఘటన గుర్తొచ్చి ఆస్పత్రికి వెళ్లి తన నిర్ణయాన్ని తెలిపి మరీ సాహసోపేతంగా బిడ్డను కని వార్తల్లో నిలిచింది. అది మరువక మునుపే అదే మాదిరి ఘటన కాకపోతే కొద్ది తేడా ఉంది. అక్కడ బతికుండగానే భర్త నుంచి స్పెర్మ్ తీసుకున్నారు. ఇక్కడ ఈ జంట కనాలనుకునేలోపే భర్త అకాల మరణం పొందాడు. అయినా తన భర్త నుంచే పిల్లలను కనాలనుకుంటున్నా అంటూ అందుకు పర్మిషన్ ఇమ్మని ఏకంగా సుప్రీం కోర్టునే ఆశ్రయించి అనుమతి తెచ్చుకుంది. ఈ ఆశ్చర్యకర ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..వెస్ట్ ఆస్ట్రేలియాకు చెందిన 62 ఏళ్ల మహిళ ఆమె భర్త తమ ఇద్దరు పిల్లలను వేర్వేరు ఘటనలు పోగొట్టుకున్నారు. దీంతో ఇరువురు పిల్లను కనాలని కృతనిశ్చయంతో ఉన్నారు. అయితే అనుకోకుండా ఇటీవలే డిసెంబర్ 17న భర్త ఆకస్మికంగా మరణించారు. దీంతో ఆమె తన భర్త బతికుండగానే పిల్లలను కనాలనుకున్న దాన్ని నిజం చేయాలనుకుంది. చనిపోయినప్పటికీ తన భర్త నుంచే పిల్లలను కనాలనుకుంది. అందుకోసం అని చనిపోయిన భర్త నుంచి స్పెర్మ్‌ని సేకరించాలనుకుంది. దీనికి సుప్రీం కోర్టు అనుమతివ్వాలంటూ అభ్యర్థించింది. తన భర్త బతికున్నప్పుడే తామిరువురం అనుకున్నామని, తన భర్త కోరికని అనుమతిమ్మని కోర్టుని వేడుకుంది. దీంతో ధర్మాసనం చనిపోయిన భర్త నుంచి స్పెర్మ్‌ని తీసుకునేందు అనుమతి మంజూరుచేసింది. ఇక్కడ ఓ చనిపోయిన వ్యక్తి స్పెర్మ్ ఫలదీకరణం చెందించేలా ఉపయోగించడం అనేది వైద్యశాస్త్రంలో మరింత పురోగతికి నాంది పలుకుతుందనే చెప్పాలి. ఇక ఆ జంట పిల్లలు 2013లో కుమార్తె(29) ఫిషింగ్ ట్రిప్‌లో మరణించగా, కుమారుడు(30) కారు ప్రమాదంలో మరణించాడు. దీంతో ఆ జంట ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లను కనాలని అనుకుంది. అయితే పిల్లలను కనే వయసు సదరు మహిళకు దాటిపోవడంతో సరోగసి ద్వారా పిల్లలను పొందాలనుకున్నారు. ఈలోగా అనుకోకుండా భర్త దూరమవ్వడంతో ఆ కోరిక కలగా మిగిలిపోకూడదని ఆ మహిళ స్ట్రాంగ్‌గా నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె సుప్రీంకోర్టుని ఆశ్రయించి చనిపోయిన భర్త నుంచే స్పెర్మ్‌ని సేకరించేలా అనుమతి పొందింది. కాగా, మరణాంతర ఫలదీకరణంపై వెస్ట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది. అందువల్ల ఆమె సరోగసి ద్వారా బిడ్డను పొందాలనుకుంటే..ముందుగా సదరు మహిళ స్త్రీ పునరుత్పత్తి సాంకేతిక పరిజ్ఞాన మండలికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆమె దివగంత భర్త తండ్రి కావాలనుకున్నాడా? అలాగే సదరు మహిళ చెబుతోంది అంతా నిజమేనా? అన్నది నిర్థారణ చేసుకుని ఆస్ట్రేలియా వైద్యాధికారులు అనుమతి ఇస్తేనే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక అధికారులు సదరు మహిళ వివరాలను చాలా గోప్యంగా ఉంచారు. (చదవండి: ఒక లీటర్ బాటిల్లో ఎన్ని నానో ప్లాస్టిక్ కణాలు ఉంటాయో తెలుసా! వెలుగులోకి షాకింగ్ విషయాలు!) -
US Elections: ట్రంప్‌పై బ్యాన్.. రివ్యూకు సుప్రీంకోర్టు ఓకే
వాషింగ్టన్: ఈ ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవితవ్యం త్వరలో తేలనుంది. ఇప్పటికే కొలరాడో సుప్రీం కోర్టు ఆ రాష్ట్ర ప్రైమరీ బ్యాలెట్లో పాల్గొనకుండా ట్రంప్‌పై నిషేదం విధించిన విషయం తెలిసిందే. కొలరాడో స్టేట్ సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్‌ను విచారించేందుకు దేశ సుప్రీం కోర్టు శుక్రవారం అంగీకరించింది. ఈ విచారణను త్వరిగతిన చేపడతామని, ఫిబ్రవరి 8న తుది వాదనలు వింటామని చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ తెలిపారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత క్యాపిటల్ బిల్డింగ్‌పై ట్రంప్ మద్దతుదారులు చేసిన దాడి రాజ్యాంగపరంగా తిరుగుబాటు కిందకు వస్తుందా రాదా అనేదానిపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పనుంది. ట్రంప్ చేసిన తిరుగుబాటు రాజ్యాంగ తిరుగుబాటు కిందకు వస్తుందని భావించిన కొలరాడో స్టేట్ సుప్రీం కోర్టు ఆయనను ఆ స్టేట్ ప్రైమరీ బ్యాలెట్లో పాల్గొనకుండా బ్యాన్ విధించింది. అయితే ఈ బ్యాన్పై దేశ సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు ట్రంప్‌కు అనుకూలంగా వస్తే ఈ ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకున్న న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోతాయి. ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే మాత్రం అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సంబంధించి ట్రంప్ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చని తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ప్రైమరీలు ఈ నెల 15వ తేదీ ప్రారంభం కానున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరపున ప్రెసిడెంట్ నామినేషన్ రేసులో ట్రంప్ ఇప్పటికే ముందంజలో ఉన్నారు. మిగతా అభ్యర్థులు ఆయన దరిదాపుల్లో కూడా లేరని పలు సర్వేలు చెబుతున్నాయి. ఇదీచదవండి..ఫిన్లాండ్, స్వీడన్లో రికార్డు చలి -
సంకుచితమైన తీర్పు
అబార్షన్ల విషయంలో మహిళల రాజ్యాంగ హక్కుని కాలరాస్తూ నిరుడు జూన్‌లో తీర్పునిచ్చిన అమెరికా సుప్రీంకోర్టు... జాతి ఆధారంగా విద్యాసంస్థల అడ్మిషన్లలో ప్రాధాన్యం కల్పించే విధానా నికి మంగళం పాడి తనది వెనకడుగేనని మరోసారి నిరూపించుకుంది. గత అరవైయ్యేళ్లుగా అమల వుతున్న ఈ విధానం రాజ్యాంగంలోని 14వ అధికరణ కు విరుద్ధమని 6–3 మెజారిటీతో ధర్మాసనం గురువారం తీర్పునిచ్చింది. ధర్మాసనంలో అత్యధికులు రిపబ్లికన్ల ఏలుబడిలో వచ్చినవారే. మన దేశంలో శతాబ్దాలుగా వివక్ష ఎదుర్కొంటున్న అట్టడుగు కులాలకు కోటా కల్పించిన విధంగానే అమెరికా విద్యాసంస్థల్లో కూడా నల్లజాతీయులు, ఇతర మైనారిటీ వర్గాలకు ప్రవేశాల్లో ప్రాధాన్య మిస్తున్నారు. ఆ వర్గాలపై శతాబ్దాలుగా అమలవుతున్న వివక్షపై డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్VŠ జూనియర్ నేతృత్వంలో సాగిన చరిత్రాత్మక పోరాటాల ఫలితంగా అక్కడి సమాజం తనను తాను సరిదిద్దుకునే క్రమంలో ఈ విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఈ క్రమం అసంపూర్ణంగానే ఉన్న దని తరచు నిరూపణ అవుతూనే ఉంది. వర్ణ వివ క్ష, దాన్ని వెన్నంటి ఉండే వ్యవస్థీకృత హింస ఇంకా సమసిపోలేదు. ఎలాంటి నేర నేపథ్యమూ లేని జార్జి ఫ్లాయిడ్ అనే ఒక నల్లజాతీయుణ్ణి 2020లో మినియాపొలిస్ నగరంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎంత క్రూరంగా, ఎంత నిర్దాక్షిణ్యంగా హత మార్చాడో, దాని పర్యవసానంగా ఎంత హింస చెలరేగిందో ప్రపంచమంతా చూసింది. ఆ ఘటనకు ముందూ వెనుకా అనేకానేకమంది నల్లజాతీయులు పోలీసు హింసకు బలయ్యారు. వందల ఏళ్ల పాటు బానిసత్వంలో మగ్గిన పర్యవసానంగా వారు చదువులకు దూరమయ్యారు. కనుక మెరుగైన ఉపాధికి వారు దూరం. అసలు 1964 వరకూ పౌరహక్కులే లేవు. ఆ మరుసటి ఏడాది వారికి తొలిసారిగా ఎన్నికల్లో ఓటేసే హక్కు లభించింది. ఇదంతా నల్లజాతీయుల మొక్కవోని పోరాటాల, త్యాగాల ఫలితం. ఆ హక్కులకు కొనసాగింపుగానే 1965 జూన్‌లో అప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ ‘నిశ్చయాత్మక చర్య’కు సంసిద్ధం కావాలని, నల్లజాతీయులకూ, ఇతర మైనారిటీ లకూ ప్రవేశాల్లో ప్రాధాన్యతనీయాలని విద్యాసంస్థలకు పిలుపునిచ్చారు. ఆరు దశాబ్దాలుగా అమల వుతున్న ఈ విధానంతో ఎంతోమంది అత్యున్నత స్థానాలకు ఎదుగుతున్నారు. తమ మేధస్సుతో అమెరికన్ సమాజం సుసంపన్నం కావటానికి దోహదపడుతున్నారు. అయినా ఈనాటికీ విద్యా సంస్థల్లో నల్లజాతీయులు 7 శాతం మించరు. శ్వేత జాతి అమెరికన్లు 46 శాతం వరకూ ఉంటారు. ఏదో మేరకు జరుగుతున్న కాస్త మంచినీ తాజా తీర్పు ఆవిరిచేసింది. విద్యారంగంలో ‘నిశ్చయాత్మక చర్య’కు ముందు అత్యున్నత శ్రేణి విద్యా కేంద్రాలుగా పేరున్న హార్వర్డ్, యేల్, ప్రిన్స్టన్ యూనివర్సిటీల్లో 1960ల నాటికి కేవలం 15 (0.5 శాతం) మంది నల్లజాతి విద్యార్థులుండేవారు. వైద్య విద్యలో పేరెన్నికగన్న యూసీఎల్ఏలోనూ, మరికొన్నిచోట్లా 1955–1968 మధ్య 764 మంది వైద్య పట్టాలు పొందితే నల్లజాతీయులు ఒక్కరు కూడా లేరు. దీన్ని గమనించాకే లిండన్ జాన్సన్ విద్యాసంస్థలకు అర్థమయ్యేలా చెప్పారు. అనేకానేక ఏళ్లపాటు సంకెళ్లలో బందీ అయిన వ్యక్తికి విముక్తి కల్పిస్తూ ‘ఇకపై నీకు స్వేచ్ఛనిస్తున్నాం. ఇప్పుడు ఎవరితో నైనా నువ్వు పోటీపడొచ్చు. ఆ పోటీ పూర్తి న్యాయబద్ధంగా ఉంటుంది’ అనడం ఎంత అన్యాయమో గ్రహించమని కోరారు. ఆ తర్వాతే విద్యాసంస్థలు తమ అడ్మిషన్ విధానాల్లో మార్పులు చేశాయి. తమ తీర్పు దీన్నంతటినీ దెబ్బతీస్తుందన్న వాదనలతో ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ఏకీభ వించటం లేదు. వివక్ష అంతానికి ప్రవేశపెట్టిన ఈ విధానమే వివక్షతో కూడుకున్నదని ఆయన అభిప్రాయం. ఇకపై వ్యక్తులుగా ఎవరు ఎలాంటి వివక్ష ఎదుర్కొన్నారో తెలుసుకుని దాన్నిబట్టి నిర్ణయం తీసుకోవాలన్నది ఆయన సూచన. ఆచరణలో ఇదంతా ఏమవుతుందో తెలియనిది కాదు. ఉన్నతశ్రేణి విద్యాసంస్థల్లో జాతిపరమైన వైవిధ్యత మాయమవుతుంది. శ్వేత జాతి అమెరికన్ల ఆధిపత్యం పెరుగుతుంది. ప్రస్తుతం తీర్పు వెలువడిన కేసు అక్కడ మొదటిదేమీ కాదు. ‘నిశ్చయాత్మక చర్య’ మొదలై పదేళ్లు గడవకుండానే దానిపై వివిధ న్యాయస్థానాల్లో కేసులు దాఖలయ్యాయి. వాటిల్లో స్వల్ప మెజారిటీతో గండం గట్టెక్కిన కేసులే అధికం. 2003లో ఈ విధానానికి అనుకూలంగా తీర్పు వెలువడినా, ధర్మాసనంలోని మహిళా న్యాయమూర్తి ‘మరో పాతికేళ్లకు జాతిని కాక ప్రతిభను పరిగ ణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంద’ని అభిప్రాయపడ్డారు. కానీ అంతకు చాలాముందే సుప్రీంకోర్టు ఆ విధానానికి స్వస్తి పలికినట్టయింది. అసలు ఈ విధానాన్ని కాలిఫోర్నియా, ఫ్లారిడాలతో సహా తొమ్మిది రాష్ట్రాలు అమలు చేయటంలేదు. అమెరికన్ సమాజంలో ఈ విధానాన్ని వ్యతిరేకించే వర్గం క్రమేపీ పెరగటం కనిపిస్తుంది. రిపబ్లికన్ పార్టీ ఈ విధానికి మొదటినుంచీ బద్ధ వ్యతిరేకం. అనుకూలంగా ఉండే డెమొక్రటిక్ పార్టీ కూడా ప్రజానీకాన్ని చైతన్యవంతం చేసే ప్రయత్నం చేయలేదు. అందుకే ప్రస్తుత తీర్పు మెజారిటీ జనాభా దృక్పథాన్నే ప్రతిబింబిస్తోంది. ఇది విద్యాసంస్థలకు సంబంధించిందే అయినా మున్ముందు మిలిటరీ, నావీ అకాడమీ ప్రవేశాల్లోనూ, కార్పొరేట్ రంగ ఎంపికల్లోనూ అమలు చేసే పరిస్థితులు ఏర్పడొచ్చు. ఈ విధానంవల్ల లాభపడు తున్న ఆసియన్ అమెరికన్లను, శ్వేతజాతి మహిళలను కూడగట్టడంలో నల్లజాతీయులు విఫలం కావటంవల్లే ఈ తీర్పు వెలువడిందని కొందరి విశ్లేషణ. ఆ మాటెలావున్నా మొత్తంగా అమెరికన్ సమాజంలో జాతిపరమైన సంకుచితత్వం పెరుగుతోందనటానికి ఈ తీర్పు నిదర్శనం. -
US: యూనివర్సిటీల్లో ఆ రిజర్వేషన్లపై నిషేధం
వాషింగ్టన్ డీసీ: అమెరికా సుప్రీం కోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. యూనివర్సిటీల అడ్మిషన్లలో జాతి సంబంధిత రిజర్వేషన్లపై నిషేధం విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఆఫ్రో-అమెరికన్లు, ఇతర మైనారిటీలకు విద్యావకాశాలను పెంపొందించే ఉద్దేశంతో యూనివర్సిటీ అడ్మిషన్లను అమలు చేస్తున్నారు. 1960 సంవత్సరం నుంచి ఇవి అమలు అవుతున్నాయి. ఈ మేరకు అడ్మిషన్ విధానాల్లో జాతి, తెగ పదాలను ప్రధానంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే.. ఇకపై ఆ పదాలను ఉపయోగించడానికి వీల్లేదని.. ఆ పదాలను నిషేధిస్తూ అమెరికా అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. 👨⚖️ ఈ మేరకు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆ సంచలన తీర్పు చదువుతూ.. ఒక స్టూడెంట్ను అతని అనుభవాల ఆధారంగా పరిగణించబడాలిగానీ జాతి ఆధారంగా కాదు. యూనివర్సిటీలలో ఇకపై జాతి సంబంధిత అడ్మిషన్లు కొనసాగడానికి వీల్లేదు అంటూ తీర్పు కాపీని చదివి వినిపించారాయన. 👉 అమెరికాలో అత్యంత పురాతనమైన ఉన్నత విద్యాసంస్థలు హార్వర్డ్ యూనివర్సిటీ, యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా (UNC)ల్లో అడ్మిషన్ల విధానంలో పారదర్శకత కోరుతూ ఓ విద్యార్థి సంఘం వేసిన పిటిషన్ ఆధారంగా అమెరికా సుప్రీం కోర్టు ఈ తీర్పు వెల్లడించింది. 👉 ఒకప్పుడు అఫ్రో-అమెరికన్ల పట్ల విపరీతమైన జాతి వివక్ష కొనసాగేది. ఈ క్రమంలోనే అమెరికా ఉన్నత విద్యాసంస్థల్లో వాళ్లకు అవకాశాలు దక్కేవి కావు. 👉 అయితే.. 1960లో జరిగిన పౌర హక్కుల ఉద్యమం ఆధారంగా యూనివర్సిటీలలో నల్ల జాతి పౌరులకు,ఇతర మైనారీటీలకు విద్యావకాశాలు అందజేసే ఉద్దేశంతో పలు నూతన విధానాలు తీసుకొచ్చారు. 👉 అయితే.. జాతి సంబంధిత అడ్మిషన్ విధానాల వల్ల సమానత్వానికి తావు లేకుండా పోయిందని, పైగా మెరుగైన అర్హత కలిగిన ఆసియా అమెరికన్లకు అవకాశాలు దూరం అవుతున్నాయని సదరు గ్రూప్ సుప్రీం ముందు వాదించింది. 👉 నల్లజాతి అమెరికన్లకు చోటు కల్పించేందుకు ఆసియన్ల పట్ల వివక్ష చూపుతున్నారన్నది ప్రధాన అభ్యంతరం చాలా కాలంగా కొనసాగుతోందక్కడ. 👨⚖️ తాజాగా.. సుప్రీం కోర్టు ధర్మాసనంలోని 6-3 న్యాయమూర్తుల మెజార్టీ సదరు రెండు యూనివర్సిటీలలో జాతి సంబంధిత అడ్మిషన్లు చెల్లవంటూ తీర్పు ఇచ్చింది. ట్రంప్ తప్పా అంతా ఆగ్రహం యూనివర్శిటీ అడ్మిషన్లలో రిజర్వేషన్లపై నిషేధం తీర్పుపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తీర్పుతో తాను విబేధిస్తున్నట్లు తెలిపారాయన. అమెరికాలో వివక్ష ఇంకా మనుగడలోనే ఉందన్న విషయాన్ని గుర్తు చేశారాయన. జాతుల పరంగా వైవిధ్యం ఉన్నప్పుడే అమెరికా విద్యాసంస్థలు బలోపేతంగా ఉంటాయని తాను భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పు తుది నిర్ణయం కాదంటూ ప్రధానంగా ప్రస్తావించారాయన. The odds have been stacked against working people for too long – we cannot let today's Supreme Court decision effectively ending affirmative action in higher education take us backwards. We can and must do better. pic.twitter.com/Myy3D5jUGH — President Biden (@POTUS) June 30, 2023 సుప్రీం తీర్పు.. భవిష్యత్తు తరాలకు అవకాశాలను నిరాకరించడమే అవుతుందని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ అభిప్రాయపడ్డారు. తీర్పును వర్ణాంధత్వం అంటూ అభివర్ణించిన ఆమె.. దేశాన్ని వెనక్కి తీసుకెళ్లడమే అంటూ తీవ్రంగా వ్యతిరేకించారామె. Today’s Supreme Court decision in Students for Fair Admissions v. Harvard and Students for Fair Admissions v. University of North Carolina is a step backward for our nation. Read my full statement. pic.twitter.com/pIBCmVMr6d — Vice President Kamala Harris (@VP) June 29, 2023 రిజర్వేషన్లపై నిషేధం విధిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పుపై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మండిపడ్డారు. అందరికీ అవకాశాల పేరిటే ఈ విధానాలు తెరపైకి వచ్చాయని.. తద్వారానే తాను, తన భార్య మిచెల్లీ లాంటి వాళ్లం వృద్ధిలోకి వచ్చామని అంటున్నారాయన. ఆ విధానాలు తెచ్చిన ఉద్దేశ్యాన్ని న్యాయవ్యవస్థ గుర్తించి ఉంటే బాగుండేదని అంటున్నారాయన. Affirmative action was never a complete answer in the drive towards a more just society. But for generations of students who had been systematically excluded from most of America’s key institutions—it gave us the chance to show we more than deserved a seat at the table. In the… https://t.co/Kr0ODATEq3 — Barack Obama (@BarackObama) June 29, 2023 ట్రంప్ మాత్రం ఇలా.. ఇది గొప్ప శుభదినం అంటూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన ఆయన.. సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ సైతం ఉంచారు. అమెరికాకు ఇది గొప్ప రోజు. ఇది ప్రతి ఒక్కరూ ఎదురుచూసిన.. ఆశించిన తీర్పు. దీని ఫలితం అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలోని ఇతర దేశాలతో మనల్ని పోటీగా ఉంచుతుంది అంటూ ట్రూత్‌సోషల్‌లో పోస్ట్ చేశారాయన. -
సుప్రీంకోర్టులో ట్రంప్‌కు చుక్కెదురు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన కాలంలో రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ బహిర్గతం చేయని ఆరేళ్ల ట్యాక్స్ రిటర్న్ వివరాలను పొందే హక్కు అమెరికా పార్లమెంట్ కమిటీకి ఉందంటూ ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది. దీంతో ఇన్నాళ్లూ ట్యాక్స్ రిటర్స్లను బయటపెట్టని ట్రంప్‌కు సమస్యలు ఎదురుకానున్నాయి. 2015–2020 కాలానికి సంబంధించి ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారం సహా స్థిరచరాస్తుల ట్యాక్స్ రిటర్న్‌ల వివరాలను బహిర్గతంచేయలేదు. ట్రంప్ పన్ను చెల్లింపుల్లో అవకతవకలు ఉన్నాయంటూ హౌజ్ వేస్ అండ్ మీన్స్ కమిటీ ఆరోపించింది. కమిటీ దూకుడును అడ్డుకునేందుకు ట్రంప్ కింది కోర్టును ఆశ్రయించారు. అక్కడ ట్రంప్‌కు చుక్కెదురైంది. -
వారికి స్వేచ్ఛ లేదా?
దాదాపు అర్ధశతాబ్దం క్రితం అమెరికా అంతటా మహిళలకు దక్కిన వరం అది. 1973లో ‘రో వర్సెస్ వేడ్’ కేసులో తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంతో ఆ దేశమంతటా గర్భస్రావం చట్టబద్ధమైంది. అలా 22 నుంచి 24 వారాల లోపు గర్భస్రావం చేయించుకోవడానికి దక్కిన హక్కు ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టు నిర్ణయంతో మహిళలకు దూరమవుతోంది. ఈ తిరోగమన చర్యతో లావోస్, ఫిలిప్పైన్స్, ఈజిప్ట్, ఇరాక్‌ల దోవలో గర్భస్రావాన్ని చట్టవిరుద్ధం చేసిన దేశాల జాబితాలో అమెరికా చేరింది. ఇప్పుడిక అమెరికాలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం గర్భస్రావ హక్కుపై సొంత నిర్ణయాలు తీసుకొనే వీలు చిక్కింది. జూన్ 24న కోర్టు ఇచ్చిన ఈ ఆదేశం స్త్రీ స్వేచ్ఛనూ, సొంత శరీరంపై స్త్రీలకున్న సహజమైన హక్కునూ కాలరాయడమే అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్త చర్చ. గర్భస్రావాలపై నిషేధం లైంగిక సమానత్వానికీ, మహిళల మానవహక్కులకూ గొడ్డలిపెట్టు అని ఐరాస సహా అంతర్జాతీయ మహిళా సంఘాలు ఎలుగెత్తుతున్నాయి. సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం ‘కోర్టు తాజా నిర్ణయం దురదృష్టకరం, ఇది దేశానికి దుర్దినం’ అన్నారంటే విషయ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అమెరికా కోర్టు 6–3 మెజారిటీతో ఇచ్చిన ఆదేశాన్ని ఆసరాగా చేసుకొని, అక్కడ 50 రాష్ట్రాల్లో కనీసం 26 రాష్ట్రాల్లో గర్భస్రావంపై నిషేధాలొచ్చే సూచనలున్నాయి. రిపబ్లికన్ల హయాంలోని రాష్ట్రాలు తక్షణమే గర్భస్రావాన్ని నిషేధించడమో, లేదంటే బోలెడన్ని ఆంక్షలు విధించడమో చేయనున్నాయి. మరోపక్క డెమోక్రాట్ల సారథ్యంలోని పలు రాష్ట్రాలేమో మహిళల గర్భస్రావ హక్కును కాపాడే చర్యలకు సిద్ధమవుతున్నాయి. వెరసి, అమెరికాలో ఆ యా రాష్ట్రాలలోని పాలకపార్టీని బట్టి స్త్రీ స్వేచ్ఛ ఉండే పరిస్థితి వచ్చిందన్న మాట. అయితే, కొత్త నియంత్రణల దెబ్బతో ఇక ఎవరూ గర్భ స్రావం చేయించుకోకుండా ఆగిపోతారని అనుకుంటే అమాయకత్వమే. దొంగచాటు గర్భస్రావాలు పెరిగి, గర్భిణుల ప్రాణాలకే ప్రమాదం పెరిగే అవకాశాలెక్కువ. ఐరాస ప్రతినిధుల అభిప్రాయమూ అదే. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న గర్భస్రావాల్లో నూటికి 45 గర్భస్రావాలు సురక్షితమైనవి కావు. అవి గర్భిణుల మరణానికి దారి తీస్తున్నాయని సాక్షాత్తూ ఐరాస పాపులేషన్ ఫండ్ లెక్క. నిజానికి, కోర్టు తాజా నిర్ణయం తాలూకు ముసాయిదా మే నెలలోనే బయటకు పొక్కింది. అమెరికన్ స్త్రీలకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన ఓ ప్రాథమికమైన హక్కుకు ముప్పు వాటిల్లనుందని అప్పటి నుంచీ చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు కోర్టు నిర్ణయం అధికారికంగా వచ్చేసింది గనక, అటు రాజకీయంగానూ, ఇటు ప్రభుత్వ విధానపరంగానూ బైడెన్ వ్యూహాలు పరీక్షను ఎదుర్కోక తప్పదు. కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న నిరసనను రాజకీయంగా ఉపయోగించుకొని, నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని బైడెన్, ఇతర డెమోక్రాట్లు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా గర్భస్రావ హక్కు కల్పించేలా చేయడం కష్టమే కానీ, వివిధ రాష్ట్రాల్లో డెమోక్రాట్లు విజయాలు సాధిస్తే గనక రిపబ్లికన్ల గర్భస్రావ నిషేధ యత్నాలను కొంత నియంత్రించవచ్చు. బైడెన్ వర్గం ఆ మాటే ప్రచారంలో పెట్టనుంది. కానీ, మధ్యంతర ఎన్నికల తర్వాత అమెరికన్ పార్లమెంటులోని రెండు సభల్లోనూ రిపబ్లికన్లదే మెజారిటీ కావచ్చని ఓ అంచనా. ఛాందస సంప్రదాయవాది అయిన ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ అధ్యక్షులైనా ఆశ్చర్యం లేదని వార్త. అంటే, గర్భస్రావమే కాదు... ఇంకా అనేక అంశాల్లో అమెరికా పాత కాలపు దురభిప్రాయాల్లోకి తిరోగమిస్తుందా? గర్భస్రావ హక్కుపై పోరు అమెరికాలో ఓ భావోద్వేగభరిత సైద్ధాంతిక యుద్ధం. కొన్ని దశాబ్దాలుగా కన్జర్వేటివ్‌లు గర్భస్రావ హక్కు నిర్ణయాన్ని తిరగదోడేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. మిగతావాళ్ళు ప్రతిఘటిస్తూనే ఉన్నారు. తీరా కోర్టులో కన్జర్వేటివ్‌ల ఆధిక్యంతో ఇప్పుడు గర్భస్రావ హక్కును తొలగించేందుకు సందు చిక్కింది. ఇదంతా ఘనత వహించిన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ చలవే. ఎందుకంటే, ఆయనే తన హయాంలో ముగ్గురు కన్జర్వేటివ్ సుప్రీమ్ కోర్టు జడ్జీలను నియమించారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఆ ముగ్గురూ తాజాగా గర్భస్రావ హక్కును కొట్టిపారేసేందుకు ఓటేశారట. కేవలం ఆరే ఆరుగురు జడ్జీలు మొత్తం అమెరికన్ స్త్రీ జాతి శారీరక స్వేచ్ఛపై సమ్మెట దెబ్బ వేసి, వారి తలరాతను మార్చేయడం అత్యంత విషాదం. అమానవీయం. లైంగిక, పునరుత్పాదక ఆరోగ్యం, హక్కులనేవి ప్రపంచ వ్యాప్తంగా స్త్రీ సమానత్వానికీ, స్వేచ్ఛకూ, ఎంపిక హక్కుకూ సంబంధించిన అంశాలు. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకొనే అమెరికాలోనే ఆ హక్కులపై నియంత్రణ పెట్టారంటే ఏమనుకోవాలి! ఎవరైనా సరే తుపాకీలు యథేచ్ఛగా కొనుక్కోవడానికి అవకాశమిస్తున్న అగ్రరాజ్యం... తీరా గర్భాన్ని కొనసాగించాలా, వద్దా అని నిర్ణయించుకొనే హక్కు మాత్రం స్త్రీలకు లేదనడమే విరోధాభాస. ఇంకా చెప్పాలంటే, ఒక దేశం ఆర్థిక పురోగమించినంత మాత్రాన ఆ దేశంలో పౌర స్వేచ్ఛ, హక్కులు పరిరక్షితమవుతాయని అనుకుంటే పొరపాటే అని మరోమారు ఋజువైంది. ఆదర్శంగా నిలవాల్సిన భారీ ప్రజాస్వామ్య దేశంలోని వ్యవహారం రేపు మిగతా ప్రపంచమూ ఆదర్శంగా తీసుకుంటే, అది మహిళలకు జరిగే మహాపచారం. అందుకే, పాశ్చాత్య ప్రపంచం తిరోగమిస్తుంటే, మన దేశం మాత్రం గర్భస్రావం, అద్దె గర్భం, బాల్యవివాహాల నిరోధం లాంటి అంశాల్లో మెరుగైన చట్టాలతో పురోగమిస్తోందని కేంద్ర పాలకులు జబ్బలు చరుచుకోవడం అర్థం చేసుకోదగినదే! -
అంతా దైవ నిర్ణయం.. కాదు కాదు నావల్లే: ట్రంప్
వాషింగ్టన్: అమెరికాలో అబార్షన్ హక్కుల రద్దు నిర్ణయంపై సుప్రీం కోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై 50 రాష్ట్రాల్లోనూ నిరసనలు కొనసాగుతున్న వేళ.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అమెరికా సుప్రీం కోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. ఇది దైవ నిర్ణయమంటూ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యనించిన ఆయన.. కాసేపటికే ఆ క్రెడిట్ తనకే దక్కాలంటూ కామెంట్ చేశాడు. రాజ్యాంగాన్ని అనుసరించడం అంటే ఇదే. చాలా కాలం క్రితం ఇవ్వాల్సిన హక్కులంటూ.. అంటూ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. ఇక తాజా తీర్పు ఇచ్చిన న్యాయమూర్తుల్లో ముగ్గురిని ట్రంప్ అధికారంలో ఉండగానే నియమించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. అది తన చేతుల్లో లేదని, అంతా దైవ నిర్ణయమని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. అయితే.. కాసేపటికే మాట మార్చి.. అంతా తనకే దక్కాలంటూ కామెంట్ చేశారు. ‘నేటి నిర్ణయం(కోర్టు తీర్పు).. ఒక తరంలో జీవితానికి అతిపెద్ద విజయం. నేను వాగ్దానం చేసినట్లుగా అన్నింటినీ అందించడం వల్లనే ఇది సాధ్యమైంది. ముగ్గురు బలమైన రాజ్యాంగకర్తలను యునైటెడ్ స్టేట్స్ సుప్రీం కోర్ట్‌కు నేనే ధృవీకరించాను. అది గౌరవంగా భావిస్తున్నా. నా వల్లే ఇప్పుడు ఇలా తీర్పు రావడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నాడు ట్రంప్. సుప్రీం కోర్టులో కన్జర్వేటివ్ మెజార్టీ కృషిలో.. ట్రంప్ ఎంతో కీలకంగా వ్యవహరించారు. నీల్ గోర్సచ్, బ్రెట్ కవానఫ్, అమీ కోనీ బారెట్ట్.. శుక్రవారం నాటి తీర్పులో క్రియాశీలకంగా వ్యవహరించాడు. తాజా తీర్పుతో.. ఇక నుంచి అమెరికా రాష్ట్రాలు అబార్షన్ చట్టం విషయంలో సొంత నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. చదవండి: అబార్షన్ హక్కుల రద్దు.. అమెరికాకు ఇది చీకటి దినం -
అబార్షన్ హక్కుల రద్దు.. కోర్టు తీర్పుపై నిరసన జ్వాలలు
వాషింగ్టన్: అబార్షన్‌కు రాజ్యాంగ రక్షణ కల్పించే చట్టాన్ని అమెరికా సుప్రీం కోర్టు రద్దు చేసింది. సుమారు యాభై ఏళ్ల కిందటి ఉత్తర్వును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా.. దేశంలోని దాదాపు సగం రాష్ట్రాలు.. అబార్షన్‌పై నిషేధం విధించేందుకు, కఠిన చట్టాలు చేసేందుకు అధికారం పొందనున్నాయి. దేశవ్యాప్తంగా అబార్షన్‌ను చట్టబద్ధం చేసిన 1973 నాటి మైలురాయి నిర్ణయం ‘రోయ్ వర్సెస్ వేడ్’ని సుప్రీం కోర్టు రద్దు చేసిన నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్ సహా పలువురు ప్రపంచ నేతలు స్పందించారు ‘‘ఇది అమెరికాకు విచారకరమైన రోజు’’ అని బైడెన్ అభివర్ణించారు. ‘‘రో వెళ్ళిపోవడంతో.. దేశంలోని మహిళల ఆరోగ్యం, జీవితం ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి’’ అని ఒక ప్రకటన విడుదల చేశారాయన. ఇక అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబాబా సైతం సుప్రీం కోర్టును తప్పుబట్టారు. ఈ తీర్పు స్వేచ్ఛపై దాడిగా పేర్కొన్నారాయన. ఇవాళ సుప్రీంకోర్టు దాదాపు 50 సంవత్సరాల పూర్వాపరాలను తిప్పికొట్టడమే కాకుండా, రాజకీయ నాయకులు, సిద్ధాంతకర్తల ఇష్టానుసారంగా ఎవరైనా తీసుకోగల అత్యంత తీవ్రమైన వ్యక్తిగత నిర్ణయాన్ని - లక్షల మంది అమెరికన్ల ఆవశ్యక స్వేచ్ఛపై దాడి చేసింది అంటూ ట్విటర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. తీర్పుపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందిస్తూ.. భయానకంగా ఉందంటూ తీర్పుపై కామెంట్ చేశారు. గర్భస్రావానికి చట్టబద్ధమైన హక్కును కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న మిలియన్ల మంది అమెరికన్ మహిళల భయం, కోపాన్ని నేను ఊహించలేను’ అంటూ ఓ ట్వీట్ చేశారు. అమెరికా మాజీ ప్రథమ పౌరురాలు మిషెల్లీ ఒబామా, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తదితర ప్రముఖులు.. అమెరికా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా మహిళా ఆరోగ్య ప్రాముఖ్యత తగ్గడంతో పాటు వాళ్ల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని పలువురు ప్రముఖులు సైతం వ్యాఖ్యలు చేస్తున్నారు. రోయ్ 1973 ప్రకారం.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొదటి రెండు త్రైమాసికాల్లో అబార్షన్లకు అనుమతిస్తారు. అయితే తాజా సుప్రీం కోర్టు రద్దు నిర్ణయంతో.. సగానికి సగం పైగా రాష్ట్రాలు కఠిన అబార్షన్ చట్టం తీసుకొచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తీర్పు ఇచ్చిన జస్టిస్ శ్యామ్యూయెల్ అలిటోకు వ్యతిరేకంగా అమెరికాతో పాటు పలు దేశాల్లో ఇంటర్నెట్ నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. Abortion rights protesters stand in front of city hall in San Francisco, Calif., on Friday, June 24, 2022. People across the country took to the streets to protest after the U.S. Supreme Court overturned Roe v. Wade. #RoeVsWade #abortionrights #sanfrancisco pic.twitter.com/SRYmWuoIPf — Jose Carlos Fajardo (@jcfphotog) June 25, 2022 Today, the Supreme Court not only reversed nearly 50 years of precedent, it relegated the most intensely personal decision someone can make to the whims of politicians and ideologues—attacking the essential freedoms of millions of Americans. — Barack Obama (@BarackObama) June 24, 2022 Reversal of abortion rights #Roe vs Wade horrific indeed. — Deepa Mehta (@IamDeepaMehta) June 25, 2022 Safe #abortion is health care. It saves lives. Restricting it drives women and girls towards unsafe abortions, resulting in complications, even death. The evidence is irrefutable. https://t.co/EB5BsKIxG7 #RoeVsWade — Tedros Adhanom Ghebreyesus (@DrTedros) June 24, 2022 -
బైడెన్‌కు ఎదురుదెబ్బ.. తీవ్ర నిరాశ చెందానంటూ ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు.. సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. న్యూయార్క్ పౌరులు తుపాకుల్ని తమ వెంట తీసుకెళ్లేందుకు(బహిరంగ ప్రదేశాల్లో కూడా) మార్గం సుగమం చేస్తూ.. గురువారం ఆదేశాలు జారీ చేసింది అమెరికా అత్యున్నత న్యాయస్థానం. ఈ నేపథ్యంలో.. సుప్రీం ఆదేశాలపై తీవ్ర నిరాశ చెందినట్లు అధ్యక్షుడు బైడెన్ ఒక ప్రకటన విడుదల చేశారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగానికి, ఇంగిత జ్ఞానానికి (కామన్సెన్స్) విరుద్ధంగా ఉంది. ఈ తీర్పు అమెరికన్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టేది అని వ్యాఖ్యానించారయన. అయితే తీర్పు ఎలా ఉన్నా.. రాష్ట్రాలు మాత్రం తమ తమ పరిధిలో తుపాకీ నియంత్రణ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని, తద్వారా కాల్పుల నేరాలకు కట్టడి వేయాలని కోరారు ఆయన. న్యూయార్క్‌లో పౌరులు తుపాకీ వెంట తీసుకెళ్లే హక్కులపై ఆంక్షలు విధిస్తూ ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు. అయితే.. ఆ చట్టాన్ని కొట్టేస్తూ గురువారం సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం.. అమెరికన్లకు తుపాకీలను మోసుకెళ్లే ప్రాథమిక హక్కు ఉంటుందని ప్రభుత్వానికి గుర్తు చేసింది సుప్రీం కోర్టు. న్యూయార్క్ చట్టం ప్రకారం.. సాధారణ పౌరులు తుపాకులను మోసుకెళ్లే వాళ్లు.. సరైన కారణం, వివరణలు ఇవ్వాల్సి ఉంటుంది. అది ప్రత్యేక అవసరమా? లేదంటే ఆత్మ రక్షణ అన్న విషయం మీద కూడా స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. బైడెన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగలడంతో నేషనల్ రైఫిల్ అసోషియేషన్ సంబురాలు చేసుకుంటోంది. 2020 లెక్కల ప్రకారం.. అమెరికా పౌరుల దగ్గర 390 మిలియన్ల తుపాకులు ఉన్నాయి. సుమారు 45 వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. Gun Safety Billకు ఆమోదం ఇదిలా ఉంటే.. సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలినా బైడెన్ సర్కార్ మాత్రం గన్ వయలెన్స్ కట్టడికి ఓ ముందడుగు వేసింది. గురువారం రాత్రి ద్వైపాక్షిక గన్ సేఫ్టీ బిల్లుకు ఆమోదం తెలిపింది అమెరికా సెనేట్. అమెరికాలో పేట్రేగిపోతున్న తుపాకీ హింస నేపథ్యంలోనే.. కట్టడి దిశగా ఈ బిల్లు తీసుకొచ్చింది బైడెన్ ప్రభుత్వం. గత మూడు దశాబ్దాల తర్వాత తుపాకీ హింస కట్టడికి.. ఇదే అతిపెద్ద సంస్కరణ కావడం విశేషం. ప్రస్తుతం ఈ బిల్లు.. ఓటింగ్‌కు వెళ్లాల్సి ఉంది. వీలైనంత త్వరగా శుక్రవారం లోపే ఈ బిల్లుకు ఆమోదం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
అబార్షన్ చట్టంపై అమెరికా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!
వాషింగ్టన్: అబార్షన్ హక్కులపై అమెరికాలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ముసాయిదా లీకవడంతో దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. ఆందోళనకారులు వాషింగ్టన్ డీసీలోని సర్వోన్నత న్యాయస్థానం భవనాన్ని చుట్టుముట్టారు. తమ హక్కులను కాలరాయవద్దంటూ నినాదాలు చేశారు. లీకైన ముసాయిదాలో ఏముందంటే.. అబార్షన్ హక్కులపై 1973లో రో వర్సెస్ వేడ్ కేసులో ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును జస్టిస్ శామ్యూల్ ఆలిటో రద్దు చేస్తున్నట్టు లీకైన ముసాయిదాలో ఉంది. రో వర్సెస్ వేడ్ కేసులో ఇచ్చిన వివరణ చాలా బలహీనంగా ఉందని, దాని పరిణామాలు ప్రమాదకరంగా ఉన్నట్లు జస్టిస్ అలిటో అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులు ఇస్తున్న తీర్పు సరిగా లేదని లీకైన డాక్యుమెంట్‌పై విమర్శలు వస్తున్నాయి. అబార్షన్ హక్కులపై తీర్పు లీకైన సమాచారంపై సుప్రీంకోర్టు కానీ వైట్‌హౌజ్ కానీ ఇంతవరకు స్పందించలేదు. దీనికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని ఎన్నికైన ప్రతినిధులకు ఇవ్వాలన్న అభిప్రాయాన్ని ఆ ముసాయిదాలో వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సోమవారం కొందరు సుప్రీంకోర్టు ముందు నిరసన చేపట్టారు. దీంతో ఆందోళనలు తారా స్థాయికి చేరుకున్నాయి. కాగా జూలైలో అబార్షన్ హక్కులపై అమెరికా సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించాల్సి ఉంది. చదవండి: నిరసనకారులను కాల్చి చంపేయమని ఆదేశించిన ట్రంప్ -
అమెరికా సుప్రీంకోర్టుకు బాంబు బెదిరింపు
వాషింగ్టన్: అమెరికా సుప్రీంకోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు సుప్రీంకోర్టును ఖాళీ చేయించారు. బాంబ్ స్క్వాడ్‌ను రప్పించి సుప్రీంకోర్టులో తనిఖీలు చేపట్టారు. కాగా జో బైడెన్ 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఇది జరగడం ఆసక్తికరంగా మారింది. కాగా భారత కాలామానం ప్రకారం రాత్రి 10.30గంటలకు క్యాపిటల్ హిల్ భవనంలో జో బైడెన్ 46వ అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. కాగా జో బైడెన్‌తో చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించనున్నారు. -
పోరాటం ముగియలేదు: ట్రంప్
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై తన పోరాటం ఇంకా ముగియలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. స్వింగ్ స్టేట్స్లో అక్రమాలకు సంబంధించి ట్రంప్ తరఫున వేసిన ఒక వ్యాజ్యాన్ని తాజాగా సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆయన ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, అందువల్లనే తాను ఓడిపోయానని ట్రంప్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. పెన్సిల్వేనియా, మిషిగన్, జార్జియాల్లో తానే గెలిచానని ట్రంప్ వాదిస్తున్నారు. ‘అమెరికా చరిత్రలోనే అత్యంత అవినీతిమయ ఎన్నికలు’ అని ఆదివారం ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. ‘ఇంత అవినీతి, ఇన్ని అక్రమాలు జరిగిన ఎన్నికల్లో ఫలితాలను ఎలా నిర్ధారిస్తారు?’ అని మరో ట్వీట్లో ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలను కోర్టుల్లో సవాలు చేసేందుకు వీలైన సమయం తన బృందానికి లభించలేదని ఒక ఇంటర్వ్యూలో ఆరోపించారు. ‘మాకు చాలా తక్కువ సమయం ఇచ్చారు. అయినా, మేం వదల్లేదు. చాలా అక్రమాలను వెలికితీసాం’ అని వ్యాఖ్యానించారు. చనిపోయిన వారి పేరుపై కూడా ఓట్లు వేశారని ఆరోపించారు. మరోవైపు ట్రంప్‌కు మద్దతుగా వారాంతంలో ఆయన మద్దతుదారులు వాషింగ్టన్లో నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ట్రంప్ మద్దతుదారులకు, ట్రంప్‌ను వ్యతిరేకించేవారికి మధ్య శనివారం సాయంత్రం చెదురుముదురు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణలకు సంబంధించి 23 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైట్‌హౌస్‌ని శానిటైజ్ చెయ్యండి.. వైట్‌హౌస్‌ను పరిశుభ్రంగా శానిటైజ్ చెయ్యాలని కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. అధ్యక్షుడు ట్రంప్ తన వ్యక్తిగత సిబ్బందితో వైట్ హౌస్ వీడడానికి, బైడెన్ ప్రమాణ స్వీకారం చేశాక రావడానికి మధ్య అయిదు గంటల సమయం ఉంటుందని, ఆ సమయంలోనే వైట్‌హౌస్ అంతా పరిశుభ్రం చేయాలంటూ బైడెన్ ఆదేశించారని వైట్‌హౌస్ అధికారి కేట్ ఆండర్సన్ బ్రోయర్ వెల్లడించారు. -
నేడే యూఎస్ ఎలక్టోరల్స్ సమావేశం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా నవంబర్ ఎన్నికలో గెలుపొందిన ఎలక్టోరల్స్ సోమవారం సమావేశమై అధినేతను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే ఎలక్టోరల్స్‌లో మెజార్టీ వచ్చినందున డెమొక్రాటిక్ అ«భ్యర్థి జో బైడెన్ ఎంపిక లాంఛనమేనని నిపుణులు భావిస్తున్నారు. ఒకపక్క ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తానే విజేతనంటూ పట్టిన పట్టు వీడకపోవడం, ఎలక్టోరల్స్‌ను తనకే ఓట్ వేయాలని కోరడం, సుప్రీంకోర్టును ఆశ్రయించినా నిరాశ ఎదురవడం, రాజధానిలో వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు చేరడం వంటి పరిస్థితుల్లో ఎలక్టోరల్ కాలేజీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఎలక్టోరల్ కాలేజీ అంటే..? అమెరికాలో ప్రతీ రాష్ట్రానికి జనాభా ఆధారంగా ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల్ని కేటాయిస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాపులర్ ఓట్లు ఎన్ని వచ్చినప్పటికీ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వారే అధ్యక్ష పీఠం దక్కించుకుంటారు. బ్యాలెట్ పత్రాల ద్వారా అధ్యక్షుడు, ఉపాధ్యక్షులకు ఓటు వేస్తారు. దేశం మొత్తమ్మీద 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉంటే 270, అంత కంటే ఎక్కువ వచ్చిన వారే విజేత. ఈ సారి బైడెన్‌కు 306 ఓట్లు, ట్రంప్ 232 ఓట్లు వచ్చాయి. అధ్యక్షుడిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల్ని డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీలే నామినేట్ చేస్తాయి. వారి ఎంపిక విధానం ప్రతీ రాష్ట్రానికి మారిపోతుంది. ఓటు ఎవరికి వేయాలి ? ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ తమ రాష్ట్రంలో అత్యధికంగా పాపులర్ ఓట్లు సాధించిన అభ్యర్థికే వారు ఓటు వేసి తీరాలి. ఎవరైనా అలా ఓటు వెయ్యడానికి నిరాకరిస్తే వెంటనే పార్టీకి ఆ ప్రతినిధిని మార్చే అధికారం ఉంటుంది. 2016 ఎన్నికల్లో ఏకంగా 10 మంది ప్రతినిధులు ఇతర పార్టీ అభ్యర్థికి ఓటు వెయ్యడానికి ప్రయత్నాలు చేసినా అవి కొనసాగలేదు. ఈ సారి కూడా అలా ఎవరైనా మొరాయిస్తారేమోరేనన్న ఉత్కంఠ నెలకొంది. వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా నవంబర్ ఎన్నికలో గెలుపొందిన ఎలక్టోరల్స్ సోమవారం సమావేశమై అధినేతను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే ఎలక్టోరల్స్‌లో మెజార్టీ వచ్చినందున డెమొక్రాటిక్ అ«భ్యర్థి జో బైడెన్ ఎంపిక లాంఛనమేనని నిపుణులు భావిస్తున్నారు. ఒకపక్క ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తానే విజేతనంటూ పట్టిన పట్టు వీడకపోవడం, ఎలక్టోరల్స్‌ను తనకే ఓట్ వేయాలని కోరడం, సుప్రీంకోర్టును ఆశ్రయించినా నిరాశ ఎదురవడం, రాజధానిలో వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు చేరడం వంటి పరిస్థితుల్లో ఎలక్టోరల్ కాలేజీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఎలక్టోరల్ కాలేజీ అంటే..? అమెరికాలో ప్రతీ రాష్ట్రానికి జనాభా ఆధారంగా ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల్ని కేటాయిస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాపులర్ ఓట్లు ఎన్ని వచ్చినప్పటికీ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వారే అధ్యక్ష పీఠం దక్కించుకుంటారు. బ్యాలెట్ పత్రాల ద్వారా అధ్యక్షుడు, ఉపాధ్యక్షులకు ఓటు వేస్తారు. దేశం మొత్తమ్మీద 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉంటే 270, అంత కంటే ఎక్కువ వచ్చిన వారే విజేత. ఈ సారి బైడెన్‌కు 306 ఓట్లు, ట్రంప్ 232 ఓట్లు వచ్చాయి. అధ్యక్షుడిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల్ని డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీలే నామినేట్ చేస్తాయి. వారి ఎంపిక విధానం ప్రతీ రాష్ట్రానికి మారిపోతుంది. ఓటు ఎవరికి వేయాలి ? ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ తమ రాష్ట్రంలో అత్యధికంగా పాపులర్ ఓట్లు సాధించిన అభ్యర్థికే వారు ఓటు వేసి తీరాలి. ఎవరైనా అలా ఓటు వెయ్యడానికి నిరాకరిస్తే వెంటనే పార్టీకి ఆ ప్రతినిధిని మార్చే అధికారం ఉంటుంది. 2016 ఎన్నికల్లో ఏకంగా 10 మంది ప్రతినిధులు ఇతర పార్టీ అభ్యర్థికి ఓటు వెయ్యడానికి ప్రయత్నాలు చేసినా అవి కొనసాగలేదు. ఈ సారి కూడా అలా ఎవరైనా మొరాయిస్తారేమోరేనన్న ఉత్కంఠ నెలకొంది. జనవరి 6న కాంగ్రెస్ ఉభయ సభల సమావేశంలో ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను లెక్కిస్తారు. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ ఓటింగ్‌పై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ప్రతినిధుల సభ, సెనేట్ ప్రత్యేకంగా సమావేశమై చర్చిస్తుంది. ఆ తర్వాత విజేతను ప్రకటిస్తారు. కొత్త అధ్యక్షుడు జనవరి 20న ప్రమాణ స్వీకారం చేస్తారు. -
వైట్‌హౌస్ నుంచి వెళ్లాల్సిందే
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌ను వీడి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అ««ధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆయనకి ఎదురు దెబ్బ తగిలింది. జార్జియా, మిషిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల్ని నిలిపివేయాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు శామ్యూల్ అలిటో, క్లారెన్స్ థామస్‌లు శుక్రవారం కొట్టేశారు. అవకతవకలు జరిగాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. సోమవారం సమావేశం కానున్న ఎలోక్టరల్ కాలేజీ బైడెన్‌ను ఎన్నుకుంటే ఇక ట్రంప్ వైట్‌హౌస్‌ను వీడాల్సి ఉంటుంది. దేశాన్నే ఇరుకున పెట్టారు : ట్రంప్ సుప్రీం కోర్టు తీర్పు దేశాన్నే ఇరుకున పెట్టేలా ఉందంటూ ట్రంప్ మండిపడ్డారు. ఇలాంటి తీర్పు ఇవ్వడం న్యాయాన్ని అవమానిం చడమేనన్నారట్వీట్ చేశారు. వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం అగ్రరాజ్యంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతి ఇవ్వడంతో వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ‘‘తొమ్మిది నెలల్లో సురక్షితమైన, సామర్థ్యమైన వ్యాక్సిన్‌ను రూపొందించాం’’ అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని నిర్మూలించే రోజులు దగ్గర పడుతున్నాయన్న ట్రంప్ ఈ వ్యాక్సిన్ లక్షలాది మందికి ప్రాణం పోస్తుందని అన్నారు. వ్యాక్సిన్ వినియోగానికి ఎఫ్‌డీఏ అనుమతినివ్వడం తనని ఉద్వేగానికి గురి చేసిందని ట్రంప్ అన్నారు. వ్యాక్సిన్‌పై విశ్వాసం ఉంచండి: బైడెన్ కరోనా వ్యాక్సిన్‌పై ఎలాంటి సందేహాలు పెట్టుకోనక్కర్లేదని, పూర్తి విశ్వాసంతో వ్యాక్సిన్ వేయించుకోవాలని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎలాంటి రాజకీయ ప్రలోభాలకు లోను కాకుండా శాస్త్రవేత్తలు నాణ్యమైన టీకాను రూపొందించారని చెప్పారు. ఎఫ్‌డీఏ కమిషనర్ డాక్టర్ స్టీఫెన్ హన్పై వైట్‌హౌస్ ఒత్తిడి తీసుకురావడంతో ఫైజర్‌కు అనుమతులు లభించాయన్న ఆరోపణలున్న నేపథ్యంలో బైడెన్ వ్యాక్సిన్‌పై ఎలాంటి అనుమానాలు ఉండక్కర్లేదన్నారు. కరోనాతో అతలాకుతలమవుతున్న దేశాన్ని అన్ని విధాల ఆదుకోవడానికి శాస్త్రవేత్తలు ఎంతో శ్రమకోర్చి ఈ వ్యాక్సిన్‌ను రూపొందించారని చెప్పారు. వ్యాక్సిన్ తయారీలో పాల్గొన్న వారందరినీ అభినందించారు. -
ట్రంప్‌కు సుప్రీం షాక్.. ఆధారాల్లేవ్
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన డొనాల్డ్ ట్రంప్.. ఓటమిని అంగికరించకుండా మరోసారి అధ్యక్ష పదవిని చేపట్టాలనుకుంటున్నారు. ఇందుకోసం పోలింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తూ అమెరికా సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే రిపబ్లికన్లు వేసిన ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం తాజాగా కొట్టివేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఓటింగ్ జరిగినట్లు ఆధారాలేవి లేవని స్పష్టం చేసింది. దీంతో ట్రంప్‌కు వేరేదారి లేదని ఆయన ఓటమిని అంగీకరించక తప్పదని నిపుణులు చెబుతున్నారు. కాగా అధ్యక్ష ఎన్నికపై తాజాగా సుప్రీం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఎల్లుండి ఎలక్టోరల్ కాలేజీ డిసెంబర్ 14న సమావేశమై తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకోనుంది. దీంతో డెమొక్రటిక్ అభ్యర్థి జోబైడెన్‌ను అమెరికా అధ్యక్షుడిగా ఎలక్రోలర్ ప్రకటించినున్నట్లు స్పష్టమవుతుంది. (చదవండి: వ్యాక్సిన్‌కు ఎఫ్‌డీఏ ఆమోదం : ట్రంప్ సంచలనం) అయితే పిటిషన్లో.. అమెరికాలోని నాలుగు ప్రముఖ రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, జార్జియా, మిషిగన్, విస్కాన్సిన్లో లక్షలాది ఓట్లను రద్దు చేయాలని, ఓటింగ్ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ రిపబ్లికన్లు కోర్టులో పిటిషన్ వేశారు. కావునా అక్కడి ఎన్నికల ఫలితాలను నిలిపివేయాలంటూ టెక్సాస్‌కు చెందిన రిపబ్లికన్‌లో కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను 126 మంది రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యులు, 17 మంది అటార్నీ జనరళ్లు కలిసి ఈ పిటిసన్‌ను దాఖలు చేశారు. (చదవండి: ట్రంప్‌కు మరో పరాజయం) -
వివాదాల పరిష్కారానికి 3మార్గాలు
అమెరికాలో ఎన్నికల సందర్భంగా ఏర్పడే వివాదాల పరిష్కారానికి అమెరికన్ పార్లమెంటరీ వ్యవస్థలో తగిన ఏర్పాట్లు ఉన్నాయి. కోర్టు కేసుల ద్వారా పరిష్కరించుకోవడం వీటిల్లో ఒకటి మాత్రమే. ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ద్వారా అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు అమెరికా రాజ్యాంగం అనుమతిస్తుంది. ఈ మూడు మార్గాలపై సంక్షిప్తంగా... 2020 ఎన్నికల్లో డెమొక్రాట్లు అధికులు మెయిల్ ద్వారా ఓట్లు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇది రిపబ్లికన్ల కంటే ఎక్కువ సంఖ్యలో ఉంది. పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ఎన్నికల రోజు వరకూ ఈ మెయిల్ ఇన్ బ్యాలెట్ల లెక్కింపు జరగలేదు. విస్కాన్సిన్లో ఇరువురు అభ్యర్థుల మధ్య అంతరం చాలా తక్కువగా ఉండటంతో బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అంశంపై వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. రాష్ట్రాల్లో దాఖలైన వేర్వేరు కేసులన్నీ చివరకు అమెరికా సుప్రీంకోర్టు ముందుకు విచారణకు వస్తాయి. 2000లో రిపబ్లికన్ అభ్యర్థి జార్జ్ డబ్ల్యూ బుష్ ఫ్లోరిడాలో డెమొక్రటిక్ అభ్యర్థి అల్‌గోర్‌పై గెలిచింది ఇలాంటి కోర్టు కేసు సాయంతోనే. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవలే మరణించిన నేపథ్యంలో ట్రంప్ అమీ కోనీ బారెట్‌ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. బారెట్ నియామకం కూడా 6– 3 ఆధిక్యంతో జరగడం ట్రంప్‌కు అనుకూలించే అంశమని నిపుణుల అంచనా. చట్టాన్ని సక్రమంగా వాడుకోవాలన్నదే తమ అభిమతమని, అందుకే ఓటింగ్‌ను నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళతామని ట్రంప్ ఇటీవలే వ్యాఖ్యానించారు. ఎలక్టోరల్ కాలేజీ ద్వారా... అమెరికా రాజ్యాంగం ప్రకారం మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో కనీసం 270 సాధించిన వారికి అధ్యక్ష పీఠం దక్కుతుంది. ఈ ఏడాది డిసెంబర్ 14న ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు సమావేశమై అధ్యక్షుడి కోసం ఓట్లు వేయనున్నారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్లు రెండూ జనవరి 6న సమావేశమై ఈ ఓట్లను లెక్కించి విజేతను ప్రకటిస్తాయి. సాధారణ పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాల గవర్నర్లు ఫలితాలను నిర్ధారించి ఆ సమాచారాన్ని కాంగ్రెస్‌కు అందిస్తూంటారు. అయితే ఎన్నికలు పోటాపోటీగా జరిగిన రాష్ట్రాల్లో గవర్నర్, అసెంబ్లీలు రెండు వేర్వేరు ఫలితాలను ఇస్తే ఏమవుతుందన్నది ఇటీవలి కాలంలో విశ్లేషకులు కొందరు ప్రశ్నిస్తున్నారు. పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సిన్, నార్త్ కరోలినాల్లో గవర్నర్లు డెమొక్రటిక్ పార్టీకి చెందిన వారు. అసెంబ్లీలన్నీ రిపబ్లికన్ల నియంత్రణలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎవరి మాటకు విలువ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం లేదని పలువురు చెబుతున్నప్పటికీ, 2000, 1876లలో ఇదే రకమైన వివాదాలు ఏర్పడిన విషయాన్ని మరికొందరు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైతే సెనేట్ రిపబ్లికన్ల చేతుల్లో ఉండగా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో డెమోక్రాట్ల ఆధిక్యత కొనసాగుతోంది. అయితే జనవరి 3న ప్రమాణ స్వీకారం చేసే కొత్త కాంగ్రెస్ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను లెక్కించనుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో రెండు సభలు ఫలితాల విషయంలో అంగీకారానికి రాలేకపోతే ఏమవుతుందన్నది ఓ శేష ప్రశ్న. చట్ట ప్రకారం చూస్తే ఆయా రాష్ట్రాల కార్యనిర్వాహక వర్గం ఆమోదించిన ఎలక్టర్ల మాటే చెల్లుబాటు అవుతుంది. కానీ దీనిపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటివరకూ ఈ అంశం న్యాయస్థానాల పరీక్షకు గురికాని నేపథ్యంలో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కొన్ని రాష్ట్రాల ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల లెక్కింపు నిలిచిపోతే అప్పుడు కూడా విజయానికి 270 ఓట్లు కావాలా? లేక లెక్కించిన ఓట్లలో ఆధిక్యత వస్తే సరిపోతుందా? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితి ఏర్పడితే పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం మినహా మరో మార్గం ఉండదు. కంటింజెంట్ ఎన్నికలు... ఎలక్టోరల్ ఓట్లలో ఏ పార్టీ అభ్యర్థికీ తగిన మెజార్టీ రాకపోతే అది కాస్తా అమెరికన్ రాజ్యాంగంలోని 12వ సవరణ ప్రకారం కంటింజెంట్ ఎన్నికలకు దారితీస్తుంది. ఇందులో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. సెనేట్ ఉపాధ్యక్షుడిని ఎంపిక చేస్తుంది. ఈ కంటింజెంట్ ఎన్నికల్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లోని ప్రతి రాష్ట్ర ప్రతినిధి బృందానికి ఒక్కో ఓటు లభిస్తుంది. ప్రస్తుతం 50 రాష్ట్రాల్లో ఇరవై ఆరు రిపబ్లికన్ల నియంత్రణలో ఉన్నాయి. డెమోక్రాట్లకు 22 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్క రాష్ట్రంలో ఇరువురికీ సమానమైన ప్రాభవం ఉంది. ఇంకో రాష్ట్రంలో ఏడుగురు డెమోక్రాట్లు, ఆరుగురు రిపబ్లికన్లు, ఒక లిబరటేరియన్ ఉన్నారు. ఎలక్టోరల్ ఓట్లు ఇరు పార్టీల అధ్యక్ష అభ్యర్థులకు 269 చొప్పున వచ్చినప్పుడు మాత్రమే ఈ కంటింజెంట్ ఎన్నికలు జరుగుతాయి. అయితే ఏ వివాదమైనా జనవరి 20లోపు ముగియాల్సిందే. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఆ రోజుతో అధ్యక్షుడి పదవీ కాలం ముగుస్తుంది. ఒకవేళ ఆ రోజుకు కూడా కొత్త అధ్యక్షుడిపై నిర్ణయం జరగకపోతే స్పీకర్ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం డెమోక్రాటిక్ పార్టీకి చెందిన నాన్సీ పెలోసీ స్పీకర్‌గా ఉన్నారు. -
కౌంటింగ్‌కు కౌంటర్
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల చరిత్రలోనే ఇదో అసాధారణ నిర్ణయం. విమర్శలు, వివాదాలు, క్షణక్షణం ఉత్కంఠ రేగే పరిస్థితుల మధ్య వ్యవహారం కోర్టు వరకు వెళుతోంది. మొదట్నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కోర్టుకెక్కుతామని హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్ అమెరికా ప్రజల్ని మోసం చేయడమేనని ధ్వజమెత్తారు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా పోస్టల్ బ్యాలెట్‌కు అనుమతించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ట్రంప్ దీనిపై సుప్రీంకోర్టుకి వెళతానని స్పష్టం చేశారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు శ్వేత సౌధంలో తన మద్దతుదారులనుద్దేశించి ట్రంప్ మాట్లాడారు. ‘‘ఈ ఎన్నికల్లో మనమే గెలవబోతున్నాం. నా దృష్టిలో మనమే గెలిచాం. దేశ ప్రయోజనాలను పరిరక్షించడానికి మనం కట్టుబడి ఉన్నాం. అందుకే చట్టాన్ని సద్వినియోగం చేసుకుంటాం’’అని ట్రంప్ చెప్పారు. ‘‘వెంటనే పోస్టల్ బ్యాలెట్లను అనుమతించడం ఆపేయాలి. జో బైడెన్ శిబిరం దేశాన్ని ఇరకాటంలోకి నెట్టేస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కి అనుమతిస్తున్నారు. నవంబర్ 3 అర్థరాత్రి తర్వాత వచ్చే పోస్టల్ బ్యాలెట్లను అనుమతించ కూడదు. అందుకే సుప్రీంకోర్టుకెళతాం’’అని ట్రంప్ తన అనుచరుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ట్రంప్ మొదట్నుంచి పోస్టల్ బ్యాలెట్‌ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ ఓట్లలో అక్రమాలకు ఆస్కారం ఉందన్నది ఆయన ప్రధాన ఆరోపణ. అయితే కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ సారి సగం మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అన్నింటినీ ఎదుర్కొంటాం: డెమొక్రాట్లు ఎన్నికల ఫలితాల్ని నిరోధించడానికి అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారని డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ శిబిరం విమర్శించింది. ట్రంప్ కోర్టుకి వెళ్లకుండా తమ న్యాయ నిపుణుల బృందం అడ్డుకుంటుందని బైడెన్ క్యాంపైన్ మేనేజర్ ఓ మల్లే డిల్లాన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిలిపివేయాలని ట్రంప్ పేర్కొనడం అసాధారణం, అవమానకరమని ఆమె మండిపడ్డారు. ట్రంప్ చర్యలు సరైనవి కావన్న డిల్లాన్ ఓటింగ్ నిలిపివేయాలనడం అమెరికా పౌరుల ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాయడమేనని అన్నారు. ట్రంప్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎదుర్కోవడానికి తమ న్యాయనిపుణుల బృందం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అలా చెయ్యడం కుదరదు: అమెరికా పోస్టల్ సర్వీసు కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ సారి రికార్డు స్థాయిలో ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ ఓట్లు అన్నింటీనీ మంగళవారం సాయంత్రానికల్లా కౌంటింగ్ కేంద్రాలకు తరలించాలన్న న్యాయస్థానం ఆదేశాలను పాటించలేమని అమెరికా పోస్టల్ సర్వీసు స్పష్టం చేసింది. ప్రతీ రాష్ట్రంలోనూ రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రావడం వల్ల సమయం పడుతుందని పోస్టల్ సర్వీసు తరఫు లాయర్ కోర్టులో తన వాదనలు వినిపించారు. కీలక రాష్ట్రాలుగా భావించే డజనుకి పైగా రాష్ట్రాల్లో 3 లక్షలకు పైగా ఓట్లు ఇంకా ఎన్నికల అధికారులకు అప్పగించవలసి ఉంది. -
అమెరికా సుప్రీం జడ్జిగా జస్టిస్ అమీ
వాషింగ్టన్: అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అమీ కోనే బారెట్‌ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. న్యాయవ్యవస్థలో రిపబ్లికన్ల హవా పెంచుకోవడం కోసం ట్రంప్ శనివారం ఆమెను నామినేట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. జస్టిస్ రూత్ బాడర్ గిన్స్బర్గ్ మరణంతో ఏర్పడిన ఖాళీని ఎన్నికల తర్వాత భర్తీ చేయాలని డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ చేసిన అభ్యర్థనను ట్రంప్ పట్టించుకోలేదు. 48 ఏళ్ల వయసున్న బారెట్ పూర్తిగా సంప్రదాయ భావాలు కలిగిన మహిళ. సుప్రీం న్యాయమూర్తిగా నామినేషన్ తనకు దక్కిన అత్యంత గౌరవమని బారెట్ అన్నారు. సెనేట్ ఆమోదం తర్వాత గిన్స్బర్గ్ స్థానంలో ఆమె నియామకం ఖరారు అవుతుంది. ట్రంప్ బారెట్‌ను అత్యంత మేధావి, సత్ప్రవర్తన కలిగిన మహిళగా అభివర్ణించారు. స్వేచ్ఛాయుత భావాలు కలిగిన గిన్స్బర్గ్ స్థానంలో అందుకు పూర్తిగా విరుద్ధమైన భావజాలం కలిగిన మహిళను ట్రంప్ నామినేట్ చేశారు. అధ్యక్ష ఎన్నికలకి కొద్ది వారాలే గడువుండగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నామినేషన్‌ను తీసుకున్న ట్రంప్ సుప్రీం కోర్టులో కూడా రిపబ్లికన్ల సంప్రదాయ ముద్ర వేయాలని చూస్తున్నారు. అధ్యక్ష ఎన్నికలయ్యే వరకు ఆమోదించొద్దు: బైడెన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకం ద్వారా అధ్యక్ష ఎన్నికల్లో కూడా పట్టు బిగించడానికి ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారని జో బైడెన్ విమర్శించారు. అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యేవరకు అమీ నామినేషన్‌ను ఖరారు చేయవద్దని ఆయన సెనేట్‌కు విజ్ఞప్తి చేశారు. -
ట్రంప్‌కు షాకిచ్చిన రిపబ్లికన్లు
వాషింగ్టన్: అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రూత్ బాడర్ గిన్స్బర్గ్(87) శుక్రవారం కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో నూతన న్యాయమూర్తిని నియమిస్తానంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతుంది. అధ్యక్ష ఎన్నికల అనంతరం నూతన ప్రెసిడెంట్ కొత్త జడ్జిని నియామించాలంటూ డెమొక్రాట్లు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్.. ట్రంప్ సుప్రీం కోర్టుకు నామినేట్ చేసే ఏ అభ్యర్థికి కూడా ఓటు వేయవద్దని సెనేట్ రిపబ్లికన్లను కోరారు. ట్రంప్ తన రాజకీయ ప్రయోజనం కోసం ఈ ప్రతిపాదనను తీసుకువచ్చారని తెలిపారు. అధ్యక్షుడి ప్రణాళిక మేరకు ప్రస్తుత నియామకాన్ని సెనేట్ ఆమోదిస్తే.. అప్పుడు 6-3 మెజారిటీ వస్తుంది.. ఇది అమెరికన్ల చట్టాలని, జీవితాన్ని దశాబ్దాలుగా ప్రభావితం చేస్తుందన్నారు బైడెన్. (చదవండి: రూత్ స్థానంలో మహిళనే నామినేట్ చేస్తాం) అంతేకాక ‘సుప్రీం కోర్టు జడ్జీ నియామకంలో ఈ దేశ ఓటర్లు పాలు పంచుకోవాలి. రాజ్యంగం ద్వారా తమకు లభించిన హక్కు మేరకు వారు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ప్రజలు ఆమోదించిన నాయకుడు ఈ నియమాకాన్ని చేపట్టాలి’ అన్నారు బైడెన్. ట్రంప్ ప్రతిపాదనను అంగీకరిస్తే.. నిరంతరాయమైన రాజకీయ దాడులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది అన్నారు. అలానే తనకు అవకాశం వస్తే ఒక ఆఫ్రికన్-అమెరికన్ మహిళని సుప్రీం కోర్టుకు నామినేట్ చేస్తానని బైడెన్ పునరుద్ఘాటించారు. ఇది చాలా చారిత్రాత్మకమైనదిగా పేర్కొన్నారు. 100 సీట్ల చాంబర్లో ఇప్పటికే ట్రంప్ ప్రతిపాదనను 53 మంది రిపబ్లికన్లు వ్యతిరేకించారు. వీరితో పాటు 62 శాతం మంది అమెరికన్లు నూతన అధ్యక్షుడు సుప్రీం కోర్టు న్యాయమూర్తిని నియమించాలని భావిస్తున్నట్లు రాయిటర్స్ తెలిపింది. చికాగోకు చెందిన 7 వ యుఎస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌కు చెందిన అమీ కోనీ బారెట్, అట్లాంటాకు చెందిన 11 వ సర్క్యూట్‌కు చెందిన బార్బరా లాగోవాలను గిన్స్బర్గ్ సృష్టించిన ఖాళీని భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థిగా ట్రంప్ పేర్కొన్నారు. -
రూత్ స్థానంలో మహిళనే నామినేట్ చేస్తాం
వాషింగ్టన్: కేన్సర్‌తో పోరాడి కన్నుమూసిన అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రూత్ బాడర్ గిన్స్బర్గ్ స్థానంలో మరో మహిళనే నామినేట్ చేస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఉత్తర కరోలినాలోని ఒక ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ సుప్రీం న్యాయమూర్తిని వచ్చేవారంలో నామినేట్ చేస్తామని మహిళకే ఆ అవకాశం దక్కుతుందన్నారు. ఒక అధ్యక్షుడిగా సుప్రీం జడ్జిని నియమించే అధికారం పూర్తిగా తనకి ఉందన్నారు. సంప్రదాయ భావ జాలం కలిగిన రిపబ్లికన్ పార్టీ సుప్రీం కోర్టు జడ్జిని నియమించడం ద్వారా న్యాయవ్యవస్థపైనా, ఇతర సామాజిక అంశాలపైనా పట్టు సాధిస్తుందన్న ఆందోళన ఇప్పటికే డెమొక్రాట్లలో ఉంది. అధ్యక్ష ఎన్నికలు దగ్గరకొస్తున్న తరుణంలో తనకి అంది వచ్చిన ఈ అవకాశాన్ని ట్రంప్ వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అందుకే అధ్యక్ష ఎన్నికల తర్వాతే సుప్రీం కోర్టు జడ్జి నియామకం జరగాలన్న డెమొక్రాట్ల వాదనని ఆయన పట్టించుకోలేదు. 45 మంది వరకు తమ జాబితాలో ఉన్నారని, త్వరలోనే వారిలో షార్ట్ లిస్ట్ చేసి వచ్చే వారమే నామినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని ట్రంప్ వెల్లడించారు. -
అమెరికా సుప్రీం జడ్జి రూత్ అస్తమయం
వాషింగ్టన్: అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రూత్ బాడర్ గిన్స్బర్గ్(87) శుక్రవారం కన్ను మూశారు. మహిళా హక్కుల కోసం, సామాజిక న్యాయం, లింగ సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన ఆమె పాన్‌క్రియాటిక్ కేన్సర్‌తో గత కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. అమెరికా సుప్రీంకోర్టులో జడ్జి అయిన రెండో మహిళగా రికార్డులకెక్కారు. 1993లో అప్పటి అధ్యక్షుడు, డెమొక్రాటిక్ నాయకుడు బిల్ క్లింటన్ ఆమెను సుప్రీం జడ్జిగా నియమించారు. అప్పట్నుంచి 27 ఏళ్ల పాటు ఆమె సమ న్యాయం కోసమే పాటుపడ్డారు. రూత్ మృతితో ఆమె అభిమానుల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. శుక్రవారం రాత్రి సుప్రీంకోర్టు దగ్గరకి వేలాదిగా జనం తరలి వచ్చి కొవ్వొత్తులు ప్రదర్శిస్తూ ఆమెకి అశ్రు నివాళులర్పించారు. ‘‘న్యాయానికి ప్రతీకగా నిలిచిన ఒక మహోన్నత వ్యక్తిని అమెరికా జాతి కోల్పోయింది. ఒక అద్భుతమైన సహచరురాలిని కోర్టు కోల్పోయింది’అని అమెరికా సుప్రీంకోర్టు సీజే జాన్ రాబర్ట్స్ అన్నారు. మిన్నెసోటాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూత్‌ని ఒక అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించారు. న్యాయవ్యవస్థకి టైటాన్లాంటి గొప్ప వ్యక్తికి అమెరికా జాతి యావత్తూ నివాళులర్పిస్తోం దన్నారు. కొత్త రాజకీయ పోరాటం అమెరికా అధ్యక్ష ఎన్నికలకి ఇంకా ఆరువారాల గడువు ఉన్న సమయంలో రూత్ గిన్స్బర్గ్ మృతి రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య కొత్త పోరాటానికి తెరతీసింది. రూత్ మరణించడానికి కొద్ది రోజులు ముందు అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాక తన స్థానాన్ని భర్తీ చేయాలని, అదే తనకున్న ప్రగాఢమైన కోరికంటూ వెల్లడించారు. ఆమె చివరి కోరిక తీర్చాలంటూ డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ డిమాండ్ చేశారు. ‘‘ఓటర్లు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. అధ్యక్షుడు కొత్త న్యాయమూర్తిని ఎన్నుకోవాలి’’అని బైడెన్ వ్యాఖ్యానించారు. అయితే అమెరికా రాజ్యాంగం అధ్యక్షుడికే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని నియమించే సర్వాధికారాలను అప్పగించింది. ఒకసారి న్యాయమూర్తి నియామకం జరిగితే వారు జీవితాంతం ఆ పదవిలో కొనసాగుతారు. రిపబ్లికన్ పార్టీ సంప్రదాయ భావజాలానికి మద్దతుగా నిలిచే న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో ఉంటే దేశంలో వివిధ ఫెడరల్ కోర్టుల్లోనూ, ఎన్నో సామాజిక అంశాల్లో పట్టు బిగించే అవకాశం ఉంటుందని ట్రంప్ భావిస్తున్నారు. అబార్షన్లు, గే మ్యారేజెస్ వంటి అంశాల్లో తమకి అనుకూలంగా వ్యవహించే వారినే రూత్ స్థానంలో భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సుప్రీం న్యాయమూర్తిగా అధ్యక్షుడు నామినేట్ చేస్తే సెనేట్‌లో అది ఆమోదం పొందాల్సి ఉంటుంది. సెనేట్‌లో రిపబ్లికన్లకే ఆధిక్యం ఉండడంతో న్యాయమూర్తి నియామకానికి అక్కడ ఎలాంటి ఆటంకం ఉండదు. రూత్ స్థానంలో మరొక జడ్జీని ఎటువంటి జాప్యం లేకుండా నామినేట్ చేస్తామని ట్రంప్ తెలిపారు. కీలకమైన ఈ పోస్టును నవంబర్ 3 అధ్యక్ష ఎన్నికలకు ముందే భర్తీ చేస్తామని తెలిపారు. అయితే, డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవి రేసులో ఉన్న జో బైడెన్ ఈ ప్రకటనను వ్యతిరేకించారు. ‘అధ్యక్షుడిని ప్రజలు ఎన్నుకుంటారు. అధ్యక్షుడు సుప్రీం జడ్జీని నామినేట్ చేస్తారు. నవంబర్ 3 తర్వాతే జడ్జీ ఎన్నిక ఉంటుంది’ అని స్పష్టం చేశారు. హక్కుల గళం అమెరికాలో స్వేచ్ఛాయుత భావజాలానికి ఆమె కథానాయిక. లింగ సమానత్వం, మహిళా హక్కులపై ఎలుగెత్తిన కార్యకర్త. పురుషాధిక్యం కలిగిన న్యాయవాద వృత్తిలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. లాయర్‌గా ఉన్న సమయంలోనే లింగ వివక్ష కేసుల్ని ఎక్కువగా తీసుకొని అద్భుతమైన తన వాదనా పటిమతో మహిళలకు అండగా నిలిచారు. న్యాయమూర్తిగా అబార్షన్ హక్కులకు మద్దతుగా నిలిచారు. గే హక్కుల పరిధి విస్తృతి, ఒబామాహెల్త్‌కేర్ చట్ట పరిరక్షణ, మైనార్టీల హక్కులకు అండగా నిలిచారు. మీటూ ఉద్యమానికి మద్దతునిచ్చారు. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో యూదు వలసదారులకు చెందిన సాధారణ కుటుంబంలో 1933 , మార్చి 15న జన్మించారు. రూత్ తండ్రి నాథాన్ బాడర్ రిబ్బన్లు, జిప్పులు వంటివి అమ్ముకునే చిరు వ్యాపారి. తల్లి సెలియా గృహిణి. యూనివర్సిటీలో చదువుతుండగానే సహచర విద్యార్థి మార్టిన్ గిన్స్‌బర్గ్‌తో ప్రేమలో పడ్డారు. హార్వార్డ్ యూనివర్సిటీలో ఇద్దరూ లా చదివారు. 1954లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. లాయర్ చదువు పూర్తి చేసుకున్నాక ఉద్యోగం సంపాదించడంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. తను ఒక మహిళని, వలసదారుని కనుకే ఏ అవకాశం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసేవారు. ఆ తర్వాత ఒక అడ్వకేట్‌గా, న్యాయమూర్తిగా అపూర్వ విజయాలు సాధించి అమెరికన్ల హృదయాల్లో శాశ్వత స్థానం ఏర్పాటు చేసుకున్నారు. 1993లో సుప్రీంకోర్టు జడ్జిగా అధ్యక్షుడు క్లింటన్ సమక్షంలో రూత్ ప్రమాణం