వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా నవంబర్ ఎన్నికలో గెలుపొందిన ఎలక్టోరల్స్ సోమవారం సమావేశమై అధినేతను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే ఎలక్టోరల్స్‌లో మెజార్టీ వచ్చినందున డెమొక్రాటిక్ అ«భ్యర్థి జో బైడెన్ ఎంపిక లాంఛనమేనని నిపుణులు భావిస్తున్నారు. ఒకపక్క ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తానే విజేతనంటూ పట్టిన పట్టు వీడకపోవడం, ఎలక్టోరల్స్‌ను తనకే ఓట్ వేయాలని కోరడం, సుప్రీంకోర్టును ఆశ్రయించినా నిరాశ ఎదురవడం, రాజధానిలో వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు చేరడం వంటి పరిస్థితుల్లో ఎలక్టోరల్ కాలేజీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.
ఎలక్టోరల్ కాలేజీ అంటే..?
అమెరికాలో ప్రతీ రాష్ట్రానికి జనాభా ఆధారంగా ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల్ని కేటాయిస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాపులర్ ఓట్లు ఎన్ని వచ్చినప్పటికీ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వారే అధ్యక్ష పీఠం దక్కించుకుంటారు. బ్యాలెట్ పత్రాల ద్వారా అధ్యక్షుడు, ఉపాధ్యక్షులకు ఓటు వేస్తారు. దేశం మొత్తమ్మీద 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉంటే 270, అంత కంటే ఎక్కువ వచ్చిన వారే విజేత. ఈ సారి బైడెన్‌కు 306 ఓట్లు, ట్రంప్ 232 ఓట్లు వచ్చాయి. అధ్యక్షుడిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల్ని డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీలే నామినేట్ చేస్తాయి. వారి ఎంపిక విధానం ప్రతీ రాష్ట్రానికి మారిపోతుంది.
ఓటు ఎవరికి వేయాలి ?
ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ తమ రాష్ట్రంలో అత్యధికంగా పాపులర్ ఓట్లు సాధించిన అభ్యర్థికే వారు ఓటు వేసి తీరాలి. ఎవరైనా అలా ఓటు వెయ్యడానికి నిరాకరిస్తే వెంటనే పార్టీకి ఆ ప్రతినిధిని మార్చే అధికారం ఉంటుంది. 2016 ఎన్నికల్లో ఏకంగా 10 మంది ప్రతినిధులు ఇతర పార్టీ అభ్యర్థికి ఓటు వెయ్యడానికి ప్రయత్నాలు చేసినా అవి కొనసాగలేదు. ఈ సారి కూడా అలా ఎవరైనా మొరాయిస్తారేమోరేనన్న ఉత్కంఠ నెలకొంది.

జనవరి 6న కాంగ్రెస్ ఉభయ సభల సమావేశంలో ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను లెక్కిస్తారు. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ ఓటింగ్‌పై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ప్రతినిధుల సభ, సెనేట్ ప్రత్యేకంగా సమావేశమై చర్చిస్తుంది. ఆ తర్వాత విజేతను ప్రకటిస్తారు. కొత్త అధ్యక్షుడు జనవరి 20న ప్రమాణ స్వీకారం చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment